Tiger Woods
-
ఆట కూడా అసూయ పడే ప్రతిభ.. అదొక్కటే తప్పటడుగు!
‘ఇంత అద్భుతంగా కూడా ఆడొచ్చా’ అని ఆటే అతడిని చూసి అసూయ పడేంత ప్రతిభ. అతడు బరిలో ఉన్నాడంటే టైటిల్ సంగతి దేవుడెరుగు.. కనీసం రన్నరప్గానైనా నిలిస్తే చాలని సహచర ఆటగాళ్లు రెండో స్థానం కోసం పోటీపడే వైనం. నిబంధనలు మారిస్తేనైనా అతడి జోరుకు బ్రేక్ పడుతుందేమోనని ఆటరాని ‘ప్రత్యర్థుల’ ఆశ. ఎవరెంత ఈర్ష్య పడినా తన నైపుణ్యంతో శిఖరాగ్రాన నిలిచాడతడు. తొంభైవ దశకం మలినాళ్ల నుంచి దాదాపు దశాబ్ద కాలానికి పైగా గోల్ఫ్ సామ్రాజ్యాన్ని ఏలిన మకుటం లేని మహారాజు. అతడి పేరు ‘టైగర్ వుడ్స్’. ఆఫ్రికన్ అమెరికన్- థాయ్‌లాండ్ సంతతికి చెందిన ఎర్ల్ డెన్నిసన్- కుల్తిడా దంపతులకు 1975, డిసెంబరు 30న కాలిఫోర్నియాలో ‘ఎల్డ్రిక్ టాంట్ వుడ్స్’గా జన్మించాడు. బాల మేధావి అయిన అతడు చిన్ననాటి నుంచే ఆటపై మక్కువ పెంచుకున్నాడు. రెండేళ్లకే గోల్ఫ్ స్టిక్ చేతబట్టాడు. పాల్గొన్న ప్రతి పోటీలోనూ గెలుపొంది.. 19 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ గోల్ఫర్గా మారాడు. ఎనలేని క్రేజ్ సంపాదించి మేటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని కీర్తితో పాటు సంపదనూ పెంచుకుంటూ పోయాడు. ముఖ్యంగా 2000 ఏడాదిలో 15 స్ట్రోక్స్ తేడాతో వుడ్స్ యూఎస్ ఓపెన్ గెలవడం అతడి కెరీర్‌తో పాటు గోల్ఫ్ చరిత్రలోనే హైలైట్‌గా నిలిచిపోయిందని చెప్పవచ్చు. ‘టైగర్ స్లామ్’ అదే విధంగా 2001లో మాస్టర్స్ టైటిల్ గెలిచిన వుడ్స్.. తద్వారా వరుసగా నాలుగు గోల్ఫ్ మేజర్ టోర్నీలు గెలిచిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కాడు. మాస్టర్స్, యూఎస్ ఓపెన్, బ్రిటిష్ ఓపెన్, పీజీఏ చాంపియన్‌షిప్ ట్రోఫీలు కైవసం చేసుకుని.. ఇది ‘టైగర్ స్లామ్’ అనేలా గోల్ఫ్ ప్రపంచం ప్రశంసలు అందుకున్నాడు. ఇలా గోల్ఫ్ రారాజుగా పేరొందినా వ్యక్తిగత జీవితంలోని పొరపాట్ల వల్ల వుడ్స్ అపఖ్యాతిని కూడా మూటగట్టుకున్నాడు. అయినా పడిలేచిన కెరటంలా ఆటకు మెరుగులు దిద్దుకుని ప్లేయర్‌గా తన ప్రతిష్టను ఇనుమడింపజేసుకున్నాడు. 15 సార్లు మేజర్ చాంపియన్స్ గెలవడం సహా ఏకంగా 683 వారాల పాటు వరల్డ్ నంబర్ వన్‌గా నిలిచిన ఘనత సొంతం చేసుకున్నాడు. ఇంతకీ వుడ్స్ పేరులో టైగర్ ఎలా చేరిందో తెలుసా?.. వుడ్స్ తండ్రి ఓ ఆర్మీ అధికారి. ఆయన వియత్నాం యుద్ధంలో పాల్గొన్నట్లు ఆధారాలు ఉన్నాయి. తండ్రి స్నేహితుడు, వియత్నాం యుద్ధవీరుడు అయిన టైగర్‌కు గౌరవ సూచకంగా తన పేరులో ఆ పదాన్ని జోడించుకుని.. టైగర్ వుడ్స్గా చరిత్రలో ఆ పేరును అజరామరం చేశాడు. భార్యకు క్షమాపణ.. విడాకులు 2001లో స్వీడిష్ గోల్ఫర్ జెస్పెర్ పార్ణెవిక్ ద్వారా పరిచయమైన నోర్డెగ్రెన్ను ప్రేమించిన టైగర్ వుడ్స్.. 2003లో ఆమెతో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఆ మరుసటి ఏడాది నోర్డెగ్రెన్తో కలిసి పెళ్లి బంధంలో అడుగుపెట్టాడు. ఈ జంటకు కూతురు సామ అలెక్సిస్ వుడ్స్, చార్లీ అక్సెల్ వుడ్స్ సంతానం. అయితే, వుడ్స్ వివాహేతర సంబంధాల కారణంగా విసిగెత్తిపోయిన నోర్డెగ్రెన్ అతడికి విడాకులు ఇచ్చింది. అనంతరం మరో వ్యక్తిని పెళ్లాడింది. నోర్డెగ్రెన్ విషయంలో తప్పుచేశానని ఒప్పుకొన్న టైగర్ వుడ్స్.. ఇప్పటికీ స్నేహితుడిగా కొనసాగుతున్నాడు. చదవండి: #MSDhoni: స్వర్ణ యుగం ముగిసింది.. గుండె ముక్కలైంది!.. ఆ ఊహే కష్టంగా ఉంది.. One of the greatest golf shots of our generation pic.twitter.com/ENLGXX1JPN — Historic Vids (@historyinmemes) March 18, 2024 -
ఆ ముగ్గురు దిగ్గజాలు క్రికెట్‌ను ఏలేవారేమో!
ఆస్ట్రేలియా విధ్వంసక ఆల్‌రౌండర్ మార్కస్ స్టోయినిస్ పరిమిత ఓవర్ల క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. ముఖ్యంగా టి20ల్లో విధ్వంసకర ఇన్నింగ్స్‌లకు పెట్టింది పేరైన స్టోయినిస్ ప్రస్తుతం ఐపీఎల్ 16వ సీజన్లో బిజీగా గడుపుతున్నాడు. ఐపీఎల్లో కేఎల్ రాహుల్ సారధ్యంలోని లక్నో సూపర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. కాగా ఇవాళ ఎస్ఆర్హెచ్తో లక్నో సూపర్ జెయింట్స్ అమితుమీ తేల్చుకోనుంది. కాగా ఎస్ఆర్హెచ్తో మ్యాచ్‌కు సన్నద్ధమవుతున్న స్టోయినిస్ ఐపీఎల్ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. క్రీడారంగానికి సంబంధించి నీకిష్టమైన ముగ్గురు రిటైర్డ్ ఆటగాళ్ల పేర్లు చెప్పమని అడిగారు. దీనికి స్టోయినిస్.. మాజీ బాస్కెట్‌బాల్ దిగ్గజం మైకెల జోర్డాన్, గోల్ఫ్ దిగ్గజం టైగర్‌వుడ్స్, బాక్సింగ్ దిగ్గజం మహమూద్ అలీ పేర్లను ఏంచుకున్నాడు. ఒకవేళ ఈ ముగ్గురు ఆయా రంగాల్లో కాకుండా క్రికెట్లో ఆడుంటే ఈ ఆటను కూడా ఏలేవారేమో అని పేర్కొన్నాడు. ఇక తాను, ఆస్టన్ అగర్ యూఎఫ్సీకి పెద్ద అభిమానులమని.. ఎప్పుడు మ్యాచ్‌లు జరిగినా తప్పుకుండా చూస్తామన్నాడు. యూఏఈ వేదికగా జరిగిన 2021 టి20 ప్రపంచకప్ సందర్భంగా గోల్ప్ ఆడడానికి పొవెళ్లాం. అక్కడ యూఎఫ్‌సీ ఛాంపియన్స్‌గా ఫోజు ఇవ్వడం ఇప్పటికి మరిచిపోలేదని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం స్టోయినిస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఇప్పటివరకు లక్నో సూపర్ జెయింట్స్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఒక దాంట్లో గెలిచి మరొక దాంట్లో ఓడింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో 50 పరుగుల తేడాతో గెలిచిన లక్నో.. సీఎస్కే చేతిలో 12 పరుగుల తేడాతో ఓటమి పాలయ్యింది. The Christian Bale connection to his social-media post 🤔 3⃣ sportspersons he wished would have played cricket 👌 Who is on his speed dial 📱@MStoinis 𝙐𝙉𝙋𝙇𝙐𝙂𝙂𝙀𝘿 ahead of @LucknowIPL's home game against #SRH tonight 😎 - By @ameyatilak #TATAIPL | #LSGvSRH pic.twitter.com/6lLOpFbkb8 — IndianPremierLeague (@IPL) April 7, 2023 చదవండి: IPL 2023: 'టైమూ పాడూ లేదు.. చూసేవాళ్లకు చిరాకు తెప్పిస్తోంది' -
టైగర్‌వుడ్స్‌పై మాజీ గర్ల్‌ఫ్రెండ్ పరువునష్టం దావా
గోల్ఫ్ రారాజు టైగర్‌వుడ్స్‌పై పరువు నష్టం దావా దాఖలైంది. అతని మాజీ గర్ల్‌ఫ్రెండ్ ఎరికా హెర్మన్ దాదాపు 30 మిలియన్ డాలర్ల కింద పరువునష్టం దాఖలు చేసినట్లు ఆమె తరపు లాయర్ వెల్లడించాడు. 2017లో టైగర్‌వుడ్స్, ఎరికా హెర్మన్ల మధ్య మొదలైన రిలేషిన్షిప్ 2022 వరకు కొనసాగింది. అయితే రిలేషన్షిప్ ప్రారంభంలో ఎరికా హెర్మన్, టైగర్‌వుడ్స్ మధ్య నాన్డిస్క్లోజర్ ఒప్పందం జరిగింది. తాజాగా ఈ ఒప్పందం నుండి తనను విడుదల చేయాలని కోరుతూ దావా వేసింది. ఈ మేరకు కోర్టు బుధవారం ఫైలింగ్స్ చూపించింది. ఫ్లోరిడాలోని మార్టిన్ కౌంటీలోని 19వ జ్యుడీషియల్ సర్క్యూట్ యొక్క సర్క్యూట్ కోర్టులో అభ్యర్థనను దాఖలు చేసింది. ఏఎఫ్‌పీ చూసిన కోర్టు రికార్డుల ప్రకారం, స్పీక్ అవుట్ యాక్ట్ అని పిలువబడే యూఎస్ ఫెడరల్ చట్టం ప్రకారం ఆమె సంతకం చేయాల్సిన ఎన్డీఏ "చెల్లదు మరియు అమలు చేయలేనిది" అని హర్మన్ తరపు న్యాయవాదులు వాదించారు. 2022 చివరి వరకు తన ఫ్లోరిడా మాన్షన్‌లో 15 సార్లు విజేత అయిన టైగర్ వుడ్స్‌తో ఎరికా హెర్మన్ కలిసి ఉంది. చదవండి: 'గతంలో వచ్చిన రెండుసార్లు డ్రింక్స్ మోశాను.. సెంచరీ విలువైనది' మాజీ క్రికెటర్ ఇంట్లో దొంగతనం.. 2 కోట్ల విలువైన సొత్తు చోరీ -
గోల్ఫ్ సామ్రాజ్యానికి రారాజు.. 'టైగర్ వుడ్స్' పేరు ఎలా వచ్చింది
‘అతను సాధిస్తున్న విజయాలు ఆటకు మంచిది కాదు. అసలు పోటీ అనేది లేకుండా పోతోంది. ఇలా అయితే కష్టం..’ ఆ ఆట గురించి విశ్లేషకులు చెప్పిన మాట ఇది! ‘అతను బరిలో ఉంటే ప్రత్యర్థులు తమ అత్యుత్తమ ప్రదర్శన కూడా ఇవ్వలేకపోతున్నారు. ఆ ప్లేయర్ లేని సమయంలో ఎంతో గొప్పగా ఆడేవాళ్లు కూడా ఎదురుగా అతను ఉంటే తడబడుతున్నారు..’ ఒక యూనివర్సిటీ అధ్యయనంలో తేలిన విషయం ఇది. ‘ఆ ప్లేయర్ జోరును తగ్గించేందుకు అవసరమైతే నిబంధనలు కూడా మార్చాల్సిందే. అతని బలహీనతలను గుర్తించి అలాంటి నిబంధనలు చేర్చాలి.. మరికొందరి సలహా! ఇదంతా ఒక్కడి గురించే! ఒక ఆటగాడు సాధిస్తున్న విజయాలు, ఘనతలు కూడా ఆటకు చేటు చేస్తాయని అనిపించడం చూస్తే సదరు ఆటపై అతని ముద్ర ఏమిటో స్పష్టమవుతుంది. వారు వీరని తేడా లేకుండా ప్రత్యర్థులంతా మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారంటే అతని గొప్పతనం ఏమిటో అర్థమవుతుంది. అలాంటి అద్భుతం పేరే టైగర్ వుడ్స్.. గోల్ఫ్ సామ్రాజ్యానికి రారాజు.. ఆర్జనలో ఆకాశాన్నందుకున్నా, కీర్తి వెంట అపకీర్తి వచ్చి చేరినా ఈ ‘టైగర్’ విలువ ఏమాత్రం తగ్గలేదు! - మొహమ్మద్ అబ్దుల్ హాది టైగర్ వుడ్స్ కెరీర్ అంతా ఒక సినిమాను తలపిస్తుంది. ఆసక్తికరమైన మలుపులు, డ్రామాలకు కొదవే లేదు. గోల్ఫ్ ప్రపంచంలో గెలుచుకున్న టోర్నీలు, సాధించిన సంపద మాత్రమే కాదు.. మత్తు పదార్థాలు వాడి పోలీసులకు చిక్కడం, పరాయి స్త్రీలతో సంబంధాల వల్ల కుటుంబ బంధాల్లో కుదుపు, కారు ప్రమాదంలో చావుకు దగ్గరగా వెళ్లి బతికిపోవడం.. ఆపై అన్నింటినీ దాటి మళ్లీ పూర్వ వైభవం సాధించడం కూడా అసాధారణం. అతను సాధించిన విజయాలను అంకెల్లో తూచలేం. టోర్నీల సంఖ్య, వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్, అవార్డులు, రివార్డులు.. ఇలా ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ అంతకు మించిన ఒక కరిష్మా, గోల్ఫ్ మైదానాన్ని తాను ఏకఛత్రాధిపత్యంతో శాసించిన తీరు అతడిని అందనంత ఎత్తులో నిలబెడతాయి. పసిప్రాయంలోనే.. గోల్ఫ్‌కు సంబంధించి వుడ్స్ బాల మేధావి! రెండేళ్ల వయసులోనే తొలిసారి అతని చేతికి తండ్రి గోల్ఫ్ స్టిక్‌ను అందించాడు. ఆ తర్వాత ప్రతి వయో విభాగంలోనూ ఎక్కడ పోటీల్లో పాల్గొన్నా అతను విజేతగా నిలుస్తూ వచ్చాడు. ఎనిమిదేళ్ల వయసులో అరుదైన ‘80 పాయింట్ల స్కోర్’ను సాధించిన వుడ్స్.. ఆరుసార్లు వరల్డ్ జూనియర్ చాంపియన్ గా నిలవడంతోనే అతని అసలు సత్తా ఏమిటో గోల్ఫ్ ప్రపంచానికి తెలిసింది. స్కూల్, కాలేజీ.. అమెచ్యూర్ స్థాయిల్లో తిరుగులేని ప్రదర్శనతో దూసుకుపోయాడు. సరిగ్గా చెప్పాలంటే ఆ దశలో అతను పాల్గొన్న ఏ ఒక్క టోర్నీలోనూ వుడ్స్‌కు ఓటమి ఎదురు కాలేదు. దాంతో ఈ కుర్రాడు చరిత్రను తిరగరాయగలడని అంతా భావించారు. రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందో అందరికీ అర్థమైంది. ప్రొఫెషనల్‌గా.. 19 ఏళ్ల వయసులో వుడ్స్.. గోల్ఫ్ ప్రొఫెషనల్‌గా మారాడు. అప్పటికి అతని గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు కాబట్టి నైకీ, టిట్లీస్ట్లాంటి ప్రతిష్ఠాత్మక సంస్థలు వెంటనే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 2000 సంవత్సరంలో వుడ్స్ రికార్డు స్థాయిలో 15 స్ట్రోక్ తేడాతో యూఎస్ ఓపెన్ ను గెలుచుకున్నాడు. ‘గోల్ఫ్ చరిత్రలోనే ఇది అత్యుత్తమ ప్రదర్శన’ అంటూ దీనిపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు కురిశాయి. 2007లో మోకాలి గాయంతో వుడ్స్ ఆటకు దూరంగా ఉండగా.. ఆ సీజన్ మొత్తం టీవీ రేటింగ్ భారీగా పడిపోయి అతని విలువేంటో చూపించింది. పుష్కర కాలానికి పైగా గోల్ఫ్ మైదానాన్ని అతను శాసించాడు. ఈ క్రమంలో ఎన్నో అద్భుత విజయాలు అంది వచ్చాయి. అతను బరిలో ఉంటే చాలు మిగతా గోల్ఫర్లంతా రెండో స్థానం కోసమే పోటీ పడాల్సిన పరిస్థితి. అయితే ఆ తర్వాతి కొన్ని పరిణామాలు, వ్యక్తిగత అంశాలు ఆటపై ప్రభావం చూపించాయి. ఐదు సార్లు వెన్నుకు జరిగిన శస్త్రచికిత్సలు కూడా వుడ్స్ జోరుకు బ్రేకులు వేశాయి. 2013 వరల్డ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచిన తర్వాత వరుస పరాజయాలు పలకరించాయి. ఇక వుడ్స్ ఆట ముగిసినట్లేనని, అతను మళ్లీ కోలుకోవడం కష్టమని గోల్ఫ్ ప్రపంచం మొత్తం నిర్ణయించేసుకుంది. అదే జరిగితే అతను టైగర్ ఎందుకవుతాడు! ఒక్కో సమస్యను పరిష్కరించుకుంటూ మెల్లగా మళ్లీ స్టిక్ పట్టిన వుడ్స్ ఒకప్పటి తన ఆటను చూపించాడు. మరోసారి వరల్డ్ నంబర్‌వన్ కావడంతో పాటు మరో మాస్టర్స్ టోర్నమెంట్‌ను తన ఖాతాలో వేసుకొని శిఖరాన నిలిచాడు. గోల్ఫ్ కోర్సు బయట... 2009లో అనూహ్యంగా జరిగిన ఒక కారు ప్రమాదం కారణంగా ఇతర మహిళలతో వుడ్స్‌కు ఉన్న సంబంధాల విషయం వెలుగులోకి వచ్చింది. ముందుగా వాటిని వ్యక్తిగత అంశం అంటూ తిరస్కరించినా.. ఆ తర్వాత దానిని అంగీకరించక తప్పలేదు. క్షమించాలంటూ అతను బహిరంగ ప్రకటన చేశాడు. దాంతో అసెంచర్, గెటరాడ్, జనరల్ మోటార్స్, జిల్లెట్వంటి సంస్థలన్నీ అతనితో తమ ఒప్పందాలను రద్దు చేసుకున్నాయి. ఇదే కారణంతో కొద్ది రోజులకే వుడ్స్ భార్య ఎలిన్ నార్డెగ్రెన్ అతనికి విడాకులు ఇచ్చింది. మద్యం, డ్రగ్స్ సేవించి కారు నడుపుతున్నాడంటూ 2017లో పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు. నాలుగేళ్ల తర్వాత జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన వుడ్స్ కోలుకునేందుకు సమయం పట్టింది. అయితే ఇలాంటివన్నీ అధిగమించిన అతను మరోసారి అసలు వేదికపై తానేంటో చూపించగలిగాడు. ఆ పేరు అలా వచ్చింది.. వుడ్స్ తండ్రి ఎర్ల్ డెన్నిసన్.. ఆర్మీ అధికారిగా వియత్నాం యుద్ధంలో పాల్గొన్నాడు. తల్లి కుల్టిడా థాయ్‌లాండ్ దేశస్తురాలు. అయితే అతని తల్లిదండ్రుల నేపథ్యాలు కూడా చాలా భిన్నమైనవి కావడంతో వుడ్స్ గురించి ‘అతను పావు వంతు థాయ్, మరో పావు చైనీస్, ఒక పావు కకేషియన్ , మిగతా పావులో సగం ఆఫ్రికన్ అమెరికన్, మిగిలిన సగం మాత్రమే అసలు అమెరికన్ ’ అని విమర్శకులు చెబుతారు. అసలు పేరు ఎల్డ్రిక్ టాంట్ వుడ్స్ అయితే..‘టైగర్’గా పిలిచే వియత్నాం యుద్ధవీరుడు, తన తండ్రి స్నేహితుడి పేరును గౌరవంగా తన పేరుకు ముందు జోడించుకున్నాడు వుడ్స్. నాకూ నత్తి ఉండేది కొన్నేళ్ల క్రితం డిల్లాన్ అనే స్కూల్ అబ్బాయి తన బాల్కనీ కిటికీలోంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అదృష్టవశాత్తూ అతనికి ప్రాణాపాయం తప్పింది. తనకు నత్తి ఉందని, అందరూ ఎగతాళి చేస్తున్నారని, స్కూల్ స్పోర్ట్స్ టీమ్‌లో కూడా తనను తీసుకోవడం లేదని అతను కారణం చెప్పాడు. ఈ విషయం వార్తల ద్వారా వుడ్స్‌కు తెలిసింది. ఆ కుర్రాడు తన ఆటను చూస్తాడని కూడా సన్నిహితులు చెప్పారు. దాంతో వుడ్స్ ఆ చిన్నారికి వ్యక్తిగతంగా ఒక లేఖ రాశాడు.. ‘అందరిలాగా ఉండలేకపోవడం ఎంత బాధ కలిగిస్తుందో నాకు బాగా తెలుసు. చిన్నప్పుడూ నేనూ నీ తరహా సమస్యతో బాధపడ్డాను. ఆ సమయంలో దానిని దూరం చేసుకునేందు నేను నా కుక్కతో మాట్లాడుతూ ఉండేవాడిని. అది పడుకునేవరకు ఆపకపోయేవాడిని. చివరకు నత్తి దూరమైంది. ఆ సమస్యను ఎలాగైనా అధిగమించవచ్చు. కానీ నువ్వు సంతోషంగా ఉండాలి’ అంటూ! భావోద్వేగంతో రాసిన ఆ లేఖ వుడ్స్ సహృదయాన్ని చూపించింది. సాధించిన ఘనతలెన్నో.. మేజర్ చాంపియన్‌షిప్స్ – 15 సార్లు విజేత వరల్డ్ గోల్ఫ్ చాంపియన్‌షిప్ – 18 సార్లు విజేత మొత్తం పీజీఏ టూర్ విజయాలు – 82 పీజీఏ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు – 11 సార్లు అత్యుత్తమ వరల్డ్ ర్యాంకింగ్ – 1997లో జూన్ 15న తొలిసారి వరల్డ్ నంబర్‌వ¯Œ .. ఏకంగా 683 వారాల పాటు అగ్రస్థానంలో నిలిచిన రికార్డు వరల్డ్ గోల్ఫ్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో చోటు అమెరికా అత్యున్నత పౌర పురస్కారం ‘ప్రెసిడెన్షియల్ మెడల్ ఆఫ్ ఫ్రీడమ్’ అందుకున్న ఘనత చదవండి: 'బోపన్న.. మీ భార్య చాలా అందంగా ఉంది' -
కన్నీటి పర్యంతమైన టైగర్‌వుడ్స్
గోల్ఫ్ ఆటలో లెజెండరీ ఎవరంటే టక్కున గుర్తొచ్చే పేరు అమెరికాకు చెందిన టైగర్‌వుడ్స్. వ్యక్తిగత జీవితంలో మాయని మచ్చలు చాలానే ఉన్నా.. ఆటలో మాత్రం పేరు, సంపదలు బాగానే చూశాడు. తాజాగా బ్రిటిష్ ఓపెన్ గోల్ఫ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న టైగర్‌వుడ్స్ దాదాపు 18 హోల్స్ పూర్తి చేశాడు. ఆట ముగిసిన అనంతరం టైగర్‌వుడ్స్ కన్నీటి పర్యంతమయ్యాడు. టైగర్‌వుడ్స్ వెళ్లిపోతున్న సమయంలో స్టాండ్స్‌లో ఉన్న ప్రేక్షకులు స్టాండింగ్ ఒవేషన్ ఇవ్వడంతో పాటు కరతాళధ్వనులు చేశారు. బహుశా వయసు రిత్యా మళ్లీ బ్రిటిష్ ఓపెన్ ఆడేందుకు చాన్స్ లేదనే కన్నీళ్లు పెట్టుకొని ఉంటాడని భావిస్తున్నారు. ''గోల్ఫ్‌లో ఇన్నేళ్లుగా ఉన్న నాపై ఇంకా అభిమానం తగ్గనందుకు చాలా సంతోషంగా ఉందని.. 18 హోల్స్‌కు నాకిచ్చిన స్టాండింగ్ ఒవేషన్‌కు కృతజ్ఞత తెలుపుకుంటున్న.'' అంటూ పేర్కొన్నాడు. ఇక గోల్ప్‌లో 15 సార్లు మేజర్ టైటిల్స్ కొల్లగొట్టిన టైగర్‌వుడ్స్ నిజంగానే రారాజు అని అభివర్ణించొచ్చు. అయితే 46 ఏళ్ల టైగర్‌వుడ్స్ జీవితంలో గతేడాది జరిగిన కారు ప్రమాదం మాత్రం అతని జీవితాన్ని తలకిందులు చేసింది. మానసికంగా చాలా కుంగిపోయిన టైగర్‌వుడ్స్ కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. మానసిక, ఆరోగ్య సమస్యలతో దాదాపు 17 నెలలు ఆటకు దూరమయ్యాడు. కాగా 2022 ఏప్రిల్‌లో ఆగస్టా నేషనల్ గోల్ఫ్ ద్వారా మళ్లీ అడుగుపెట్టాడు. రీఎంట్రీ ఘనంగా లేకున్నప్పటికి తన ట్రేడ్‌మార్క్ షాట్లతో అలరించాడు. మానసికంగా ఎంతో వేదన అనుభవించిన తర్వాత కూడా గోల్ఫ్‌లోకి తిరిగి రావాలన్న అతని సంకల్పాన్ని అందరూ మెచ్చుకున్నారు. "The warmth and ovation on 18 -- it got to me." An emotional moment for @TigerWoods at #TheOpen pic.twitter.com/K2eqFeKrk2 — PGA TOUR (@PGATOUR) July 15, 2022 చదవండి: Allyson Felix: మాట నిలబెట్టుకున్న దిగ్గజ అథ్లెట్.. కెరీర్‌కు గుడ్‌బై -
వేల కోట్ల రూపాయల ఆఫర్‌ను తిరస్కరించిన గోల్ఫ్ దిగ్గజం
అంతర్జాతీయ గోల్ఫ్ దిగ్గజం టైగర్‌వుడ్స్ ఒక బిలియన్ అమెరికన్ డాలర్లు(ఇండియన్ కరెన్సీలో దాదాపు రూ. ఏడున్నర వేల) కోట్ల ఆఫర్‌ను తిరస్కరించినట్లు సమాచారం. సౌదీ రన్ ఎల్ఐవీ గోల్ఫ్ సిరీస్‌కు సంబంధించిన టోర్నీలో టైగర్‌వుడ్స్ పాల్గొనేందుకు నిరాకరించినట్లు మరో మాజీ గోల్ఫ్ ఆటగాడు గ్రెగ్ నార్మన్ ద్రువీకరించాడు. 46 ఏళ్ల టైగర్‌వుడ్స్ సౌదీ గోల్ఫ్ నుంచి తప్పుకోవాలని ముందుగానే నిర్ణయం తీసుకున్నాడని.. మరింత బెస్ట్ ప్లేయర్లు ఉన్న కొత్త సిరీస్‌కు టైగర్‌వుడ్స్ సంతకం చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలిసిందని నార్మన్ అభిప్రాయపడ్డాడు. అయితే ఫిల్ మికెల్సన్, డస్టిన్ జాన్సన్‌లతో సహా కొంతమంది హై ప్రొఫైల్ ప్లేయర్లు £100 మిలియన్ విలువైన రుసుముపై సంతకం చేయనున్నారు. కాగా టైగర్ వుడ్స్ గతంలోనూ ఎల్ఐవీ గోల్ఫ్‌కు సంబంధించిన ఒప్పందంపై సంతకం చేయడానికి నిరాకరించాడు. నవంబర్ 2021లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న టైగర్‌వుడ్ ఎల్ఐవీ గోల్ఫ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ''నేను పీజీఏ టూర్‌కు మద్దతు ఇస్తున్నానని స్వయంగా నిర్ణయించుకున్నాను. నా వారసత్వం ఇక్కడే ఉంది. ఈ టూర్లో 82 ఈవెంట్లు, 15 మేజర్ ఛాంపియన్షిప్లను గెలుచుకోవడంతో పాటు ఛాంపియన్‌షిప్‌లలో భాగమైనందుకు అదృష్టవంతుడిని అయ్యాను.'' అని చెప్పుకొచ్చాడు. -
గంటకు 140 కిమీ వేగం.. అందుకే ప్రమాదం
లాస్ ఏంజిల్స్: రెండు నెలల కిందట గోల్ఫ్ స్టార్ టైగర్‌వుడ్స్ కారుకు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో వుడ్స్ కుడి కాలు విరిగిపోయింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పుడు పోలీస్ అధికారులు కీలకమైన వివరాలను వెల్లడించారు. ఆ సమయంలో టైగర్‌వుడ్స్ గంటకు 87 మైళ్ల (140 కిలోమీటర్లు) వేగంతో వెళ్తున్నట్లు పోలీసులు చెప్పారు. ఇదే స్పీడుతో కారు అదుపుతప్పి పల్టీ కొట్టింది. లాస్ ఏంజిల్స్‌లోని రాంచోస్ పాలోస్ వెర్డస్ దగ్గర ఈ ప్రమాదం జరిగింది. నిజానికి ఆ ప్రాంతంలో గంటకు 45 మైళ్ల వేగంతో వెళ్లడానికి అనుమతి ఉన్నా.. టైగర్‌వుడ్స్ మాత్రం దానికి రెట్టింపు వేగానికి మించి వెళ్లాడు. విచారణకు సంబంధించిన విషయాలను బయటకు వెల్లడించడానికి వుడ్స్ అంగీకరించినట్లు కూడా పోలీసులు తెలిపారు. ఆ ప్రమాదం ఎలా జరిగిందో కూడా చెప్పలేని పరిస్థితుల్లో వుడ్స్ ఉన్నట్లు కెప్టెన్ జేమ్స్ పవర్స్ చెప్పాడు. అయితే పరిమితికి మించిన వేగంతో వెళ్తున్నట్లు తేలినా.. అక్కడ పోలీసు అధికారులుగానీ, ప్రత్యక్ష సాక్షులుగానీ లేకపోవడంతో టైగర్‌వుడ్స్‌పై ఎలాంటి క్రిమినల్ కేసూ పెట్టడం లేదు. ఒకవేళ తీవ్ర గాయాలు, మరణం, లేదా మరో వ్యక్తి ఈ ప్రమాదంలో ఉండి ఉంటే.. దీనిపై విచారణ కొనసాగించే వాళ్లమని పోలీసులు చెప్పారు. ఫిబ్రవరి 23న జరిగిన ఈ ప్రమాదంలో వుడ్స్ కాలు విరగడంతో అతనికి సర్జరీ చేసి రాడ్ వేశారు. దీంతో గురువారం ప్రారంభం కానున్న మాస్టర్స్ టోర్నీకి టైగర్‌వుడ్స్ దూరమయ్యాడు. చదవండి: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. టైగర్ వుడ్స్‌కు తీవ్ర గాయాలు -
మైదానంలోనే కుప్పకూలాడు.. 18 ఏళ్లకే
వాషింగ్టన్: కారు ప్రమాదంలో గాయపడిన ప్రముఖ గోల్ఫ్ ఆటగాడు టైగర్ వుడ్స్(45) ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. టైగర్ స్పృహలోనే ఉన్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని పేర్కొన్నారు. సకాలంలో ఆయనను ఆస్పత్రికి తీసుకురావడం వల్ల పెను ప్రమాదం తప్పిందని, కుడి కాలులో రాడ్డు వేసినట్లు తెలిపారు. కాగా లాస్ ఏంజెల్స్‌లో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టైగర్ వుడ్స్ తీవ్రంగా గాయపడిన విషయం విదితమే. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి పల్టీలు కొట్టి రోడ్డు పక్కనున్న లోయలోకి 20 అడుగుల దూరం దూసుకెళ్లింది. ఈ క్రమంలో ఆయనను సమీప ఆస్పత్రికి తీసుకువెళ్లి చికిత్స అందిస్తున్నారు. ఈ వార్తతో క్రీడాలోకం తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. టైగర్ ప్రాణాలతో సురక్షితంగా బయటపడాలని ఆయన అభిమానులు ప్రార్థిస్తున్నారు. మరికొంత మంది గతేడాది హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన కోబీ బ్రియాంట్ సహా అకస్మాత్తుగా ఈ లోకాన్ని వీడిన క్రీడాకారులను తలచుకుంటూ భావోద్వేగానికి లోనవుతున్నారు. పద్దెనిమిదేళ్లకే మృత్యువాత పడ్డాడు ధ్రువ్ మహేందర్ పండోవ్.. పంజాబ్ తరఫున ఫస్ట్‌క్లాస్ క్రికెట్ ఆడాడు. 1974 జనవరి 9న జన్మించిన అతడు పదమూడేళ్ల వయస్సులోనే దేశవాళీ క్రికెట్లో అడుగుపెట్టాడు. జమ్ము కశ్మీర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో 137 పరుగులు చేసిన ధ్రువ్, ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అత్యంత పిన్న వయసులో సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. 14 ఏళ్ల 294 రోజుల వయసులో ఈ ఘనత సాధించాడు. అంతేగాక రంజీ ట్రోఫీలో 1000 పరుగుల మార్కును చేరుకున్న పిన్న వయస్కుల్లో(17 ఏళ్ల 341 రోజులు) ఒకడిగా కూడా నిలిచాడు. మెరుగైన భవిష్యత్తు గల ఆటగాడిగా ప్రశంసలు అందుకున్న ధ్రువ్ దురదృష్టవశాత్తూ అంబాలాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పద్దెమినిదేళ్ల వయసులో(1992, జనవరి 31)నే ఈ లోకాన్ని శాశ్వతంగా వీడి వెళ్లిపోయాడు. మైదానంలో కుప్పకూలాడు భారత్ తరఫున 4 టెస్టు మ్యాచ్‌లు, 32 వన్డేలు ఆడాడు క్రికెటర్ రమణ్ లంబా కుశాల్. 1960లో ఉత్తర్‌ప్రదేశ్‌లో జన్మించిన అతడు, ఐర్లాండ్ తరఫున అనధికారంగా వన్డే మ్యాచుల్లో పాల్గొన్నాడు. అంతేగాకుండా బంగ్లాదేశ్ ఢాకా ప్రీమియర్ లీగ్‌లోనూ ఆడాడు. ఈ క్రమంలో 1998 ఫిబ్రవరిలో జరిగిన ఓ మ్యాచ్‌లో భాగంగా క్రికెట్ బాల్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. అంతర్గత అవయవాల్లో రక్తస్రావం జరిగడంతో కోమాలోకి వెళ్లి మూడు రోజుల తర్వాత మృతి చెందాడు. కూతురితో పాటు తాను కూడా బాస్కెట్‌బాల్ దిగ్గజం కోబీ బ్రియాంట్ గతేడాది తన అభిమానులను శోకసంద్రంలో ముంచి ఈ లోకాన్ని వీడాడు. సుమారు రెండు దశాబ్దాల పాటు (1996-2016) తన మెరుపు విన్యాసంతో మైదానంలో పాదరసంలా కదిలిన బ్రయాంట్.. కూతురు జియానాను సైతం తనలాగే అద్భుతమైన క్రీడాకారిణిగా తీర్చిదిద్దాలని భావించాడు. మాంబా స్పోర్ట్స్ అకాడమీలో జియానాకు బాస్కెట్‌బాల్ మ్యాచ్ ఉండటంతో అందులో పాల్గొనడానికి తనతో పాటు హెలికాప్టర్లో వెళ్తుండగా ప్రమాదం జరిగి ఇద్దరూ మృత్యువాత పడ్డారు. వారితో పాటు మరో ఏడుగురు కూడా మరణించారు. ఏడేళ్లపాటు జీవచ్చవంలా ఫార్ములా వన్ మాజీ ప్రపంచ చాంపియన్ మైకెల్ షుమాకర్ స్కై డైవింగ్ సరదాతో చావు అంచుల దాకా వెళ్లాడు. ఫ్రాన్స్‌లోని ఆల్ప్స్ పర్వత శ్రేణుల్లో షుమేకర్ స్కీయింగ్ చేస్తూ ప్రమాదానికి గురైన అతడు సుదీర్ఘకాలంపాటు కోమాలోనే ఉన్నాడు. 1946లో తొలిసారిగా ఆరంభమైన ఫార్ములా వన్ నాటి నుంచీ అంతకు ముందెన్నడు లేనివిధంగా, ఫార్ములా వన్ చాంపియన్ షిప్ లతో పాటు పందేలనూ గెలుచుకున్న షూమాకర్.. 2004లో చివరిసారిగా తన చివరి ఫార్ములా రేస్‌ను గెల్చుకున్నాడు. ప్రస్తుతం అతడు కోమా నుంచి బయపడినప్పటికీ మునుపటిలా సాధారణ జీవితం గడిపే అవకాశం లేదని వైద్యులు తెలిపారు. విషాదాంతంగా ముగిసిన హ్యూస్ జీవితం క్రికెట్‌ను ప్రాణంగా భావించిన ఆస్ట్రేలియా క్రికెటర్ ఫిలిఫ్ జోయెల్ హ్యూస్ జీవితం ఆట కారణంగానే అర్ధాంతరంగా ముగిసిపోయింది. 2014 నవంబర్‌లో సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో దేశవాళీ మ్యాచ్ సందర్భంగా సీన్ అబాట్ సంధించిన బౌన్సర్ హ్యూస్ తలకు బలంగా తాకింది. బాధతో విలవిల్లాడుతూ క్రీజులోనే కుప్పకూలిన హ్యూస్ చికిత్స పొందుతూ రెండు రోజుల తర్వాత తుదిశ్వాస విడిచాడు. పాతికేళ్ల వయసులోనే ఈ లోకాన్ని వీడి వెళ్లిపోయాడు. వీరితో పాటు క్రీడా రంగానికి చెందిన మరెంతో మంది ఆటగాళ్లు హఠాన్మరణం చెంది అభిమానులకు దుఃఖాన్ని మిగిల్చారు. చదవండి: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. టైగర్ వుడ్స్‌కు తీవ్ర గాయాలు మొతేరా క్రికెట్ స్టేడియం : బిగ్ సర్ప్రైజ్ -
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. టైగర్ వుడ్స్‌కు తీవ్ర గాయాలు
లాస్ ఏంజిలెస్: అమెరికాకు చెందిన ప్రఖ్యాత గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ (45) కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్ ఏంజిలెస్ కౌంటీలో ఉన్న రాంచో పాలో వర్జిస్ వద్ద మంగళవారం ఉదయం సుమారు 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక) జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వుడ్స్ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనున్న లోయలోకి 20 అడుగుల దూరం దూసుకెళ్లి పడ్డట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆయన కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయని, ఆయన్ను సమీప ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు. -
టైగర్ వుడ్స్ రికార్డు విజయం
ఇన్జాయ్ (జపాన్): గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ అద్భుత కెరీర్లో మరో కొత్త ఘనత చేరింది. తాజాగా జోజో చాంపియన్‌షిప్‌లో అతను విజేతగా నిలిచాడు. ఈ గెలుపుతో టైగర్ వుడ్స్ యూఎస్ పీజీఏ టూర్ టైటిల్స్ సంఖ్య 82కు చేరింది. దీంతో స్యామ్ స్నీడ్ పేరిట ఉన్న అత్యధిక టైటిల్స్ రికార్డును వుడ్స్ సమం చేశాడు. కెరీర్లో 15 ‘మేజర్’ టైటిల్స్ సాధించిన ఈ స్టార్ తన తొలి టూర్ టైటిల్‌ను 20 ఏళ్ల క్రితం గెలవడం విశేషం. తాజా విజయంతో ప్రపంచ ర్యాంకింగ్స్‌లో కూడా టైగర్ వుడ్స్ పది నుంచి ఆరో స్థానానికి చేరుకున్నాడు. -
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో టైగర్ వుడ్స్ అరెస్టు
అమెరికా గోల్ఫ్ దిగ్గజం టైగర్ వుడ్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పోలీసులకు పట్టుబడ్డాడు.నిబంధనలకు విరుద్ధంగా అధిక మోతాదులో మద్యం సేవించి అతను కారు నడిపినట్లు ఫ్లోరిడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే 41 ఏళ్ల వుడ్స్ అరెస్టు అనంతరం సొంత పూచీకత్తుపై విడుదలయ్యాడు. గోల్ఫ్‌లో 14 సార్లు మేజర్ చాంపియన్‌షిప్ గెలుచుకొని ఆల్‌టైమ్ గ్రేట్‌గా నిలిచిన టైగర్ వుడ్స్ వెన్ను నొప్పి కారణంగా గత ఫిబ్రవరి నుంచి ఆటకు దూరంగా ఉన్నాడు. -
పడి లేచారు..!
