విజయవాడ : కృష్ణా జిల్లా పాచిపెంట మండలం బొబ్బిలివలసలో మంగళవారం అదృశ్యమైన ఇంటర్ విద్యార్థి సుభాష్‌చంద్ర క్షేమంగా ఉన్నాడు. బుధవారం రాత్రి విజయవాడ రైల్వేస్టేషన్‌లో టిక్కెట్ లేకుండా ఉండటంతో టిక్కెట్ కలెక్టర్ సుభాష్ను పట్టుకున్నారు. పోలీసులు విద్యార్థిని ప్రశ్నించగా.. తనను ఎవరో కిడ్నాప్ చేసి గూడ్స్ రైలులో తరలిస్తుండగా తప్పించుకున్నానని సుభాష్ తెలిపాడు.