Subhash Chandra
-
’జీ’ సుభాష్ చంద్రపై దివాలా చర్యలకు ఎన్సీఎల్టీ ఆదేశాలు
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం, జీ ఎంటర్టైన్మెంట్ (జీల్) గౌరవ చైర్మన్ సుభాష్ చంద్రపై దివాలా చట్టం కింద ప్రొసీడింగ్స్ చేపట్టాలంటూ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ) ఆదేశించింది. ఎస్సెల్ గ్రూప్ సంస్థ వివేక్ ఇన్ఫ్రాకాన్ తీసుకున్న రుణాలకు గ్యారంటార్‌గా ఉన్న చంద్రపై ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ (ఐహెచ్ఎఫ్ఎల్) దాఖలు చేసిన పిటీషన్ మీద ఎన్సీఎల్టీ ఈ ఉత్తర్వులు ఇచ్చింది. మరో రెండు సంస్థలు (ఐడీబీఐ ట్రస్టీíÙప్, యాక్సిస్ బ్యాంక్) దాఖలు చేసిన ఇదే తరహా పిటీషన్లను తోసిపుచి్చంది. ఓపెన్ కోర్టులో ఎన్సీఎల్టీ ఈ ఆర్డరులివ్వగా పూర్తి వివరాలతో కూడిన తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంది. వివరాల్లోకి వెడితే చంద్రా ప్రమోట్ చేస్తున్న ఎస్సెల్ గ్రూప్‌లో భాగమైన వివేక్ ఇన్ఫ్రాకాన్ సంస్థ 2022లో ఐహెచ్‌ఎఫ్‌ఎల్‌కు రూ. 170 కోట్ల రుణం డిఫాల్ట్ అయ్యింది. దీనిపైనే ఐహెచ్ఎఫ్ఎల్ .. ఎన్సీఎల్టీని ఆశ్రయించింది. వ్యక్తిగత గ్యారంటార్లు.. దివాలా ప్రొసీడింగ్స్ పరిధిలోకి రారని, తనపై చర్యలు తీసుకునేందుకు ఎన్సీఎల్టీకి ఎలాంటి అధికారాలు ఉండవని చంద్రా వాదనలు వినిపించారు. అయితే, దీన్ని ఎన్సీఎల్టీ తిరస్కరించగా .. చంద్రా ఎన్సీఎల్ఏటీని ఆశ్రయించారు. వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలని ఇరు వర్గాలు నిర్ణయించుకోవడంతో కేసును ఉపసంహరించుకున్నారు. కానీ, ఆ తర్వాత కూడా బకాయిలను తీర్చకపోవడంతో ఐహెచ్ఎఫ్ఎల్ ఈ ఏడాది ప్రారంభంలో కేసును తిరగదోడింది. -
రామోజీ బధిర రాతలు
సాక్షి, అమరావతి: గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు(ఎంఎస్ఎంఈ) వేగంగా విస్తరిస్తుంటే ఐదేళ్లు గాఢ నిద్రలో ఉన్న ఈనాడు రామోజీ వాటిపై విషం కక్కుతూ ఒక కథనాన్ని వండి వార్చారు. గడిచిన ఐదేళ్ల కాలంలో వీటి సంఖ్య మూడు రెట్లు పెరిగింది. ప్రభుత్వ చర్యలను నీతి ఆయోగ్ ప్రశంసించింది. కేంద్ర ఎంఎస్ఎంఈ శాఖ కీర్తించింది. కళ్లకు, చెవులకు గంతలు కట్టుకొని పడుకున్న రామోజీకి ఇవేవీ కనిపించలేదు. ‘‘ఐదేళ్లు నిద్దరపోయి ఐదురోజుల్లో ఉద్ధరిస్తారట!’’ అంటూ అవాస్తవ కథనాన్ని రాసేశారు. ఏషియన్ సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థ ఎంఎస్ఎంఈల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలను కీర్తిస్తూ తాజాగా ఒక నివేదికను విడుదల చేసింది. ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర ఎంఎస్ఎంఈ మంత్రిత్వశాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర లాల్ దాస్ గడిచిన ఐదేళ్లలో ఎంఎస్ఎంఈ అభివృద్ధి కార్యక్రమాలను ప్రశంసించారు. పీఎంఈజీపీ, పీఎం విశ్వకర్మయోజన్, నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్లో ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన పనితీరు కనబరుస్తోందన్నారు. రాష్ట్రంలో ఎంఎస్ఎంఈ పురోగతికి తిరుపతి, విజయవాడల్లో మరో రెండు ఎంఎస్ఎంఈ డీఎఫ్‌వో కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు సుభాష్ చంద్ర ప్రకటించారు. మౌలిక వసతులకు పెద్ద పీట ఎంఎస్ఎంఈలు ఒక సంఘంగా ఏర్పడి తక్కువ వ్యయంతో ఉత్పత్తి చేసుకునే విధంగా క్లస్టర్ రూపంలో ఉమ్మడి మౌలిక వసతుల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తోంది. ఇందుకోసం ప్రతీ జిల్లాలో కనీసం రెండు చొప్పున మొత్తం 54 క్లస్టర్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రచించింది. అంతర్జాతీయ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నది ఈ క్లస్టర్ల ప్రధాన ఉద్దేశ్యం. తాజాగా విజయనగరం జిల్లా ఎస్.కోటలో జేఎస్‌డబ్ల్యూ ఇండ్రస్టియల్ పార్కు ఏర్పాటుకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం తెలిపింది. సుమారు రూ.531 కోట్లతో అభివృద్ధి చేస్తున్న ఈ పార్కు అందుబాటులోకి వస్తే 35,750 మందికి ప్రత్యక్షంగానూ, 9,375 మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. అనకాపల్లి, కొప్పర్తిల్లో కూడా ఎంఎస్ఎంఈ పార్కులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వ, ఇతర సంస్థల నుంచి బకాయిలు వసూలు కాక ఇబ్బందులు పడుతున్న యూనిట్లకు అండగా విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, కర్నూలుల్లో ప్రాంతీయ ఫెసిలిటేషన్ కౌన్సిళ్లను ఏర్పాటు చేసింది. నూతన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల కోసం వైఎస్ఆర్ జిల్లా కొప్పర్తిలో 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.250 కోట్ల వ్యయంతో మరో టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఇలాంటిది విశాఖపట్నంలో ఉంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ విభాగాలు 25 శాతం తప్పనిసరిగా ఎంఎస్ఎంఈల నుంచే కొనుగోలు చేయాలంటూ చట్టం కూడా తీసుకు వచ్చింది. ఏడు లక్షలు దాటిన ఎంఎస్ఎంఈలు ♦ గత ప్రభుత్వం దిగిపోయేనాటికి రాష్ట్రంలో ఎంఎస్ఎంఈల సంఖ్య 1,93,530. ఈ ఏడాది ఆగస్టు ముగిసే నాటికి వాటి సంఖ్య ఏకంగా 7,72,802. కేంద్ర ప్రభుత్వ ఉద్యమ్ పోర్టల్ గణాంకాలు ఇవి. ♦ ఈ నాలుగున్నర ఏళ్లలో కొత్తగా 15 లక్షలకు పైగా ఉపాధి లభించింది. ♦ గత ఆర్థిక సంవత్సరంలో సగటున ప్రతీ నెలా సగటున కొత్తగా 11,379 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటైతే ఈ ఒక్క ఏడాదిలోనే 19,476కు చేరింది. ♦కోవిడ్ సమయంలో రీస్టార్ట్ ప్యాకేజీ, వైఎస్ఆర్ నవోదయం వంటి పథకాలతో ఎంఎస్ఎంఈ రంగం పునర్జీవం పొందింది. గత ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు, స్పిన్నింగ్ మిల్లులకు బకాయి పెట్టిన రూ.1,588 కోట్లను ఈ ప్రభుత్వం విడుదల చేసింది. రూ.2,087 కోట్ల ప్రోత్సాహకాలను అందించింది. అభివృద్ధి కోసం సర్వే చేయడం కూడా తప్పేనా రామోజీ? వచ్చే నాలుగేళ్ల కాలంలో రాష్ట్రంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంఖ్యను, వాటి వ్యాపారాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో రూ.118 కోట్లతో రైజింగ్ అండ్ యాక్సలరేటింగ్ ఎంఎస్ఎంఈ పెర్ఫార్మెన్స్ (ర్యాంప్) పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇందులో భాగంగా ఎంఎస్ఎంఈల వివరాలను ప్రత్యేక సర్వే ద్వారా సేకరిస్తోంది. ఉద్యమ్ పోర్టల్‌లో నమోదు కాని ఎంఎస్ఎంఈలను గుర్తించడం ఈ సర్వేలో ఓ భాగం. అవగాహన, శిక్షణ కార్యక్రమాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే పథకాలు, బ్యాంకు రుణాలు, డిలేడ్ పేమెంట్, పోర్టల్‌కు అనుసంధానం వంటి ప్రయోజనాలను కల్పించేందుకు ఈ సర్వే ఉపయోగపడనుంది. -
సెబీ ఉత్తర్వులపై శాట్‌కు సుభాష్ చంద్ర, పునీత్ గోయెంకా
న్యూఢిల్లీ: లిస్టెడ్ కంపెనీ దేనిలోనూ డైరెక్టర్ లేదా కీలకమైన మేనేజర్ హోదాలో కొనసాగకుండా సెబీ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర (జెడ్‌ఈఈఎల్– జీల్ చైర్మన్), జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ ఎండీ, సీఈఓ పునీత్ గోయెంకా సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్)ను ఆశ్రయించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. తమకు ఎటువంటి షోకాజ్ నోటీసు జారీ చేయకుండా, సహజ న్యాయ సూత్రాలను అనుసరించకుండా సెబీ ఈ రూలింగ్ ఇచ్చిందన్నది వారి వాదన అని ఆ వర్గాలు పేర్కొన్నాయి. మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్)కు చెందిన నిధుల అక్రమ మళ్లింపు వ్యవహారంలో సెబీ సోమవారం సుభాష్ చంద్ర, పునీత్ గోయెంకాలపై తాజా ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. వీరు తమ హోదాలను అడ్డుపెట్టుకుని సొంత లబ్ది కోసం నిధులను అక్రమంగా తరలించిన కేసులో సెబీ తాజా చర్యలు చేపట్టింది. చంద్ర, గోయెంకా.. జీల్‌సహా ఎస్సెల్ గ్రూప్‌లోని ఇతర లిస్టెడ్ కంపెనీల ఆస్తులను.. సొంత నియంత్రణలోని సహచర సంస్థల కోసం అక్రమంగా వినియోగించినట్లు సెబీ పేర్కొంది. పక్కా ప్రణాళిక ప్రకారం నిధుల అక్రమ వినియోగాన్ని చేపట్టినట్లు తెలియజేసింది. జీల్ షేరు 2018–19లో నమోదైన రూ. 600 స్థాయి నుంచి 2022–23కల్లా రూ. 200కు దిగివచ్చినట్లు సెబీ ప్రస్తావించింది. ఈ కాలంలో కంపెనీ అత్యంత లాభదాయకంగా నడుస్తున్నప్పటికీ షేరు విలువ పడిపోయినట్లు పేర్కొంది. వెరసి కంపెనీలో ఏవో అక్రమాలు జరుగుతున్న విషయాన్ని ఇది ప్రతిఫలించినట్లు వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో కంపెనీలో ప్రమోటర్ల వాటా 41.62 శాతం నుంచి 3.99 శాతానికి పడిపోయినట్లు వెల్లడించింది. -
సుభాష్ చంద్ర, పునీత్‌లకు సెబీ షాక్
న్యూఢిల్లీ: ఏ లిస్టెడ్ కంపెనీలోనూ కీలక యాజమాన్య పదవులు లేదా డైరెక్టర్లుగా బాధ్యతలు చేపట్టకుండా ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్రతోపాటు ఎండీ, సీఈవో పునీత్ గోయెంకాను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ నిషేధించింది. మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్)కు చెందిన నిధుల అక్రమ మళ్లింపు వ్యవహారంలో సెబీ తాజా ఆదేశాలు జారీ చేసింది. జీల్ చైర్మన్ చంద్ర, డైరెక్టరు గోయెంకా తమ హోదాలను అడ్డుపెట్టుకుని సొంత లబ్ది కోసం నిధులను అక్రమంగా తరలించిన కేసులో సెబీ తాజా చర్యలు చేపట్టింది. చంద్ర, గోయెంకా.. జీల్‌సహా ఎస్సెల్ గ్రూప్‌లోని ఇతర లిస్టెడ్ కంపెనీల ఆస్తులను.. సొంత నియంత్రణలోని సహచర సంస్థల కోసం అక్రమంగా వినియోగించినట్లు సెబీ పేర్కొంది. పక్కా ప్రణాళిక ప్రకారం నిధుల అక్రమ వినియోగాన్ని చేపట్టినట్లు తెలియజేసింది. కాగా.. జీల్ షేరు 2018–19లో నమోదైన రూ. 600 స్థాయి నుంచి 2022–23కల్లా రూ. 200కు దిగివచ్చినట్లు సెబీ ప్రస్తావించింది. ఈ కాలంలో కంపెనీ అత్యంత లాభదాయకంగా నడుస్తున్నప్పటికీ షేరు విలువ పడిపోయినట్లు పేర్కొంది. వెరసి కంపెనీలో ఏవో అక్రమాలు జరుగుతున్న విషయాన్ని ఇది ప్రతిఫలించినట్లు వ్యాఖ్యానించింది. ఇదే సమయంలో కంపెనీలో ప్రమోటర్ల వాటా 41.62 శాతం నుంచి 3.99 శాతానికి పడిపోయినట్లు వెల్లడించింది. ప్రమోటర్ల వాటా 4 శాతం దిగువకు చేరినప్పటికీ చంద్ర, గోయెంకా జీల్ వ్యవహారాలను చక్కబెడుతూనే ఉన్నట్లు తెలియజేసింది. -
‘సంగీత’ వార్షికోత్సవ ఆఫర్లు
సాక్షి, బెంగళూరు: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ ‘సంగీత’ మొబైల్స్ 48వ వార్షికోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించింది. గ్రామ్‌ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్ విక్రయాల వరకు ఎదిగిన సంగీత మొబైల్స్ తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి అడుగు పెట్టింది. బెంగళూరులో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల స్టోర్‌ను బాణసవాడిలో ప్రారంభించింది. త్వరలో మరిన్ని ప్రాంతాల్లో విస్తరించనున్నట్లు సంగీత మొబైల్స్ ఎండీ సుభాష్ చంద్ర మీడియాకు తెలిపారు. సంస్థ ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఏటా వార్షికోత్సవ ఆఫర్లు అందిస్తున్నట్టు చెప్పారు. మే 31 నుంచి జూలై మొదటి వారం వరకు ఆఫర్లు కొనసాగిస్తామని తెలిపారు. త్వరలోనే కేరళ, వారణాసి, గోవా, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లో కొత్త శాఖలు ప్రారంభిస్తామన్నారు. కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా స్టోర్ల సంఖ్య 800 దాటనున్నట్లు పేర్కొన్నారు. సంగీత ఆఫర్లు ఇవే.. ప్రతి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై స్మార్ట్ వాచ్ తక్కువ ధరకే లభిస్తుంది. ఎంపిక చేసిన మోడళ్లపై 50 శాతం ఇన్స్టాంట్ క్యాష్‌బ్యాక్. రూ.99లకే ఏడాది కాల పరిమితిగల ఫోన్ ప్రొటెక్షన్, రూ.4,999 విలువ చేసే స్మార్ట్‌ఫోన్ కొంటే అదే ధర ఉన్న మరో మొబైల్ ఉచితం వంటి ఆఫర్లు ఉన్నాయి. వార్షికోత్సవం సందర్భంగా లక్కీడిప్ నిర్వహిస్తున్నట్లు సుభాష్ చంద్ర చెప్పారు. మొత్తం 30 రోజులకు గాను 30 మంది విజేతలను ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.65 వేలు విలువ చేసే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం బహుమతిగా ఇస్తామని వివరించారు. సామాజిక సేవలోనూ.. సుభాష్ చంద్ర తన స్వగ్రామం నెల్లూరు జిల్లా పొదకలూరు మండలం తాటిపర్తిలో వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నారు. పదేళ్ల క్రితం ప్రారంభించిన ఈ కేంద్రంలో ప్రస్తుతం సుమారు 50 మంది ఆశ్రయం పొందుతున్నారు. లాక్డౌన్ సమయంలో అన్నదాన కార్యక్రమాల కోసం రూ.1 కోటి వెచ్చించారు. సుమారు 10 లక్షల మందికి ఆహార పొట్లాలు అదజేశారు. -
తెలంగాణలో అడవులు, పచ్చదనం భేష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అటవీ శాఖ నిబంధనల మేరకు ప్రత్యామ్నాయ అటవీకరణ నిధులను వినియోగిస్తూ మంచి ఫలితాలు రాబడుతోందని నేషనల్ కంపా సీఈవో సుభాష్‌చంద్ర ప్రశంసించారు. అర్బన్ ఫారెస్ట్ పార్కుల ఏర్పాటు ప్రస్తుత పట్టణీకరణ పరిస్థితుల్లో చాలా ఉపయోగకరమైన కార్యక్రమమని పేర్కొన్నారు. జాతీయ అటవీ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసిన రాష్ట్ర పర్యటనలో సుభాష్‌చంద్ర, వివిధ రాష్ట్రాల అటవీ సంరక్షణ ప్రధాన అధికారు (పీసీసీఎఫ్)లు శనివారం క్షేత్ర స్థాయి సందర్శనలో పాల్గొన్నారు. హైదరాబాద్ శివారు కండ్లకోయ అక్సిజన్ అర్బన్ ఫారెస్ట్ పార్కుతోపాటు, ఔటర్‌రింగ్ రోడ్డు పచ్చదనం, ఎవెన్యూ ప్లాంటేషన్లను పరిశీలించారు. తెలంగాణలో అడవుల నిర్వహణ, పచ్చదనం పెంపు చాలా బాగుందని మెచ్చుకున్నారు. తెలంగాణ అటవీశాఖ చొరవ మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా ఉందని యూపీ పీసీసీఎఫ్ సంజయ్ శ్రీవాత్సవ అన్నారు. కార్యక్రమంలో మణిపూర్ పీసీసీఎఫ్ ఆదిత్య జోషి, పీసీసీఎఫ్(కంపా) లోకేశ్ జైస్వాల్, హైదరాబాద్ చీఫ్ కన్జర్వేటర్ ఎం.జె. అక్బర్ పాల్గొన్నారు. -
జీ మీడియాకు పునీత్ గోయెంకా రాజీనామా
సాక్షి, ముంబై: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీల్) సీఎండీ పునిత్ గోయెంకా జీ మీడియా నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్-ఇండిపెండెంట్ డైరెక్టర్ పదవికి రాజీనామా చేశారు. కంపెనీ డైరెక్టర్ పదవికి గోయెంకా రాజీనామా చేశారని, తక్షణమే ఇది అమల్లోకి వస్తుందని జీ మీడియా ఎక్స్ఛేంజ్ సమాచారంలో బుధవారం తెలిపింది. 2010 జనవరి నుంచి జీల్ ఎండీ గా ఉన్న గోయెంకా ఎస్సెల్ గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర పెద్ద కుమారుడు. గోయెంకా జనవరి 1, 2010 నుండి జీ ఎంటర్టైన్మెట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. మరోవైపు జీ మీడియా కార్పొరేషన్ ఈ ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఏకీకృత నికర లాభం 11.14 కోట్లుగా ఉంది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో కంపెనీ 86.66 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఆదాయం 18.42 శాతం తగ్గి 138.15 కోట్ల రూపాయలకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 169.35 కోట్లుగా ఉంది. మల్టీ బిలియన్ డాలర్ల ఎస్సెల్ గ్రూపులో జీ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్ (గతంలో జీ న్యూస్ లిమిటెడ్) ఒకభాగం. -
ఛైర్మన్ షాక్‌తో జీ షేర్లు ఢమాల్
సాక్షి,ముంబై : జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్(జీఈఈఎల్) చైర్మన్ పదవికి సుభాష్ చంద్ర రాజీనామా చేయడంతో కంపెనీ షేరు మంగళవారం సెషన్లో భారీ నష్టాలతో కొనసాగుతోంది. ఇన్వెస్టర్లు ట్రేడర్ల అమ్మకాలతో జీ 9 శాతం నష్టపోయింది. గత సెషన్లో రూ. 343.80 వద్ద ముగిసిన ఈ షేరు, మంగళవారం రూ. 312.40 వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరింది. జీలో సుభాష్ చంద్ర నేతృత్వంలోని ఎస్సెల్ గ్రూప్ వాటా అమ్మకం గురించి గత వారం ప్రతికూల ప్రభావం చూపకపోయినప్పటికీ, జీ బోర్డు ఛైర్మన్ పదవి నుంచి చంద్ర పదవి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించడం ప్రతికూలంగా మారింది. కంపెనీ ఎండీ, సీఈవోలతో చైర్‌పర్సన్‌కు బంధుత్వం వంటివి ఉండకూడదన్న సెబీ నిబంధనలకు లోబడి చంద్ర రాజీనామా చేసినట్లు జీఈఈఎల్ సోమవారం రెగ్యులేటరీ సమాచారంలో వెల్లడించింది. అయితే సుభాష్ చంద్ర కుమారుడు పునిత్ గోయెంకా నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా కొనసాగుతారు. అలాగే బోర్డును పునర్వ్యవస్థీకరించినట్లు, కొత్తగా ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు (ఆర్ గోపాలన్, సురేంద్ర సింగ్, అపరాజిత జైన్) నియమితులైనట్లు పేర్కొంది. కొత్త బోర్డులో స్వతంత్ర డైరెక్టర్లు ఆరుగురు, ఎస్సెల్ గ్రూప్ (జీఈఈఎల్ మాతృసంస్థ) తరఫున ఇద్దరు ఉంటారు. రుణాల భారాన్ని తగ్గించుకునే దిశగా ప్రమోటర్ల వాటాలను మరింతగా విక్రయించేందుకు ఎస్సెల్ గ్రూప్ మార్గాలు అన్వేషిస్తున్న తరుణంలో చంద్ర రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. జూన్ 30న కంపెనీలో 35.79 శాతంగా ఉన్న ప్రమోటర్ల వాటా సెప్టెంబర్ 30 నాటికి 22.37 శాతానికి తగ్గింది. రుణాల చెల్లింపుల కోసం జీఈఈఎల్‌లో 16.5 శాతం వాటాలు విక్రయించనున్నట్లు నవంబర్ 20న ఎస్సెల్ గ్రూప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
జీ ఎంటర్టైన్మెంట్ చైర్మన్‌గా సుభాష్ చంద్ర రాజీనామా
న్యూఢిల్లీ: మీడియా దిగ్గజం జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీఈఈఎల్) చైర్మన్ పదవికి సుభాష్ చంద్ర రాజీనామా చేశారు. ఇది తక్షణమే అమల్లోకి వచ్చినట్లు సంస్థ తెలిపింది. కంపెనీ ఎండీ, సీఈవోలతో చైర్‌పర్సన్‌కు బంధుత్వం వంటివి ఉండకూడదన్న సెబీ నిబంధనలకు లోబడి చంద్ర రాజీనామా చేసినట్లు జీఈఈఎల్ వివరించింది. ఆయన నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టరుగా కొనసాగుతారు. అలాగే బోర్డును పునర్వ్యవస్థీకరించినట్లు, కొత్తగా ముగ్గురు స్వతంత్ర డైరెక్టర్లు (ఆర్ గోపాలన్, సురేంద్ర సింగ్, అపరాజిత జైన్) నియమితులైనట్లు పేర్కొంది. రుణాల భారం తగ్గింపునకు ప్రమోటర్ల వాటాలను మరింతగా విక్రయించేందుకు ఎస్సెల్ గ్రూప్ మార్గాలు అన్వేషిస్తున్న తరుణంలో చంద్ర రాజీనామా ప్రాధాన్యం సంతరించుకుంది. -
జీ ఎంటర్టైన్మెంట్కు చైర్మన్ గుడ్‌బై
సాక్షి, ముంబై: జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ (జీల్) ఛైర్మన్ సుభాష్ చంద్ర రాజీనామా చేశారు. ఈ రాజీనామా తక్షణమే అమల్లోకి రానుంది. అయితే బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్‌గా డైరెక్టర్‌గా ఆయన కొనసాగునున్నారు.అలాగే ఈయనతోపాటు పునీత్ గోయంకా కూడా ఎస్సెల్ గ్రూపు ప్రతినిధులుగా బోర్డులో కొనసాగుతారు. అలాగే జీ బోర్డును పునర్యవస్థీకరించిన బోర్డును కొత్తగా ఆరుగురిని ఇండిపెండెంట్ డైరెక్టర్లగా నియమించుకుంది. వాటాదారుల మార్పుల దృష్ట్యా, సుభాష్ చంద్ర వెంటనే బోర్డు ఛైర్మన్ పదవికి రాజీనామాను బోర్డు అంగీకరించింది. తాజా ఒప్పందం ప్రకారం, రెగ్యులేషన్ 17 (ఎల్బీ) నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని కంపెనీ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. మరోవైపు సింగపూర్ ప్రభుత్వం, సింగపూర్ మానిటరీ అథారిటీ తమ మొత్తం హోల్డింగ్‌ను (సెకండరీ మార్కెట్ ప్లేస్మెంట్ ద్వారా) 8.44 శాతానికి పెంచిందని సంస్థ రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. నవంబర్ 21 న జీల్లో 2.9 శాతానికి సమాన మైన మొత్తం 2.85 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేసిందనీ తెలిపింది. కాగా రుణ సంక్షోభంలో చిక్కుకున్న జీ 16.5 శాతం వాటాను ఇన్వెస్కో-ఒపెన్‌హైమర్ ఫండ్‌కు రూ. 4,224 కోట్లకు విక్రయించన్నుట్టు ఈ నెలలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విక్రయం ద్వారా సమకూరిన నిధులను రుణాల చెల్లింపునకు వినియోగించుకోనుంది. ఈ 16.50 శాతంలో ఇన్వెస్కో ఒపెన్‌హైమర్ డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ అనుబంధ సంస్థ ఓఎఫ్సీ గ్లోబల్ చైనా ఫండ్‌కు 2.3శాతం వాటాను విక్రయించనుంది. ఈ సంస్థ ఇప్పటికే జీ లిమిడెలో 8.7శాతం వాటాను కలిగి ఉంది. -
జీలో 11 శాతం వాటా విక్రయం
సాక్షి, ముంబై : జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ (జీల్) ప్రమోటర్ సుభాష్ చంద్ర ఎస్సెల్ గ్రూప్ వాటాను ఇన్వెస్కో ఒపెన్‌హైమర్ డెవలపింగ్ మార్కెట్స్ ఫండ్ విక్రయించారు. 11 శాతం వాటాను రూ .4,224 కోట్ల విలువకు కొనుగోలు చేసింది. ఈ ఫండ్‌కు ఇప్పటికే కంపెనీలో 8 శాతం వాటా ఉంది. తాజా కొనుగోలు తరువాత జీల్లో ఫండ్ మొత్తం వాటా 19 శాతానికి పెరిగింది. కాగా ప్రమోటర్ల వాటా 25 శాతానికి తగ్గుతుంది. ఈ వివరాలను మార్కెట్ ముగిసిన అనంతరం కంపెనీ వెల్లడించింది. జీల్ ఎండీ, సీఈవో పునీత్ గోయంకా మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక పెట్టుబడిదారుగా కంపెనీపై నమ్మకం వుంచినందుకు సంతోషంగా ఉందన్నారు. ప్రమోటర్లు జీల్లో తమ వాటాను సగం (ఆ సమయంలో 42 శాతం) వ్యూహాత్మక పెట్టుబడిదారులకు విక్రయించడానికి ఉద్దేశించినట్లు ఎస్సెల్ గ్రూప్ నవంబర్‌లో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరిలో, ఎస్సెల్ గ్రూప్ రుణదాతలు జీ ఎంటర్టైన్మెంట్, డిష్ టివి వంటి ఎస్సెల్ కంపెనీలలో వాటాలను అమ్మడం ప్రారంభించింది. సెప్టెంబరు 2019 నాటికి రుణదాతలందరికీ రూ.11వేల కోట్ల రుణాలను తిరిగి చెల్లించాలనేది ఎస్సెల్ గ్రూప్ లక్ష్యం. ఈ నేపథ్యంలోనే తాజా డీల్. కాగా ఈక్వీటీ షేరు సుమారు 400 చొప్పున కొనుగోలు చేయనుంది ఇన్వెస్కో. దీని ప్రభావం గురువారం నాటి ట్రేడింగ్‌లో కనిపించనుంది. -
షేర్లను అమ్ముకున్న జీ ప్రమోటర్లు
న్యూఢిల్లీ: భారీ రుణభారంతో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న జీ గ్రూపు ప్రమోటర్లు ఆరు లిస్టెడ్ కంపెనీల్లో తమ వాటాల నుంచి కొంత మేర ఓపెన్ మార్కెట్లో విక్రయించిన విషయం వెలుగు చూసింది. జవనరి 25 నుంచి ఫిబ్రవరి 1 మధ్య ఈ లావాదేవీలు జరిగాయి. తద్వారా రూ.1050 కోట్లను ప్రమోటర్లు సమకూర్చుకున్నారు. జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్, డిష్‌టీవీ, జీ మీడియా కార్పొరేషన్, సిటీ నెట్వర్క్స్, జీ లెర్న్ కంపెనీల్లో వాటాలను అమ్మేసినట్టు స్టాక్ ఎక్సేంజ్‌లకు ఇచ్చిన సమాచారం ఆధారంగా తెలుస్తోంది. ఎస్సెల్ ఇన్ఫ్రా ఆధ్వర్యంలో మౌలిక సదుపాయాల రంగంలో చేసిన వ్యాపారాలు బెడిసి కొట్టాయని, భారీ రుణ భారాన్ని తీర్చడంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్టు జీ ప్రమోటర్ సుభాష్‌చంద్ర గత నెల 26న ప్రకటించడం గమనార్హం. అమ్మకాలు వీటిల్లోనే... ►జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌లో ప్రమోటర్ల సంస్థలు అయిన... సైక్వేటర్ మీడియా సర్వీసెస్ ప్రైవేటు లిమిటెడ్ 1.69 శాతం, ఎస్సెల్ కార్పొరేట్ ఎల్ఎల్పీ 0.85 శాతం మేర షేర్లను అమ్మేశాయి. ఈవాటాల విక్రయం ద్వారానే ప్రమోటర్లకు రూ.874.11 కోట్లు సమకూరాయి. ►డిష్ టీవీలో వరల్డ్ క్రెస్ట్ అడ్వైజర్స్ ఎల్ఎల్పీ 0.86 శాతం, డైరెక్ట్ మీడియా డిస్ట్రిబ్యూషన్ వెంచర్స్ 0.80 శాతం, వీనా ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేటు లిమిటెడ్ 0.35 శాతం చొప్పున రూ.97.34 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. ►జీ మీడియా కార్పొరేషన్లో ఏఆర్ఎం ఇన్ఫ్రా అండ్ యుటిలిటీస్ 2.38 శాతం, 25ఎఫ్‌పీఎస్ మీడియా 3.09 శాతం మేర షేర్లను అమ్మేశాయి. ►సిటీ నెట్‌వర్క్స్‌లో ఆరో మీడియా అండ్ బ్రాడ్‌బ్యాండ్ ప్రైవేటు లిమిటెడ్ 4.50 శాతం వాటాను విక్రయించింది. దీని విలువ రూ.28.88 కోట్లుగా ఉంది. -
జీ పై జియో కన్ను!!
