న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆరి్థక అనిశ్చితి పరిస్థితులు భారత్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దేశ జూలై ఎగుమతుల్లో (2022 ఇదే నెల గణాంకాలతో పోల్చి) అసలు వృద్ధిలేకపోగా 16 శాతం క్షీణించాయి. విలువలో 32.25 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. కీలక పెట్రోలియం, రత్నాలు–ఆభరణాలు, ఇతర కీలక రంగాల ఎగుమతులు భారీగా పడిపోయాయి. వాణిజ్య పరిశ్రమల శాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది.
దిగుమతులూ క్షీణతే..: ఇక దిగుమతుల విలువ కూడా జూలైలో 17% పడిపోయి 52.92 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 20.67 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2022 జూలైలో 25.43 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యలోటు తాజాగా దాదాపు 5 బిలియన్ డాలర్లకు తగ్గిపోవడం గమనార్హం.
నాలుగు నెలల్లోనూ..
ఈ ఏడాది (2022–23) ఏప్రిల్ నుంచి జూలై మధ్య ఎగుమతులు 14.5% పడిపోయి 136.22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 13.79 శాతం పడిపోయి 213.2 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి వాణిజ్యలోటు 76.98 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక ఈ నాలుగు నెలల్లో పసిడి దిగుమతులు 2.7% పెరిగి 13.2 బిలియన్ డాలర్లకు చేరాయి. చమురు దిగుమతుల బిల్లు 23.4% తగ్గి 55 బిలియన్ డాలర్లకు దిగివచి్చంది.
ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులపై మరిన్ని ఆంక్షలు ఉండబోవు: కేంద్రం
మరిన్ని ఎల్రక్టానిక్ వస్తువులపై దిగుమతి ఆంక్షలు విధించే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని వాణిజ్య కార్యదర్శి సునీల్ బరత్వాల్ తెలిపారు. చైనా వంటి దేశాల నుంచి దిగుమతులను తగ్గించడానికి అలాగే దేశీయ తయారీని పెంచడానికి నవంబర్ 1 నుండి ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, మరికొన్ని ఎల్రక్టానిక్ పరికరాలపై దిగుమతి ఆంక్షలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీకి ప్రొడక్షన్–లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్‌ఐ) పథకం వర్తిస్తుందని మంత్రి చెప్పారు.
జూలైలో ఎగుమతులు 16% డౌన్
Published Tue, Aug 15 2023 4:51 AM | Last Updated on Tue, Aug 15 2023 4:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment