దేశంలో ప్రతి సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా, మధ్యలో లోక్‌సభ ఎన్నికలు కూడా నిర్వహిస్తారు. 18 ఏళ్లు దాటిన ప్రతి భారతీయ పౌరునికి ఓటు హక్కు ఉంటుంది. వన్ కంట్రీ- వన్ ఎలక్షన్ లేదా వన్ నేషన్- వన్ ఎలక్షన్ అంటూ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఈవీఎం వినియోగానికి బదులుగా ఎన్వలప్ ఉపయోగించే ఓటింగ్ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విధానాన్నే టెండర్ ఓటింగ్ అని అంటారు.
భవిష్యత్‌ను నిర్ణయించే ఓటు హక్కు
భారతదేశంలో నడుస్తున్న ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును ప్రధాన హక్కులలో ఒకటిగా పరిగణిస్తారు. దేశపౌరుడు వేసే ఓటు అటు దేశ, ఇటు సమాజ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఈ అధికారాన్ని వినియోగించుకోవాలి. అయితే ఓటింగ్ సమయంలో చాలాసార్లు నకిలీ ఓట్లు కనిపిస్తుంటాయి. ఒకరి ఓటును మరొకరు వేసేస్తుంటారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకే టెండర్ ఓటింగ్ అనే నిబంధన ఉంది.
పోలింగ్ జరుగుతున్న రోజున మీరు ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు వెళ్లినప్పుడు అక్కడి అధికారులు మీ ఓటు ఇప్పటికే ఎవరో వినియోగించారని చెప్పారనుకోండి. అటువంటి పరిస్థితిలో మీరు టెండర్ ఓటింగ్ ద్వారా మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది?
దీని కోసం ముందుగా మీరు మీ గుర్తింపు కార్డుతో పోలింగ్ బూత్‌లోనే ఉన్న ప్రిసైడింగ్ అధికారి వద్దకు వెళ్లాలి. మీరు ఓటు వేయలేదని ముందుగా వారికి చెప్పాలి. అప్పుడు వారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. కొన్ని పత్రాలు కూడా అడగవచ్చు. ఇది పూర్తయిన తర్వాత మీరు మీ ఓటు వినియోగించుకునేందుకు అనుమతి పొందుతారు. అటువంటి సందర్భంలో మీరు ఈవీఎంలపై ఓటు వేయనప్పటికీ, బ్యాలెట్ ఓటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియనే టెండర్ ఓటింగ్ అంటారు. అటువంటప్పుడు మీకు అన్ని పార్టీల అభ్యర్థుల పేర్లు, ఎన్నికల గుర్తులు ఉండే ఒకపత్రం అందజేస్తారు. అప్పుడు మీరు ఎవరిని ఎన్నుకుంటున్నారో అదే స్లిప్‌లో టిక్ చేయాలి. దీని తరువాత ప్రిసైడింగ్ అధికారి ఆ స్లిప్‌ను ఒక కవరులో సీలు చేసి, పెట్టెలో భద్రపరచి, కౌంటింగ్ రోజున దానిని లెక్కిస్తారు.
ఇది కూడా చదవండి: రైలు కదిలేముందు జర్క్ ఎందుకు?
Comments
Please login to add a commentAdd a comment