విశాఖపట్టణం : విశాఖపట్నం నగరంలోని సీతమ్మధార రైతు బజారులో విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు బజారు నిర్వాహణ తీరుపై ఆయన ఉన్నతధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు బజారులో ఉల్లి ధరలపై ఆరా తీశారు.
ఉల్లి ధరలు అందుబాటులోకి వచ్చే వరకు సబ్సిడీ ధరలకే ఉల్లిని అందించాలని గంటా శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఉన్నతాధికారులను ఆదేశించారు. అంతేకాకుండా డిమాండ్‌కు తగ్గట్లు ఉల్లి అందుబాటులో ఉండేలా చూడాలని గంటా శ్రీనివాసరావు రైతు బజారు అధికారులకు సూచించారు.