న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్‌ప్రైజెస్‌పై (జీల్) టెలికం దిగ్గజం రిలయన్స్ జియో కన్నేసింది. చౌక చార్జీలతో టెలికం రంగాన్ని కుదిపేసిన జియో... తాజాగా మీడియా కంటెంట్ విషయంలోనూ ఆధిపత్యం సాధించేందుకు వ్యూహాలు రచిస్తోంది. దీన్లో భాగంగా జీల్లో వాటాలు దక్కించుకోవడంపై దృష్టి సారిస్తోంది. ప్రమోటర్ సుభాష్ చంద్ర వాటాల్లో సగభాగాన్ని కొనుగోలు చేసేందుకు బరిలోకి దిగాలని జియో యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటిదాకా అంతర్జాతీయ సంస్థలతోనే జట్టు కడతామంటూ వచిన జీల్ ప్రమోటర్లు... తాజాగా దేశీ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునే అవకాశాలూ పరిశీలిస్తామని చెప్పడంతో జియో బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఇప్పటికే అమెజాన్, యాపిల్, టెన్సెంట్, ఆలీబాబా వంటి ఓవర్ ది టాప్ (ఓటీటీ) అంతర్జాతీయ దిగ్గజాలు రేసులో ఉన్నాయి. వీటితో పాటు ఏటీఅండ్‌టీ, సింగ్టెల్, కామ్‌కాస్ట్, సోనీ పిక్చర్స్ పేర్లు కూడా వినిపిస్తున్న నేపథ్యంలో తాజా పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. దేశీ ఇన్వెస్టరుకు విక్రయించే యోచన.. దీర్ఘకాలికంగా జీల్‌కు మరింత విలువ తెచ్చిపెట్టేలా కంపెనీని తీర్చిదిద్దగలిగే సామర్థ్యమున్న అంతర్జాతీయ సంస్థలకు సగం వాటా దాకా విక్రయించేందుకు సిద్ధమని 2018 నవంబర్‌లో సుభాష్ చంద్ర ప్రకటించారు. కాకపోతే, దేశీ ఇన్వెస్టర్లను కూడా పరిగణనలోకి తీసుకుంటామని ఇటీవల జీల్ మేనేజింగ్ డైరెక్టర్ పునీత్ గోయెంకా చెప్పారు. ఈ దిశగా ఇప్పటికే కొన్ని సంస్థలతో చర్చలు కూడా మొదలెట్టామని, మరికొద్ది వారాల్లో డీల్ ప్రకటించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. దీంతో రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన జియో వంటి దేశీ దిగ్గజాలు కూడా జీల్‌పై దృష్టి సారిస్తున్నాయి. మీడియాలో రిలయన్స్ హవా.. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఇప్పటికే పలు మీడియా, ఎంటర్టైన్మెంట్ సంస్థల్లో ఇన్వెస్ట్ చేశారు. నెట్వర్క్18లో 75 శాతం వాటాలు కొనుగోలు చేశారు. న్యూస్‌కి సంబంధించి సీఎన్ఎన్–న్యూస్18, సీఎన్‌బీసీ–టీవీ18, ఎంటర్టైన్మెంట్కి సంబంధించి వయాకామ్ 18తో పాటు సినిమాల నిర్మాణ సంస్థ వయాకామ్18 మోషన్ పిక్చర్స్ వంటివి ఇందులో భాగమే. వీటితో పాటు హిందీ, ఇంగ్లీష్ సహా పలు భారతీయ భాషల్లో డిజిటల్, పబ్లిషింగ్ సంస్థలూ ఇందులో ఉన్నాయి. రామోజీరావుకు చెందిన ఈటీవీ వివిధ భాషల్లో ఆరంభించిన న్యూస్ ఛానెళ్లు కూడా ప్రస్తుతం నెట్వర్క్–18 చేతిలోనే ఉన్నాయి. 2017 జూలైలో కంటెంట్ ప్రొడక్షన్ సంస్థ బాలాజీ టెలీఫిలిమ్స్‌లో రిలయన్స్ 24.9 శాతం వాటాలు కొనుగోలు చేసింది. ఈ సంస్థకి ఆల్ట్‌బాలాజీ పేరుతో ఓవర్–ది–టాప్ (ఓటీటీ) యాప్ కూడా ఉంది. ఇక ఇప్పుడు జీల్లో కూడా వాటాలు కొనుగోలు చేస్తే ఓటీటీ, బ్రాడ్‌కాస్టింగ్ విభాగంలో రిలయన్స్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే అవకాశాలు ఉన్నాయని, దేశీయ నెట్‌ఫ్లిక్స్‌గా ఎదిగేందుకు రిలయన్స్ చేస్తున్న ప్రయత్నాలకు మరింత దన్ను లభిస్తుందని పరిశ్రమవర్గాలు భావిస్తున్నాయి. సుభాష్ చంద్రకు దక్కేదెంత.. ప్రస్తుతం జీల్లో సుభాష్ చంద్ర, ఆయన కుటుంబానికి 41 శాతం వాటాలుండగా.. ఇందులో 20 శాతం వాటాలను విక్రయించాలని భావిస్తున్నారు. వాటాల విక్రయ వార్తలతో డిసెంబర్లో జీల్ షేరు రూ.500 స్థాయికి ఎగియడంతో వీటి విలువ రూ.10,000 కోట్లకు ఎగిసింది. అయితే, శుక్రవారం ప్రతికూల వార్తలతో జీల్ షేరు ఏకంగా 26 శాతం పతనం కావడంతో ఆ రోజు లెక్కల ప్రకారం 20 శాతం వాటాలకు గాను సుభాష్ చంద్రకు రూ. 7,000 కోట్లు మాత్రమే దక్కే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఇది డిసెంబర్ నాటి విలువతో పోలిస్తే 30 శాతం తక్కువ. అయితే, సోమవారం షేరు కోలుకోవడంతో విలువ మళ్లీ కొంత మేర పెరిగిందని, రూ.8వేల కోట్ల దరిదాపుల్లో ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఎస్సెల్‌కు బ్యాంకర్ల భరోసా.. షేరు 17 శాతం జూమ్.. రుణాల చెల్లింపు అంశానికి సంబంధించి జీల్ మాతృసంస్థ ఎస్సెల్ గ్రూప్, బ్యాంకర్లకు మధ్య ఒప్పందం కుదరడంతో సోమవారం సంస్థ షేరు ఎగిసింది. ఒప్పందం ప్రకారం.. తనఖాలోని ప్రమోటర్ల షేర్లను మూడు నెలల దాకా విక్రయించబోమని, ధర తగ్గినా దీనికి కట్టుబడి ఉంటామని బ్యాంకులు, మ్యూచువల్ ఫండ్స్, నాన్–బ్యాంకింగ్ ఫైనాన్షియల్ సంస్థలు భరోసా ఇచ్చాయి. ఈలోగా జీల్లో వాటాలతో పాటు ఇన్ఫ్రా అసెట్స్ మొదలైన వాటిని విక్రయించడం ద్వారా ఎస్సెల్ గ్రూప్ దశలవారీగా రుణాలను తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. శుక్రవారం నాటి గణాంకాల ప్రకారం.. జీల్ మార్కెట్ విలువ రూ. 30,673 కోట్లుగా ఉండగా.. రూ.7,580 కోట్ల విలువ చేసే షేర్లు తనఖాలో ఉన్నాయి. మరోవైపు, డీమోనిటైజేషన్ అనంతరం గ్రూప్ సంస్థల సందేహాస్పద డిపాజిట్లపై విచారణ జరుగుతోందన్న వార్తలను కంపెనీ ఖండించింది. ఈ సానుకూల అంశాలతో సోమవారం జీల్ షేరు ఏకంగా 17 శాతం ఎగిసి రూ. 372.50 వద్ద క్లోజయ్యింది. ఇంట్రాడేలో ఒక దశలో 19 శాతం కూడా పెరిగి రూ. 380.80 స్థాయిని తాకింది. ప్రతికూల వార్తల మధ్య జీల్ షేరు శుక్రవారం ఏకంగా 26 శాతం పతనమైన సంగతి తెలిసిందే. ఓటీటీ రంగం..రూ.35 వేల కోట్లకు! ఇంటర్నెట్ ద్వారా జరిగే మీడియా కంటెంట్ ప్రసారాన్ని ఓటీటీగా వ్యవహరిస్తారు. 2018లో దేశీ ఓటీటీ మార్కెట్ రూ.3,500 కోట్లుగా ఉండగా.. 2023 నాటికి ఇది పది రెట్ల వృద్ధితో రూ. 35,000 కోట్ల స్థాయికి చేరుతుందనే అంచనాలున్నాయి. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్లో 40 శాతం వాటాతో హాట్‌స్టార్ అగ్రస్థానంలో ఉండగా, జియో టీవీ 18% వాటాతో రెండో స్థానంలో ఉంది. జీ గ్రూప్‌నకు చెందిన జీ5కి 15%, వూట్ (వయాకామ్18)కి 12 శాతం, అమెజాన్ ప్రైమ్ వీడియోకి 1.43 శాతం, నెట్‌ఫ్లిక్స్‌కు 2 శాతం మార్కెట్ వాటా ఉంది. -
ఎవ్వరిదీ పైసా ఉంచుకోను...క్షమించండి!
ముంబై: ఎస్సెల్ గ్రూప్ తీవ్ర సంక్షోభ పరిస్థితులు ఎదుర్కొంటోందంటూ వస్తున్న వార్తలపై గ్రూప్ చైర్మన్ సుభాష్ చంద్ర ఎట్టకేలకు పెదవి విప్పారు. కంపెనీ ఆర్థిక సంక్షోభంలో ఉన్న మాట నిజమేనని అంగీకరించారు. దీన్నుంచి బైటపడే క్రమంలో కీలకమైన జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ (జీఈఈఎల్)లో వాటాలను విక్రయించి నిధులు సమీకరించేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. కొన్ని శక్తులు పడనివ్వడం లేదని ఆరోపించారు. ఇన్ఫ్రా పెట్టుబడులపై ఆశలు పెట్టుకున్నా ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం కారణంగా పరిస్థితి అదుపు తప్పిందని, వీడియోకాన్‌కి చెందిన డీ2హెచ్ వ్యాపారం కొనుగోలు కూడా కలిసి రాలేదని పేర్కొన్నారు. శుక్రవారం రుణదాతలకు రాసిన బహిరంగ లేఖలో సుభాష్ చంద్ర ఈ విషయాలు వెల్లడించారు. తొందరపడితే మీకే నష్టం.. రుణదాతలకు క్షమాపణ చెప్పిన సుభాష్ చంద్ర .. జీఈఈఎల్‌లో వాటాల విక్రయం పూర్తయ్యే దాకా ఓపిక పట్టాలని కోరారు. అలా కాకుండా తొందరపాటుతనంతో వ్యవహరిస్తే.. రెండు వర్గాలూ నష్టపోక తప్పదని వ్యాఖ్యానించారు. అయితే, మొత్తం అప్పు ఎంత ఉన్నది, ఎగవేతలేమైనా జరిగాయా లాంటి అంశాలు ఆయన ప్రస్తావించలేదు. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్ సంక్షోభం అనంతరం రుణాల రోలోవర్ కష్టంగా మారిందని, అయితే డిసెంబర్ దాకా చెల్లింపులన్నీ సక్రమంగానే జరపగలిగామని పేర్కొన్నారు. ‘నా ఉద్దేశాలు మంచివే అయినప్పటికీ బ్యాంకర్లు, ఎన్బీఎఫ్సీలు, మ్యూచువల్ ఫండ్స్ ఆశించినట్లుగా పనిచేయలేకపోయాయని నేను భావిస్తున్నాను. ఇందుకుగాను క్షమాపణలు చెబుతున్నాను. ఎవ్వరిదీ ఒక్క పైసా రుణం కూడా ఉంచుకోబోను. జీఈఈఎల్‌లో వాటాల విక్రయం పూర్తయితే అన్ని రుణాలను తీర్చేయగలుగుతాము. అప్పటిదాకా ఓర్పు వహించండి. కానీ ఆందోళనతో, అరాచకంగా స్పందిస్తే దాని వల్ల మీరూ, మేమూ నష్టపోవాల్సి వస్తుంది‘ అని చంద్ర పేర్కొన్నారు. తప్పులు జరిగాయి.. గతేడాది జూన్ నుంచి సమస్యలు వెన్నాడుతున్నాయని, రుణదాతలు.. షేర్హోల్డర్లకు గుర్తుతెలియని శక్తులు లేఖలు రాస్తూ గందరగోళపరుస్తున్నాయని సుభాష్ చంద్ర చెప్పారు. తన వంతుగా కొన్ని తప్పులు కూడా జరిగాయని ఆయన తెలిపారు. ఎస్సెల్ ఇన్ఫ్రా కారణగా రూ. 4,000–5,000 కోట్ల మేర నష్టపోవాల్సి వచ్చిందన్నారు. అలాగే 2016 నవంబర్‌లో వీడియోకాన్ డీ2హెచ్ వ్యాపారం కొనుగోలుతో బోలెడంత నష్టపోయామని చెప్పారు. ఇక కుటుంబ వ్యాపార విభజన సమయంలో గ్రూప్ కంపెనీల రుణభారమంతా తమపైనే వేసుకోవడం మరో పెద్ద తప్పిదమని పేర్కొన్నారు. షేర్లు ఢమాల్... డీమోనిటైజేషన్ తర్వాత భారీ డిపాజిట్లు చేయడంపై ఎస్ఎఫ్ఐవో విచారణ ఎదుర్కొంటున్న కంపెనీల జాబితాలో ఎస్సెల్ గ్రూప్ సంస్థల పేర్లున్నాయని వార్తలు రావడంతో గ్రూప్ కంపెనీల షేర్లు భారీగా పడ్డాయి. డిష్ టీవీ 33%, జీలెర్న్ 19%, ఎస్సెల్ ప్యాక్ 12% క్షీణించాయి. జీ గ్రూప్ మార్కెట్ విలువ రూ. 14,000 కోట్లు పడిపోయింది. జీ ఎంటర్టైన్మెంట్ 26% క్షీణించి రూ. 319కి పడిపోయింది. -
‘జీ’పై విదేశీ దిగ్గజాల కన్ను!?
ముంబయి: సుభాష్ చంద్ర... దేశీ మీడియా రంగంలో సుపరిచితమైన పేరు. జీ టెలివిజన్ చానెళ్లతో విదేశీ మీడియా సంస్థలకు దీటుగా వ్యాపారాన్ని విస్తరించారు. అయితే, హఠాత్తుగా ప్రధాన కంపెనీలో వాటాలను విక్రయించాలని నిర్ణయించడంతో మీడియాలో ఇప్పుడిది హాట్ టాపిక్‌గా మారింది. తన వ్యాపారానికి మూల స్తంభంలాంటి జీ ఎంటర్టైన్మెంట్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్(జీల్) పగ్గాలను ఎందుకు వదులుకోవాలని అనుకుంటున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. అంతర్జాతీయ మీడియా దిగ్గజాలు, టెక్నాలజీ కంపెనీలతో పాటు దేశీయంగా మీడియాలో దూసుకెళ్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా జీ ఎంటర్టైన్మెంట్పై కన్నేసినట్లు పరిశ్రమవర్గాలు పేర్కొంటున్నాయి. బంపర్ ఆఫర్ వచ్చిందా... ఒక గ్లోబల్ మీడియా అగ్రగామి నుంచి భారీస్థాయిలో ఆఫర్ వచ్చిందని... ఈ నేపథ్యంలో తాము వాటా విక్రయానికి సిద్ధమైనట్లు స్వయంగా జీల్ సీఈఓ, సుభాష్ చంద్ర తనయుడు పునీత్ గోయెంకా తాజాగా వెల్లడించారు. ప్రస్తుతం ప్రమోటర్లకు (ఎస్సెల్ హోల్డింగ్స్) జీల్లో 42 శాతం వాటా ఉంది. ఇందులో సగం వరకూ వాటాను విక్రయించనున్నామని... కొనుగోలుదారులు అడిగితే మరింత వాటాను విక్రయించడానికి కూడా రెడీగా ఉన్నట్లు గత వారంలో జీ ప్రమోటర్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకోసం అంతర్జాతీయ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ గోల్డ్‌మన్ శాక్స్, సలహా సంస్థ లయన్ ట్రీలను కూడా నియమించుకున్నారు. తాము వ్యాపారం నుంచి పూర్తిగా వైదొలిగే ప్రణాళికల్లేవని పునీత్ చెబుతున్నప్పటికీ.. కంపెనీపై నియంత్రణ వదులుకోవడానికి ప్రమోటర్లు సిద్ధపడే అవకాశం ఉందని ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ‘జీ ఎంటర్టైన్మెంట్ను కొనుగోలు చేసేందుకు ప్రపంచస్థాయి మీడియా దిగ్గజం ఇటీవలే ప్రమోటర్లను సంప్రతించింది. దీంతో వాటా విక్రయం ప్రక్రియను మొదలుపెట్టాలని నిర్ణయించారు. ఎందుకంటే జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి అవకాశం లభిస్తుంది’ అని గోయెంకా పేర్కొనడం విశేషం. రేసులో ఎవరెవరు... జీల్ కొనుగోలు రేసులో అంతర్జాతీయ మీడియా, టెక్నాలజీ దిగ్గజాలు ఉన్నట్లు సమాచారం. ఇటీవలి ఒక మీడియా కథనం ప్రకారం కామ్‌కాస్ట్, సోనీ, చార్టర్ కమ్యూనికేషన్స్, అలీబాబా, గూగుల్, యాపిల్లు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ జియోతో దేశీ టెలికం రంగంలో సంచలనం సృష్టించిన ముకేశ్ అంబానీ కూడా జీల్లో మెజారిటీ వాటా కోసం పోటీపడొచ్చని వార్తలొస్తున్నాయి. ప్రస్తుత నిబంధనల ప్రకారం దేశీ ఎంటర్టైన్మెంట్ మీడియా కంపెనీల్లో 100 శాతం వాటాను విదేశీ సంస్థలు కొనుగోలు చేసేందుకు వీలుంది. అయితే, తాము వ్యూహాత్మక భాగస్వామ్యానికే మొగ్గుచూపుతామని పునీత్ చెబుతున్నారు. మరోపక్క, విదేశీ కంపెనీలు కూడా ఇక్కడి కంపెనీలను పూర్తి స్థాయిలో టేకోవర్ చేసేందుకు వెనకాడవచ్చనేది నిపుణుల మాట. విభిన్న భాషలు, సంక్లిష్టమైన కార్యకలాపాలతో కూడిన దేశీ ఎంటర్టెన్మెంట్ మార్కెట్‌ను నడిపించేందుకు స్థానిక భాగస్వామ్యాన్ని వారు కోరుకోవచ్చని భావిస్తున్నారు. కాగా, తాజా షేరు ధర ప్రకారం జీల్ మార్కెట్ విలువ దాదాపు రూ.42,000 కోట్లు. ఇందులో ప్రమోటర్ల వాటా సుమారు రూ.17,600 కోట్లు. అయితే, ఈ విలువకన్నా 20–25 శాతం అధిక ధరకే డీల్ కుదరవచ్చన్నది విశ్లేషకుల అంచనా. దీని ప్రకారం కంపెనీ మార్కెట్ విలువను రూ.57,800 కోట్ల నుంచి రూ. 64,500 కోట్లుగా (8–9 బిలియన్ డాలర్లు) లెక్కగట్టొచ్చని భావిస్తున్నారు. ఈ ఏడాది జూలైలో రూపర్ట్ మర్దోక్‌కు చెందిన ట్వంటియత్ సెంచురీ ఫాక్స్ వ్యాపారాన్ని డిస్నీ ఏకంగా 71 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేయడం తెలిసిందే. ఇందులో భారత్ కార్యకలాపాలు కూడా ఉన్నాయి. దీనిప్రకారం స్టార్ ఇండియా విలువను ఏకంగా 15 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. గ్లోబల్ టెలికం– కంటెంట్ దిగ్గజం కామ్‌కాస్ట్ గనుక జీల్లో మెజారిటీ వాటాను దక్కించుకుంటే... అది దేశీ మీడియా రంగం స్వరూపాన్ని మార్చివేయొచ్చని పరిశ్రమ నిపుణులు భావిస్తున్నారు. రిలయన్స్ జియోపై కూడా ఇది తీవ్ర ప్రభావం చూపొచ్చనేది వారి అభిప్రాయం. ఓటీటీలో దూసుకెళ్లేందుకేనా... మీడియా రంగంలో ప్రస్తుతం విపరీతమైన పోటీ నెలకొంది. మరోపక్క, ఇంటర్నెట్ ఆధారిత కంటెంట్ కూడా అంతకంతకూ ప్రేక్షకులను ఆకర్షిస్తుండటం సాంప్రదాయ టెలివిజన్ చానెళ్ల ఆదాయానికి గండికొడుతోంది. ఓవర్ ది టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్‌గా పిలుస్తున్న ఈ విభాగంలో యూజర్లు అంతకంతకూ పెరిగిపోతుండటం దీనికి నిదర్శనం. ప్రస్తుతం దేశంలో స్టార్ టీవీ గ్రూప్‌నకు చెందిన హాట్‌స్టార్, అమెజాన్ ప్రైమ్, నెట్‌ఫ్లిక్స్ వంటి ఓటీటీ ఆపరేటర్ల కంటెంట్‌కు మంచి గిరాకీయే ఉంది. ఇదే తరుణంలో సుభాష్ చంద్ర ప్రారంభించిన జీల్ అనుబంధ సంస్థ జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు కూడా ఆదరణ పెరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో టెక్నాలజీ మీడియా కంపెనీగా జీల్ మార్పు చెందడం కోసమే వాటా విక్రయానికి నిర్ణయం తీసుకున్నట్లు జీ ప్రమోటర్లు చెబుతున్నారు. హాట్‌స్టార్ యూజర్ల సంఖ్య 10 కోట్లను దాటింది. జీ5 యూజర్లు కూడా 5 కోట్లకు చేరుకోనున్నారు. వాస్తవానికి జీ5లోనే వ్యూహాత్మక ఇన్వెస్టర్లకు వాటా విక్రయించాలని భావించామని... అయితే, మాతృ సంస్థ వద్ద భారీగా కంటెంట్ ఉండటంతో జీల్లో వాటాకు విదేశీ ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారని పునీత్ చెప్పారు. తాము అధునాతన టెక్నాలజీతో కూడిన కంటెంట్ కంపెనీగానే కొనసాగాలని భావిస్తున్నామని వివరించారు. అంతర్జాతీయ మీడియా రంగంలో ఓటీటీ కంటెంట్‌తో పాటు టెలికం సేవలు కూడా కలగలిసిపోతు న్నాయి. అందుకే కొన్ని టెలికం, టెక్నాలజీ కంపె నీలు కూడా మీడియాలోనూ (ఓటీటీ ప్లాట్‌ఫామ్) భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. పునీత్ మాత్రం తమకు టెలికంపై ఎలాంటి ఆసక్తీ లేదని స్పష్టంచేశారు. ఈ నేపథ్యంలో జీల్లో ప్రమోటర్ల వాటా విక్రయానికి భారీగానే విలువ (వేల్యుయేషన్) దక్కొచ్చని నిపుణులు భావిస్తున్నారు. -
భారత రేటింగ్ పెంచాల్సిందే
న్యూఢిల్లీ: భారత్ ఎన్నో నిర్మాణాత్మక, ప్రధాన ఆర్థిక సంస్కరణలు చేపట్టినందున రేటింగ్ పెంపునకు అర్హత ఉందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్ అన్నారు. వరుసగా 12వ ఏడాదీ భారత సార్వభౌమ రేటింగ్‌ను పెంచేందుకు ఫిచ్ నిరాకరిస్తూ బీబీబీను కొనసాగించిన నేపథ్యంలో గార్గ్ స్పందించారు. ఫిచ్ చర్య తమకు ఆశ్చర్యం కలిగించలేదని చెప్పారు. భారత ఆర్థిక వ్యవస్థ విషయలో ఎంతో సానుకూల దృక్పథంతో ఉన్నప్పటికీ ప్రధానంగా ప్రభుత్వ రుణ భారం స్థాయిపైనే తాము దృష్టి సారించినట్టు ఫిచ్ పేర్కొనట్టు చెప్పారు. అయితే, ప్రభుత్వం రేటింగ్ ఏజెన్సీలతో సంప్రదింపులు జరుపుతుందని, ఆర్థిక వ్యవస్థ సాధించిన విజయాలు, పనితీరు విషయంలో వాటికి నచ్చజెప్పే ప్రయత్నం కొనసాగుతుందని గార్గ్ స్పష్టం చేశారు. జీఎస్టీ, ఐబీసీ, రెరా చట్టాలతోపాటు ఆర్థిక నేరస్థులకు సంబంధించి తీసుకొచ్చిన చట్టాన్ని ఆయన గుర్తు చేశారు. -
కేజ్రివాల్‌కు కోర్టు సమన్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్‌కు సోమవారం మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సమన్లు జారీ చేసింది. జూలై 29 లోపు కోర్టులో హాజరు కావలని ఆదేశించింది. కేజ్రివాల్ తప్పడు ఆరోపణలు చేశారంటూ రాజ్య సభ ఎంపీ, ఎస్సెల్ గ్రూప్ చైర్మెన్ సుభాష్ చంద్ర పరువు నష్టం కేసు దాఖలు చేసిన విషయం తెలిసిందే. కేజ్రివాల్ గతేడాది నవంబర్ 11న ప్రెస్ మీట్లో తన వద్ద నల్లడబ్బు ఉందని, నోట్లరద్దు విషయం తనకు ముందే తెలుసనే అవాస్తవాలు మాట్లాడారని చంద్ర పిటీషన్లో పేర్కొన్నారు. ఇది తన పరువుకు భంగం కల్గిందని భారత పీనల్ కోడ్ 500 సెక్షన్ కింద కేజ్రివాల్‌పై పరువు నష్టం కేసు పెట్టారు. దీన్ని విచారించిన కోర్టు కేజ్రివాల్‌కు సమన్లు జారీ చేసింది. -
‘జీ–జిందగీ’లో పాక్ టీవీ కార్యక్రమాలు రావు
ముంబై: ఈజిప్టు, టర్కీ, పాకిస్థాన్ నుంచి కార్యక్రమాల్ని తీసుకుని ప్రసారం చేసే జీటీవీ గ్రూపులోని జిందగీ ఛానల్ ఇకనుంచి పాక్ కార్యక్రమాల్ని ప్రసారం చేయడాన్ని నిలిపివేయనున్నట్లు జీ గ్రూప్ అధినేత సుభాష్ చంద్ర వెల్లడించారు. పాక్‌కు చెందిన కళాకారులు భారత్‌ను విడిచి రావాల్సిందిగా ఐక్యరాజ్య సమితిలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ పిలుపునివ్వడం దురదృష్టకరమని సుభాష్ చంద్ర అన్నారు. ఐక్యరాజ్య సమితిలో నవాజ్ షరీఫ్ అలాంటి నిర్ణయం తీసుకోవడం దురదృష్టకరమని అందుకే జిందగీలో పాక్ ఆధారిత కార్యక్రమాల్ని నిలిపివేసే ఆలోచనలో ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇక పాక్‌కు చెందిన కళాకారులు భారత్‌ను విడిచివెళ్లిపోవాలని సుభాష్ చంద్ర ట్వీట్ చేశారు. 2014లో జీగ్రూప్ జిందగీ ఛానల్‌ను ప్రారంభించింది. జిందగీ ఛానల్లో ప్రసారమైన ఆన్‌జారా, హమ్‌సఫర్, కిత్నీ గిర్‌హైన్ బాకీ హైన్, మాత్ అండ్ జిందగీ, గుల్జార్ హై వంటి అనేక కార్యక్రమాలు పాకిస్తాన్‌తో మనదేశంలోనూ విశేష ఆదరణ పొందాయి. ఫవాద్, మహీరా ఖాన్ వంటి పాక్ కళాకారులు తక్షణం భారత్‌ను విడిచివెళ్లాల్సిందిగా మహారాష్ట్ర నవనిర్మాణ్‌సేన (ఎంఎన్ఎస్) అధినేత రాజ్ థాకరే హెచ్చరించారు. పొరుగుదేశంలోని కళాకారుల్ని అరువుతెచ్చుకొని స్వదేశంలోని ప్రతిభ గల కళాకారుల అవకాశాలను కొట్టివేస్తున్నారని.. వినియోగించుకుంటే అద్భుత ప్రతిభ కలిగిన కళాకారులు మనదేశంలోనే ఉన్నారని ఎంఎన్ఎస్ ప్రధాన కార్యదర్శి బాలీవుడ్ నిర్మాతలకు బహిరంగ లేఖ రాశారు. -
తప్పు మార్కర్ పెన్నుదా? పార్టీ సభ్యులదా?
న్యూఢిల్లీ: భారత పార్లమెంట్లో ప్రజాస్వామ్యం ఓ బూటకమని, రాజకీయ పార్టీలు ఆడే నాటకమని తెల్సిందే. ఈ బూటకపు నాటకంలో పార్టీ అధిష్టానం చేతుల్లో పార్లమెంట్ సభ్యులు జవసత్వాలు లేని పాత్రలుగా వ్యవహరించడం మనం ఇంతకాలం చూశాం. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికే షాకిచ్చిన పార్టీలోని ఓ వర్గం ఆడిన సరికొత్త నాటకం ఇప్పుడు తెరపైకి వచ్చింది. హర్యానాలోని రెండు సీట్లతో సహా దేశవ్యాప్తంగా 27 రాజ్యసభ సీట్లకు ఆదివారం ఎన్నికలు జరిగాయి. ఈ రెండు సీట్లను బీజేపీ కైవసం చేసుకున్నాయి. అసెంబ్లీలో ఆ పార్టీకున్న బలం ప్రకారం ఒక్క సీటు మాత్రమే బీజేపీకి దక్కాలి. మరోసీటు కాంగ్రెస్-ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ కూటమికి వెళ్లాలి. బీజేపీ అధికార అభ్యర్థిగా కేంద్ర మంత్రి వీరేందర్ సింగ్‌తోపాటు బీజేపీ మద్దతిచ్చిన ప్రముఖ పారిశ్రామికవేత్త, ఈస్ట్ గ్రూప్, జీ మీడియా చైర్మన్ సుబాస్ చంద్ర అనూహ్యంగా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన 13 ఓట్లు చెల్లకుండా పోవడమే కాంగ్రెస్ కూటమి బలపర్చిన స్వతంత్య్ర అభ్యర్థి ఆర్కే ఆనంద్ ఓటమికి కారణమని రిటర్నింగ్ అధికారితోపాటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాదిస్తోంది. ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే తన బ్యాలెట్ పత్రాన్ని తోటి సభ్యుడికి బహిరంగంగా చూపించినందుకు ఒక ఓటు, ఎన్నికల నిబంధనల ప్రకారం రిటర్నింగ్ అధికారి సూచించిన వయలెట్ మార్కర్ పెన్నును ఉపయోగించక పోవడం వల్ల 12 ఓట్లు చెల్లకుండా పోయాయి. మరో ఓటరు ఎవరికి ఓటు వేయకుండా ఖాళీగా వదిలేశారు. దీంతో కాంగ్రెస్ కూటమి బలపర్చిన ఆనంద్‌కు దక్కాల్సిన 14 ఓట్లు రాకుండా పోయాయి. దీనికి రిటర్నింగ్ అధికారి బీజేపీ పార్టీతో అక్రమాలకు కుమ్మక్కు అవడం వల్లనే ఇలా జరిగిందని, సూచించిన మార్కర్ పెన్నుకు బదులుగా ఓటేసేటప్పుడు మరో పెన్నును ఎలా పెడతారని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వాదిస్తోంది. ఈ విషయమై ఎన్నికల కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేసింది. వాస్తవానికి మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హూడా వర్గానికి చెందిన 14 మంది శాసనసభ్యుల ఓట్లే చెల్లకుండా పోయాయని, వారే ఇందులో కుట్రపన్ని తప్పుడు పెన్నుతో ఓటేశారని ఓడిపోయిన స్వతంత్య్ర అభ్యర్థి ఆనంద్ ఆరోపిస్తున్నారు. ఆయన వాదనలో వాస్తవం లేకపోలేదు. బీజేపీతో అంటకాగే ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌తో పొత్తు పెట్టుకోవడం భూపేందర్ సింగ్ హూడాకు ఏమాత్రం ఇష్టం లేదు. పార్టీ అధిష్టానంకు ఆయన ఓ షాక్ ఇవ్వాలనుకున్నారు. ఇచ్చారు. పార్టీ అంతర్గత కుమ్ములాటల గురించి, అవిధేయత గురించి బహిరంగంగా మాట్లాడడం ఇష్టంలేని కాంగ్రెస్ అధిష్టానం నెపాన్ని రిటర్నింగ్ అధికారిపైకి నెట్టేస్తోంది. ఇందులో పూర్తిగా రిటర్నింగ్ అధికారి తప్పిదమేననుకుంటే ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సరైన మార్కర్‌తోనే ఓట్లు ఎలావేశారన్న ప్రశ్న వస్తుంది. ఈ మొత్తం వ్యవహారంలో రిటర్నింగ్ అధికారి హస్తం ఉన్నా, లేకున్నా హూడా వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కుమ్మక్కు కాకపోతే ఇలా జరగదనే విషయం సుస్పష్టం. ఎమ్మెల్యేలు డబ్బులకు అమ్ముడుపోయి పార్టీ అధిష్టానం ఆదేశాలకు విరుద్ధంగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడరాదనే ఉద్దేశంతో రాజ్యసభ ఎన్నికల్లో 2003 నుంచి ఏజెంట్ల వ్యవస్థను ప్రవేశపెట్టారు. ఈ పద్ధతి ప్రకారం పార్టీ నియమించిన ఏజెంట్‌కు చూపించి పార్టీ సభ్యులు ఓటు వేయాల్సి ఉంటుంది. హర్యానా నుంచి జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున ఏజెంట్‌గా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బీకే హరిప్రసాద్ వ్యవహరించారు. ఓట్లు చెల్లకుండా పోయిన 13 మంది శాసన సభ్యులు సహా పార్టీ సభ్యులంతా తనకు చూపించే ఓటు వేశారని హరిప్రసాద్ ఓటింగ్ అనంతరం మీడియా సమక్షంలో ప్రకటించారు. అందరు కూడా ఆనంద్‌కే ఓటేశారని చెప్పారు. ఎవరికి ఓటు వేశారన్న విషయాన్ని గ్రహించిన ఆయన ఏ పెన్నుతో ఓటు వేశారన్న విషయాన్ని గమనించలేకపోయారు. ఎన్ని కొత్త పద్ధతులు తీసుకొచ్చిన క్రాస్ ఓటింగ్ జరుగుతోందన్నది నిర్వివాదాంశం. ఏదేమైతేనేం! మరో పారిశ్రామికవేత్త, ధనవంతుడు రాజ్యసభకు ఎన్నికయ్యారు. -
'చెల్లని' కాంగ్రెస్ ఓట్లు.. మీడియా కింగ్ విజయం
మీడియా కింగ్ సుభాష్ చంద్ర అనూహ్యంగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. ఆయన హరియాణా నుంచి పెద్దల సభకు ఎన్నికయ్యారు. బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన జీ గ్రూపు అధినేత.. పెద్ద రాజకీయ డ్రామా నడుమ ఎన్నిక కావడం గమనార్హం. ఈయనపై ఐఎన్ఎల్డీ మద్దతుతో ఢిల్లీకి చెందిన ప్రముఖ న్యాయవాది ఆర్కే ఆనంద్ పోటీ చేశారు. అయితే.. 13 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వేసిన ఓట్లు చెల్లలేదు. దాంతో ఆనంద్ ఓడిపోగా, సుభాష్ చంద్ర గెలిచారు. నిజానికి రాజ్యసభ ఎన్నికలలో ఓట్లు వేసేది అప్పటికే ఎమ్మెల్యేలుగా గెలిచినవాళ్లు. వాళ్లకు ఓటు ఎలా వేయాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. అయినా వారు వేసిన ఓట్లు చెల్లలేదంటే.. అందులో ఏదో మతలబు ఉందనే అంటున్నారు. విప్‌ను ధిక్కరించి వేరే పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే, పార్టీ ఫిరాయింపుల నిరోధ చట్టం ప్రకారం వేటు పడే ప్రమాదం ఉంటుంది. అప్పుడు సభ్యత్వాన్ని కోల్పోవాలి. మరోసారి ఎన్నిక అవుతామో లేదో నమ్మకం ఉండదు. కానీ అవతలి వాళ్లు మనకు బాగా కావల్సిన వాళ్లయితే.. వాళ్లు గెలవాలని గట్టిగా కోరుకుంటే.. మన ఓట్లు చెల్లకుండా ఉండేలా వేయొచ్చు. అప్పుడు అవతలి వాళ్లకు అంత బలం లేకపోయినా, ఈ ఓట్లు చెల్లవు కాబట్టి తొలి ప్రాధాన్యత ఓట్లలోనే ఆ అభ్యర్థి గెలిచే అవకాశం ఉంటుంది. సుభాష్ చంద్ర విజయం వెనుక ఇలాంటి వ్యూహమే పనిచేసిందని సమాచారం. -
328 ఒప్పందాలు
విలువ రూ.4.67 లక్షల కోట్లు: సీఎం చంద్రబాబు ప్రకటన (విశాఖ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి) విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ 22వ భాగస్వామ్య సదస్సు మంగళవారం ముగిసింది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ(సీఐఐ), కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహించిన ఈ మూడురోజుల సదస్సులో మొత్తం 328 అవగాహన ఒప్పందాలు కుదిరాయని, తద్వారా రూ.4.67 లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి ఇన్వెస్టర్లు ఆసక్తి చూపించారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. చివర్లో మరికొందరు కూడా ఒప్పందాలు కుదుర్చుకున్నారని, ఆ విలువను దీన్లో చేర్చలేదని అన్నారు. ‘భారత్ సహా 41 దేశాల నుంచి 1,400 మందికి పైగా ప్రతినిధులు పాల్గొన్న ఈ సదస్సులో తొలిరోజు 32 ఎంఓయూలు కుదరగా... 2వ రోజు 248, మూడోరోజు 48 ఒప్పందాలు జరిగాయి. దాదాపు ప్రతి రంగంలోనూ దిగ్గజ సంస్థలు ముందుకొచ్చి రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి ఆసక్తి చూపించాయి. తయారీ రంగానికి సంబంధించి సుభాష్ చంద్ర సారథ్యంలోని ఎస్సెల్ గ్రూప్, అనిల్ అంబానీకి చెందిన అనిల్ ధీరూభాయ్ అంబానీ గ్రూప్, అమరరాజా, ఫాక్స్‌కాన్ వంటి కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాయి. ఫార్మాలో దివీస్ ల్యాబొరేటరీస్, అరబిందో, డాక్టర్ రెడ్డీస్ వంటి దిగ్గజాలు ముందుకొచ్చాయి. విద్యుత్ రంగంలో ట్రైనా సోలార్, సుజ్లాన్ వంటివి ఎంఓయూ చేసుకున్నాయి’ అని వివరించారు. రిటైల్ సహా మైనింగ్‌లోనూ దిగ్గజాలు రిటైల్ రంగంలో వాల్‌మార్ట్, ఫ్యూచర్ గ్రూప్, అరవింద్ రిటైల్, స్పెన్సర్స్ వంటి పెద్ద కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నట్లు ముఖ్యమంత్రి తెలియజేశారు. మైనింగ్‌కు సంబంధించి ఎన్ఎస్ఎల్ మైనింగ్, సంఘీ సిమెంట్స్, మై హోమ్ గ్రూప్ ముందుకొచ్చాయని, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ రంగాల్లో కూడా పెద్ద ఎత్తున కంపెనీలు ఎంఓయూలు చేసుకున్నాయని చెప్పారు. నగరాల అభివృద్ధికి సంబంధించి చైనా కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నామన్నారు. సదస్సుకు ఇంత స్పందన వస్తుందని ఊహించలేదని, వచ్చే 30 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ ముందుకెళుతుందని పేర్కొన్నారు. ఎగుమతులకు అవసరమైన వస్తువుల తయారీకి రాష్ట్రం కేంద్రంగా మారుతుందని, ముఖ్యంగా హార్డ్‌వేర్, సెల్‌ఫోన్, సోలార్ రంగాలకు విపరీతమైన అవకాశాలున్నాయని చంద్రబాబు చెప్పారు. గత రెండురోజుల్లో 44 ద్వైపాక్షిక సమావేశాల్లో తాను పాల్గొన్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది కూడా విశాఖలోనే సదస్సు నిర్వహించేందుకు సీఐఐ అంగీకరించిందని వెల్లడించారు. ఎస్సెల్ ఇన్ఫ్రా భారీ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్‌లో ఇంటిగ్రేటెడ్ సోలార్ ఎక్విప్మెంట్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి జీ-టీవీ సుభాష్ చంద్ర నేతృత్వంలోని ఎస్సెల్ గ్రూప్ ముందుకు వచ్చింది. ఇందుకోసం చైనాకు చెందిన గోల్డెన్ కంకార్డ్ హోల్డింగ్స్ లిమిటెడ్ (జీసీఎల్)తో కన్సార్షియాన్ని ఏర్పాటు చేసింది. దీనిపై దాదాపు 2 బిలియన్ డాలర్ల (సుమారు రూ.13,000 కోట్లు) పెట్టుబడి పెడతామని, 15వేల ఉద్యోగాలొస్తాయని ఎస్సెల్ గ్రూప్ అధిపతి సుభాష్ చంద్ర మంగళవారం నాడిక్కడ చెప్పారు. ఈ యూనిట్‌కు దాదాపు 2వేల ఎకరాల భూమి కావాల్సి ఉంటుందన్నారు. సోలార్ పరికరాల తయారీతో పాటు భారత, చైనా కంపెనీలు వివిధ సంస్థల్ని ఏర్పాటు చేయటం కోసం స్మార్ట్ ఇండస్ట్రియల్ పార్కును కూడా అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. దీనికి 9 బిలియన్ డాలర్ల (సుమారు రూ.58,500 కోట్లు) పెట్టుబడి అవసరమవుతుందన్నారు. సీఐఐ భాగస్వామ్య సదస్సు సందర్భంగా మం గళవారం సీఎం చంద్రబాబునాయుడి సమక్షంలో ఆయన ఎంవోయూపై సంతకాలు చేశా రు. ఈ సందర్భంగా సుభాష్ చంద్ర మాట్లాడుతూ.. ‘మేం ఎక్కువగా కార్యకలాపాలు సాగిస్తున్నది మీడియాతో సహా సేవల రంగంలోనే. ప్రధానమంత్రి మేకిన్ ఇండియా పిలుపు మేరకు విదేశీ భాగస్వాములతో కలసి ఏదైనా ఏర్పాటు చేయాలని వివిధ దేశాలకు వెళ్లా. ఎన్ని తిరిగినా తయారీలో చైనాను మించిన దేశం కనిపించలేదు. అందుకే చైనా కంపెనీతో జట్టుకట్టా. ఇండియాలో చూసినపుడు వ్యాపారం చేయటానికి అత్యంత అనుకూలమైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ కనిపించింది. అందుకే ఇక్కడ పెట్టుబడికి సిద్ధమయ్యా’ అని వివరించారు. మేకిన్ ఇండియాలో తామూ భాగమవుతున్నందుకు సంతోషంగా ఉందని జీసీఎల్ వైస్ చైర్మన్ షు హువా చెప్పారు. తాము పెట్టుబడులతో పాటు ఫొటో వోల్టాయిక్ రంగంలో అత్యాధునిక టెక్నాలజీని కూడా ఇండియాకు తీసుకొస్తామని తెలిపారు. ఈ ఎక్విప్మెంట్ తయారీ కేంద్రాన్ని, స్మార్ట్ ఇండస్ట్రియల్ పార్క్‌ను ఎక్కడ ఏర్పాటు చేయాలనేది ఇంకా ఖరారు కాలేద ని, దీనిపైనే చర్చలు జరుపుతున్నామని చెప్పారు. -
అదృశ్యమైన ఇంటర్ విద్యార్ధి క్షేమం
విజయవాడ : కృష్ణా జిల్లా పాచిపెంట మండలం బొబ్బిలివలసలో మంగళవారం అదృశ్యమైన ఇంటర్ విద్యార్థి సుభాష్‌చంద్ర క్షేమంగా ఉన్నాడు. బుధవారం రాత్రి విజయవాడ రైల్వేస్టేషన్లో టిక్కెట్ లేకుండా ఉండటంతో టిక్కెట్ కలెక్టర్ సుభాష్‌ను పట్టుకున్నారు. పోలీసులు విద్యార్థిని ప్రశ్నించగా.. తనను ఎవరో కిడ్నాప్ చేసి గూడ్స్ రైలులో తరలిస్తుండగా తప్పించుకున్నానని సుభాష్ తెలిపాడు. -
100 షార్ట్ ఫిల్మ్స్.. యూత్‌ఫుల్ ఐడియా
ఆలోచనలో కొత్తదనం ఉదయిస్తే.. అవకాశాలు అవే చిగురిస్తాయి. వాటికి క్రియేటివిటీ జోడిస్తే.. అనుకున్న ల క్ష్యం దగ్గరవుతుంది. అలా పుట్టిందే ఎంఆర్ ప్రొడక్షన్స్. ఓ ఇద్దరు ఇంజనీరింగ్ కుర్రాళ్ల కళల ప్రాజెక్టు ఇది. ఐదేళ్లలోనే 100 సినిమాలు నిర్మించిన సంస్థంటే నమ్ముతారా..? ఏ ప్రొడక్షన్ విత్ వాల్యూస్ అండ్ క్రియేటివ్ ఐడియాస్ అనే ట్యాగ్ లైన్‌తో వచ్చిన ఎంఆర్ ప్రొడక్షన్స ఇప్పుడు పొట్టి సినిమాల ప్రపంచంలో రారాజుగా నిలుస్తోంది. ఈ సంస్థ 2009డి సెంబర్‌లో ప్రారంభమైంది. వారిద్దరి పేర్లు ధీరజ్ రాజ్, సుభాష్‌చంద్ర. ధీరజ్ రాజ్‌ది విజయనగరం జిల్లా కొట్టాయం. సుభాష్‌చంద్రది పశ్చిమగోదావరి జిల్లా రేలంగి ప్రాంతం. ఇంటర్మీడియెట్ రోజుల్లోనే దోస్తీతో జట్టు కట్టారు. ధీరజ్ మహారాజా కాలేజీలో, సుభాష్ రఘు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేశారు. బీటెక్ పూర్తికాగానే.. లఘు చిత్రాలను నిర్మించాలని డిసైడయ్యారు. కట్ చేస్తే.. వారు చదువుకున్న ఇంజనీరింగ్ కాలేజీల మొదటి అక్షరాలను తీసుకుని ఎంఆర్ ప్రొడక్షన్స స్టార్ట్ చేశారు. ఈ బ్యానర్ మీద మొట్టమొదట తీసిన ‘సక్సెస్’ లఘు చిత్రం గీతం వర్సిటీ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్‌లో ఫోర్త్ బెస్ట్‌గా నిలిచింది. అలా మొదలైన షార్ట్ ఫిల్మ్ యాత్ర ఐదేళ్లలో 99 రిలీజ్ చేసి వందో చిత్రం విడుదలకు సన్నద్ధం అవుతోంది. ఈ బ్యానర్ నుంచి వచ్చిన అన్ని సినిమాలకు కథ వీరిదే. ఆర్టిస్టుల చాయిస్, నేపథ్య సంగీతంపైనా దృష్టి పెట్టారు. ‘తల్లిదండ్రులు, స్నేహితులు ఎంతగానో ప్రోత్సహించారు. మా చిత్రాలకు సినీహీరోలు, దర్శకుల ప్రశంసలు లభించాయి’ అని చెప్పారు ఈ కుర్రాళ్లు. మా బ్యానర్ మీద 49 చిత్రాలలో నటించిన రాజ్ తరుణ్ ‘ఉయ్యాల జంపాల’ చిత్రంలో హీరోగా నటించారు. మా 11 చిత్రాలలో నటించిన చాందినీ చౌదరి త్వరలోనే వెండితెరపై వెలగనుంది. ఎన్నో సినిమాలకు అసిస్టెంట్‌గా చేస్తున్న సంగీత దర్శకుడు వంశీకృష్ణ మా సినిమాలకు సంగీతం అందించారు. ‘మూగమనసులు’ ఫీచర్ ఫిల్మ్‌కు సంగీతం అందించిన కేశవ్ కిరణ్ మా దగ్గర నుంచే వచ్చారు. ‘ద బ్లైండ్ డే’ (సుభాష్ చంద్ర) చిత్రం ద్వారా ఎంఆర్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ ఉందని అందరూ గుర్తించారు. ఆ చిత్రంతోనే చాలామందికి బ్రేక్ వచ్చింది. ‘పెళ్లి పుస్తకం’ (ధీరజ్ రాజ్) ట్రెండ్ సెట్ చేసింది. ఫ్యామిలీ సినిమాలను షార్ట్ ఫిల్మ్స్‌గా తియ్యొచ్చనే ట్రెండ్ క్రియేట్ చేసింది. ధీరజ్ రాజ్, సుభాష్‌చంద్ర - డాక్టర్ వైజయంతి