సనత్‌నగర్: టమాటా ఠారెత్తిస్తోంది. కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తోన్న ధరలు ప్రస్తుతం కొండెక్కి కూర్చున్నాయి. రైతుబజార్‌లో కిలో రూ.75 ఉండగా బహిరంగ మార్కెట్లో సెంచరీ దాటేసింది. టమాటా పంట దిగుబడి భారీగా తగ్గడంతో రోజువారీగా హోల్‌సేల్ మార్కెట్‌కు రావాల్సిన దాని కంటే తగ్గిపోవడంతో ధరలు ఎగబాకుతున్నాయి.
ఎర్రగడ్డ రైతుబజార్‌కు రోజువారీగా 200 క్వింటాళ్ల టమాటా వస్తోంది. నాలుగైదు రోజులుగా కేవలం 50–60 క్వింటాళ్లకు పడిపోయింది. రంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్ మదనపల్లె, బెంగళూరు నుంచి ఎక్కువగా టమాటా నగరానికి దిగుమతి అవుతోంది.
ప్రస్తుతం టమాటా పంట కోతలు పూర్తయ్యి కొత్త పంట వేశారు. పంట కోతకు రావడానికి మరికొంత సమయం పడుతుంది. అప్పటివరకు టమాటా ధర మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నెల 18న రైతుబజార్‌లో రూ.39 ఉన్న కిలో టమాటా ధర వారం రోజుల వ్యవధిలోనే రూ.75కు చేరడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment