బాలికపై వారం రోజులుగా ఘాతుకం | Two Brothers Molestation On 9 Years Girl At Banjara Hills Hyderabad | Sakshi
Sakshi News home page

బాలికపై అన్నదమ్ముళ్ల లైంగికదాడి 

Published Tue, Jun 5 2018 8:14 AM | Last Updated on Tue, Sep 4 2018 5:48 PM

Two Brothers Molestation On 9 Years Girl At Banjara Hills Hyderabad - Sakshi

నిందితుడు ఎల్లేష్‌

బంజారాహిల్స్‌ : తొమ్మిదేళ్ల చిన్నారిపై అన్నా, తమ్ముళ్లు వారం రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్న సంఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి... ఫిలింనగర్‌లోని షేక్‌పేట్‌ నాలా అంబేద్కర్‌నగర్‌కు చెందిన బాలిక(9) ఐదో తరగతి చదువుతోంది. బాలిక ఇంటి సమీపంలో ఉంటున్న ఎల్లేష్‌(19) అనే ప్రైవేట్‌ ఉద్యోగి ఆదివారం పీకల దాకా మద్యం సేవించి, ఇంటి ముందు ఆడుకుంటున్న బాలికను తన గదిలోకి లాక్కెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు చిన్నారిని అతడి భారి నుంచి కాపాడారు.

వివరాలు ఆరా తీయగా వారం రోజులు ఎల్లేష్, అతని తమ్ముడు శ్రీకాంత్‌ తనపై లైంగిక దాడికి పాల్పడుతున్నాడని తెలిపింది. బాధితురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బంజారాహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. చిన్నారిని భరోసా కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. సోమవారం ఎల్లేష్‌ను అరెస్ట్‌ చేయగా, శ్రీకాంత్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు. నిందితులపై పోక్సో యాక్ట్‌ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement