declined
-
ఎగుమతులు 3 శాతం డౌన్..
న్యూఢిల్లీ: ఈ ఏడాది సెసెప్టెంబర్‌లో ఎగుమతులు 2.6 శాతం క్షీణించి 34.47 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే వ్యవధిలో ఎగుమతులు 35.39 బిలియన్ డాలర్లు. కమోడిటీల ధరలు తగ్గుముఖం పట్టడంతో వరుసగా 10వ నెల దిగుమతుల భారం కాస్త తగ్గింది. శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం .. దిగుమతులు 15% క్షీణించి 53.84 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గత సెసెప్టెంబర్‌లో ఇవి 63.37 బిలియన్ డాలర్లు. సెప్టెంబర్‌లో దేశ వాణిజ్య లోటు 19.37 బిలియన్ డాలర్లకు దిగి వచి్చంది. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–సెసెప్టెంబర్ మధ్య కాలంలో ఎగుమతులు 8.77% క్షీణించాయి. 211.4 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇదే వ్యవధిలో దిగుమతులు 12.23% తగ్గి 326.98 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఫలితంగా వాణిజ్య లోటు 115.58 బిలియన్ డాలర్లుగా ఉంది. ఎగుమతులపై ఆశాభావం.. అంతర్జాతీయంగా సవాళ్లు నెలకొన్నప్పటికీ సెసెప్టెంబర్ గణాంకాలు ఎగుమతులపరంగా ఆశావహ అవకాశాలను సూచిస్తున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్ బరత్వాల్ తెలిపారు. మిగతా ఆరు నెలల్లో ఎగుమతులు సానుకూల వృద్ధి నమోదు చేయగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్, మే, జూన్, జూలైలో క్షీణత రెండంకెల స్థాయిలో ఉండగా.. ప్రస్తుతం సింగిల్ డిజిట్ స్థాయికి దిగి వచి్చందని సునీల్ పేర్కొన్నారు. 2023లో అంతర్జాతీయంగా వాణిజ్యం 0.8 శాతమే పెరగవచ్చని వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంచనా వేసినప్పటికీ ఎగుమతులపరంగా భారత్ మెరుగ్గా రాణిస్తోందని సునీల్ చెప్పారు. ఆగస్టు గణాంకాల సవరణ.. కేంద్రం ఆగస్టు ఎగుమతుల గణాంకాలను 34.48 బిలియన్ డాలర్ల నుంచి 38.45 బిలియన్ డాలర్లకు సవరించింది. అలాగే దిగుమతులను 58.64 బిలియన్ డాలర్ల నుంచి 60.1 బిలియన్ డాలర్లకు మార్చింది. సెసెప్టెంబర్ 15న విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్టులో ఎగుమతులు అంతక్రితం ఏడాది అదే వ్యవధితో పోలిస్తే 6.86 శాతం క్షీణించినట్లు నమోదు కాగా.. తాజా సవరణతో 3.88 శాతం పెరిగినట్లయ్యింది. మరిన్ని విశేషాలు.. ► గత నెల ఎగుమతులకు సంబంధించి 30 కీలక రంగాల్లో 12 రంగాలు సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. ముడిఇనుము, కాటన్ యార్న్, మాంసం, డెయిరీ, పౌల్ట్రీ, ఫార్మా, ఇంజినీరింగ్ ఉత్పత్తులు వీటిలో ఉన్నాయి. ► దిగుమతులపరంగా చూస్తే 30లో 20 రంగాలు ప్రతికూల వృద్ధి కనపర్చాయి. వెండి, ఎరువులు, రవాణా పరికరాలు, బొగ్గు, విలువైన రాళ్లు, క్రూడ్, రసాయనాలు, మెషిన్ టూల్స్ వీటిలో ఉన్నాయి. ► చమురు దిగుమతులు 20.32 శాతం క్షీణించి 14 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో దిగుమతులు 22.81 శాతం తగ్గి 82.3 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. అటు పసిడి దిగుమతులు 7% పెరిగి 4.11 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రథమార్ధంలో 9.8% పెరిగి 22.2 బిలియన్ డాలర్లకు చేరాయి. -
జూలైలో ఎగుమతులు 16% డౌన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆరి్థక అనిశ్చితి పరిస్థితులు భారత్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దేశ జూలై ఎగుమతుల్లో (2022 ఇదే నెల గణాంకాలతో పోల్చి) అసలు వృద్ధిలేకపోగా 16 శాతం క్షీణించాయి. విలువలో 32.25 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. కీలక పెట్రోలియం, రత్నాలు–ఆభరణాలు, ఇతర కీలక రంగాల ఎగుమతులు భారీగా పడిపోయాయి. వాణిజ్య పరిశ్రమల శాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది. దిగుమతులూ క్షీణతే..: ఇక దిగుమతుల విలువ కూడా జూలైలో 17% పడిపోయి 52.92 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 20.67 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2022 జూలైలో 25.43 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యలోటు తాజాగా దాదాపు 5 బిలియన్ డాలర్లకు తగ్గిపోవడం గమనార్హం. నాలుగు నెలల్లోనూ.. ఈ ఏడాది (2022–23) ఏప్రిల్ నుంచి జూలై మధ్య ఎగుమతులు 14.5% పడిపోయి 136.22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 13.79 శాతం పడిపోయి 213.2 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి వాణిజ్యలోటు 76.98 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక ఈ నాలుగు నెలల్లో పసిడి దిగుమతులు 2.7% పెరిగి 13.2 బిలియన్ డాలర్లకు చేరాయి. చమురు దిగుమతుల బిల్లు 23.4% తగ్గి 55 బిలియన్ డాలర్లకు దిగివచి్చంది. ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులపై మరిన్ని ఆంక్షలు ఉండబోవు: కేంద్రం మరిన్ని ఎల్రక్టానిక్ వస్తువులపై దిగుమతి ఆంక్షలు విధించే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని వాణిజ్య కార్యదర్శి సునీల్ బరత్వాల్ తెలిపారు. చైనా వంటి దేశాల నుంచి దిగుమతులను తగ్గించడానికి అలాగే దేశీయ తయారీని పెంచడానికి నవంబర్ 1 నుండి ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, మరికొన్ని ఎల్రక్టానిక్ పరికరాలపై దిగుమతి ఆంక్షలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీకి ప్రొడక్షన్–లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం వర్తిస్తుందని మంత్రి చెప్పారు. -
హైదరాబాద్ రియల్ ఎస్టేట్‌కు షాకిచ్చిన జూన్! ఎలాగంటే..
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ స్థిరాస్తి రంగం ఎన్నికల మూడ్‌లోకి వెళ్లిపోయింది. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా ఆరు నెలలు సమయం ఉండగా.. రియల్టీ రంగంలో స్తబ్దత నెలకొంది. ఏ ప్రభుత్వం వస్తుందో, అభివృద్ధి పనులు ఎలా ఉంటాయో, ధరలు తగ్గుతాయేమో అనే రకరకాల కారణాలతో స్థిరాస్తి విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. మే నెలతో పోలిస్తే జూన్‌లో గ్రేటర్లో రిజిస్ట్రేషన్లు, వాటి విలువలు క్షీణించడమే ఇందుకు ఉదాహరణ. మేలో రూ.2,994 కోట్ల విలువ చేసే 5,877 అపార్ట్మెంట్ల రిజిస్ట్రేషన్స్ జరగగా.. జూన్ నాటికి రూ.2,898 కోట్ల విలువైన 5,566 యూనిట్ల రిజిస్ట్రేషన్స్ జరిగాయని నైట్‌ఫ్రాంక్ ఇండియా నివేదిక వెల్లడించింది. గతేడాది జూన్‌లో జరిగిన 5,411 యూనిట్లతో పోలిస్తే గత నెలలో రిజిస్ట్రేషన్స్‌లో 3 శాతం వృద్ధి నమోదయింది. అలాగే విలువల పరంగా చూస్తే 2022 జూన్‌లో రూ.2,842 కోట్లతో పోలిస్తే గత నెలలో 2 శాతం పెరుగుదల కనిపించింది. గత నెలలోని రిజిస్ట్రేషన్స్‌లో 52 శాతం యూనిట్లు రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షల మధ్య ధర ఉన్న గృహాలే. అలాగే రూ.కోటి కంటే ఎక్కువ ధర ఉన్న లగ్జరీ గృహాల వాటా 9 శాతంగా ఉంది. 68 శాతం ఫ్లాట్లు 1,000 చ.అ. నుంచి 2,000 చ.అ. మధ్య విస్తీర్ణం ఉన్న యూనిట్లే. 2 వేల చ.అ. కంటే విస్తీర్ణమైన ఇళ్ల వాటా 11 శాతంగా ఉంది. రిజిస్ట్రేషన్స్‌లో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా హవా కొనసాగుతుంది. జూన్‌లో జరిగిన రిజిస్ట్రేషన్స్‌లో ఈ జిల్లా వాటా 46 శాతం కాగా.. రంగారెడ్డి 38 శాతం, హైదరాబాద్ 16 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఈ ఏడాది నెల వారీగా రిజిస్ట్రేషన్స్ (రూ.కోట్లలో) నెల రిజిస్ట్రేషన్లు విలువ జనవరి 5,454 2,650 ఫిబ్రవరి 5,725 2,987 మార్చి 6,959 3,602 ఏప్రిల్ 4,494 2,286 మే 5,877 2,994 జూన్ 5,566 2,898 సోమాజిగూడలో రూ.5.09 కోట్లు సోమాజిగూడ ఖరీదైన నివాసాలకు కేంద్రంగా మారింది. గత నెలలో జరిగిన రిజిస్ట్రేషన్లలో టాప్–5 లావాదేవీలలో నాలుగు ఈ ప్రాంతంలోనే జరగడం గమనార్హం. రూ.5.09 కోట్ల మార్కెట్ విలువ గల 3,500 చ.అ.ల లోపు ఉన్న రెండు అపార్ట్మెంట్లు, రూ.4.22 కోట్ల వ్యాల్యూ ఉండే మరొక రెండు యూనిట్ల రిజిస్ట్రేషన్స్ జరిగాయి. అలాగే నార్సింగిలో రూ.5 కోట్ల మార్కెట్ విలువ గల ఓ ఫ్లాట్ రిజిస్ట్రేషన్ జరిగిందని నైట్‌ఫ్రాంక్ రిపోర్ట్ వెల్లడించింది. ఇదీ చదవండి: ఇల్లు అద్దెకివ్వడానికి ఇంటర్వ్యూ.. దిమ్మతిరిగిపోయే ప్రశ్నలతో చుక్కలు చూపించిన ఓనర్! -
ఎగుమతులు మూడో నెలా డౌన్
న్యూఢిల్లీ: భారత్ నుంచి ఎగుమతులు వరుసగా మూడో నెలా క్షీణించాయి. ఏప్రిల్‌లో 12.7 శాతం తగ్గి 34.66 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. కేంద్ర వాణిజ్య శాఖ సోమవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దిగుమతులు కూడా వరుసగా అయిదో నెలా క్షీణించాయి. ఏప్రిల్‌లో 14 శాతం క్షీణించి 49.9 బిలియన్ డాలర్లకు తగ్గాయి. గత ఏప్రిల్‌లో ఇవి 58.06 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. భారత్‌కు ప్రధాన మార్కెట్లుగా ఉన్న అమెరికా, యూరప్‌లో డిమాండ్ అంతగా లేకపోవడం .. ఎగుమతులు మందగించడానికి కారణమైంది. పరిస్థితి మెరుగుపడటానికి మరికొద్ది నెలలు పట్టే అవకాశం ఉందని డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) సంతోష్ కుమార్ సారంగి తెలిపారు. ‘యూరప్, అమెరికాలో డిమాండ్ క్షీణించింది. వచ్చే 2–3 నెలలు కూడా అంత ఆశావహంగా కనిపించడం లేదు. అయితే, చైనా ఎకానమీ కోలుకుని.. యూరప్, అమెరికా మార్కెట్లలో కూడా కాస్త డిమాండ్ నెలకొనే అవకాశం ఉన్నందున ఆగస్టు–సెప్టెంబర్ తర్వాత నుంచి ఎగుమతులు మళ్లీ పుంజుకోవడానికి ఆస్కారం ఉంది‘ అని ఆయన పేర్కొన్నారు. 20 నెలల కనిష్టానికి వాణిజ్య లోటు .. ఎగుమతులు, దిగుమతుల మందగమనంతో ఏప్రిల్‌లో వాణిజ్య లోటు 20 నెలల కనిష్టమైన 15.24 బిలియన్ డాలర్లకు తగ్గింది. చివరిసారిగా 2021 ఆగస్టులో వాణిజ్య లోటు ఇంతకన్నా తక్కువగా 13.81 బిలియన్ డాలర్లుగా నమోదు కాగా.. గతేడాది ఏప్రిల్‌లో ఇది 18.36 బిలియన్ డాలర్లుగా ఉంది. కమోడిటీల ధరలు, రత్నాభరణాల్లాంటి ఉత్పత్తులకు డిమాండ్ క్షీణించడంతో దిగుమతులు తగ్గినట్లు సారంగి వివరించారు. ఎగుమతులపరంగా రాబోయే రోజుల్లోనూ రత్నాభరణాలు, కొన్ని రకాల ఇంజినీరింగ్ ఉత్పత్తులు, దుస్తులపై ప్రభావం ఉండవచ్చన్నారు. ఎక్కువగా ఎగుమతులు చేసేందుకు ఆస్కారమున్న ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, నూనె గింజల్లాంటి వాటిపై వ్యాపారవర్గాలు మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు. 2022–23 గణాంకాల సవరణ.. గత ఆర్థిక సంవత్సరం గణాంకాలను వాణిజ్య శాఖ ఎగువముఖంగా సవరించింది. దీని ప్రకారం.. ► 2022–23లో ఉత్పత్తులు, సర్వీసుల ఎగుమతులు 14.68 శాతం వృద్ధి చెంది 676.53 బిలియన్ డాలర్ల నుంచి 775.87 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతులు 17.65 శాతం పెరిగి 894.19 బిలియన్ డాలర్లకు చేరాయి. వాణిజ్య లోటు 118.31 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ► ఉత్పత్తుల ఎగుమతులు 6.74% వృద్ధితో 450.43 బిలియన్ డాలర్లకు చేరగా, దిగుమతులు 16.47% పెరిగి 714 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► సేవల ఎగుమతులు 27.86 శాతం ఎగిసి 325.44 బిలియన్ డాలర్లకు, దిగుమతులు 22.54 శాతం పెరిగి 180 బిలియన్ డాలర్లకు చేరాయి. -
సిలికాన్ వ్యాలీ బ్యాంక్ సంక్షోభం.. భారత్‌లో తగ్గిన ప్రైవేట్ ఈక్విటీ పెట్టుబడులు
ముంబై: దేశయంగా ప్రయివేట్ ఈక్విటీ(పీఈ), వెంచర్ క్యాపిటల్(వీసీ) ఫండ్స్ పెట్టుబడులు గత నెలలో 4 శాతం నీరసించాయి. 5.3 బిలియన్ డాలర్లకు(రూ. 43,460 కోట్లు) పరిమితమయ్యాయి. 2022 మార్చితో పోలిస్తే లావాదేవీలు సైతం 125 నుంచి 82కు క్షీణించాయి. ఐవీసీఏ, కన్సల్టెన్సీ సంస్థ ఈవై సంయుక్తంగా రూపొందించిన నివేదిక వెల్లడించిన అంశాలివి. వీటి ప్రకారం జనవరి–మార్చి త్రైమాసికంలో డీల్స్ 21 శాతం తగ్గాయి. పెట్టుబడుల విలువ 13.3 బిలియన్ డాలర్లకు చేరింది. యూఎస్‌లో సిలికాన్ వ్యాలీ బ్యాంక్(ఎస్వీబీ) దివాలా అనిశ్చితికి దారితీసినట్లు ఈవై పార్టనర్ వివేక్ సోనీ పేర్కొన్నారు. దీంతో స్టార్టప్‌లకు నిధుల లభ్యత కఠినతరమైనట్లు తెలియజేశారు. అనిశ్చిత వాతావరణంలో స్టార్టప్‌ల విభాగంలో కన్సాలిడేషన్‌కు తెరలేచే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. నగదు అధికంగా ఖర్చయ్యే కంపెనీలు నిధుల సమీకరణలో సవాళ్లు ఎదుర్కోవలసి వస్తుందని పేర్కొన్నారు. వెరసి సంస్థల మధ్య విలీనాలు, కొనుగోళ్లు వంటివి నమోదుకావచ్చని తెలియజేశారు. ప్రధానంగా వాటాల మార్పిడి(షేర్ల స్వాప్) ద్వారా బిజినెస్‌లు, కంపెనీల విక్రయాలు జరిగే అవకాశమున్నట్లు వివరించారు. ధరల వ్యత్యాసం.. గత నెలలో డీల్స్ నీరసించడానికి కారణాలున్నట్లు నివేదిక పేర్కొంది. ప్రమోటర్లు ఆశించే ధర, ఇన్వెస్టర్లు ఆసక్తి చూపిన బిడ్స్ మధ్య వ్యత్యాసాలు ప్రభావం చూపినట్లు తెలియజేసింది. 2023 మార్చిలో 10 కోట్లకుపైగా విలువగల 14 భారీ డీల్స్ జరిగాయి. వీటి విలువ 4.3 బిలియన్ డాలర్లు. 2022 మార్చిలో 2.9 బిలియన్ డాలర్ల విలువైన 13 లార్జ్ డీల్స్ నమోదయ్యాయి. తాజా డీల్స్‌లో గ్రీన్కో ఎనర్జీలో జీఐసీ, ఏడీఐఏ, ఓరిక్స్ చేపట్టిన 70 కోట్ల డాలర్ల పెట్టుబడులు, అదానీ గ్రూప్ కంపెనీలలో జీక్యూసీ పార్టనర్స్1.3 బిలియన్ డాలర్ల ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. పైప్ జోరు విలువరీత్యా గత నెలలో పబ్లిక్ ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ప్రయివేట్ ఇన్వెస్ట్మెంట్(పీఐపీఈ–పైప్) జోరు చూపాయి. 10 డీల్స్ ద్వారా 2.4 బిలియన్ డాలర్లు వచ్చాయి. 2022 మార్చిలో 8 లావాదేవీల ద్వారా 70 కోట్ల డాలర్ల పెట్టుబడులే నమోదయ్యాయి. తాజా డీల్స్‌లో మౌలికరంగం మొత్తం పెట్టుబడులను ఆకట్టుకుంది. ఇక ఈ మార్చిలో 1.75 బిలియన్ డాలర్ల విలువైన 30 అమ్మకపు(ఎగ్జిట్) లావాదేవీలు నమోదయ్యాయి. వీటిలో సోనా బీఎల్డబ్ల్యూ ప్రెసిషన్ ఫోర్జింగ్స్ టాప్‌లో నిలిచింది. మరోవైపు మూడు డీల్స్ ద్వారా 1.95 బిలియన్ డాలర్ల నిధుల సమీకరణ జరిగింది. 2022 మార్చిలో దాదాపు 1.2 బిలియన్ డాలర్ల పెట్టుబడులను మాత్రమే సమకూర్చుకున్నాయి. -
ఐదు నెలల కనిష్టానికి టోకు ధరలు
న్యూఢిల్లీ: వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం తరహాలోనే టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ద్రవ్యోల్బణం స్పీడ్ కూడా దిగువముఖం పట్టింది. జూలైలో ఐదు నెలల కనిష్ట స్థాయిలో 13.93 శాతంగా నమోదయ్యింది. అంటే 2021 జూలైతో పోల్చితే 2022 జూలైలో టోకు ధరల బాస్కెట్ ధర పెరుగుదల 13.93 శాతమన్నమాట. నెలవారీగా ఆహార, తయారీ ఉత్పత్తుల ధరల తగ్గుదల తాజా సానుకూల గణాంకానికి ప్రధాన కారణమని ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. టోకు ధరల సూచీ తగ్గుదల ఇది వరుసగా రెండవనెల. మేలో సూచీ 15.88 శాతం రికార్డు గరిష్టానికి చేరింది. అయితే జూన్‌లో 15.18 శాతానికి తగ్గింది. తాజా సమీక్షా నెల్లో మరికొంత (13.93) దిగివచ్చింది. అయితే రెండంకెలపైనే డబ్ల్యూపీఐ స్పీడ్ కొనసాగడం వరుసగా 16వ నెల. రిటైల్ ద్రవ్యోల్బణం కూడా మేలో 7.04%కి చేరింది. అయితే జూన్‌లో 7.01%కి, జూలైలో 6.71 శాతానికి తగ్గింది. సరఫరాల పరంగా ప్రభుత్వం, ద్రవ్య పాలసీవైపు ఆర్బీఐ, పంట దిగుబడులు ద్రవ్యోల్బణం దిగిరావడానికి కారణమని భావిస్తున్నారు. ►ఆహార ఉత్పత్తుల ద్రవ్యోల్బణం జూన్‌లో 14.39 శాతం ఉంటే, జూలైలో 10.77 శాతానికి తగ్గింది. ఇందులో కూరగాయల ధరల స్పీడ్ 18.25 శాతం. జూన్‌లో ఈ స్పీడ్ ఏకంగా 56.75 శాతంగా ఉంది. ►ఇంధన, విద్యుత్ బాస్కెట్ ద్రవ్యోల్బణం జూన్‌లో 40.38% ఉంటే, జూలైలో 43.75%కి పెరిగింది. ►సూచీలో మెజారిటీ వెయిటేజ్ ఉన్న తయారీ ఉత్పత్తుల ద్రవ్యోల్బణం 8.16 శాతానికి చేరింది. -
వేల కోట్ల రూపాయల ఆఫర్‌ను తిరస్కరించిన గోల్ఫ్ దిగ్గజం
అంతర్జాతీయ గోల్ఫ్ దిగ్గజం టైగర్‌వుడ్స్ ఒక బిలియన్ అమెరికన్ డాలర్లు(ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. ఏడున్నర వేల) కోట్ల ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం. సౌదీ రన్ ఎల్ఐవీ గోల్ఫ్ సిరీస్‌కు సంబంధించిన టోర్నీలో టైగర్‌వుడ్స్ పాల్గొనేందుకు నిరాకరించినట్లు మరో మాజీ గోల్ఫ్ ఆటగాడు గ్రెగ్ నార్మన్ ద్రువీకరించాడు. 46 ఏళ్ల టైగర్‌వుడ్స్ సౌదీ గోల్ఫ్ నుంచి తప్పుకోవాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నాడని.. మరింత బెస్ట్ ప్లేయర్లు ఉన్న కొత్త సిరీస్‌కు టైగర్‌వుడ్స్ సంతకం చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసిందని నార్మన్ అభిప్రాయపడ్డాడు. అయితే ఫిల్ మికెల్సన్, డస్టిన్ జాన్సన్‌లతో సహా కొంతమంది హై ప్రొఫైల్ ప్లేయర్లు £100 మిలియన్ విలువైన రుసుముపై సంతకం చేయనున్నారు. కాగా టైగర్ వుడ్స్ గతంలోనూ ఎల్ఐవీ గోల్ఫ్‌కు సంబంధించిన ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించాడు. నవంబర్ 2021లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న టైగర్‌వుడ్ ఎల్ఐవీ గోల్ఫ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''నేను పీజీఏ టూర్‌కు మద్దతు ఇస్తున్నానని స్వయంగా నిర్ణయించుకున్నాను. నా వారసత్వం ఇక్కడే ఉంది. ఈ టూర్లో 82 ఈవెంట్లు, 15 మేజర్ ఛాంపియన్షిప్లను గెలుచుకోవడంతో పాటు ఛాంపియన్‌షిప్‌లలో భాగమైనందుకు అదృష్టవంతుడిని అయ్యాను.'' అని చెప్పుకొచ్చాడు. -
2,000 కరెన్సీ నోట్లు : ఆర్బీఐ షాకింగ్ నివేదిక
ముంబై: ఆర్థిక వ్యవస్థ నుంచి 2000 వేల రూపాయల నోట్లు క్రమంగా వెనక్కుమళ్లుతున్నాయి. 2022 మార్చి నాటికి చెలామణిలో ఉన్న మొత్తం నోట్లలో వీటి శాతం కేవలం 1.6 శాతానికి పడిపోయింది. నోట్ల సంఖ్య 214 కోట్లుగా ఉంది. ఆర్బీఐ 2021–22 వార్షిక నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. రుణ వృద్ధిలో బ్యాంకింగ్ కీలకపాత్ర పోషించాలని నివేదిక సూచిస్తూనే, అదే సమయంలో రుణ పునర్వ్యవస్థీకరణకు సంబంధించిన అకౌంట్ల పనితీరును జాగ్రత్తగా ఎప్పటికప్పుడు పరిశీలించాలని, బ్యాలెన్స్ షీట్ల పటిష్టతపై దృష్టి సారించాలని ఉద్ఘాటించింది.దేశంలో వర్చువల్ కరెన్సీని ప్రవేశపెట్టడం వల్ల కలిగే లాభ,నష్టాలను పరిశీలిస్తున్నామని తెలిపింది. డిజిటల్ కరెన్సీని ప్రారంభించేందుకు గ్రేడెడ్ విధానాన్ని (దశలవారీ పరిశీలిలన) అవలంబిస్తామని పేర్కొంది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే.. ఈ ఏడాది మార్చి నాటికి మొత్తం చెలామణిలో ఉన్న అన్ని డినామినేషన్ల కరెన్సీ నోట్ల సంఖ్య 13,053 కోట్లు. 2021 ఇదే నెల్లో ఈ నోట్ల సంఖ్య 12,437 కోట్లు. మార్చి 2020 చివరి నాటికి, చెలామణిలో ఉన్న రూ. 2000 డినామినేషన్ నోట్ల సంఖ్య 274 కోట్లు. ఇది మొత్తం చెలామణిలో ఉన్న కరెన్సీ నోట్లలో 2.4 శాతం. మార్చి 2021 నాటికి చెలామణిలో ఉన్న మొత్తం బ్యాంకు నోట్లలో 245 కోట్లకు లేదా 2 శాతానికి ఈ పరిమాణం క్షీణించింది. ఇక గత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 214 కోట్లకు (1.6 శాతానికి) పడిపోయింది. విలువ పరంగా కూడా రూ. 2000 డినామినేషన్ నోట్లు చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీ నోట్ల విలువలో 22.6 శాతం నుండి మార్చి 2021 చివరి నాటికి 17.3 శాతానికి, మార్చి 2022 చివరి నాటికి 13.8 శాతానికి తగ్గాయి. నివేదిక ప్రకారం ఈ ఏడాది మార్చి చివరి నాటికి చెలామణిలో ఉన్న రూ.500 డినామినేషన్ నోట్ల సంఖ్య 3,867.90 కోట్ల నుంచి 4,554.68 కోట్లకు పెరిగింది. పరిమాణం పరంగా మొత్తం బ్యాంక్ నోట్లలో మార్చి చివరినాటికి రూ. 500 డినామినేషన్ అత్యధికంగా 34.9 శాతం వాటాను కలిగి ఉంది. ఆ తర్వాత రూ. 10 డినామినేషన్ బ్యాంక్ నోట్ల వెయిటేజ్ చెలామణిలో ఉన్న నోట్లలో 21.3 శాతంగా ఉంది. రూ.500 డినామినేషన్ నోట్లు మార్చి 2021 చివరి నాటికి 31.1 శాతం. మార్చి 2020 నాటికి 25.4 శాతం వాటా కలిగి ఉంది. విలువ పరంగా చూస్తే, ఈ నోట్లు మార్చి 2020 నుండి మార్చి 2022 వరకు 60.8 శాతం నుండి 73.3 శాతానికి పెరిగాయి. 2021 మార్చి చివరినాటికి రూ.28.27 లక్షల కోట్లుగా ఉన్న అన్ని డినామినేషన్ల మొత్తం కరెన్సీ నోట్ల విలువ ఈ ఏడాది మార్చి చివరి నాటికి రూ.31.05 లక్షల కోట్లకు పెరిగింది. విలువ పరంగా రూ. 500, రూ. 2000 నోట్ల వాటా 31 మార్చి 2022 నాటికి చెలామణిలో ఉన్న బ్యాంక్ నోట్ల మొత్తం విలువలో 87.1 శాతం. ఇది మార్చి 2021 నాటికి 85.7 శాతం. చెలామణిలో ఉన్న బ్యాంకు నోట్ల విలువ–పరిమాణం 2020–21లో వరుసగా 16.8 శాతం, 7.2 శాతం పెరిగాయి. 2021–22లో వరుసగా ఈ పెరుగుదల 9.9 శాతం, 5 శాతంగా ఉంది. చెలామణిలో ఉన్న కరెన్సీ (సీఐసీ) బ్యాంకు నోట్లు, నాణేల రూపంలో ఉంది. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20, రూ. 50, రూ. 100, రూ. 200, రూ. 500, రూ. 2000 డినామినేషన్లలో బ్యాంకు నోట్లను జారీ చేస్తోంది. 50 పైసలు, రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10, రూ. 20 నాణేలు చెలామణిలో ఉన్నాయి. పెరిగిన ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ నివేదిక ప్రకారం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బ్యాలెన్స్ షీట్ 8.46 శాతం పెరిగి రూ.61.9 లక్షల కోట్లకు చేరింది. కరెన్సీ జారీ కార్యకలాపాలు, ద్రవ్య విధానం, నగదు నిల్వల నిర్వహణ, ఇందుకు అనుగుణంగా నిర్వహించే విధులను ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్ ప్రతిబింబిస్తుంది. సెంట్రల్ బ్యాంక్ ఆదాయం 20.14 శాతం పెరిగితే, వ్యయాలు భారీగా 280.13 శాతం పెరిగి 1,29,800.68 కోట్లకు చేరాయి. 2020–21లో మొత్తం మిగులు రూ.99,122 కోట్లయితే, 2021–22లో ఈ పరిమాణం 69.42 శాతం తగ్గి రూ.30,307.45 కోట్లకు చేరింది. ఈ మొత్తాన్ని కేంద్రానికి డివిడెండ్‌గా ఇవ్వాలని గతవారం ఆర్బీఐ నిర్ణయించింది. 2022 మార్చి నాటికి మొత్తం అసెట్స్‌లో దేశీయ అసెట్స్ వెయిటేజ్ 28.22 శాతం అయితే, ఫారిన్ కరెన్సీ అసెట్స్, పసిడి (గోల్డ్ డిపాజిట్లు, నిల్వలు) వాటా 71.78 శాతంగా ఉంది. 2021 మార్చి నాటికి ఈ వెయిటేజ్‌లు వరుసగా 26.42 శాతం, 73.58 శాతాలుగా ఉన్నాయి. గోల్డ్ హోల్డింగ్స్ ఇదే కాలంలో 695.31 మెట్రిక్ టన్నుల నుంచి 760.42 మెట్రిక్ టన్నులకు చేరింది. కాగా ఉద్యోగుల వ్యయాలు 19.19 శాతం తగ్గి రూ.4,788.03 కోట్ల నుంచి రూ.3,869.43 కోట్లకు తగ్గాయి. 2021–22లో వివిధ సూపర్‌యాన్యుయేషన్ ఫండ్స్‌కు (ఉద్యోగుల పెన్షన్ ప్రణాళికలకు) సంబంధించి చెల్లింపులు తగ్గడం దీనికి కారణం. సంస్కరణలు, ద్రవ్యోల్బణం కట్టడే కీలకం సుస్థిర, సమతౌల్య, సవాళ్లను ఎదుర్కొనగలిగే ఆర్థిక వృద్ధికి వ్యవస్థాగత సంస్కరణలు కీలకమని ఆర్బీఐ పేర్కొంది. ముఖ్యంగా మహమ్మారి సవాళ్లు, భౌగోళిక ఉద్రిక్తతల నేపథ్యంలో ఆర్థిక సంస్కరణల వేగవంతం ముఖ్యమని వివరించింది. దీనితోపాటు ద్రవ్యోల్బణం కట్టడి, మూలధన వ్యయాల పెంపు, పటిష్ట ద్రవ్య విధానాలు, సరఫరాల సమస్యలు అధిగమించడం కూడా ఎకానమీ పురోగతిలో కీలకమని వివరించింది. ప్రస్తుతం ఎకానమీ ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్లలో ద్రవ్యోల్బణం ఒకటని వివరించింది. ఎకానమీ రికవరీలో స్పీడ్ తగ్గిందని కొన్ని హై–ఫ్రీక్వెన్సీ ఇండికేటర్లు సంకేతాలు ఇచ్చినట్లు తెలిపింది. ద్రవ్యోల్బణం కట్టడికి ప్రభుత్వ సహకారం, సమన్వయంతో ఆర్బీఐ తగిన అన్ని చర్యలూ తీసుకుంటుందని స్పష్టం చేసింది. భౌగోళిక ఉద్రిక్తతలు సమసిపోయి, కోవిడ్ తదుపరి వేవ్‌లు తగ్గితే తిరిగి ఎకానమీ స్పీడ్ అందుకుంటుందన్న భరోసాను వెలిబుచ్చింది. అధిక టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ధరలపై ఒత్తిడి తెస్తుందని ఆర్బీఐ పేర్కొంది. -
హోల్‌సేల్‌లో తగ్గిన వాహన అమ్మకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్యాసింజర్ వాహనాల హోల్‌సేల్ విక్రయాలు దేశవ్యాప్తంగా ఈ ఏడాది మార్చి నెలలో 2,79,501 యూనిట్లు నమోదయ్యాయి. 2021 మార్చితో పోలిస్తే ఇది 4 శాతం తగ్గుదల అని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియమ్) చెబుతోంది. ‘2021 మార్చితో పోలిస్తే ద్విచక్ర వాహన అమ్మకాలు గత నెలలో 21 శాతం పడిపోయి 11,84,210 యూనిట్లుగా ఉంది. మోటార్‌సైకిల్స్ 21 శాతం తగ్గి 1,86,479 యూనిట్లు, స్కూటర్స్ 21 శాతం తక్కువై 3,60,082 యూనిట్లకు వచ్చి చేరాయి. ఇక 2020–21తో పోలిస్తే గత ఆర్థిక సంవత్సరంలో అన్ని విభాగాల్లో కలిపి మొత్తం వాహనాల హోల్‌సేల్ అమ్మకాలు 6 శాతం తగ్గి 1,86,20,233 నుంచి 1,75,13,596 యూనిట్లకు వచ్చి చేరింది. ప్యాసింజర్ వాహనాల విక్రయాలు 13 శాతం ఎగసి 30,69,499 యూనిట్లను నమోదు చేశాయి. ద్విచక్ర వాహనాలు 11 శాతం తగ్గి 1,34,66,412 యూనిట్లకు పడిపోయాయి. గడిచిన 10 ఏళ్లలో ఈ స్థాయి అమ్మకాలు నమోదు కావడం ఇదే తొలిసారి. త్రిచక్ర వాహనాలు 2,19,446 నుంచి 2,60,995 యూనిట్లకు పెరిగాయి. వాణిజ్య వాహనాల అమ్మకాలు 5,68,559 నుంచి 7,16,566 యూనిట్లను తాకాయి. ఎగుమతులు 41,34,047 నుంచి 56,17,246 యూనిట్లకు ఎగశాయి. అన్ని విభాగాల్లోనూ ఎగుమతులు దూసుకెళ్లాయి. ప్రధానంగా ద్విచక్ర వాహన ఎగుమతులు రికార్డు స్థాయిలో 44,43,018 యూనిట్లు నమోదయ్యాయని సియామ్ నివేదిక వెల్లడించింది. చదవండి: మారుతి జోరులో టాటా పంచ్‌లు !? -
భారత్ ‘తయారీ’ అంతంతే..! మార్చిలో మరీ దారుణంగా..
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం మార్చి నెలలో నెమ్మదించింది. ఉత్పత్తి, అమ్మకాల గణాంకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఎస్అండ్పీ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) మార్చిలో 54గా నమోదయ్యింది. సెప్టెంబర్ 2021 తరువాత ఇంత తక్కువ స్థాయి ఇండెక్స్ నమోదుకావడం ఇదే తొలిసారి. ఫిబ్రవరిలో ఈ సూచీ 54.9 వద్ద ఉంది. అయితే సూచీ 50 లోపుకు పడిపోతే క్షీణతగా భావిస్తారు. 50 ఎగువన వృద్ధి ధోరణిగానే పరిగణించడం జరుగుతుంది. ముడి పదార్థాల ధరలు పరిశ్రమకు ప్రధానంగా అవరోధంగా మారాయి. రసాయనాలు, ఇంధనం, ఫ్యాబ్రిక్, ఆహార ఉత్పత్తులు, మెటల్ ధరలు ఫిబ్రవరికన్నా పెరిగాయి. -
తెలంగాణలో నిరుద్యోగం తగ్గుముఖం..7.4 నుంచి 4.2 శాతానికి..
సాక్షి, న్యూఢిల్లీ: రెండు తెలుగురాష్ట్రాల్లో నిరు ద్యోగం తగ్గుముఖం పడుతోంది. ఈ రాష్ట్రాల్లో నిరు ద్యోగిత జాతీయసగటు కంటే మెరుగ్గా ఉంది. ఈ వివరాలను సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ నివేదిక వెల్లడించింది. ఈ ఏడాది అక్టో బర్ నాటికి జాతీయస్థాయి నిరుద్యోగరేటు 7.75% ఉండగా, తెలంగాణలో 4.2, ఆంధ్రప్రదేశ్‌లో 5.4 శాతం చొప్పున నమోదైందని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లో కొన్ని నెలలుగా నిరుద్యోగరేటు క్రమేపీ తగ్గుతోందని నివేదిక పేర్కొంది. అగ్రస్థానంలో హరియాణా: నిరుద్యోగరేటులో హరియాణాదే అగ్రస్థానం. జాతీయసగటు కంటే ఎక్కువశాతం నమోదైన రాష్ట్రాల్లో హరియాణా (30.7 శాతం), రాజస్థాన్ (29.6 శాతం), జమ్మూ, కశ్మీర్ (22.2 శాతం), జార్ఖండ్(18.1 శాతం), హిమాచల్‌ప్రదేశ్ (14.1 శాతం), బిహార్ (13.9 శాతం), గోవా (11.7 శాతం), పంజాబ్ (11.4 శాతం), ఢిల్లీ (11 శాతం), సిక్కిం (10 శాతం), త్రిపుర (9.9 శాతం)లు ఉన్నాయి. మిగిలిన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో జాతీయ సగటు కంటే తక్కువ నిరుద్యోగరేటు నమోదైంది. -
మారుతీ లాభం స్కిడ్!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా నికర లాభం ఏకంగా 66 శాతం క్షీణించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రూ. 487 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో నికర లాభం రూ. 1,420 కోట్లు. సెమీకండక్టర్ల కొరత, కమోడిటీ ధరల పెరుగుదల తదితర అంశాలు రెండో త్రైమాసికంలో కంపెనీపై ప్రతికూల ప్రభావం చూపాయి. తాజా క్యూ2లో ఆదాయం రూ. 18,756 కోట్ల నుంచి రూ. 20,551 కోట్లకు చేరింది. మొత్తం వాహన విక్రయాలు 3 శాతం క్షీణించి 3,93,130 యూనిట్ల నుంచి 3,79,541 యూనిట్లకు తగ్గాయి. దేశీ విక్రయాలు 3,70,619 యూనిట్ల నుంచి 3,20,133 యూనిట్లకు క్షీణించాయి. అయితే, ఎగుమతులు 22,511 వాహనాల నుంచి ఏకంగా 59,408 వాహనాలకు చేరాయి. త్రైమాసికాలవారీగా ఇది అత్యధికం. లక్ష పైగా వాహనాల ఉత్పత్తికి బ్రేక్ .. ప్రధానంగా దేశీ మోడల్స్‌కు సంబంధించి.. ఎలక్ట్రానిక్స్ విడిభాగాల కొరత కారణంగా దాదాపు 1.16 లక్షల వాహనాలను ఉత్పత్తి చేయలేకపోయినట్లు కంపెనీ తెలిపింది. రెండో త్రైమాసికం ఆఖరు నాటికి 2 లక్షల పైగా ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయని వివరించింది. డెలివరీలను వేగవంతం చేసేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని పేర్కొంది. ‘గడిచిన ఏడాది వ్యవధిలో చూస్తే.. ఈ త్రైమాసికంలో ఉక్కు, అల్యూమినియం, ఇతరత్రా విలువైన లోహాల ధరలు అసాధారణంగా పెరిగిపోయాయి. ఖర్చులను తగ్గించుకోవడం ద్వారా ముడి వస్తువుల ధరల పెరుగుదల ప్రభావాన్ని వీలైనంత అధికంగా భరించేందుకు కంపెనీ అన్ని ప్రయత్నాలు చేసింది. కార్ల ధరలు పెంచినా.. వినియోగదారులకు స్వల్ప భారాన్నే బదలాయించింది. నికర లాభం క్షీణించడానికి ఇది కూడా కారణం‘ అని మారుతీ సుజుకీ తెలిపింది. సవాళ్లమయంగా రెండో త్రైమాసికం.. క్యూ2 అత్యంత సవాళ్లమయంగా సాగిందని ఆన్లైన్ విలేకరుల సమావేశంలో పాల్గొన్న సందర్భంగా కంపెనీ చైర్మన్ ఆర్సీ భార్గవ తెలిపారు. ఏడాది ప్రారంభంలో కంపెనీ ఊహించని అనూహ్యమైన పరిణామాలు, సవాళ్లు ఎదురయ్యాయని ఆయన పేర్కొన్నారు. ‘రెండో త్రైమాసికంలో కరోనా పరిస్థితి మరీ తీవ్రంగా లేదు. కానీ సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్ విడిభాగాల కొరత .. కమోడిటీల ధరలు అసాధారణంగా పెరిగిపోవడం వంటి అంశాలు మా ముందస్తు అంచనాలను తల్లకిందులు చేశాయి‘ అని భార్గవ తెలిపారు. రెండంకెల వృద్ధి ఉండదు.. ఈ ఆర్థిక సంవత్సరంలో మిగతా వ్యవధిలో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో చెప్పడం ప్రస్తుతం చాలా కష్టమని భార్గవ చెప్పారు. కమోడిటీల ధరలు, ఎలక్ట్రానిక్ విడిభాగాల సరఫరాలను అంచనా వేయడం అంత సులభంగా లేదన్నారు. అంతర్జాతీయంగా సెమీకండక్టర్ల కొరత నెలకొందని, ఎవరూ దీర్ఘకాలిక సరఫరాల గురించి ఇదమిత్థంగా చెప్పలేకపోతున్నారని భార్గవ తెలిపారు. నాలుగేళ్ల తర్వాతే ఎలక్ట్రిక్ వాహనం ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ అంతగా లేదని, 2025 తర్వాతే దేశీయంగా వీటిని తాము ప్రవేశపెట్టే అవకాశం ఉందని భార్గవ చెప్పారు. తాము ఈ విభాగంలోకి ప్రవేశిస్తే నెలకు కనీసం 10,000 యూనిట్లయినా విక్రయించాలని భావిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం బ్యాటరీలు, చార్జింగ్ మౌలిక సదుపాయాలు, విద్యుత్ సరఫరా వంటివి ఇతర సంస్థల చేతుల్లో ఉన్నందున.. ధరను నిర్ణయించడం తమ చేతుల్లో లేదన్నారు. ఎలక్ట్రిక్ కారును ప్రవేశపెట్టడంపై మాతృ సంస్థ సుజుకీదే తుది నిర్ణయమని చెప్పారు. 2020లో ఎలక్ట్రిక్ వేగన్ఆర్ను విడుదల చేయాలని అనుకున్నప్పటికీ, వివిధ ప్రతికూలతల కారణంగా దాన్ని పక్కన పెట్టింది. -
రిలయన్స్ కొంపముంచిన జియోఫోన్..!
ముంబై: ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్‌ఫోన్‌గా పేర్కొన్న జియోఫోన్ నెక్ట్స్ లాంఛింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. రిలయన్స్ 44 ఏజీఎం సమావేశంలో వినాయక చవితికి తమ ఫోన్‌ను లాంఛ్ చేస్తామని కంపెనీ చైర్మన్ ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు. కాగా ఈ ఫోన్‌ను దీపావళి పండుగకు లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా జియోఫోన్‌నెక్ట్స్ లాంచ్ రిలయన్స్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ వాయిదా పడడంతో రిలయన్స్ షేర్లు సోమవారం రోజున 2 శాతం మేర నష్టపోయాయి. చదవండి: జియో నుంచి మరో సంచలనం..! త్వరలోనే లాంచ్..! సోమవారం జరిగిన బీఎస్ఈ ఇంట్రా డే ట్రేడ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 2 శాతం క్షీణించి రూ .2,382.85 వద్ద నిలిచింది. ట్రేడింగ్ ప్రారంభంలో రిలయన్స్ షేర్ విలువ రూ. 2425.60 వద్ద ఉండగా ట్రేడింగ్ ముగిసే సమయానికి సుమారు రూ. 55.80 మేర నష్టపోయి షేర్ విలువ రూ. 2,382.85 వద్ద నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమీకండక్టర్ కొరత కారణంగా జియోఫోన్‌నెక్ట్స్ లాంచింగ్ వాయిదా పడిందని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు. జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్, గూగుల్ కంపెనీలు కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. మరింత మెరుగుదల కోసం రెండు కంపెనీలు పరిమిత వినియోగదారులతో జియోఫోన్ నెక్స్ట్ ను పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. దీపావళి పండుగ సీజన్లో ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు కంపెనీ చర్యలు తీసుకుంటుంది. స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ను వాయిదా వేయడంతో వచ్చే అదనపు సమయం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమీకండక్టర్ కొరతను తగ్గించడంలో సహాయపడుతుందని జియో, గూగుల్ ఒక ప్రకటనలో పేర్కొంది. చదవండి: భూమ్మీద అత్యంత సురక్షితమైన ఫోన్ ఇదే..! -
కార్మిక సంఘాలు ఎందుకు తగ్గుతున్నాయి?
ఇదివరకే తగ్గుముఖం పట్టిన యూనియన్లను సర్వీసు రంగ పెరుగుదల, కాంట్రాక్టు కార్మికులు, ఇప్పుడు కొత్త కార్మిక చట్టాలు మరింత ప్రాధాన్యత లేనివిగా మార్చాయి. ఈ రోజుల్లో ఇండియాలో కార్మిక సంఘాల గురించి పెద్దగా వినబడటం లేదు. సరళీకరణకు ముందటి పారిశ్రామిక మార్కెట్లో కార్మిక లేదా ట్రేడ్ యూనియన్లు చాలా ప్రాధా న్యత కలిగివుండేవి. కానీ కార్మిక మార్కెట్లో ఇటీవల వస్తున్న భారీ మార్పులవల్ల అవి వాటి ప్రాసంగికతను కోల్పోతున్నాయి. సంఘంగా జట్టుకట్టడం ఎందుకు తగ్గు తుందో తెలుసుకోవాలంటే, కార్మిక సంఘాల ఆర్థిక శాస్త్రాన్ని తెలుసుకోవడం అవశ్యం. డిమాండ్, సప్లయ్ రెండూ కూడా ఒక లేబర్ మార్కె ట్లో సంఘానికి చోటివ్వగల ఉద్యోగాలను నిర్ణయిస్తాయి. అధిక వేతనం, నిరుద్యోగిత లేకుండా చేయడాన్ని గనక యూనియన్ వాగ్దానం చేస్తే కార్మికులు యూనియన్ కాగ లిగే ఉద్యోగాలను డిమాండ్ చేస్తారు. కార్మికశక్తిని వ్యవస్థీ కృతం చేయడానికయ్యే ఖర్చులు, కొన్ని తరహా యూని యన్ కార్యక్రమాలను నియంత్రించే లేదా నిషేధించే చట్టసంబంధ వాతావరణం, ఉమ్మడి బేరసారాల్ని ఎంత బలంగా కంపెనీ నిరోధించగలదన్న సంగతి, సంస్థకు వచ్చే అధిక లాభాలను యూనియన్ ఎంత సమర్థతతో పొంద గలదు– అన్నవి సప్లయ్లవైపు కారకాలు అవుతాయి. నిర్మాణం, తయారీ, రవాణా లాంటి రంగాలు కార్మిక సంఘాలుగా కూడటానికి అనువుగా ఉంటాయి. వ్యవ సాయం, ఆర్థిక రంగాల్లో ఈ వీలు తక్కువ. అత్యధిక అవుట్‌పుట్‌ను కొన్ని కంపెనీలే ఉత్పత్తి చేసే పక్షంలోనూ సంఘాలకు వీలుంటుంది. ఎందుకంటే కంపెనీల మార్కెట్ శక్తి చాలావరకు కార్మిక సంక్షేమానికి నష్టకరం గానే ఉంటుంది కాబట్టి. అలాంటి చోట సంస్థలు పొందే అధిక లాభాల్లో కొంత వాటాను యూనియన్లు తమ కార్మి కుల కోసం రాబట్టగలవు. స్థూల ఆర్థిక పరిస్థితులు, న్యాయ వాతావరణం కూడా సంఘాలు కాగలగడాన్ని ప్రభావితం చేస్తాయి. నిరుద్యో గిత శాతం ఎక్కువగా ఉండి, కార్మికులు ఉద్యోగ అభద్రత నుంచి బయటపడాలని అనుకున్నప్పుడు సంఘం ఏర్పడా లన్న డిమాండ్ పెరుగుతుంది. ద్రవ్యోల్బణం అధికంగా ఉండి, వాస్తవిక వేతనాలు తగ్గుముఖం పట్టినప్పుడు కూడా సంఘంగా కూడే శాతం పెరుగుతుంది. ఇక సంస్థ– యూనియన్ సంబంధాన్ని నియంత్రించే కార్మిక చట్టాలు కూడా యూనియన్ కావడాన్ని ప్రభావితం చేస్తాయి. ముందు చెప్పినవన్నీ కూడా 1960–70 మధ్య కాలంలో యూనియన్లు వ్యాప్తి చెందడానికి కారణమయ్యాయి. సరళీకరణ అనంతర దశలో అన్ని పరిశ్రమల్లోనూ కార్మిక సంఘాలు తగ్గిపోవడానికి చాలా కారణాలు పని చేశాయి. ఆర్థిక వ్యవస్థ వ్యవస్థీకృత మార్పులకు లోనై సర్వీసు రంగం ముందువరుసలోకి వచ్చింది. ఈ మూడవ రంగంలో యూనియన్లు తమ ప్రాధాన్యతను దాదాపుగా కోల్పోయాయి. సంఘంగా జట్టు కాలేని ఉద్యోగాలను సంఘపు ఉద్యోగాలుగా మార్చడం కష్టతరం అవుతున్న కొద్దీ కూడా యూనియన్ల శాతం తగ్గిపోయింది. పర్మనెంట్ ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుండటం కూడా కార్మిక సంఘాల పాత్రను పరిమితం చేస్తోంది. గత కొన్ని దశా బ్దాలుగా ఎన్నో వస్తూత్పత్తి సంస్థలు కార్మిక హక్కులకు రక్షణ కల్పించే కార్మిక చట్టాలను తప్పించుకోవడానికి కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులను నియమించుకు న్నాయి. అనిశ్చితి కలిగిన కాంట్రాక్టు గుణంవల్ల ఈ కార్మి కులు ఒక సంఘంగా ఏర్పడలేరు. 2020 వరకూ కూడా ఈ కారణాలు కార్మిక సంఘా లను దాదాపుగా ప్రభావశీలం కానివిగా మార్చేశాయి. దీనికితోడు గతేడాది కేంద్ర ప్రభుత్వం శాసనం చేసిన కొత్త కార్మిక చట్టాలు వారి సమస్యలను మరింత పెంచాయి. ఎన్నో వెసులుబాట్లతో కూడిన ఈ చట్టాలు ఇక యూని యన్లను ఉండీ లేనట్టుగా మార్చేశాయి. ఉదాహరణకు, మేనేజ్మెంట్తో ఒప్పందాలు కుదుర్చుకోవడంలో సమ్మె అనేది ఒక గట్టి ఆయుధంగా ఉండేది. కానీ కాలక్రమంలో చట్టాలు, విధివిధానాలు కార్మిక సంఘాలు సమ్మెకు వెళ్ల గలిగే శక్తిని తీవ్రంగా నీరుగార్చాయి. ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్(ఐఆర్సీ) 2020లో ప్రభుత్వం సమ్మెల మీద చాలా ఆంక్షలను విధిస్తూ, లేఆఫ్‌లు, ఉద్యోగుల తగ్గింపు విషయంలో మాత్రం పరి శ్రమల వైపు మొగ్గుచూపింది. దీనివల్ల ప్రభుత్వ అనుమతి లేకుండానే ఉద్యోగులను తీసుకోవడం, తీసేయడం (హైరింగ్ అండ్ ఫైరింగ్) సులభతరం అవుతుంది. ఐఆర్సీ ప్రతిపాదన ప్రకారం, ఒక పరిశ్రమలో పని చేస్తున్న ఏ వ్యక్తి కూడా 60 రోజుల ముందస్తు నోటీసు ఇవ్వకుండా; ట్రిబ్యునల్ లేదా నేషనల్ ఇండస్ట్రియల్ ట్రిబ్యునల్ ముందు వాదనలు పెండింగులో ఉన్నప్పుడూ; ఆ వ్యవహారం ముగిసిన 60 రోజుల వరకూ కూడా సమ్మెకు దిగకూడదు. గతంలో కార్మికులు రెండు నుంచి ఆరు వారాల నోటీసు ఇచ్చి సమ్మెకు దిగగలిగేవాళ్లు. ఇప్పుడు మెరుపు సమ్మెలు చట్టవ్యతిరేకం. మొదటిసారిగా కార్మిక సంఘాలను అధికారికంగా గుర్తించిన ఐఆర్సీలో, సంప్రదింపుల యూనియన్ లేదా సంప్రదింపుల సమితి పేరుతో కొత్త భావనను పరిచయం చేశారు. ఒకవేళ ఆ కంపెనీలో ఒకే యూనియన్ కర్తృత్వంలో ఉన్న పక్షంలో, దాన్ని కార్మికుడి తరఫున సంప్రదింపులు జరిపే ఏకైక యూనియన్‌గా కంపెనీ గుర్తిస్తుంది. ఎక్కువ సంఘాలు గనక ఉనికిలో ఉంటే, కంపెనీ హాజరు పట్టీలోని 51 శాతం ఉద్యోగులతో సంబంధం ఉన్నది మాత్రమే కార్మి కుడి తరఫున చర్చలు జరిపే ఏకైక యూనియన్ అవు తుంది. ఒకవేళ ఏ యూనియన్లోనూ సంస్థ హాజరు పట్టీ లోని 51 శాతం ఉద్యోగులు లేనిపక్షంలో ఆ సంస్థే ఒక చర్చల సమితిని నియమిస్తుంది. ఈ కొత్త కార్మిక చట్టాలు ఎలా కార్మికుల హక్కులను కాపాడతాయి అనేది స్పష్టంగా తెలియకపోయినా, వ్యాపార లావాదేవీలను సులభతరం చేయడంలోనూ, కాంట్రాక్టు లేబర్‌ను పెంచడంలోనూ మాత్రం పని కొస్తాయి. కాంట్రాక్ట్ లేబర్లకు సంబంధించిన నియమావళి మరింతగా కార్మిక సంఘాల ఉనికిని కుంచింపజేస్తోంది.అయితే ఈ కొత్త తరం నవీన ఆర్థిక వ్యవస్థలో కూడా కార్మిక సంఘాలు ప్రాధాన్యత గల పాత్ర పోషించే అవ కాశం ఉంది. ఆఖరికి భారీ ఏనుగుల్లాంటి అమెజాన్, గూగుల్లోనూ యూనియన్లు ఉన్నాయి. ఈ కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి కార్మిక సంఘాలు కొత్త వ్యవహార పద్ధతు లను అవలంబించాలి, సాంకేతికంగా తమను కాలాను గుణంగా మార్చుకోవాలి, రాజకీయంగా తక్కువ ప్రభా వితం కావాలి. అలాగే పాత ప్రపంచ సంప్రదాయాలు, పనితీరు విషయంలో పూర్తి భిన్నంగా ఉన్న కొత్త తరం కార్మికుడి పరిభాషను మాట్లాడాలి. -సీతాకాంత్ పాండా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్, ఐఐటీ భిలాయ్ -
ఏపీ: కరోనా తగ్గుముఖం పట్టింది..
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టిందని, వైరస్ తీవ్రత వచ్చే నెల నాటికి మరింతగా తగ్గే అవకాశం ఉందని వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డా.కె.ఎస్.జవహర్‌రెడ్డి అన్నారు. టీటీడీ ఈవోగా బదిలీపై వెళుతున్న నేపథ్యంలో ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా చివరిసారి గురువారం మీడియాతో మాట్లాడారు. కరోనా విషయంలో అజాగ్రత్తగా ఉంటే ప్రమాదమేనని, ఎవరికి వారు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. మాస్కులు, శానిటైజర్, భౌతిక దూరం.. ఈమూడే కోవిడ్ నియంత్రణకు సూత్రాలని చెప్పారు. ఇటీవలి కాలంలో పోస్ట్ కరోనా (కరోనా వచ్చి తగ్గాక) సమస్యలు వస్తున్నాయని, ముందస్తు జాగ్రత్తే మంచిదని సూచించారు. భారీగా నియామకాలు, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం చేయూతనివ్వడం వల్లే దేశంలోనే ఏపీ కోవిడ్ నియంత్రణలో ముందంజలో ఉందని తెలిపారు. (చదవండి: ఎమ్మెల్యే భూమనకు మరోసారి కరోనా) స్కూళ్లకు వెళ్లే ప్రతి విద్యార్థి మాస్కు ధరించాలన్నారు. వీలైతే వరండాల్లో, చెట్ల కింద పాఠాలు చెప్పడం మంచిదని సూచించారు. చాలా రాష్ట్రాల్లో వైరస్ నియంత్రణకు మౌలిక వసతుల కల్పన కేంద్రీకృతంగా చేశారు, కానీ మన రాష్ట్రంలో అన్ని జిల్లాల్లోనూ వికేంద్రీకరణ చేసి, విస్తరించడం వల్లే నియంత్రణ సాధ్యమైందని తెలిపారు. 17 శాతమున్న పాజిటివిటీ రేటు ఇప్పుడు 7కు చేరిందని, కొద్ది రోజుల్లోనే 5 కంటే తగ్గిపోతుందని అంచనా ఉందని వెల్లడించారు. అనంతరం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో జవహర్‌రెడ్డి పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్‌ను కలిసిన జవహర్‌రెడ్డి టీటీడీ నూతన ఈవోగా నియమితులైన కేఎస్ జవహర్‌రెడ్డి.. టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని టీటీడీ చైర్మన్ కార్యాలయంలో గురువారం ఇరువురు భేటీ అయ్యారు. ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలతో పాటు, పలు అంశాలను వారు ఈ సందర్భంగా చర్చించుకున్నారు. -
భారత్‌లో తగ్గిన శిశు మరణాలు
ఐక్యరాజ్యసమితి: భారత్‌లో శిశుమరణాలు తగ్గుముఖం పట్టాయని ఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడించింది. 1990–2019 మధ్యలో శిశు మరణాలు భారీగా తగ్గినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా నమోదయ్యే అయిదేళ్లలోపు చిన్నారుల మరణాల్లో మూడో వంతు నైజీరియా, భారత్‌లో సంభవిస్తున్నాయని తెలిపింది. ‘చైల్డ్ మోర్టాలిటీ లెవల్స్, ట్రెండ్స్ 2020’ పేరుతో ఐరాస నివేదికను విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా 1990లో అయిదేళ్ల లోపు చిన్నారులు 1.25 కోట్ల మంది మరణిస్తే 2019 నాటికి వారి సంఖ్య 52 లక్షలకి తగ్గింది. అదే భారత్‌లో 34 లక్షల నుంచి 8 లక్షల 24వేలకి తగ్గింది. ► భారత్‌లో 1990లో అయిదేళ్ల వయసులోపు పిల్లల్లో ప్రతీ వెయ్యి మందిలో 126 మంది మరణిస్తే, 2019 సంవత్సరం నాటికి ఆ సంఖ్య 34కి తగ్గింది. ► ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మినహా మధ్య, దక్షిణాసియా దేశాల్లో అయిదేళ్ల లోపు చిన్నారుల మరణాలు తగ్గుముఖం పట్టాయి. ► అత్యధికంగా శిశు మరణాలు సంభవిస్తున్న దేశాల్లో సబ్ సహారా ఆఫ్రికా, మధ్య, దక్షిణాసియా దేశాలే ఉన్నాయి. ► సగానికి పైగా శిశు మరణాలు నైజీరియా, భారత్, పాకిస్తాన్, కాంగో, ఇథియోపియా దేశాల నుంచే నమోదయ్యాయి. -
మౌలికం ఉత్పత్తులు పూర్తిగా డౌన్
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కట్టడిపరమైన లాక్డౌన్ అమలు నేపథ్యంలో ఎనిమిది మౌలిక పరిశ్రమల ఉత్పత్తి వరుసగా మూడో నెలలో కూడా క్షీణత నమోదు చేసింది. మేలో 23.4 శాతం క్షీణించింది. 2019 మేలో ఎనిమిది రంగాల ఉత్పత్తి 3.8 శాతం మేర వృద్ధి నమోదు చేసింది. కేంద్ర వాణిజ్య శాఖ మంగళవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఎరువుల పరిశ్రమ మినహా మిగతా ఏడు రంగాలన్నీ (బొగ్గు, ముడిచమురు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఉక్కు, సిమెంటు, విద్యుత్) మేలో ప్రతికూల వృద్ధే కనపర్చాయి. 2020–21 ఏప్రిల్–మే మధ్యకాలంలో మౌలిక రంగాల ఉత్పత్తి 30 శాతం క్షీణించింది. గతేడాది ఇదే వ్యవధిలో 4.5 శాతం వృద్ధి సాధించింది. ‘ఏప్రిల్, మే నెలల్లో దేశవ్యాప్త లాక్డౌన్ విధించిన నేపథ్యంలో బొగ్గు, సిమెంటు, ఉక్కు, సహజ వాయువు, రిఫైనరీ, ముడిచమురు తదితర పరిశ్రమల ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది‘ అని వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. క్షీణత తగ్గుముఖం పడుతోంది.. మే గణాంకాల బట్టి చూస్తే ఉత్పత్తి క్షీణత గణనీయంగా తగ్గినట్లు కనిపిస్తోందని రేటింగ్ ఏజెన్సీ ఇక్రా ప్రిన్సిపల్ ఎకానమిస్ట్ అదితి నాయర్ తెలిపారు. ‘ ఏప్రిల్‌లో పారిశ్రామికోత్పత్తి 55.5 శాతం క్షీణించింది. ఈ ధోరణుల ప్రకారం చూస్తే మేలో ఇది 35–45 శాతం మాత్రమే నమోదయ్యే అవకాశం ఉంది‘ అని పేర్కొన్నారు. పారిశ్రామికోత్పత్తి సూచీలో ఈ ఎనిమిది రంగాల వాటా 40.27 శాతంగా ఉంటుంది. వీటి ఉత్పత్తి ఏప్రిల్‌లో రికార్డు స్థాయిలో ఏకంగా 37 శాతం క్షీణించింది. తాజాగా మేలో బొగ్గు (14 శాతం క్షీణత), సహజ వాయువు (16.8 శాతం), రిఫైనరీ ఉత్పత్తులు (21.3 శాతం), ఉక్కు (48.4 శాతం), సిమెంటు (22.2 శాతం), విద్యుదుత్పత్తి (15.6 శాతం) క్షీణించాయి. -
వృద్ధి పరుగే ప్రధాన లక్ష్యం
న్యూఢిల్లీ: భారత్ ఇప్పటికీ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని, డీమోనిటైజేషన్ (నోట్ల రద్దు) తాలూకు ప్రభావం ఆర్థిక రంగంపై లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం రాజ్యసభకు చెప్పారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో భాగంగా ఎదురైన ప్రశ్నలకు ఆమె స్పందించారు. తయారీ రంగంలో కొంత క్షీణత ఉందని, అయితే, ఇది నోట్ల రద్దు వల్ల కాదన్నారు. ప్రభుత్వ ఎజెండాలో ఆర్థిక వృద్ధి ఎంతో ప్రాధాన్య అంశంగా ఉందని చెప్పారు. జీడీపీ వృద్ధి పెంపు కోసం ఎన్నో రంగాల్లో సంస్కరణలను చేపట్టడం జరుగుతోందన్నారు. 2018–19 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి మోస్తరుగా ఉండడానికి వ్యవసాయం, అనుబంధ రంగాలు, వాణిజ్యం, హోటల్, రవాణా, స్టోరేజ్, కమ్యూనికేషన్, ప్రసార సేవల రంగాల్లో వృద్ధి తక్కువగా ఉండడమేనని చెప్పారు. ‘‘ముఖ్యంగా కొన్ని రంగాల్లో తక్కువ వృద్ధి ఆర్థిక వృద్ధిపై ప్రభావం చూపించింది. వ్యవసాయం, అనుబంధ రంగాలు, ఫైనాన్షియల్, రియల్ ఎస్టేట్, నైపుణ్య సేవల్లో ఈ పరిస్థితి నెలకొంది’’ అని మంత్రి వివరించారు. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో వృద్ధి రేటు పడిపోయిందని, పరిస్థితిని మెరుగుపరిచేందుకు చర్యలను కూడా అమల్లో పెట్టినట్టు చెప్పారు. ఈ విషయంలో సభ్యుని ఆందోళనను అర్థం చేసుకోగలనన్నారు. అయినా కానీ, ఇప్పటికీ భారత్ వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగానే ఉన్నట్టు చెప్పారు. అమెరికా వృద్ధి రేటు 2016–2019 మధ్య 1.6 శాతం నుంచి 2.3 శాతం మధ్య ఉంటే, చైనా వృద్ధి 6.7 శాతం నుంచి 6.3 శాతానికి పడిపోయిందని, కానీ, దేశ వృద్ధి రేటు 7 శాతానికి పైనే ఉన్నట్టు చెప్పారు. రైతులందరికీ ఆదాయం... కిసాన్ సమ్మాన్ యోజన, పెన్షన్ యోజన కార్యక్రమాలను ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగమని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు. మోదీ సర్కారు రెండో విడత పాలనలో చేపట్టిన కీలక సంస్కరణ... పీఎం కిసాన్ యోజన కింద రైతులందరికీ రూ.6,000 చొప్పున ఆదాయం అందించనున్నట్టు చెప్పారు. గతంలో ఇది రెండు హెక్టార్ల రైతులకే పరిమితం చేశారు. దీనికి తోడు చిన్న, సన్నకారు రైతులు, చిన్న వర్తకులకు స్వచ్ఛంద పెన్షన్ పథకాన్ని కూడా తీసుకొచ్చినట్టు మంత్రి చెప్పారు. వృద్ధి విషయమై మరింత దృష్టి పెట్టేందుకు ప్రధాని అద్యక్షతన ఐదుగురు సభ్యులతో పెట్టుబడులు, వృద్ధిపై కేబినెట్ కమిటీని ఏర్పాటు చేసినట్టు తెలిపారు. జీఎస్టీ, ఎఫ్‌డీఐ నిబంధనలు సరళతరం సహా పూర్వపు ఐదేళ్ల కాలంలో చేపట్టిన సంస్కరణలను కూడా మంత్రి గుర్తు చేశారు. నోట్ల రద్దుతో సానుకూల ఫలితాలు రూ.500, రూ.1,000 నోట్ల డీమోనిటైజేషన్ వల్ల సానుకూల ఫలితాలు ఉన్నట్టు మంత్రి చెప్పారు. అక్రమ ధనం ఉగ్రవాదులకు పెద్ద ఎత్తున నిధుల సాయంగా వెళ్లేదని, నోట్ల రద్దు తర్వాత ఉగ్రవాదుల వద్ద ఉన్న డబ్బంతా పనికిరాకుండా పోయిందన్నారు. అలాగే, డిజిటల్ లావాదేవీలు కూడా పెద్ద ఎత్తున పెరిగాయన్నారు. బ్యాంకు మోసాలు తగ్గాయి బ్యాంకుల్లో రూ.లక్ష., అంతకుమించిన మోసాలు 2018–19లో 6,735 తగ్గినట్టు మంత్రి చెప్పారు. ఈ మోసాల వల్ల పడిన ప్రభావం రూ.2,836 కోట్లుగా ఉంటుందన్నారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం 2017–18లో 9,866 మోసం కేసులు (రూ.4,228 కోట్లు) నమోదైనట్టు తెలిపారు. -
కారు.. బేజారు!
న్యూఢిల్లీ: దేశీ వాహన రంగం ప్రతికూల వాతావరణంలో ప్రయాణిస్తోంది. వరుసగా పదో నెలలోనూ కార్ల విక్రయాలు క్షీణతను నమోదుచేశాయి. ఈ విభాగంలోనే మార్కెట్ లీడరైన మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ) జూన్ దేశీ అమ్మకాలు ఏకంగా 15.3% తగ్గిపోయాయి. కంపెనీ మినీ సెగ్మెంట్ 36.2% క్షీణించింది. వినియోగదారుల సెంటిమెంట్ బలహీనపడిన నేపథ్యంలో దేశీ ఆటో పరిశ్రమ అమ్మకాల్లో తగ్గుదల నమోదవుతూనే ఉందని టయోటా కిర్లోస్కర్ మోటార్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ రాజా అన్నారు. ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం, రుతుపవనాలపై అనిశ్చితి, అధిక వడ్డీ, ద్రవ్య లభ్యత సమస్య, బీఎస్–సిక్స్ అమలు వంటి ప్రతికూల అంశాలు సెంటిమెంట్‌ను బలహీనపర్చాయన్నారు. మొత్తం ఆటో ఇండస్ట్రీ కంటే పీవీ అమ్మకాల పరంగా సెంటిమెంట్ మరింత బలహీనంగా ఉందని ఎం అండ్ ఎం ప్రెసిడెంట్ (ఆటోమోటివ్ సెక్టార్) రాజన్ వాధేరా అన్నారు. పరిశ్రమ ఇప్పటికీ ఒత్తిడిలోనే కొనసాగుతుండగా.. మార్కెట్ మాత్రం త్వరలోనే కోలుకోవచ్చని చెప్పారు. -
హ్యాండిచ్చిన ట్విటర్ అధికారులు
సాక్షి, న్యూఢిల్లీ : సమాచార సాంకేతికపై ఏర్పాటు చేసిన పార్లమెంటరీ ప్యానెల్ సమావేశానికి ట్వీటర్ సీఈవో, ఇతర అధికారులు గైర్హాజరు కానున్నారు. కమిటీ ముందు హాజరు కావడానికి తమకు సమయం తక్కువగా వుందంటూ ఈ ప్రతిపాదనను ట్విటర్ అధికారులు తిరస్కరించారు. ఈ మేరకు ట్విటర్ ప్రతినిధి విజయా గద్దే ఫిబ్రవరి 7న బీజేపీ ఎంపి అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలోని పార్లమెంటరీ పార్లమెంటరీ కమిటీకి ఒక లేఖ రాశారు. సామాజిక మాధ్యమ వేదికల్లో పౌరుల హక్కుల రక్షణ కోసం లోక్‌సభ సభ్యుడు అనురాగ్ ఠాకూర్ నేతృత్వంలో ఒక కమిటీనీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. ఈ మేరకు ట్విటర్ సీఈవో జాక్ డోర్సే సహా మరోటాప్ అధికారి హాజరు కావాలని పార్లమెంటరీ ఐటీ కమిటీ సమన్లు జారీ చేసింది. వీరితో ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ప్రతినిధును కమిటీ ఆదేశించింది. ఫిబ్రవరి 1న సమావేశానికి హాజరు కావాలని కమిటీ అధికారిక లేఖ రాసింది. ఫిబ్రవరి 7వ తేదీన జరగనున్న సమావేశం అజెండాను ఠాకూర్ ట్వీట్ చేశారు. ఈ అంశంపై సాధారణ ప్రజల అభిప్రాయాలు, సమీక్షలను కూడా కోరతామని ఆయన పేర్కొన్నారు. అయితే ఆ తరువాత ఈ సమాశం ఫిబ్రవరి 11వ తేదీకి వాయిదా పడింది. కాగా సోషల్ మీడియా వేదికల్లో యూజర్ల డేటా భద్రతపై చెలరేగుతున్న ఆందోళనలు, రానున్న ఎన్నికలు నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. మరోవైపు ట్విటర్ డేటా భద్రతపై గ్లోబల్‌గా విచారణను ఎదుర్కొంటోంది. ఈ కోవలో అమెరికా, సింగపూర్, ఈయూ తర్వాత, ఇండియా నాలుగదేశంగా నిలిచింది. -
బ్యాంకుల్లో తగ్గిన ఫండ్స్ పెట్టుబడులు
న్యూఢిల్లీ: మార్కెట్లో కరెక్షన్ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగ స్టాక్స్‌లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు సెప్టెంబర్‌లో 21,600 కోట్ల మేర తగ్గిపోయాయి. సెప్టెంబర్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు రూ.1,88,620 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు నెల ఆగస్టు నాటికి రూ.2,10,251 కోట్లుగా ఉండటం గమనార్హం. జూన్ నుంచి చూసుకుంటే ఇదే తక్కువ. జూన్‌లో బ్యాంక్స్టాక్స్లో ఫండ్స్ పెట్టుబడులు 1.87 లక్షల కోట్లుగా ఉండటం గమనార్హం. శాతం వారీగా చూసుకుంటే ఫండ్స్ మొత్తం పెట్టుబడుల్లో బ్యాంకింగ్ రంగంలో ఎక్స్పోజర్ సెప్టెంబర్ నాటికి 19.78 శాతంగా ఉంది. మ్యూచువల్ ఫండ్స్ పథకాలు పెట్టుబడుల తగ్గింపు కంటే మార్కెట్ కరెక్షన్ కారణంగానే పెట్టుబడుల శాతం ఎక్కువగా తగ్గినట్టు ఫండ్స్ఇండియా రీసెర్చ్ హెడ్ విద్యాబాల తెలిపారు. సెప్టెంబర్‌లో బీఎస్ఈ బ్యాంకెక్స్ 12 శాతం పడిపోయిన విషయం గమనార్హం. అయినప్పటికీ ఫండ్ మేనేజర్లకు ఇప్పటికీ బ్యాంకింగ్ మిక్కిలి ప్రాధాన్య రంగంగానే కొనసాగుతోంది. ఆ తర్వాత ఫైనాన్స్ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫైనాన్స్ రంగ స్టాక్స్‌లో రూ.87,519 కోట్ల పెట్టుబడులు కలిగి ఉండగా, సాఫ్ట్వేర్ రంగ స్టాక్స్‌లో రూ.88,453 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. నాన్ డ్యూరబుల్స్, ఆటోమొబైల్ రంగాలకు ఆ తర్వాత ప్రాధాన్యం ఇచ్చారు. -
21 నెలల కనిష్టానికి సూచీలు
♦ 262 పాయింట్ల నష్టంతో ♦ 23,759 పాయింట్లకు సెన్సెక్స్ కంపెనీల ఆర్థిక ఫలితాలు నిరాశాజనకంగా ఉంటున్న నేపథ్యంలో భారీ ఎత్తున అమ్మకాలు వెల్లువెత్తాయి. దీనితో బుధవారం దేశీ స్టాక్ మార్కెట్ గణనీయంగా నష్టపోయింది. బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 21 నెలల కనిష్టానికి క్షీణించాయి. సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే బుధవారం మరింత తక్కువగా 23,938 పాయింట్ల వద్ద ప్రారంభమై ఒక దశలో 23,637 పాయింట్ల స్థాయికి కూడా క్షీణించింది. చివరికి 262 పాయింట్ల నష్టంతో (దాదాపు 1%) దాదాపు 21 నెలల కనిష్టమైన 23,759 పాయింట్ల వద్ద ముగిసింది. 2014 మే 12న సెన్సెక్స్ చివరిసారిగా 23,551 వద్ద ముగిసింది. ఆ తర్వాత ఇదే కనిష్టం. అటు నిఫ్టీ కూడా 82 పాయింట్లు (1.13శాతం) తగ్గి 21 నెలల కనిష్టం 7,216 వద్ద ముగిసింది. చివరిసారిగా 2014 మే 16 నిఫ్టీ 7,203 పాయింట్ల స్థాయిలో ముగిసింది. బ్యాంకింగ్ షేర్లు భారీగా నష్టపోయాయి. బీఎస్ఈలో బ్యాంకింగ్ స్టాక్స్ సూచీ 2 శాతం పైగా క్షీణిం చింది. కాగా మందగమనం భయాలతో ఆసియా మార్కెట్లు బలహీనంగానే ముగిశాయి. జపాన్‌కి చెందిన నికాయ్ 2.31% నష్టపోయింది. క్రితం రోజున ఇది 5.41% పడింది. సింగపూర్ స్ట్రెయిట్ టైమ్స్ కూడా 1.57% తగ్గింది. వరుసగా ఏడు సెషన్ల పాటు తగ్గిన యూరప్ సూచీలు మాత్రం మెరుగ్గా ట్రేడయ్యాయి. బలహీనంగానే భారత్ ఆర్థిక వ్యవస్థ: డాయిష్ బ్యాంక్ న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ బలహీన ధోరణిలోనే ఉందని ప్రపంచ ఆర్థిక సేవల దిగ్గజం డాయిష్ బ్యాంక్ నివేదిక పేర్కొంది. 7 శాతం పైగానే వృద్ధి రేటు నమోదవుతున్నా... ఆర్థిక వృద్ధి ధోరణి మాత్రం బలహీనంగానే కనిపిస్తోందని విశ్లేషించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి రేటు 7.6 శాతం ఉంటుందని కేంద్ర గణాంకాల కార్యాలయం అంచనావేస్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితి భిన్నంగా ఉందని తెలిపింది. పలు సర్వేలు, గణాంకాలు ఆర్థిక వ్యవస్థ బలహీనతలను తెలియజేస్తున్నాయని బ్యాంక్ నివేదిక వెల్లడించింది. కాగా బడ్జెట్ అనంతరం ఆర్బీఐ రెపో రేటు పావుశాతం తగ్గుతుందని జపాన్ బ్రోకరేజ్ సంస్థ నొమురా అంచనా వేసింది.