Headwind
-
జూలైలో ఎగుమతులు 16% డౌన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయ ఆరి్థక అనిశ్చితి పరిస్థితులు భారత్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దేశ జూలై ఎగుమతుల్లో (2022 ఇదే నెల గణాంకాలతో పోల్చి) అసలు వృద్ధిలేకపోగా 16 శాతం క్షీణించాయి. విలువలో 32.25 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. కీలక పెట్రోలియం, రత్నాలు–ఆభరణాలు, ఇతర కీలక రంగాల ఎగుమతులు భారీగా పడిపోయాయి. వాణిజ్య పరిశ్రమల శాఖ తాజా గణాంకాలను విడుదల చేసింది. దిగుమతులూ క్షీణతే..: ఇక దిగుమతుల విలువ కూడా జూలైలో 17% పడిపోయి 52.92 బిలియన్ డాలర్లకు పడిపోయింది. దీనితో ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 20.67 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. 2022 జూలైలో 25.43 బిలియన్ డాలర్లుగా ఉన్న వాణిజ్యలోటు తాజాగా దాదాపు 5 బిలియన్ డాలర్లకు తగ్గిపోవడం గమనార్హం. నాలుగు నెలల్లోనూ.. ఈ ఏడాది (2022–23) ఏప్రిల్ నుంచి జూలై మధ్య ఎగుమతులు 14.5% పడిపోయి 136.22 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 13.79 శాతం పడిపోయి 213.2 బిలియన్ డాలర్లకు చేరాయి. వెరసి వాణిజ్యలోటు 76.98 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ఇక ఈ నాలుగు నెలల్లో పసిడి దిగుమతులు 2.7% పెరిగి 13.2 బిలియన్ డాలర్లకు చేరాయి. చమురు దిగుమతుల బిల్లు 23.4% తగ్గి 55 బిలియన్ డాలర్లకు దిగివచి్చంది. ఎలక్ట్రానిక్ వస్తువుల దిగుమతులపై మరిన్ని ఆంక్షలు ఉండబోవు: కేంద్రం మరిన్ని ఎల్రక్టానిక్ వస్తువులపై దిగుమతి ఆంక్షలు విధించే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని వాణిజ్య కార్యదర్శి సునీల్ బరత్వాల్ తెలిపారు. చైనా వంటి దేశాల నుంచి దిగుమతులను తగ్గించడానికి అలాగే దేశీయ తయారీని పెంచడానికి నవంబర్ 1 నుండి ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు, మరికొన్ని ఎల్రక్టానిక్ పరికరాలపై దిగుమతి ఆంక్షలు విధించాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. ఎలక్ట్రానిక్స్, మొబైల్ తయారీకి ప్రొడక్షన్–లింక్డ్ ఇన్సెంటివ్ (పీఎల్ఐ) పథకం వర్తిస్తుందని మంత్రి చెప్పారు. -
తీవ్ర తుపాను దిశగా ‘ఇటా’
మియామీ (యూఎస్): ఇటా తుపాను కరీబియన్‌లోని పలు ప్రాంతాలను బెంబేలెత్తిస్తోంది. ఇది సోమవారం నాటికి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఆదివారం ఉదయం గంటకు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచాయి. ఈ తుపాను మంగళవారం ఉదయానికి నికరాగ్వా, హోండూరస్ తీరాన్ని తాకుతుందని భావిస్తున్నారు. నికరాగ్వా, హోండూరస్, జమైకా, కేమన్ ఐలాండ్స్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. 53కు చేరిన టర్కీ భూకంప మృతులు ఇజ్మిర్: టర్కీలోని ఇజ్మిర్ పరిసర ప్రాంతాల్లో శుక్రవారం సంభవించిన భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య ఆదివారానికి 53కు చేరుకుంది. గాయపడిన వారి సంఖ్య 900 దాటింది. కూలిన భవనాల శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో 70 ఏళ్ల వృద్ధుడు ప్రాణాలతో బయటపడ్డాడు. శిథిలాల కింద దాదాపు 34 గంటలు గడిపిన అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
బాలరాజుకు ఎదురుగాలి
చింతపల్లి, న్యూస్‌లైన్: మాజీ మంత్రి బాలరాజుకు సొంత మండలంలోనే ఎదురుగాలి వీస్తోంది. ప్రతి ఎన్నికలల్లో ఆయనకు వెన్నుదన్నుగా ఉండే చింతపల్లి, గూడెం కొత్తవీధి మండలాల ప్రజలు ఈ ఎన్నికల్లో ఝలక్ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 2009 ఎన్నికల్లో బాలరాజు విజయంలో కీలకపాత్ర పోషించిన ఉద్యోగులు ఈసారి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమానికి దూరంగా ఉండడమే కాకుండా ఉద్యోగులను వేధించి తన నైజాన్ని బహిర్గతం చేసుకున్నారని ఆరోపిస్తున్నారు. బాలరాజు మంత్రిగా ఉన్నంత కాలం ఆయన సతీమణి పెత్తనం కూడా ఇబ్బందికరంగా ఉండేదన్న భావం చాలామందిలో ఉంది. 1989లో తొలిసారిగా చింతపల్లి ఎమ్మెల్యేగా గెలుపొందిన బాలరాజు కొద్ది రోజులకే ప్రజలు, ఉద్యోగుల వ్యతిరేకతను మూటకట్టుకున్నారు. అనుకూలంగా లేని ఉద్యోగులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువయ్యాయి. దాంతో ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమైంది. తర్వాత మూడు సార్లు జరిరగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చిత్తుగా ఓడారు. దాంతో రూట్ మార్చారు. గత ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి పడరాని పాట్లు పడ్డారు. ‘గతంలో తప్పుగా వ్యవహరించి ఉంటే మన్నించండి.. ఇకపై మారతాను.. నన్ను నమ్మండి’ అంటూ సమావేశాల్లో ఉద్యోగులను వేడుకున్నారు. మరీ ముఖ్యంగా మహానేత వైఎస్ పథకాల అండతో ఎమ్మెల్యే పదవి దక్కించుకున్నారు. కానీ ఎమ్మెల్యే అయ్యాక వెనకటి బుద్ధి చూపించారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఉద్యోగులు సమైక్యాంధ్ర కోసం ఉద్యమిస్తూ ఉంటే ఆయన అందుకు భిన్నమైన ధోరణిని అనురించిన సంగతిని వారు గుర్తు చేస్తున్నారు. చింతపల్లిలో జేఏసీ నేతల అరెస్ట్‌ల వెనుక ఆయన సూత్రధారిగా వ్యవహరించారన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంతా జరిగాక ఆయనకెలా మద్దతిస్తామని ప్రశ్నిస్తున్నారు.