Curfew Relaxed for One Hour
-
తీవ్ర ఇక్కట్లు పడుతున్న విజయనగర వాసులు
-
తీవ్ర ఇక్కట్లు పడుతున్న విజయనగర వాసులు
విజయనగరం పట్టణ ప్రజల కోసం ఉదయం 7- 8 వరకు గంట పాటు కర్ఫ్యూను సడలించారు. అయితే ఆ సమయంలో అటు రైతు బజారుల్లో కూరగాయలు, ఇటు దుకాణాల్లో నిత్యవసర సరుకులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఒక్కో రైతు బజార్ వద్ద భారీగా వినియోగదారులు బారులు తీరారు. అయితే రైతు బజార్లో కూరగాయలు లేక ప్రజలు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. అలాగే దుకాణాల్లో నిత్యవసర సరుకులు కూడా నిండుకున్నాయి. దాంతో గంట సేపు కర్ఫ్యూ సడలించడం ఎందుకంటూ ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. కర్ఫ్యూ సడలించిన సమయంలోనైన వినియోగదారుల కోసం ప్రభుత్వ అధికారులు సరైన చర్యలు చేపట్టకపోవడం పట్ల ప్రజలు మండిపడుతున్నారు. అదికాక కర్ఫ్యూ నేపథ్యంలో రైతులను రైతు బజార్లో తమ కురగాయలను విక్రయించేందుకు అనుమతించలేదు. దాంతో అధికారుల తీరుపై రైతులు మండిపడ్డారు. పట్టణంలోని ఏటీఎం కేంద్రాల వద్ద భారీగా ప్రజలు క్యూ కట్టారు. కాగా కర్ప్యూ సడలింపు సమయం ముగియడంతో పోలీసులు నిత్యవసర సరుకుల కోసం విధుల్లోకి వచ్చిన వినియోగదారులపై తమ జులుం ప్రదర్శిస్తున్నారు. -
విజయనగరంలో గంటసేపు కర్ఫ్యూ సడలింపు
విజయనగరం : విజయనగరం ఇంకా పూర్తిగా పోలీసుల దిగ్బంధంలో ఉంది. రెండు రోజులుగా పోలీసులపై రాళ్లతో విరుచుకుపడిన ఉద్యమకారులు కాస్త శాంతించారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నప్పటికీ నివురుగప్పిన నిప్పులా ఉంది. గత రెండు రోజులుగా కర్ఫ్యూ అమల్లో ఉంది. అయితే ఈ రోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు కర్ఫ్యూను సడలించారు. సడలింపుతో ప్రజలు నిత్యావసరాలు వస్తువుల కోసం ఎగబడ్డారు. మార్కెట్లు, రైతుబజారు, ఎటీఎంల వద్ద ప్రజలు బారులు తీరారు. ఒక్కసారిగా ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం రావటంతో .... అందరికి అందకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పరిస్థితిని బట్టి సడలింపుని పెంచుతామని అధికారులు వెల్లడించారు.