కర్నూలు(అగ్రికల్చర్), న్యూస్‌లైన్ : రైతులు, వినియోగదారుల సౌలభ్యం కోసం నగరంలోని సీ క్యాంపు రైతుబజార్‌ను మరింత గా విస్తరిస్తున్నారు. అందుకోసం రూ.15 లక్షలను మార్కెటింగ్ శాఖ విడుదల చేసింది. ఈ నిధులతో ప్రస్తుతమున్న షెడ్లకు క్యాంటీన్‌కు మధ్య 50 మంది రైతులు కూరగాయలు అమ్ముకునేందుకు వీలుగా రెండు షెడ్లు నిర్మిస్తున్నారు. ఇదివరకు వేసిన షెడ్ల మధ్య గ్యాప్ ఉండటం వల్ల వర్షాలు వచ్చినప్పుడు రైతుబజార్ మొత్తం తడచి ముద్దవుతుండేది.
ప్రస్తుత పనులతో ఆ గ్యాప్‌లను కూడా మూసేస్తున్నారు. కాగా రైతుబజార్‌ను ఆన్‌లైన్ చేయనున్నారు. రైతుబజార్‌లో జరిగే క్రయవిక్రయాలు తదితరాలను హైదరాబాద్‌లోని మార్కెటింగ్ శాఖ కమిషనర్, రైతుబజార్ల సీఈఓ వీక్షించే సదుపాయాన్ని కల్పించనున్నారు. మూడు నాలుగు రోజుల్లో ఆన్‌లైన్ సౌకర్యం అందుబాటులోకి రానుంది. రైతుబజార్‌లో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు. రైతుబజార్‌ను పారదర్శకంగా నిర్వహించేందుకు ఇవి తోడ్పడనున్నాయి.
రైతుబజార్‌కు కొత్తహంగులు
Published Mon, Dec 9 2013 3:52 AM | Last Updated on Sat, Sep 2 2017 1:24 AM
Advertisement