న్యూఢిల్లీ: మార్కెట్లో కరెక్షన్ నేపథ్యంలో బ్యాంకింగ్ రంగ స్టాక్స్‌లో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు సెప్టెంబర్‌లో 21,600 కోట్ల మేర తగ్గిపోయాయి. సెప్టెంబర్ చివరికి మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు రూ.1,88,620 కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు నెల ఆగస్టు నాటికి రూ.2,10,251 కోట్లుగా ఉండటం గమనార్హం. జూన్ నుంచి చూసుకుంటే ఇదే తక్కువ. జూన్‌లో బ్యాంక్‌స్టాక్స్‌లో ఫండ్స్ పెట్టుబడులు 1.87 లక్షల కోట్లుగా ఉండటం గమనార్హం. శాతం వారీగా చూసుకుంటే ఫండ్స్ మొత్తం పెట్టుబడుల్లో బ్యాంకింగ్ రంగంలో ఎక్స్‌పోజర్ సెప్టెంబర్ నాటికి 19.78 శాతంగా ఉంది.
మ్యూచువల్ ఫండ్స్ పథకాలు పెట్టుబడుల తగ్గింపు కంటే మార్కెట్ కరెక్షన్ కారణంగానే పెట్టుబడుల శాతం ఎక్కువగా తగ్గినట్టు ఫండ్స్‌ఇండియా రీసెర్చ్ హెడ్ విద్యాబాల తెలిపారు. సెప్టెంబర్‌లో బీఎస్‌ఈ బ్యాంకెక్స్ 12 శాతం పడిపోయిన విషయం గమనార్హం. అయినప్పటికీ ఫండ్ మేనేజర్లకు ఇప్పటికీ బ్యాంకింగ్ మిక్కిలి ప్రాధాన్య రంగంగానే కొనసాగుతోంది. ఆ తర్వాత ఫైనాన్స్ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఫైనాన్స్ రంగ స్టాక్స్‌లో రూ.87,519 కోట్ల పెట్టుబడులు కలిగి ఉండగా, సాఫ్ట్‌వేర్ రంగ స్టాక్స్‌లో రూ.88,453 కోట్లు ఇన్వెస్ట్ చేసి ఉన్నారు. నాన్ డ్యూరబుల్స్, ఆటోమొబైల్ రంగాలకు ఆ తర్వాత ప్రాధాన్యం ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment