జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు చైర్మన్‌ గుడ్‌బై  | Zee Entertainment board accepts Subhash Chandra resignation as chairman | Sakshi
Sakshi News home page

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు చైర్మన్‌ గుడ్‌బై 

Published Mon, Nov 25 2019 7:34 PM | Last Updated on Mon, Nov 25 2019 11:31 PM

Zee Entertainment board accepts Subhash Chandra resignation as chairman - Sakshi

సాక్షి, ముంబై: జీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఎంటర్ ప్రైజెస్‌ లిమిటెడ్ (జీల్) ఛైర్మన్‌ సుభాష్ చంద్ర రాజీనామా చేశారు. ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి రానుంది. అయితే బోర్డులో నాన్‌-ఎగ్జిక్యూటివ్‌గా డైరెక్టర్‌గా ఆయన కొనసాగునున్నారు.అలాగే ఈయనతోపాటు పునీత్‌ గోయంకా  కూడా ఎస్సెల్‌ గ్రూపు ప్రతినిధులుగా బోర్డులో కొనసాగుతారు.  అలాగే జీ బోర్డును పునర్యవస్థీకరించిన బోర్డును కొత్తగా  ఆరుగురిని ఇండిపెండెంట్‌ డైరెక్టర్లగా నియమించుకుంది.

వాటాదారుల మార్పుల దృష్ట్యా, సుభాష్ చంద్ర వెంటనే బోర్డు ఛైర్మన్ పదవికి రాజీనామాను బోర్డు అంగీకరించింది.  తాజా ఒప్పందం ప్రకారం, రెగ్యులేషన్ 17 (ఎల్‌బీ) నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ  రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. మరోవైపు సింగపూర్ ప్రభుత్వం, సింగపూర్ మానిటరీ అథారిటీ తమ మొత్తం హోల్డింగ్‌ను (సెకండరీ మార్కెట్ ప్లేస్‌మెంట్ ద్వారా) 8.44 శాతానికి పెంచిందని సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.  నవంబర్ 21 న జీల్‌లో  2.9 శాతానికి సమాన మైన మొత్తం 2.85 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసిందనీ తెలిపింది.  

కాగా రుణ సంక్షోభంలో చిక్కుకున్న జీ 16.5 శాతం వాటాను ఇన్వెస్కో-ఒపెన్‌హైమర్ ఫండ్‌కు రూ.  4,224 కోట్లకు విక్రయించన్నుట్టు ఈ నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విక్రయం ద్వారా సమకూరిన నిధులను రుణాల చెల్లింపునకు వినియోగించుకోనుంది. ఈ 16.50 శాతంలో ఇన్వెస్కో ఒపెన్‌హైమర్ డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ అనుబంధ సంస్థ ఓఎఫ్‌సీ గ్లోబల్‌ చైనా ఫండ్‌కు 2.3శాతం వాటాను విక్రయించనుంది. ఈ సంస్థ ఇప్పటికే జీ లిమిడెలో 8.7శాతం వాటాను కలిగి ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement