12 ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన కామాంధుడు | Boy Molested On Girl In Nizamabad | Sakshi
Sakshi News home page

12 ఏళ్ల బాలికను గర్భవతిని చేసిన కామాంధుడు

Published Sat, Oct 16 2021 10:51 PM | Last Updated on Sun, Oct 17 2021 9:02 AM

Boy Molested On Girl In Nizamabad - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

నిజామాబాద్‌: నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో 12 ఏళ్ల బాలికకు మాయమాటలు చెప్పి గర్భవతిని చేశాడో కామాంధుడు. బాలికలో మార్పులు రావడంతో తల్లి గట్టిగా నిలదీయడంతో తల్లి దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.  ఒకటవ టౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  మాలపల్లికి చెందిన 12 ఏళ్ల బాలికకు.. ఇదే ప్రాంతంలో ఉండే ఇజాజ్‌ అనే యువకుడు మాయమాటలు చెప్పి గత ఆరు నెలలుగా అత్యాచారం చేస్తున్నాడు. ప్రస్తుతం బాలిక ఐదు నెలల గర్భిణి. కాగా, బాలిక తల్లి  చిన్నారి పరిస్థితిని గమనించి ఆసుపత్రి తీసుకెళ్లగా వైద్యులు ఐదు నెలల గర్భవతని నిర్ధారించారు.

దీంతో బాలికను ప్రశ్నించగా అదే ప్రాంతం ఉండే ఇజాజ్‌ అనే యువకుడు పలుమార్లు అత్యాచారం చేశాడని తెలిపింది. దీంతో బాలిక తల్లి గత శుక్రవారం ఒకటవ టౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేసి శనివారం ఇజాజ్‌ను కేసు నమోదు చేసుకొని రిమాండ్‌కు తరలించారు.  ఇజాజ్‌  ఇంటి నిర్మాణ పనులు చేస్తుండేవాడు. ప్రస్తుతం ఇజాజ్‌ గత కొన్ని రోజుల కిందట మాలపల్లి నుండి నగరంలోని బర్కత్‌పురకు మకాం మార్చినట్లు ఎస్‌హెచ్‌వో ఆంజనేయులు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement