గత రెండు రోజులుగా పోలీస్ పహారాలో ఉన్న విజయనగరంలో ఈ రోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు కర్ఫ్యూను సడలించారు.
విజయనగరం : విజయనగరం ఇంకా పూర్తిగా పోలీసుల దిగ్బంధంలో ఉంది. రెండు రోజులుగా పోలీసులపై రాళ్లతో విరుచుకుపడిన ఉద్యమకారులు కాస్త శాంతించారు. పరిస్థితి పూర్తిగా అదుపులో ఉన్నప్పటికీ నివురుగప్పిన నిప్పులా ఉంది. గత రెండు రోజులుగా కర్ఫ్యూ అమల్లో ఉంది. అయితే ఈ రోజు ఉదయం 7 నుంచి 8 గంటల వరకు కర్ఫ్యూను సడలించారు.
సడలింపుతో ప్రజలు నిత్యావసరాలు వస్తువుల కోసం ఎగబడ్డారు. మార్కెట్లు, రైతుబజారు, ఎటీఎంల వద్ద ప్రజలు బారులు తీరారు. ఒక్కసారిగా ప్రజలు నిత్యావసర వస్తువుల కోసం రావటంతో .... అందరికి అందకపోవటంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు పరిస్థితిని బట్టి సడలింపుని పెంచుతామని అధికారులు వెల్లడించారు.