శ్రీనగర్‌కాలనీ: ఎస్‌టీఎఫ్ పోలీసులు గురువారం వేర్వేరు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి డ్రగ్స్, గంజాయి స్వాధీనం చేసుకుని ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ఎర్రగడ్డ మెట్రోస్టేషన్ సమీపంలో కొందరు యువకులు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్‌టీఎఫ్ బీ టీమ్ సీఐ భిక్షారెడ్డి నేతృత్వంలో దాడి చేసి ఎస్‌కే అహ్మద్ రహీమ్, మహ్మద్ ఫక్రుద్దీన్ అనే యువకులను అరెస్ట్ చేశారు. వారి నుంచి 2.78 గ్రాముల ఎండిఎంఏ, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సౌదీఅరేబియాకు చెందిన సఫార్, బెంగళూరుకు చెందిన సప్లయర్ ఇబ్రహీం జహీర్ పరారీలో ఉన్నట్లు తెలిపారు.
ధూల్‌పేటలో....
లోయర్ ధూల్‌పేటలో జుంగూర్ బస్తీలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో ఎస్‌టీఎఫ్ బీ టీమ్ ఎకై ్సజ్ అధికారులు దాడులు నిర్వహించి 1.3కిలోల గంజాయిని స్వాదీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కునాల్‌సింగ్, వినోద్‌సింగ్, హేమబాయిలను అరెస్ట్ చేసి వారి నుంచి నాలుగు సెల్‌ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అనికేష్‌సింగ్, ఆర్తిబాయి, నరేన్, గణేష్‌సింగ్ పరారీలో ఉన్నారని వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దాడుల్లో ఎస్సైలు బాలరాజు, సంద్య, కానిస్టేబుళ్లు యాదగిరి, అనీఫ్, నితిన్, మహేశ్వర్, శ్రీనివాసరెడ్డి, కౌసిక్ పాల్గొన్నారు.