
న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం మార్చి నెలలో నెమ్మదించింది. ఉత్పత్తి, అమ్మకాల గణాంకాలు అంతంతమాత్రంగానే ఉన్నాయి. ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) మార్చిలో 54గా నమోదయ్యింది. సెప్టెంబర్ 2021 తరువాత ఇంత తక్కువ స్థాయి ఇండెక్స్ నమోదుకావడం ఇదే తొలిసారి. ఫిబ్రవరిలో ఈ సూచీ 54.9 వద్ద ఉంది. అయితే సూచీ 50 లోపుకు పడిపోతే క్షీణతగా భావిస్తారు. 50 ఎగువన వృద్ధి ధోరణిగానే పరిగణించడం జరుగుతుంది. ముడి పదార్థాల ధరలు పరిశ్రమకు ప్రధానంగా అవరోధంగా మారాయి. రసాయనాలు, ఇంధనం, ఫ్యాబ్రిక్, ఆహార ఉత్పత్తులు, మెటల్ ధరలు ఫిబ్రవరికన్నా పెరిగాయి.