
సాక్షి, బెంగళూరు: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ ‘సంగీత’ మొబైల్స్ 48వ వార్షికోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించింది. గ్రామ్‌ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్ విక్రయాల వరకు ఎదిగిన సంగీత మొబైల్స్ తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి అడుగు పెట్టింది. బెంగళూరులో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల స్టోర్‌ను బాణసవాడిలో ప్రారంభించింది. త్వరలో మరిన్ని ప్రాంతాల్లో విస్తరించనున్నట్లు సంగీత మొబైల్స్ ఎండీ సుభాష్ చంద్ర మీడియాకు తెలిపారు. సంస్థ ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఏటా వార్షికోత్సవ ఆఫర్లు అందిస్తున్నట్టు చెప్పారు. మే 31 నుంచి జూలై మొదటి వారం వరకు ఆఫర్లు కొనసాగిస్తామని తెలిపారు. త్వరలోనే కేరళ, వారణాసి, గోవా, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లో కొత్త శాఖలు ప్రారంభిస్తామన్నారు. కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా స్టోర్ల సంఖ్య 800 దాటనున్నట్లు
పేర్కొన్నారు.
సంగీత ఆఫర్లు ఇవే..
ప్రతి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై స్మార్ట్ వాచ్ తక్కువ ధరకే లభిస్తుంది. ఎంపిక చేసిన మోడళ్లపై 50 శాతం ఇన్‌స్టాంట్ క్యాష్‌బ్యాక్. రూ.99లకే ఏడాది కాల పరిమితిగల ఫోన్ ప్రొటెక్షన్, రూ.4,999 విలువ చేసే స్మార్ట్‌ఫోన్ కొంటే అదే ధర ఉన్న మరో మొబైల్ ఉచితం వంటి ఆఫర్లు ఉన్నాయి. వార్షికోత్సవం సందర్భంగా లక్కీడిప్ నిర్వహిస్తున్నట్లు సుభాష్ చంద్ర చెప్పారు. మొత్తం 30 రోజులకు గాను 30 మంది విజేతలను ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.65 వేలు విలువ చేసే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం బహుమతిగా ఇస్తామని వివరించారు.
సామాజిక సేవలోనూ..
సుభాష్ చంద్ర తన స్వగ్రామం నెల్లూరు జిల్లా పొదకలూరు మండలం తాటిపర్తిలో వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నారు. పదేళ్ల క్రితం ప్రారంభించిన ఈ కేంద్రంలో ప్రస్తుతం సుమారు 50 మంది ఆశ్రయం పొందుతున్నారు. లాక్‌డౌన్ సమయంలో అన్నదాన కార్యక్రమాల కోసం రూ.1 కోటి వెచ్చించారు. సుమారు 10 లక్షల మందికి ఆహార పొట్లాలు
అదజేశారు.