బాలికను గర్భవతి చేసిన కామాంధుడి అరెస్ట్ | rapist arrested in hyderabad school girl pregnancy | Sakshi

బాలికను గర్భవతి చేసిన కామాంధుడి అరెస్ట్

Jan 4 2016 10:51 PM | Updated on Sep 15 2018 5:14 PM

హైదరాబాద్‌లో బాలికను గర్భవతి చేసిన కామాంధుడిని సోమవారం మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు.

మాదాపూర్: హైదరాబాద్‌లో బాలికను గర్భవతి చేసిన కామాంధుడిని సోమవారం మాదాపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మాదాపూర్‌లోని ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ బాలిక చందానాయక్ తాండాలో నివాసముంటోంది.

బాలికకు పశ్చిమ బెంగాల్‌కు చెందిన దిలీప్ సర్కార్(39)తో పరిచయం ఏర్పడింది. దిలీప్ సర్కార్‌కు వివాహమై, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. మాదాపూర్‌లో రెస్టారెంట్ నిర్వహించే అతడు బాలికకు మాయమాటలు చెప్పి ఆమెను గర్భవతిని చేశాడు. దీంతో గత నవంబర్ 28న బాలిక ఆడ శిశువును ప్రసవించింది. అనంతరం దిలీప్ సర్కార్ పరారయ్యాడు. నిందితుడ్ని పోలీసులు కోల్‌కతాలో అరెస్ట్ చేసి నగరానికి తీసుకొచ్చారు. సోమవారం అతడిని రిమాండ్‌కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement