Envelope
-
పేపర్ కవర్ ధర పదివేలా? ఏముందిరా అందులో..?
సాధారణంగా మనం వాడే పేపర్ కవర్ (ఎన్వలప్) ఎంత ఉంటుంది. పది, ఐదు, మహా అయితే రెండు వందలు ఉంటుంది. కానీ ఫ్రెంచ్ లగ్జరీ డిజైన్ హౌస్ హెర్మేస్ ఇంటర్నేషనల్ ప్రస్తుతం ఒకే పేపర్ ఎన్వలప్‌ను వేల రూపాయలకు విక్రయిస్తోంది. దీనికి సంబంధించిన స్టోరీ ఒకటి ఇంటర్నరెట్లో హల్ చల్ చేస్తోంది. అయితే దీనికి ఓ ప్రత్యేకత ఉంది. హెర్మేస్ వెబ్సైట్ ప్రకారం, “సిగ్నేచర్ ఆరెంజ్ హెర్మేస్ పేపర్ ఎన్వలప్” ఆరెంజ్పేపర్ బాక్స్‌లో పట్టుదారాలతో చుట్టి ఉంటుంది. A4 , A5 అనే రెండు సైజుల్లో ఇది అందుబాటులో ఉంది. దీంట్లో ట్రావెల్ డాక్యుమెంట్స్, టిక్కెట్లు , ఇతర పత్రాలను దాచుకోవచ్చు. అంతేకాదు “ప్రత్యేక ఆహ్వానం లేదా ప్రేమ ప్రకటన” కోసం కూడా అపురూపంగా పదిలపర్చు కోవచ్చు. ఫ్రాన్స్లోప్రత్యేకంగా రూపొందించిన ఈపేపరు కవరు ధరసుమారు రూ. 10,411 (125 డాలర్లు)కి విక్రయిస్తోంది. అంతేకాదు దీన్ని రీయూజ్ చేసుకోవచ్చు. హెర్మేస్ హై-ఎండ్ స్టేషనరీ కలెక్షన్లో దీన్ని ప్రత్యేకంగా భావిస్తారు. కొందరు ఇది కాస్ట్లీ గురూ అంటోంటే, మరికొందరు మాత్రం స్టేటస్ బాస్ అంటారట. కాగా హీర్మేస్ ఇంటర్నేషనల్ లగ్జరీ బ్రాండ్ ప్రొడక్ట్స్ ధరలు సోషల్ మీడియాలో వైరల్ కావడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది Balenciaga ట్రాష్ బ్యాగ్ ఒక్కొక్కటి రూ. 1.4 లక్షలకు విక్రయించడం వైరల్‌గా మారింది. అలాగే 7.5 అంగుళాల సమర్కాండే మోడల్‌తో సహా వివిధ విలువైన పేపర్‌వెయిట్ ధర 2,950 డాలర్లు, అలాగే మౌస్ ప్యాడ్ 405 డాలర్లంటే ఆశ్చర్యమే మరి. 1837 నుండి విలాసవంతమైన ఉత్పత్తులకు, ముఖ్యంగా సాండిల్స్, హ్యాండ్‌బ్యాగ్‌లు, ఇతర లెదర్ వస్తువులకు ప్రసిద్ధి చెందింది ఈ బ్రాండ్. -
టెండర్ ఓటింగ్ అంటే ఏమిటి? ఎన్వలప్లో ఓటు ఎందుకు ప్యాక్ చేస్తారు?
దేశంలో ప్రతి సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా, మధ్యలో లోక్‌సభ ఎన్నికలు కూడా నిర్వహిస్తారు. 18 ఏళ్లు దాటిన ప్రతి భారతీయ పౌరునికి ఓటు హక్కు ఉంటుంది. వన్ కంట్రీ- వన్ ఎలక్షన్ లేదా వన్ నేషన్- వన్ ఎలక్షన్ అంటూ ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడంపై గత కొంతకాలంగా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా ఈవీఎం వినియోగానికి బదులుగా ఎన్వలప్ ఉపయోగించే ఓటింగ్ విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ విధానాన్నే టెండర్ ఓటింగ్ అని అంటారు. భవిష్యత్‌ను నిర్ణయించే ఓటు హక్కు భారతదేశంలో నడుస్తున్న ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును ప్రధాన హక్కులలో ఒకటిగా పరిగణిస్తారు. దేశపౌరుడు వేసే ఓటు అటు దేశ, ఇటు సమాజ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందుకే ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఈ అధికారాన్ని వినియోగించుకోవాలి. అయితే ఓటింగ్ సమయంలో చాలాసార్లు నకిలీ ఓట్లు కనిపిస్తుంటాయి. ఒకరి ఓటును మరొకరు వేసేస్తుంటారు. అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకే టెండర్ ఓటింగ్ అనే నిబంధన ఉంది. పోలింగ్ జరుగుతున్న రోజున మీరు ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు వెళ్లినప్పుడు అక్కడి అధికారులు మీ ఓటు ఇప్పటికే ఎవరో వినియోగించారని చెప్పారనుకోండి. అటువంటి పరిస్థితిలో మీరు టెండర్ ఓటింగ్ ద్వారా మీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఈ ప్రక్రియ ఎలా జరుగుతుంది? దీని కోసం ముందుగా మీరు మీ గుర్తింపు కార్డుతో పోలింగ్ బూత్‌లోనే ఉన్న ప్రిసైడింగ్ అధికారి వద్దకు వెళ్లాలి. మీరు ఓటు వేయలేదని ముందుగా వారికి చెప్పాలి. అప్పుడు వారు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. కొన్ని పత్రాలు కూడా అడగవచ్చు. ఇది పూర్తయిన తర్వాత మీరు మీ ఓటు వినియోగించుకునేందుకు అనుమతి పొందుతారు. అటువంటి సందర్భంలో మీరు ఈవీఎంలపై ఓటు వేయనప్పటికీ, బ్యాలెట్ ఓటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియనే టెండర్ ఓటింగ్ అంటారు. అటువంటప్పుడు మీకు అన్ని పార్టీల అభ్యర్థుల పేర్లు, ఎన్నికల గుర్తులు ఉండే ఒకపత్రం అందజేస్తారు. అప్పుడు మీరు ఎవరిని ఎన్నుకుంటున్నారో అదే స్లిప్‌లో టిక్ చేయాలి. దీని తరువాత ప్రిసైడింగ్ అధికారి ఆ స్లిప్‌ను ఒక కవరులో సీలు చేసి, పెట్టెలో భద్రపరచి, కౌంటింగ్ రోజున దానిని లెక్కిస్తారు. ఇది కూడా చదవండి: రైలు కదిలేముందు జర్క్ ఎందుకు? -
రంగు పడాల్సిందే!
నెయిల్ పాలిష్ గోళ్లను అందంగా తీర్చిదిద్దుతుంది కదా! అయితే దాని పాత్ర అక్కడితో ముగిసిపోతుందనుకుంటే పొరపాటు. ఒక్కసారి చాన్స్ ఇచ్చి చూడండి... అది మన ఇంట్లో చాలా పనులు చేసేస్తుంది. చాలా రకాలుగా ఉపయోగపడుతుంది. ఎలాగంటే... ఎన్వలప్ అతికిద్దామంటే జిగురు డబ్బా కనిపించడం లేదా? నెయిల్ పాలిష్ ఉంటే దానితో అతికించండి. జిగురుకన్నా బాగా కవర్ని సీల్ చేసేస్తుంది! వార్డ్రోబ్స్, కిచెన్ షెల్ఫుల్లో పెయింటు పోయి మచ్చలు కనిపిస్తుంటే... అక్కడ బ్రౌన్ కలర్ నెయిల్ పాలిష్ పూయండి. మచ్చలు కనిపించవిక! {స్కూలు వదులై జారిపోతుంటే... వాటిమీద నెయిల్ పాలిష్‌ను పూయండి. ఆ తర్వాత బిగించి చూడండి... ఎంత బిగుతుగా ఉంటాయో! ఒకేలాంటి తాళాలు బోలెడు ఉన్నాయనుకోండి. ఏది దేనిదో తెలియక కన్ఫ్యూజ్ అవుతాం. అలాంటప్పుడు ఒక్కో తాళానికీ ఒక్కో రంగు నెయిల్ పాలిష్ వేసి, ఆ తాళం దేనికి సంబంధించినదో ఆ కీ హోల్‌కి అదే రంగు పాలిష్ పూయండి. ఇక కన్ఫ్యూజనే ఉండదు! మీకెంతో ఇష్టమైన ఆర్టిఫీషియల్ జ్యూయెలరీ రంగు పోయిందని దిగులు పడ నక్కర్లేదు. మీకు నచ్చిన రంగు నెయిల్ పాలిష్‌తో ఓ కోటింగ్ ఇవ్వండి. కొత్తగా కనిపిస్తాయి ఆభరణాలన్నీ. కావాలంటే మరో డ్రెస్ వేసుకున్నప్పుడు ఆ రంగును రిమూవర్‌తో తొలగించేసి, మీ డ్రెస్సు రంగు పాలిష్‌ను వేసుకోవచ్చు. దాంతో ఒకే సెట్ అన్నిటి మీదకీ వచ్చేస్తుంది! సూదిలో దారం ఓ పట్టాన ఎక్కకపోతే, దారం చివర నెయిల్ పాలిష్ పూయండి. స్టిఫ్‌గా అయ్యి వెంటనే ఎక్కేస్తుంది! వాహనాల మీద గీతలు పడినప్పుడు పెయింట్‌తో వాటిని కవర్ చేయవచ్చు! షూ లేసుల చివర ఉన్న టిప్స్ ఊడిపోయాయనుకోండి... ఆ స్థానంలో నెయిల్ పాలిష్ రాసి ఎండబెడితే పోగులు ఊడిపోకుండా ఉంటాయి! కొన్ని రకాల లోహాల్ని తాకితే అలర్జీ వస్తుంది కొందరికి. అలాంటి వాటికి నెయిల్ పాలిష్ పూసేస్తే... ముట్టు కున్నప్పుడు లోహం చేతికి తాకదు, అలర్జీ రాదు! చలికాలంలో అగ్గిపెట్టెలు నానినట్టుగా అయ్యి, పుల్లలు సరిగ్గా వెలగవు. అలా అవ్వకుండా ఉండాలంటే... చలికాలం రాగానే అగ్గిపెట్టెలకు నెయిల్ పాలిష్ పూత పూయాలి. అప్పుడు తేమకి అట్ట నానకుండా ఉంటుంది!