huge offer
-
డిస్కౌంట్ల షికారు!
వానాకాలం వచ్చేసింది. దీనికి తోడు కార్ల కంపెనీల ఆఫర్ల వర్షం కూడా మొదలైపోయింది. అయితే, ఈ ఏడాది డిస్కౌంట్ల మోత మరింతగా మోగుతోంది. సార్వత్రిక ఎన్నికలు, మండుటెండల దెబ్బకు వేసవి సీజన్లో అమ్మకాలు ఆశించిన స్థాయిలో లేవు. షోరూమ్‌లకు కస్టమర్ల రాక కూడా భారీగా తగ్గిపోయింది. మరోపక్క, వర్షాకాలంలో విక్రయాల తగ్గుదల కూడా పరిపాటే. ఈ పరిస్థితిని మార్చేందుకు, ఏదో రకంగా విక్రయాలు పెంచుకునేందుకు కంపెనీలు పలురకాల వ్యూహాలను అమలు చేస్తున్నాయి. భారీ డిస్కౌంట్ ధరలతో ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ప్రారంభ స్థాయి మోడళ్లపై ఎక్కువ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నాయి. పాత కార్ల ఎక్సే్ఛంజ్పై మంచి ధర, అదనపు బోనస్, బహుమతులను కూడా అందిస్తున్నాయి.బలహీన సీజన్... పండుగలు పెద్దగా లేకపోవడంతో పాటు, వర్షాలు ఎప్పుడు పడతాయో ఊహించని పరిస్థితులు ఉంటాయి. దీంతో కస్టమర్లు ఈ సీజన్లో కొనుగోళ్ల ప్రణాళికలను వాయిదా వేసుకుని.. దసరా, దీపావళి సమయాల్లో కొనుగోళ్లకు మొగ్గుచూపిస్తుంటారు. అందుకే ఏటా వర్షాకాలంలో అమ్మకాలు పెంచుకునేందుకు దేశవ్యాప్తంగా డీలర్లు డిస్కౌంట్లు, ఇతరత్రా స్కీమ్‌లను అమలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పలు మోడల్ కార్లపై రూ.20 వేల నుంచి రూ.4 లక్షల వరకు తగ్గింపు ఆఫర్లు అమల్లో ఉన్నాయి. ముఖ్యంగా గతేడాది వర్షాకాలం కంటే ఈ ఏడాది డిస్కౌంట్లు కూడా పెరిగాయి. వేసవిలో విక్రయాలు తగ్గడంతో డీలర్ల వద్ద వాహన నిల్వలు పేరుకుపోయాయి. వీటిని తగ్గించుకోవాలంటే డీలర్లు విక్రయాలు పెంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. డబుల్ బెనిఫిట్... డిమాండ్ పెంచేందుకు కార్ల కంపెనీలు.. స్టాక్‌ను తగ్గించుకునేందుకు డీలర్ల స్థాయిలోనూ డిస్కౌంట్ ఆఫర్లు నడుస్తున్నాయి. ‘గతేడాది ఇదే సీజన్లో కొన్ని కార్ల మోడళ్లకు కొరత నెలకొంది. వెయిటింగ్ వ్యవధి కూడా పెరిగింది. కానీ, ఈ ఏడాది చాలా మోడళ్లు డీలర్ల వద్ద సిద్ధంగా ఉన్నాయి. ఇదే కస్టమర్లకు ఆఫర్లు పెంచేందుకు కారణం’ అని ఫాడా ప్రెసిడెంట్ మనీ‹Ùరాజ్ సింఘానియా తెలిపారు. మారుతీ ఆల్టో కే10పై రూ.40 వేలు, ఎస్–ప్రెస్సో, వ్యాగన్ఆర్పై రూ.25,000–30,000, స్విఫ్ట్ మోడళ్లపై రూ.15,000–20,000 వరకు తగ్గింపు ఆఫర్లు నడుస్తున్నాయి. బాలెనో పెట్రోల్ ఎంటీ వెర్షన్‌పై రూ.35 వేలు, పెట్రోల్ ఏజీఎస్ వెర్షన్‌పై రూ.40 వేల వరకు, ఎక్స్ఎల్6 పెట్రోల్ వేరియంట్‌పై 20 వేలు, సీఎన్జీ వేరియంట్‌పై రూ.15 వేల వరకు తగ్గింపు లభిస్తోంది.ఉచిత విదేశీ ట్రిప్..! ‘హోండా మ్యాజికల్ మాన్సూన్’ పేరుతో హోండా కార్స్ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించింది. అన్ని కార్లపై బహుమతులు, ఇతర ప్రయోజనాలను ఇందులో భాగంగా అందిస్తోంది. ముఖ్యంగా జూలై నెలలో కొనుగోలుదారుల నుంచి విజేతలను ఎంపిక చేసి, వారికి స్విట్జర్లాండ్ ఉచిత పర్యటన, రూ.75,000 వరకు నగదు బహుమతులను ఆఫర్ చేస్తోంది. హోండా కారు కొనుగోలుపై ఈ పరిమిత కాల ఆఫర్ తమ డీలర్లందరి వద్దా అందుబాటులో ఉన్నట్టు హోండా కార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కునాల్ బెహల్ తెలిపారు.ఆఫర్ సూపర్... → ఎంఅండ్ఎం ఎక్స్‌యూవీ400 (ఈవీ) – రూ. 4 లక్షలు → మారుతి జిమ్నీ ఆల్ఫా వేరియంట్ – రూ. 2 లక్షలు → హోండా అమేజ్, సిటీ, ఎలివేట్, సిటీ ఈ–హెచ్ఈవీ – రూ. 75,000 వరకు → టాటా టియాగో, ఆ్రల్టోజ్, నెక్సాన్, పంచ్, హ్యారియర్, సఫారీ – రూ. 50,000 వరకు → అధిక డిమాండ్ ఉండే ఎస్‌యూవీలపై తగ్గింపు కొంతే → ఆరంభ మోడళ్లు, హ్యాచ్‌బ్యాక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు → ఎక్స్చేంజ్పైనా అదనపు బోనస్ → సాధారణ రోజుల్లో ఎస్‌యూవీలకు 60 రోజుల వెయిటింగ్ → ఈ సీజన్లో 30 రోజుల్లోనే డెలివరీ → పండుగల ముందు వరకు ఇదే ధోరణి -
ఆటగాళ్లకు కోట్లలో ఆఫర్.. సొంత లీగ్‌కు తూట్లు పొడిచే యత్నం!
క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ) నిర్వహించే బిగ్‌బాష్ లీగ్(బీబీఎల్)కు ఆటగాళ్లు తూట్లు పొడిచే అవకాశం కనిపిస్తోంది. వచ్చే ఏడాది యూఏఈ వేదికగా జనవరిలో ఇంటర్నేషనల్ లీగ్(ఐఎల్టీ 20) ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో కోట్ల రూపాయలు కుమ్మరించి స్టార్ ఆటగాళ్లను ఆడించే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే బీబీఎల్‌లో ఆడే 15 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లకు ఐఎల్టీలో ఆడేందుకు భారీ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. రిపోర్ట్స్ ప్రకారం 15 మంది ఆస్ట్రేలియా ఆటగాళ్లకు భారత కరెన్సీలో దాదాపు రూ.30 కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రతీఏటా బీబీఎల్ డిసెంబర్లో మొదలై.. ఫిబ్రవరిలో ముగుస్తుంది. ఇక ఈ ఏడాది డిసెంబర్ 13న మొదలుకానున్న బీబీఎల్ ఫిబ్రవరి 4 వరకు జరగనుంది.ఇదే సమయంలో ఇంటర్నేషనల్ లీగ్ టి20(ఐఎల్టీ 20) జనవరి 6 నుంచి ఫిబ్రవరి 12 వరకు మొదటి ఎడిషన్ జరగనుంది. మొత్తం ఆరుజట్లు ఉండగా.. ఈ జట్లను దాదాపు ఐపీఎల్‌తో సంబంధమున్న సంస్థలే కొనుగోలు చేయడం విశేషం. యూఏఈ వేదికగా జరుగుతున్న తొలి సీజన్‌ను విజయవంత చేసేందుకు స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేయాలని అన్ని జట్లు టార్గెట్‌గా పెట్టుకున్నాయి. అందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాలని చూస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీబీఎల్‌లో ఆడుతున్న 15 మంది ఆస్ట్రేలియా స్టార్ ఆటగాళ్లకు బీబీఎల్ వదిలేసి.. ఐఎల్టీ లీగ్‌లో పాల్గొనేందుకు భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. యూఏఈ టి20 లీగ్‌లో ఒక్కో టీమ్‌కి 2.5 మిలియన్ డాలర్లు (రూ.20 కోట్లు) పర్సు వాల్యూని కేటాయించారు. దీంతో స్టార్ ప్లేయర్లను 450000 డాలర్లు (దాదాపు 3.5 కోట్లు) ఇచ్చి కొనుగోలు చేసేందుకు ఫ్రాంఛైజీలు ఇప్పటికే రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఐపీఎల్‌తో పోలిస్తే ఇది చాలా తక్కువ. కానీ మిగిలిన క్రికెట్ లీగులతో పోలిస్తే ఇది చాలా ఎక్కువే. పొరుగుదేశం పాక్‌లో పాకిస్తాన్ సూపర్ లీగ్‌లో అత్యధికంగా చెల్లించే మొత్తం రూ.1.9 కోట్లు మాత్రమే... ఐపీఎల్ తర్వాత అత్యంత పాపులారిటీ దక్కించుకున్న బిగ్‌బాష్ లీగ్ (బీబీఎల్)లోనూ పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. దీంతో యూఏఈ లీగ్ ఫ్రాంఛైజీ ఓనర్లు, బిగ్‌బాష్ లీగ్ ఆడకుండా అదే సమయంలో యూఏఈ టీ20 లీగ్‌లో ఆడేందుకు 15 మంది ఆస్ట్రేలియా క్రికెటర్లకు రూ.4 కోట్ల దాకా కాంట్రాక్ట్ ఇచ్చేందుకు ఆశచూపిస్తున్నారని సమాచారం. రూ.4 కోట్లంటే ఐపీఎల్లో అన్క్యాప్డ్ రిజర్వు ప్లేయర్‌కి ఇచ్చే మొత్తం. అయితే బీబీఎల్ ద్వారా వచ్చే దానితో పోల్చుకుంటే, ఆసీస్ క్రికెటర్లకు ఇది చాలా ఎక్కువ మొత్తమే. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియాకి భయం పట్టుకుంది. అయితే బీసీసీఐ నిర్వహించే ఐపీఎల్లో ఆడే ఆటగాళ్లు విదేశీ లీగ్‌ల్లో ఆడాలంటే అనుమతి తప్పనిసరి. కానీ బిగ్‌బాష్ లీగ్‌లో ఆటగాళ్లకు అలాంటి అవసరం లేదు. లీగ్‌లో ఆడాలా వద్దా అనేది ఆటగాళ్ల నిర్ణయానికే వదిలేస్తుంది అక్కడి సీఏ(క్రికెట్ ఆస్ట్రేలియా). అందుకే 2014 నుంచి ఆసీస్ స్టార్ డేవిడ్ వార్నర్ ఇప్పటివరకు బీబీఎల్ ఆడింది లేదు. వార్నర్ ఒక్కడే కాదు.. చాలా మంది ఆసీస్ క్రికెటర్లు బీబీఎల్‌ను మధ్యలోనే వదిలేసి వేరే లీగ్ ఆడేందుకు వెళ్లిపోతుంటారు. ఆసీస్ క్రికెటర్లు ఆ డబ్బుకి ఆశపడి యూఏఈ టీ20 లీగ్‌లో ఆడాలని నిర్ణయం తీసుకుంటే, స్టార్ ప్లేయర్లు లేకుండా బీబీఎల్‌ని నిర్వహించాల్సి ఉంటుంది. మిగిలిన దేశాల ప్లేయర్లు కూడా యూఏఈ టీ20 లీగ్ ఆడేందుకే ఇంట్రెస్ట్ చూపిస్తే బీబీఎల్ నిర్వహణే కష్టమైపోతుంది. దీంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటోందట ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. బీసీసీఐ మాదిరిగానే తమ ప్లేయర్లు, విదేశీ టీ20ల్లో లీగుల్లో పాల్గొనకుండా నియంత్రించాలనే ఆలోచనలో కూడా సమాచారం. ఇక ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కి యూఏఈ నుంచి 7 లక్షల డాలర్లు (దాదాపు 5.5 కోట్లు) ఆఫర్ వచ్చిందని, అలాగే ఆసీస్ టెస్టు కెప్టెన్ ప్యాట్ కమ్మిన్స్‌కి కూడా దాదాపు రూ.6 లక్షల డాలర్లకు పైగా ఆఫర్ వచ్చందని... ఈ ఇద్దరూ యూఏఈ టీ20 లీగ్‌లో ఆడేందుకు క్రికెట్ ఆస్ట్రేలియాని అనుమతి కోరినట్టు వార్తలు వస్తున్నాయి. చదవండి: NED vs NZ: పసికూనపై కివీస్ ప్రతాపం.. సిరీస్ క్లీన్‌స్వీప్ Andrew Symonds: అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్‌కు ఆండ్రూ సైమండ్స్ పేరు..! -
‘సంగీత’ వార్షికోత్సవ ఆఫర్లు
సాక్షి, బెంగళూరు: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ ‘సంగీత’ మొబైల్స్ 48వ వార్షికోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించింది. గ్రామ్‌ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్ విక్రయాల వరకు ఎదిగిన సంగీత మొబైల్స్ తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి అడుగు పెట్టింది. బెంగళూరులో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల స్టోర్‌ను బాణసవాడిలో ప్రారంభించింది. త్వరలో మరిన్ని ప్రాంతాల్లో విస్తరించనున్నట్లు సంగీత మొబైల్స్ ఎండీ సుభాష్ చంద్ర మీడియాకు తెలిపారు. సంస్థ ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఏటా వార్షికోత్సవ ఆఫర్లు అందిస్తున్నట్టు చెప్పారు. మే 31 నుంచి జూలై మొదటి వారం వరకు ఆఫర్లు కొనసాగిస్తామని తెలిపారు. త్వరలోనే కేరళ, వారణాసి, గోవా, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లో కొత్త శాఖలు ప్రారంభిస్తామన్నారు. కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా స్టోర్ల సంఖ్య 800 దాటనున్నట్లు పేర్కొన్నారు. సంగీత ఆఫర్లు ఇవే.. ప్రతి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై స్మార్ట్ వాచ్ తక్కువ ధరకే లభిస్తుంది. ఎంపిక చేసిన మోడళ్లపై 50 శాతం ఇన్స్టాంట్ క్యాష్‌బ్యాక్. రూ.99లకే ఏడాది కాల పరిమితిగల ఫోన్ ప్రొటెక్షన్, రూ.4,999 విలువ చేసే స్మార్ట్‌ఫోన్ కొంటే అదే ధర ఉన్న మరో మొబైల్ ఉచితం వంటి ఆఫర్లు ఉన్నాయి. వార్షికోత్సవం సందర్భంగా లక్కీడిప్ నిర్వహిస్తున్నట్లు సుభాష్ చంద్ర చెప్పారు. మొత్తం 30 రోజులకు గాను 30 మంది విజేతలను ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.65 వేలు విలువ చేసే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం బహుమతిగా ఇస్తామని వివరించారు. సామాజిక సేవలోనూ.. సుభాష్ చంద్ర తన స్వగ్రామం నెల్లూరు జిల్లా పొదకలూరు మండలం తాటిపర్తిలో వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నారు. పదేళ్ల క్రితం ప్రారంభించిన ఈ కేంద్రంలో ప్రస్తుతం సుమారు 50 మంది ఆశ్రయం పొందుతున్నారు. లాక్డౌన్ సమయంలో అన్నదాన కార్యక్రమాల కోసం రూ.1 కోటి వెచ్చించారు. సుమారు 10 లక్షల మందికి ఆహార పొట్లాలు అదజేశారు. -
వేల కోట్ల రూపాయల ఆఫర్‌ను తిరస్కరించిన గోల్ఫ్ దిగ్గజం
అంతర్జాతీయ గోల్ఫ్ దిగ్గజం టైగర్‌వుడ్స్ ఒక బిలియన్ అమెరికన్ డాలర్లు(ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. ఏడున్నర వేల) కోట్ల ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం. సౌదీ రన్ ఎల్ఐవీ గోల్ఫ్ సిరీస్‌కు సంబంధించిన టోర్నీలో టైగర్‌వుడ్స్ పాల్గొనేందుకు నిరాకరించినట్లు మరో మాజీ గోల్ఫ్ ఆటగాడు గ్రెగ్ నార్మన్ ద్రువీకరించాడు. 46 ఏళ్ల టైగర్‌వుడ్స్ సౌదీ గోల్ఫ్ నుంచి తప్పుకోవాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నాడని.. మరింత బెస్ట్ ప్లేయర్లు ఉన్న కొత్త సిరీస్‌కు టైగర్‌వుడ్స్ సంతకం చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసిందని నార్మన్ అభిప్రాయపడ్డాడు. అయితే ఫిల్ మికెల్సన్, డస్టిన్ జాన్సన్‌లతో సహా కొంతమంది హై ప్రొఫైల్ ప్లేయర్లు £100 మిలియన్ విలువైన రుసుముపై సంతకం చేయనున్నారు. కాగా టైగర్ వుడ్స్ గతంలోనూ ఎల్ఐవీ గోల్ఫ్‌కు సంబంధించిన ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించాడు. నవంబర్ 2021లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న టైగర్‌వుడ్ ఎల్ఐవీ గోల్ఫ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''నేను పీజీఏ టూర్‌కు మద్దతు ఇస్తున్నానని స్వయంగా నిర్ణయించుకున్నాను. నా వారసత్వం ఇక్కడే ఉంది. ఈ టూర్లో 82 ఈవెంట్లు, 15 మేజర్ ఛాంపియన్షిప్లను గెలుచుకోవడంతో పాటు ఛాంపియన్‌షిప్‌లలో భాగమైనందుకు అదృష్టవంతుడిని అయ్యాను.'' అని చెప్పుకొచ్చాడు. -
అమెజాన్ ఇయర్ ఎండ్ సేల్: స్మార్ట్ఫోన్లపై అమెజాన్ అందిస్తోన్న టాప్ డీల్స్ ఇవే..!
ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇయర్ ఎండ్ సేల్‌ను ప్రారంభించింది. స్మార్ట్‌ఫోన్స్, స్మార్ట్ టీవీలపై భారీ తగ్గింపును అమెజాన్ అందిస్తోంది. ఈ సేల్ డిసెంబర్ 31 వరకు కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. రెడ్మీ 9ఏ, రెడ్మీ నోట్ 10ఎస్, షావోమీ 11 లైట్ ఎన్ఈ 5G, శాంసంగ్ గెలాక్సీ ఎమ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్స్, శాంసంగ్ గెలాక్సీ ఎస్20 ఎఫ్ఈ 5జీ, రియల్మీ నార్జో 50ఏ, వన్‌ప్లస్ నార్డ్ సీఈ వంటి స్మార్ట్ఫోన్స్తో పాటుగా ప్రముఖ స్మార్ట్ఫోన్లపై కొనుగోలుదారులు 40 శాతం వరకు తగ్గింపును పొందవచ్చు. ఆయా స్మార్ట్ఫోన్ల కొనుగోలుపై బ్యాంకు ఆఫర్లను కూడా అమెజాన్ అందిస్తోంది. అమెజాన్ పే, ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులపై అదనంగా రూ. 1,500 వరకు తగ్గింపు రానుంది. అంతేకాకుండా నో-కాస్ట్ ఈఎంఐ సౌకర్యాన్ని కూడా అందిస్తోంది. ప్రైమ్ మెంబర్స్‌కు 6-నెలల ఉచిత స్క్రీన్ రీప్లేస్మెంట్, అదనంగా 3 నెలల నో కాస్ట్ వంటి ప్రయోజనాలు ఉన్నాయి. స్మార్ట్ఫోన్లపై అమెజాన్ అందిస్తోన్న టాప్ డీల్స్ ఇవే..! ► వన్‌ప్లస్ నార్డ్ 2 5G 8జీబీ ర్యామ్ వేరియంట్ రూ. 29,999కు రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై కొనుగోలుదారులు రూ. 2000 వరకు ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్ ద్వారా బోనస్‌గా రూ. 16,950 వరకు అమెజాన్ అందిస్తోంది. ► వన్‌ప్లస్ నార్డ్ సీఈ 5జీ రూ. 24,999కు రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై కొనుగోలుదారులు రూ.1500 వరకు ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ. 16,950 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ అమెజాన్ అందిస్తోంది. ► రెడ్మీ నోట్ 10ఎస్ రూ. 14,999కు రానుంది. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌లపై కస్టమర్లు రూ. 1000 వరకు ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 13,950 వరకు తగ్గింపు కూడా రానుంది. ► షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌లతో కొనుగోలు చేస్తే రూ. 2,500 తక్షణ తగ్గింపు రానుంది. దీంతో రూ. 24,500కు ఈ స్మార్ట్‌ఫోన్‌ను పొందవచ్చును. స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్పై రూ. 19,950 కూడా రానుంది. చదవండి: ఐఫోన్ కొనేవారికి శుభవార్త.. రూ.18 వేలు డిస్కౌంట్..! -
ఎస్బీఐ బంపర్ ఆఫర్..! రూ.4,999 విలువైన స్మార్ట్‌వాచ్ ఉచితం..! ఇంకా మరెన్నో ఆఫర్లు
SBI Pulse Credit Card Benefits: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ సరికొత్త క్రెడిట్ కార్డుతో ముందుకొచ్చింది. ఫిట్నెస్, హెల్త్ ఔత్సాహికులను దృష్టిలో ఉంచుకొని ‘ ఎస్బీఐ కార్డ్ పల్స్ ’ను లాంచ్ చేసింది. వీసా సిగ్నేచర్ ప్లాట్‌ఫారమ్‌లో ప్రారంభించిన ఈ పల్స్ క్రెడిట్ కార్డుపై వార్షిక సభ్యత్వ ఛార్జీ కింద రూ. 1,499ను ఎస్బీఐ వసూలు చేయనుంది. పల్స్ క్రెడిట్ కార్డును అందిస్తోన్న ఏకైక బ్యాంకింగ్ సంస్థగా ఎస్బీఐ నిలవనుంది. ఈ కార్డును తీసుకునే కస్టమర్లకు వెల్కమ్ గిఫ్ట్‌గా రూ. 4,999 విలువైన నాయిస్ కలర్‌ఫిట్ పల్స్ స్మార్ట్‌వాచ్‌ను సొంతం చేసుకోవచ్చునని ఎస్బీఐ ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాకుండా కార్డు వినియోగదారు కనీసం రూ. 2 లక్షలు ఏడాదిలోపు ఖర్చు చేస్తే వార్షిక సభ్యత్వ రుసుము నుంచి మినహాయింపు కూడా వర్తిస్తోందని ఎస్బీఐ తెలిపింది. చదవండి: విప్రో దూకుడు..! అమెరికన్ కంపెనీ విప్రో కైవసం..! ఏడాదిపాటు ఫిట్‌పాస్ ప్రో సభ్యత్వం..! ఎస్బీఐ పల్స్ క్రెడిట్ కార్డును తీసుకున్న కస్టమర్లకు ఏడాది పాటు ఫిట్‌పాస్ ప్రో సభ్యత్వాన్ని కాంప్లిమెంటరీ ఎస్బీఐ అందిస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా 4,000కు పైగా జిమ్స్‌ను, ఫిట్నెస్ స్టూడియోల క్యూరేటెడ్ నెట్‌వర్క్‌ను యాక్సెస్ చేయవచ్చును. అంతేకాకుండా కస్టమర్లకు యోగా, డ్యాన్స్, కార్డియోతో సహా అపరిమిత ఆన్లైన్ ఫిట్నెస్ సెషన్లు కూడా లభించనున్నాయి. ఆరోగ్య-కేంద్రీకృత కార్డ్ కాబట్టి అనేక ఇతర జీవనశైలి ప్రయోజనాలు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. వివిధ వైద్య ప్రయోజనాలతో పాటు, కస్టమర్లు క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి ఇంధన ఛార్జీ మినహాయింపులను పొందవచ్చును. ప్రయాణ . బీమా ప్రయోజనాలను కూడా ఎస్బీఐ అందిస్తోంది. ఒక ఏడాది పాటు ఉచిత నెట్‌మెడ్స్ ప్లస్ సబ్స్క్రిప్షన్ రానుంది. అంతేకాకుండా మెడికల్ షాపులు, ఫార్మసీలు, సినిమాలు, డైనింగ్‌లలో షాపింగ్ చేయడంపై 5 రేట్ల రివార్డ్ పాయింట్లను కూడా పొందవచ్చును. చదవండి: వాటాలు విక్రయించనున్న ఏఐజీ హాస్పిటల్స్ ప్రమోటర్లు? -
'బ్యాట్‌మ్యాన్ vs సూపర్‌మ్యాన్' పోర్న్ పేరడీకి భారీ ఆఫర్
లాస్ ఏంజిలిస్: 'బ్యాట్‌మ్యాన్ వర్సెస్ సూపర్‌మ్యాన్ డాన్ ఆఫ్ ది జస్టీస్' వచ్చే ఏడాది మార్చిలోగానీ ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఇప్పుడే ప్రధాన వార్తల్లో నిలిచింది. అసలు సినిమా సంగతి ఎలా ఉన్నప్పటికీ దానికి నకలుగా అంటే.. పోర్న్ పేరడీగా రూపొందించిన 'బ్యాట్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ ట్రిపుల్ ఎక్స్' పోర్న్ సినిమాకు సంబంధించి అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బ్యాట్‌మ్యాన్- సూపర్‌మ్యాన్ పోర్న్ పేరడీలో నటించేందుకు తనకు భారీ పారితోషికం ఇవ్వజూపారంటూ.. బెన్ అఫ్లెక్స్ మాజీ గర్ల్ ఫ్రెండ్ క్రిస్టీన్ ఒజొనియాన్ ఆదివారం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ బెన్ అప్లెక్స్ మరెవరోకాదు.. అసలు బ్యాట్‌మ్యాన్ సినిమాలో హీరో. బెన్, క్రిస్టీన్లు గతంలో సాగించిన ప్రేమాయణం అప్పట్లో పతాక శీర్శికలకెక్కింది. నిజ జీవితంతో వారి ప్రేమగాథకున్న క్రేజ్.. సదరు పోర్న్ పేరడీ మూవీకి మరింత ప్లస్ అవుతుందని భావించిన దర్శక నిర్మాత అలెక్స్ బ్రౌన్ (ఇటలీలో అడల్ట్ సినిమాల దర్శకుడిగా ఇతగాడికి గొప్ప పేరుంది).. బ్యాట్‌ఉమన్ పాత్రకు క్రిస్టీన్నే తీసుకోవాలని భావించాడట (బ్యాట్‌మ్యాన్ ఎలాగో మాస్క్ వేసుకుంటాడు కాబట్టి ఆ పాత్ర ఎవరు చేసినా ఫర్వాలేదని ఆయన ఉద్దేశమట). అయితే ఆ ఆఫర్ తనకు నచ్చకపోవడంతో సున్నితంగా తిరస్కరించానని చెప్పుకొచ్చింది క్రిస్టీన్. బెన్‌తో ఎప్పుడో తెంచుకున్న ప్రేమ బంధం తాలూకు గుర్తుల్ని.. మళ్లీ బ్యాట్ఉమన్గా నటించి గుర్తుచేసుకోలేనని క్రిస్టీన్ వివరించింది. క్రిస్టీన్‌తో విడిపోయిన తర్వాత బెన్.. మరో నటీ జెన్నీఫర్ గార్నెర్ను పెళ్లాడిన సంగంతి తెలిసిందే. అసలు సినిమా కంటే ఏడాది ముందుగానే (జున్ 3, 2015న) విడుదలైన పోర్న్ పేరడీ సూపర్ హిట్ కావడం మరో విశేషం. గతంలో 300, అవేంజర్స్ లాంటి సినిమాలకు కూడా పోర్న్ పేరడీలు వచ్చాయి.