ముంబై: ప్రపంచంలోనే అత్యంత చౌక స్మార్ట్‌ఫోన్‌గా పేర్కొన్న జియోఫోన్ నెక్ట్స్ లాంఛింగ్ వాయిదా పడిన విషయం తెలిసిందే. రిలయన్స్ 44 ఏజీఎం సమావేశంలో వినాయక చవితికి తమ ఫోన్‌ను లాంఛ్ చేస్తామని కంపెనీ చైర్మన్ ముఖేశ్ అంబానీ పేర్కొన్నారు. కాగా ఈ ఫోన్‌ను దీపావళి పండుగకు లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది. తాజాగా జియోఫోన్‌నెక్ట్స్ లాంచ్ రిలయన్స్‌కు పెద్ద తలనొప్పిగా మారింది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ వాయిదా పడడంతో రిలయన్స్ షేర్లు సోమవారం రోజున 2 శాతం మేర నష్టపోయాయి.
చదవండి: జియో నుంచి మరో సంచలనం..! త్వరలోనే లాంచ్..!
సోమవారం జరిగిన బీఎస్‌ఈ ఇంట్రా డే ట్రేడ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు 2 శాతం క్షీణించి రూ .2,382.85 వద్ద నిలిచింది. ట్రేడింగ్ ప్రారంభంలో రిలయన్స్ షేర్ విలువ రూ. 2425.60 వద్ద ఉండగా ట్రేడింగ్ ముగిసే సమయానికి సుమారు రూ. 55.80 మేర నష్టపోయి షేర్ విలువ రూ. 2,382.85 వద్ద నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమీకండక్టర్ కొరత కారణంగా జియోఫోన్‌నెక్ట్స్ లాంచింగ్ వాయిదా పడిందని వ్యాపార నిపుణులు అంచనా వేస్తున్నారు.
జియోఫోన్ నెక్ట్స్ స్మార్ట్‌ఫోన్‌ను రిలయన్స్, గూగుల్ కంపెనీలు కలిసి సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. మరింత మెరుగుదల కోసం రెండు కంపెనీలు పరిమిత వినియోగదారులతో జియోఫోన్ నెక్స్ట్ ను పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. దీపావళి పండుగ సీజన్‌లో ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు కంపెనీ చర్యలు తీసుకుంటుంది. స్మార్ట్‌ఫోన్ లాంచ్‌ను వాయిదా వేయడంతో వచ్చే అదనపు సమయం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమీకండక్టర్ కొరతను తగ్గించడంలో సహాయపడుతుందని జియో, గూగుల్ ఒక ప్రకటనలో పేర్కొంది.
Jiophone Next : రిలయన్స్ కొంపముంచిన జియోఫోన్..!
Published Mon, Sep 13 2021 6:03 PM | Last Updated on Mon, Sep 13 2021 9:58 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment