అంతర్జాతీయ గోల్ఫ్ దిగ్గజం టైగర్‌వుడ్స్ ఒక బిలియన్ అమెరికన్ డాలర్లు(ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. ఏడున్నర వేల) కోట్ల ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం. సౌదీ రన్ ఎల్‌ఐవీ గోల్ఫ్ సిరీస్‌కు సంబంధించిన టోర్నీలో టైగర్‌వుడ్స్ పాల్గొనేందుకు నిరాకరించినట్లు మరో మాజీ గోల్ఫ్ ఆటగాడు గ్రెగ్ నార్మన్ ద్రువీకరించాడు. 46 ఏళ్ల టైగర్‌వుడ్స్ సౌదీ గోల్ఫ్ నుంచి తప్పుకోవాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నాడని.. మరింత బెస్ట్ ప్లేయర్లు ఉన్న కొత్త సిరీస్‌కు టైగర్‌వుడ్స్ సంతకం చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసిందని నార్మన్ అభిప్రాయపడ్డాడు.
అయితే ఫిల్ మికెల్సన్, డస్టిన్ జాన్సన్‌లతో సహా కొంతమంది హై ప్రొఫైల్ ప్లేయర్‌లు £100 మిలియన్ విలువైన రుసుముపై సంతకం చేయనున్నారు. కాగా టైగర్ వుడ్స్ గతంలోనూ ఎల్‌ఐవీ గోల్ఫ్‌కు సంబంధించిన ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించాడు. నవంబర్ 2021లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న టైగర్‌వుడ్ ఎల్‌ఐవీ గోల్ఫ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''నేను పీజీఏ టూర్‌కు మద్దతు ఇస్తున్నానని స్వయంగా నిర్ణయించుకున్నాను. నా వారసత్వం ఇక్కడే ఉంది. ఈ టూర్‌లో 82 ఈవెంట్‌లు, 15 మేజర్ ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకోవడంతో పాటు ఛాంపియన్‌షిప్‌లలో భాగమైనందుకు అదృష్టవంతుడిని అయ్యాను.'' అని చెప్పుకొచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment