ఎగుమతులు 3 శాతం డౌన్‌.. | India goods exports decline 2. 6percent in September | Sakshi
Sakshi News home page

ఎగుమతులు 3 శాతం డౌన్‌..

Published Sat, Oct 14 2023 4:16 AM | Last Updated on Sat, Oct 14 2023 9:30 AM

India goods exports decline 2. 6percent in September - Sakshi

న్యూఢిల్లీ: ఈ ఏడాది సెసెప్టెంబర్‌లో ఎగుమతులు 2.6 శాతం క్షీణించి 34.47 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. గతేడాది ఇదే వ్యవధిలో ఎగుమతులు 35.39 బిలియన్‌ డాలర్లు. కమోడిటీల ధరలు తగ్గుముఖం పట్టడంతో వరుసగా 10వ నెల దిగుమతుల భారం కాస్త తగ్గింది.  శుక్రవారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ..  దిగుమతులు 15% క్షీణించి 53.84 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

గత సెసెప్టెంబర్‌లో ఇవి 63.37 బిలియన్‌ డాలర్లు. సెప్టెంబర్‌లో దేశ వాణిజ్య లోటు 19.37 బిలియన్‌ డాలర్లకు దిగి వచి్చంది.  ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌–సెసెప్టెంబర్‌ మధ్య కాలంలో ఎగుమతులు 8.77% క్షీణించాయి. 211.4 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. ఇదే వ్యవధిలో దిగుమతులు 12.23% తగ్గి 326.98 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఫలితంగా వాణిజ్య లోటు 115.58 బిలియన్‌ డాలర్లుగా ఉంది.  

ఎగుమతులపై ఆశాభావం..
అంతర్జాతీయంగా సవాళ్లు నెలకొన్నప్పటికీ సెసెప్టెంబర్‌ గణాంకాలు ఎగుమతులపరంగా ఆశావహ అవకాశాలను సూచిస్తున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ కార్యదర్శి సునీల్‌ బరత్‌వాల్‌ తెలిపారు. మిగతా ఆరు నెలల్లో ఎగుమతులు సానుకూల వృద్ధి నమోదు చేయగలవని ఆశాభావం వ్యక్తం చేశారు. ఏప్రిల్, మే, జూన్, జూలైలో క్షీణత రెండంకెల స్థాయిలో ఉండగా.. ప్రస్తుతం సింగిల్‌ డిజిట్‌ స్థాయికి దిగి వచి్చందని సునీల్‌ పేర్కొన్నారు. 2023లో అంతర్జాతీయంగా వాణిజ్యం 0.8 శాతమే పెరగవచ్చని వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ అంచనా వేసినప్పటికీ ఎగుమతులపరంగా భారత్‌ మెరుగ్గా రాణిస్తోందని సునీల్‌ చెప్పారు.

ఆగస్టు గణాంకాల సవరణ..
కేంద్రం ఆగస్టు ఎగుమతుల గణాంకాలను 34.48 బిలియన్‌ డాలర్ల నుంచి 38.45 బిలియన్‌ డాలర్లకు సవరించింది. అలాగే దిగుమతులను 58.64 బిలియన్‌ డాలర్ల నుంచి 60.1 బిలియన్‌ డాలర్లకు మార్చింది. సెసెప్టెంబర్‌ 15న విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆగస్టులో ఎగుమతులు అంతక్రితం ఏడాది అదే వ్యవధితో పోలిస్తే 6.86 శాతం క్షీణించినట్లు నమోదు కాగా.. తాజా సవరణతో
3.88 శాతం పెరిగినట్లయ్యింది.

మరిన్ని విశేషాలు..
► గత నెల ఎగుమతులకు సంబంధించి 30 కీలక రంగాల్లో 12 రంగాలు సానుకూల వృద్ధిని నమోదు చేశాయి. ముడిఇనుము, కాటన్‌ యార్న్, మాంసం, డెయిరీ, పౌల్ట్రీ, ఫార్మా, ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు వీటిలో ఉన్నాయి.
► దిగుమతులపరంగా చూస్తే 30లో 20 రంగాలు ప్రతికూల వృద్ధి కనపర్చాయి. వెండి, ఎరువులు, రవాణా పరికరాలు, బొగ్గు, విలువైన రాళ్లు, క్రూడ్, రసాయనాలు, మెషిన్‌ టూల్స్‌ వీటిలో ఉన్నాయి.
► చమురు దిగుమతులు 20.32 శాతం క్షీణించి 14 బిలియన్‌ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో దిగుమతులు 22.81 శాతం తగ్గి 82.3 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. అటు పసిడి దిగుమతులు 7% పెరిగి 4.11 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ప్రథమార్ధంలో 9.8% పెరిగి 22.2 బిలియన్‌ డాలర్లకు చేరాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement