యాక్సిస్ బ్యాంకు సీఈవో శిఖా శర్మ(ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై : యాక్సిస్ బ్యాంకు సీఈవో శిఖాశర్మ పదవీకాలం పొడిగింపు అంశంలో బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శిఖా శర్మకు గుడ్ బై చెప్పేందుకు మొగ్గు చూపింది. ఈ మేరకు సోమవారం నిర్ణయం తీసుకుంది. బ్యాంకు ఎండీ, సీఈవో తన పదవీకాలాన్నిపొడిగించాల్సిందిగా శిఖా శర్మ బోర్డును కోరారని బోర్డు ఎక్సేంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. దీంతో ఆమె పదవీ విరమణ కాలాన్ని జులైలో కాకుండా డిసెంబర్ దాకా కొనసాగించేందుకు బోర్డు ఆమోదించిందనీ, దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం కోసం పంపినట్టు వెల్లడించింది.
జులై 2018 ,డిసెంబర్ 2018దాకా తన పదవీకాలాన్ని పొడిగించాలన్న సీఈవో శిఖా శర్మ అభ్యర్థనను బోర్డు ఆర్‌బీఐ పరిశీలనకు పంపినట్టు తెలిపింది. అనంతరం కొత్త సీఈవో ఎంపికను చేపట్టనున్న్టటు ప్రకటించింది. వరుసగా మూడవ సారి సీఈవో బాధ్యతలు చేపట్టిన శిఖాశర్మ ప్రస్తుత పదవీకాలం 2018 జులైతో ముగియనుంది. అయితే నాలుగవసారికూడా ఆమెను కొనసాగించే ప్రతిపాదనను ఆమోదించిన బోర్డు ఆర్‌బీఐ ఆమోదం కోసం పంపింది. ఆర్‌బీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో బ్యాంకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై ఆర్‌బీఐ ఈ నిర్ణయాన్ని పునరాలోచించాల్సిందిగా బోర్డును కోరడంతో ఆమె నాలుగవ సారి సీఈవో అయ్యే ప్రక్రియకు అడ్డుకట్ట పడింది.
కాగా యాక్సిస్ బ్యాంకుకు తొలిసారి సీఈఓగా శిఖా శర్మ ప్రస్థానం 2009లో మొదలైంది. దాదాపు ఎనిమిదేళ్ల 10నెలల కాలంలో యాక్సిస్ బ్యాంకును విజయపథంలో నడిపించిన ఘనతను ఆమె సొంతం చేసుకున్నారు. మరోవైపు మొండిబాకీల విషయంలో ఆమె ఆరోపణలను కూడా మూట గట్టుకున్నారు. దీనికి తోడు గత సంవత్సరం అక్టోబర్‌లో యాక్సిస్ బ్యాంకు మొండి బాకీల అంచనా లెక్కల్లో లోపాలు తలెత్తడంతో ఆర్‌బీఐ రూ.3 కోట్ల పెనాల్టీ విధించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment