నేడు మరొకరు
సాక్షి, సిటీబ్యూరో: జీహెచ్‌ఎంసీ స్టాండింగ్ కమిటీలోని 15 సభ్యత్వాల కోసం నామినేషన్లు దాఖలు చేసిన వారిలో బీఆర్‌ఎస్ కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మి తన నామినేషన్‌ను గురువారం విత్‌డ్రా చేసుకున్నారు. బీఆర్‌ఎస్‌కే చెందిన మరో కార్పొరేటర్ జూపల్లి సత్యనారాయణరావు సైతం తన నామినేషన్‌ను శుక్రవారం ఉపసంహరించుకోనున్నట్లు సమాచారం. స్టాండింగ్ కమిటీ కోసం అధికార కాంగ్రెస్– ఎంఐఎం పరస్పర అవగాహనతో నామినేషన్లు వేసినందున, పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు బీఆర్‌ఎస్ అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకుంటున్నట్లు సమాచారం. ఉపసంహరణకు నేటి (శుక్రవారం) వరకు గడువు ఉంది. సత్యనారాయణరావు ఉపసంహరణ పూర్తయ్యాక, మిగతా 15 మందిని ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించే అవకాశం ఉంది. వీరిలో ఎనిమిది మంది ఎంఐఎం సభ్యులు, ఏడుగురు కాంగ్రెస్ సభ్యులుండటం తెలిసిందే.