Term
-
ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రవేశాల గడువు మంగళవారంతో ముగుస్తోంది. అయితే ఇప్పటికీ పూర్తి స్థాయిలో ప్రవేశాలు జరగలేదు. దీంతో మరికొంత గడువు పెంచే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. గత వారం రోజులుగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అడ్మిషన్లు సరిగా జరగడం లేదని జిల్లాల్లోని ఇంటర్ అధికారులు చెబుతున్నారు. ఈ కారణంగా మరికొంత గడువు పొడిగించాలని ఉన్నతాధికారులను కోరారు. దీంతో క్షేత్రస్థాయి నివేదికల ఆధారంగా ప్రవేశాల గడువు పెంపునకు ఇంటర్ బోర్డు అధికారులు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. ప్రైవేటు కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పటికే దాదాపు పూర్తయ్యాయని, ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే కాలేజీల్లోనే సమస్య ఉందని అధికారులు తెలిపారు. హెచ్చరికతో ప్రైవేటు కాలేజీలు అప్రమత్తం.. రాష్ట్రవ్యాప్తంగా 3,339 ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీలు ఉండగా.. వీటిల్లో ఇప్పటి వరకు 3,27,202 మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్‌లో అడ్మిషన్ తీసుకున్నారు. గత ఏడాది (2022–23) కాలేజీల సంఖ్య 3,107 మాత్రమేకాగా, 4,98,699 మంది విద్యార్థులు చేరారు. దీనిని బట్టి దాదాపు 1.7 లక్షల మంది విద్యార్థులు ఇంకా చేరాల్సి ఉందని తెలుస్తోంది. వారంరోజుల క్రితం వరకూ ప్రైవేటు కాలేజీల్లో విద్యార్థుల అడ్మిషన్లు జరుగుతున్నా, ప్రవేశాలను బోర్డుకు చూపించలేదు. విద్యార్థుల ప్రవేశాలు ఒకచోట, వారు చదివేది మరోచోట ఉండేలా కాలేజీలు చేస్తున్న మాయాజాలంపై ఇంటర్ బోర్డు ఉక్కుపాదం మోపడమే ఈ ఆలస్యానికి కారణమని తెలుస్తోంది. ‘సాక్షి’ఈ విషయాన్ని వెలుగులోకి తేవడంతో ప్రభుత్వం స్పందించింది. అడ్మిషన్లు ముగిసే నాటికి ప్రవేశాలు చూపించని కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ హెచ్చరించారు. దీంతో గత వారం లక్ష వరకూ ఉన్న అడ్మిషన్ల సంఖ్య ప్రస్తుతం 2 లక్షలు దాటింది. టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు వెలువడిన తర్వాత ప్రభుత్వ కాలేజీల్లోనూ ప్రవేశాలు కొంత పెరిగాయి. -
శిఖా శర్మకు గుడ్ బై.. కానీ
సాక్షి, ముంబై : యాక్సిస్ బ్యాంకు సీఈవో శిఖాశర్మ పదవీకాలం పొడిగింపు అంశంలో బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. శిఖా శర్మకు గుడ్ బై చెప్పేందుకు మొగ్గు చూపింది. ఈ మేరకు సోమవారం నిర్ణయం తీసుకుంది. బ్యాంకు ఎండీ, సీఈవో తన పదవీకాలాన్నిపొడిగించాల్సిందిగా శిఖా శర్మ బోర్డును కోరారని బోర్డు ఎక్సేంజీలకు ఇచ్చిన సమాచారంలో తెలిపింది. దీంతో ఆమె పదవీ విరమణ కాలాన్ని జులైలో కాకుండా డిసెంబర్ దాకా కొనసాగించేందుకు బోర్డు ఆమోదించిందనీ, దీన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం కోసం పంపినట్టు వెల్లడించింది. జులై 2018 ,డిసెంబర్ 2018దాకా తన పదవీకాలాన్ని పొడిగించాలన్న సీఈవో శిఖా శర్మ అభ్యర్థనను బోర్డు ఆర్బీఐ పరిశీలనకు పంపినట్టు తెలిపింది. అనంతరం కొత్త సీఈవో ఎంపికను చేపట్టనున్న్టటు ప్రకటించింది. వరుసగా మూడవ సారి సీఈవో బాధ్యతలు చేపట్టిన శిఖాశర్మ ప్రస్తుత పదవీకాలం 2018 జులైతో ముగియనుంది. అయితే నాలుగవసారికూడా ఆమెను కొనసాగించే ప్రతిపాదనను ఆమోదించిన బోర్డు ఆర్బీఐ ఆమోదం కోసం పంపింది. ఆర్బీఐ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో బ్యాంకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే దీనిపై ఆర్బీఐ ఈ నిర్ణయాన్ని పునరాలోచించాల్సిందిగా బోర్డును కోరడంతో ఆమె నాలుగవ సారి సీఈవో అయ్యే ప్రక్రియకు అడ్డుకట్ట పడింది. కాగా యాక్సిస్ బ్యాంకుకు తొలిసారి సీఈఓగా శిఖా శర్మ ప్రస్థానం 2009లో మొదలైంది. దాదాపు ఎనిమిదేళ్ల 10నెలల కాలంలో యాక్సిస్ బ్యాంకును విజయపథంలో నడిపించిన ఘనతను ఆమె సొంతం చేసుకున్నారు. మరోవైపు మొండిబాకీల విషయంలో ఆమె ఆరోపణలను కూడా మూట గట్టుకున్నారు. దీనికి తోడు గత సంవత్సరం అక్టోబర్‌లో యాక్సిస్ బ్యాంకు మొండి బాకీల అంచనా లెక్కల్లో లోపాలు తలెత్తడంతో ఆర్బీఐ రూ.3 కోట్ల పెనాల్టీ విధించిన సంగతి తెలిసిందే. -
తమిళనాడు కొత్త గవర్నర్‌గా శంకరమూర్తి?
-
ఇక డీజీపీ పదవీకాలం రెండేళ్లు..
తప్పనిసరి చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్: ఇకపై డీజీపీ పదవీ కాలాన్ని రెండేళ్లు తప్పనిసరి చేసే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. దీనికి సంబంధించిన చట్టపరమైన అంశాలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. పోలీసుశాఖలో తీసుకు రావలసిన సంస్కరణలకు సంబంధించి ఉత్తరప్రదేశ్ మాజీ డీజీపీ ప్రకాశ్‌సింగ్ వేసిన పిటిషన్‌పై స్పందించిన సుప్రీంకోర్టు 2006లో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పలు సూచనలు చేసింది. ఇందులో ప్రధానంగా రాష్ట్ర డీజీపీని ఎంపిక చేయడానికి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో కూడిన స్టేట్ సెక్యూరిటీ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని, రాష్ట్ర డీజీపీగా నియమించిన అధికారి పదవీ కాలపరిమితి రెండేళ్లు తప్పని సరి చేయాలని, ఎస్ఐ నుంచి అదనపు డీజీస్థాయి అధికారులను రెండేళ్లపాటు వారి పోస్టు నుంచి తప్పించరాదని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. ప్రజలు పోలీసులపై ఫిర్యాదులు చేయడానికి ప్రతీ జిల్లాలో పోలీసు కంప్లైంట్ బాక్సులను ఏర్పాటుచేసి, వాటిని ఉన్నతాధికారులు విచారించి, తగిన చర్యలు తీసుకోవాలని, పోలీసుశాఖలో సైతం తమపై అధికారిపై క్రిందిస్థాయి అధికారులు, సిబ్బంది ఫిర్యాదులు చేయడానికి కంప్లైంట్ బాక్సును ఏర్పాటు చేయాలని సూచించింది. వీటిని మూడునెలల్లోగా అమలు చేస్తూ తమకు నివేదిక ఇవ్వాలని కోరింది. ఇందులో కొన్నింటిని అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. కానీ డీజీపీ పోస్టు పదవీకాలం మార్పు, స్టేట్ సెక్యూరిటీ కమిటీ ఏర్పాటు విషయాల్ని అమలు చేయలేదు. రాష్ట్ర విభజన జరిగే చివరిదశలో.. రెండేళ్లు కాకముందే తనను బదిలీ చేయడం అన్యాయమని రైల్వే ఎస్పీ ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై సుప్రీం ఇచ్చిన నోటీసుమేరకు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పీకే.మహంతి కోర్టుకు హాజరై ఈ అంశంతోపాటు డీజీపీ పోస్టు టెన్యూర్‌ను రెండేళ్లు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ మధ్యలోనే రాష్ట్ర విభజన జరగడంతో సుప్రీం సూచనలు అమలు కాలేదు. తాను చేసిన సిఫార్సులను పాటించలేదని మరోసారి దేశ అత్యున్నత న్యాయస్థానం సీరియస్ కాకమునుపే తామూ పాటించాలని కూడా భావిస్తున్నట్లు తెలిసింది.