రాష్ట్రంలో మరో 11 రైతు బజార్లు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. రైతు బజార్లలో ధరల సూచికలతో కూడిన ఎలక్ట్రానిక్ డిస్‌ప్లేను ఏర్పాటు చేస్తామన్నారు.
గుంటూరు : రాష్ట్రంలో మరో 11 రైతు బజార్లు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు వెల్లడించారు. రైతు బజార్లలో ధరల సూచికలతో కూడిన ఎలక్ట్రానిక్ డిస్‌ప్లేను ఏర్పాటు చేస్తామన్నారు. శుక్రవారం గుంటూరులోని రాష్ట్ర మార్కెటింగ్ శాఖ కార్యాలయంలో మార్కెట్ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష జరిపారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... మార్కెటింగ్ ఆదాయం నుంచి 20 శాతం నిధులు, 20 శాతం మ్యాచింగు గ్రాంటుతో లింక్ రోడ్లు వేయాలని నిర్ణయించామని చెప్పారు. దీనికి సంబంధించి జూలై 30 కల్లా అన్ని జిల్లాల్లో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 22న రైతు ఉపశమన అర్హత పత్రాలు పంపిణీ చేస్తామన్నారు. రూ.3,512 కోట్లను 32.9 లక్షల రైతుల ఖాతాలకు జమచేయనున్నట్టు చెప్పారు.