
మల్కాజిగిరి : కన్న కూతురిపై అత్యాచారానికి ప్రయత్నించిన తండ్రిని మల్కాజిగిరి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. ఎస్‌ఐ రమేష్ కథనం ప్రకారం.. జేఎల్‌ఎస్‌నగర్‌కు చెందిన కూకట్ల నాగరాజు(33), చంద్రకళ దంపతులు. వీరికి ఒక కూతురు, కొడుకు ఉన్నారు. మద్యానికి బానిసైన నాగరాజు తరచూ భార్యను వేధించేవాడు. కూతురు నగరంలోని ఓ ప్రభుత్వ హాస్టల్‌లో ఉంటూ ఐదో తరగతి చదువుకుంటోంది. ఈ నెల 2న తాగిన మైకంలో నాగరాజు కూతురిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఈ సంఘటనపై తల్లి ఫిర్యాదు చేయడంతో కేసునమోదు చేసుకొని నాగరాజును అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment