రైతు బజార్లో తెలుగు తమ్ముళ్ల బాగోతం | tdp supporters attack on sakshi reporter | Sakshi
Sakshi News home page

రైతు బజార్లో తెలుగు తమ్ముళ్ల బాగోతం

Published Thu, Sep 11 2014 5:29 PM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

tdp supporters attack on sakshi reporter

తుని(తూ.గో): మరోసారి తెలుగు తమ్ముళ్లు తమ బాగోతాన్ని బయటపెట్టారు. మీడియా స్వేచ్ఛను అడ్డకుంటూ సాక్షి ప్రతినిధిపై బెదిరింపు చర్యలకు పాల్పడిన ఘటన జిల్లాలోని తుని రైతు బజార్లో గురువారం చోటు చేసుకుంది. కొంతమంది రైతులకు చెందాల్సిన షాపుల్లో తెలుగు తమ్ముళ్లు పాగా వేసి వీరంగం సృష్టించారు. అంతేకాకుండా మీడియాపై కూడా చిందులు వేశారు.

 

తెలుగు తమ్ముళ్ల వ్యవహారాన్ని చిత్రీకరించడానికి వెళ్లిన సాక్షి ప్రతినిధిపై బెదిరింపులకు దిగారు. ఇక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ వారు తమ దైన శైలిలో హుకుం జారీ చేశారు. ఈ ఘటనపై సాక్షి ప్రతినిధి పోలీసుల్ని ఆశ్రయించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement