'బ్యాట్మ్యాన్ vs సూపర్మ్యాన్' పోర్న్ పేరడీకి భారీ ఆఫర్ | 'Batman v Superman' porn parody for Affleck's former nanny | Sakshi
Sakshi News home page

'బ్యాట్మ్యాన్ vs సూపర్మ్యాన్' పోర్న్ పేరడీకి భారీ ఆఫర్

Published Mon, Aug 24 2015 9:37 AM | Last Updated on Tue, Sep 18 2018 8:00 PM

'బ్యాట్మ్యాన్ vs సూపర్మ్యాన్' పోర్న్ పేరడీకి భారీ ఆఫర్ - Sakshi

'బ్యాట్మ్యాన్ vs సూపర్మ్యాన్' పోర్న్ పేరడీకి భారీ ఆఫర్

లాస్ ఏంజిలిస్: 'బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్మ్యాన్ డాన్ ఆఫ్ ది జస్టీస్' వచ్చే ఏడాది మార్చిలోగానీ ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఇప్పుడే ప్రధాన వార్తల్లో నిలిచింది. అసలు సినిమా సంగతి ఎలా ఉన్నప్పటికీ దానికి నకలుగా అంటే.. పోర్న్ పేరడీగా రూపొందించిన 'బ్యాట్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ ట్రిపుల్ ఎక్స్' పోర్న్ సినిమాకు సంబంధించి అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

బ్యాట్మ్యాన్- సూపర్మ్యాన్ పోర్న్ పేరడీలో నటించేందుకు తనకు భారీ పారితోషికం ఇవ్వజూపారంటూ.. బెన్ అఫ్లెక్స్ మాజీ గర్ల్ ఫ్రెండ్ క్రిస్టీన్ ఒజొనియాన్ ఆదివారం ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ బెన్ అప్లెక్స్ మరెవరోకాదు.. అసలు బ్యాట్మ్యాన్ సినిమాలో హీరో. బెన్, క్రిస్టీన్లు గతంలో సాగించిన ప్రేమాయణం అప్పట్లో పతాక శీర్శికలకెక్కింది. నిజ జీవితంతో వారి ప్రేమగాథకున్న క్రేజ్.. సదరు పోర్న్ పేరడీ మూవీకి మరింత ప్లస్ అవుతుందని భావించిన దర్శక నిర్మాత అలెక్స్ బ్రౌన్ (ఇటలీలో అడల్ట్ సినిమాల దర్శకుడిగా ఇతగాడికి గొప్ప పేరుంది).. బ్యాట్ఉమన్ పాత్రకు క్రిస్టీన్నే తీసుకోవాలని భావించాడట (బ్యాట్మ్యాన్  ఎలాగో మాస్క్ వేసుకుంటాడు కాబట్టి ఆ పాత్ర ఎవరు చేసినా ఫర్వాలేదని ఆయన ఉద్దేశమట).

అయితే ఆ ఆఫర్ తనకు నచ్చకపోవడంతో సున్నితంగా తిరస్కరించానని చెప్పుకొచ్చింది క్రిస్టీన్. బెన్తో ఎప్పుడో తెంచుకున్న ప్రేమ బంధం తాలూకు గుర్తుల్ని.. మళ్లీ బ్యాట్ఉమన్గా నటించి గుర్తుచేసుకోలేనని క్రిస్టీన్ వివరించింది. క్రిస్టీన్తో విడిపోయిన తర్వాత బెన్.. మరో నటీ జెన్నీఫర్ గార్నెర్ను పెళ్లాడిన సంగంతి తెలిసిందే. అసలు సినిమా కంటే ఏడాది ముందుగానే (జున్ 3, 2015న) విడుదలైన పోర్న్ పేరడీ సూపర్ హిట్ కావడం మరో విశేషం. గతంలో 300, అవేంజర్స్ లాంటి సినిమాలకు కూడా పోర్న్ పేరడీలు వచ్చాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement