‘చలో విద్యుత్ సౌధ’ భగ్నం
సాక్షి, సిటీబ్యూరో: విద్యుత్ సంస్థల్లో పని చేస్తున్న ఆర్టిజన్ కార్మికులను విద్యార్హతను బట్టి కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ జేఏసీ గురువారం చేపట్టిన చలో విద్యుత్ సౌధ కార్యక్రమాన్ని పోలీసులు భగ్నం చేశారు. ముందస్లు చర్యల్లో భాగంగా విద్యుత్ సౌధ సహా ఖైరతాబాద్, పంజాగుట్ట సర్కిళ్లలో పోలీసులు భారీ సంఖ్యలో మోహరించారు. ఇతర జిల్లాల నుంచి నగరానికి చేరుకుంటున్న వాహనాలను ఎక్కడికక్కడే అడ్డుకుని కార్మికులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కళ్లుగప్పి విద్యుత్ సౌధ ముందుకు చేరుకున్న జేఏసీ చైర్మన్ ఈశ్వర్‌రావును అరెస్ట్ చేయగా, కన్వీనర్ వజీర్‌ను ఎర్రగడ్డలో అదుపులోకి తీసుకున్నారు. జేఏసీ కో కన్వీనర్ గాంబో నాగరాజు సహా ఇతర ప్రతినిధులు సదానందం, నరేందర్, ఎల్లయ్యలను ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజినీర్స్ భవన్ ముందు అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment