సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: ఉల్లి ధరలు ఆకాశన్నంటడంతో నియంత్రించడానికి అధికారులు చర్యలు చేపడుతున్నారు. జిల్లాలోని మార్కెట్‌లో కిలో ధర రూ.50 నుంచి రూ.70 వరకు పలుకుతుంది. ధరలను అదుపు చేయడానికి రైతు బజార్లలో తగ్గింపు ధరలకు ఉల్లిని విక్రయించే ఏర్పాట్లు చేశారు. రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి కిలో ఉల్లిని రూ.34 చొప్పున విక్రయించనున్నట్టు జాయింట్ కలెక్టర్ ఎ.శరత్ తెలిపారు. ఈ మేరకు ఆయన శనివారం సంగారెడ్డిలోని రైతు బజార్‌ను సందర్శించారు. ఈ కేంద్రాన్ని సోమవారం కలెక్టర్ దినకర్‌బాబు ప్రారంభిస్తారని తెలిపారు. కౌంటర్ ద్వారా ఒక్కొక్కరికి రెండు కిలోల చొప్పున ఉల్లిగడ్డ విక్రయించనున్నట్టు జేసీ పేర్కొన్నారు