విజయనగరం పట్టణ ప్రజల కోసం ఉదయం 7- 8 వరకు గంట పాటు కర్ఫ్యూను సడలించారు. అయితే ఆ సమయంలో అటు రైతు బజారుల్లో కూరగాయలు, ఇటు దుకాణాల్లో నిత్యవసర సరుకులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కో రైతు బజార్ వద్ద భారీగా వినియోగదారులు బారులు తీరారు. అయితే రైతు బజార్లో కూరగాయలు లేక ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. అలాగే దుకాణాల్లో నిత్యవసర సరుకులు కూడా నిండుకున్నాయి. దాంతో గంట సేపు కర్ఫ్యూ సడలించడం ఎందుకంటూ ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. కర్ఫ్యూ సడలించిన సమయంలోనైన వినియోగదారుల కోసం ప్రభుత్వ అధికారులు సరైన చర్యలు చేపట్టకపోవడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. అదికాక కర్ఫ్యూ నేపథ్యంలో రైతులను రైతు బజార్లో తమ కురగాయలను విక్రయించేందుకు అనుమతించలేదు. దాంతో అధికారుల తీరుపై రైతులు మండిపడ్డారు. పట్టణంలోని ఏటీఎం కేంద్రాల వద్ద భారీగా ప్రజలు క్యూ కట్టారు. కాగా కర్ప్యూ సడలింపు సమయం ముగియడంతో పోలీసులు నిత్యవసర సరుకుల కోసం విధుల్లోకి వచ్చిన వినియోగదారులపై తమ జులుం ప్రదర్శిస్తున్నారు.
Published Tue, Oct 8 2013 9:26 AM | Last Updated on Thu, Mar 21 2024 9:10 AM
Advertisement
Advertisement
పోల్
Advertisement