పంచామృతం: ఇక అయిపోయిందనుకున్నారంతా. కోలుకోవడం కష్టమే.. అనే అభిప్రాయాలూ వినిపించాయి. గతంలో ఎంతో వైభవాన్ని చూశారు... రకరకాల కారణాలతో విరామం లేదా, వైఫల్యాల వల్ల కొంత ఇబ్బందిని కూడా ఎదుర్కొన్నారు. అయితే తిరిగి బంతిలాగా దూసుకురావడమే వీరి గొప్పదనం. మళ్లీ తమ సత్తా, స్థాయి ఏమిటో చూపిస్తున్నారు. వీరు వ్యక్తిగతంగా వెలుగుతున్నవారే కాదు, వర్తమానంలో ఇబ్బందులు ఎదుర్కొనే వారికి స్ఫూర్తిప్రదాతలు కూడా! అమితాబ్ బచ్చన్ ఈ సూపర్‌స్టార్ కమ్‌బ్యాక్ ఒక వ్యక్తిత్వ వికాస పాఠమే అవుతుంది. సినిమాల ఫెయిల్యూర్లు, ఏబీసీఎల్ నష్టాలు అమితాబ్ కథ అయిపోయిందనిపించాయి. ఆ సమయంలో అమితాబ్ అప్పుల పద్దు గురించి మీడియాలో రకరకాల వార్తలు వచ్చాయి. అయితే అమితాబ్ అలాంటి దశను అధిగమించాడు. కౌన్‌బనేగా కరోడ్‌పతి ద్వారా, సినిమాల ద్వారా తన స్థాయి ఏమిటో తెలియజెప్పాడు! నితిన్ వరస ఫెయిల్యూర్లు... కొన్ని సినిమాలు అయితే ఎప్పుడొచ్చి వెళ్లాయో కూడా చాలామందికి తెలియని పరిస్థితి. తొలి సినిమాతోనే టాలీవుడ్లో మంచి గుర్తింపు సొంతం చేసుకొన్న నితిన్‌ను మధ్యలో కొన్ని రోజులు వరసగా వైఫల్యాలు వెంబడించాయి. అయితేనేం.. ‘ఇష్క్’తో మళ్లీ నితిన్టైమ్ స్టార్ట్ అయ్యింది. ఫామ్‌లోకి వచ్చిన బ్యాట్స్‌మన్‌లా ఇప్పుడు చెలరేగుతున్నాడు ఈ హీరో! సల్మాన్ ఖాన్ వరస వివాదాలు.. పోలీస్ కేసులు, చెడ్డపేరు... దాదాపు దశాబ్దం కిందట సల్మాన్ పరిస్థితి ఇది. బాలీవుడ్ బ్యాడ్‌బాయ్ ఇమేజ్ను తెచ్చేసుకున్నాడు ఈ హీరో. ఇండస్ట్రీకి హిట్స్‌ను ఇచ్చి ఎంతో అభిమానగణాన్ని సంపాదించుకొన్న సల్మాన్... తాగి కారు నడిపిన కేసులో, కృష్ణజింకలను వేటాడిన కేసులోనూ దోషిగా ఉన్నాడు. ఇలాంటి ఇబ్బందికరమైన దశను తన సినిమాల ద్వారానే సల్లూ అధిగమించాడు. కేసులు కొనసాగుతున్నా... సినిమాల ద్వారా అలరిస్తూ అభిమానుల మనసులను అయితే గెలుచుకున్నాడు. టైగర్ వుడ్స్ దాదాపు ఐదేళ్ల క్రితం అమెరికన్ గోల్ఫ్ ఆటగాడు టైగర్ వుడ్స్ తీవ్ర మైన వివాదాల్లో కూరుకున్నాడు. ఎంతో అభిమానగణాన్ని కలిగిన వుడ్స్పై తీవ్రమైన ఆరోపణలు వినిపించాయి. అనేక మంది మహిళలు ‘మాకు వుడ్స్‌తో లైంగిక సంబంధముంది’ అని ప్రకటించుకున్నారు. కొన్ని నెలల పాటు వుడ్స్ శృంగారలీలలు అమెరికన్, ప్రపంచ మీడియాకు మంచి మేత అయ్యాయి. అలాంటి వార్తలు వుడ్స్ వ్యక్తిగత, క్రీడాజీవితాలను దెబ్బతీశాయి. ఎండార్స్మెంట్ ఆదాయంపై కూడా దెబ్బకొట్టాయి. అయితే అదంతా గతం. ఇప్పుడు.. వుడ్స్ ఆటలో మళ్లీ చాంపియన్. ఎండార్స్మెంట్ విషయంలో కూడా! ఆండ్రీ అగస్సీ 1992లో అందుకొన్న తొలి టైటిల్‌తో అగస్సీ ప్రభ మొదలైంది. అయితే కెరీర్ ఆరంభంలో టాప్‌టెన్ స్థాయి ర్యాంకింగ్స్‌లో ఉన్న అగస్సీ ర్యాంక్ ఒకదశలో 141కి పడిపోయిందంటే ఆశ్చర్యం కలగకమానదు. కుటుంబపరమైన సమస్యలు, ఫామ్‌లేమి కలసి 1997ల నాటికి అగస్సీ కథ అయిపోయిందనే అభిప్రాయాన్ని కలిగించాయి. అయితేనేం.. లెజెండరీ ఆటగాడు మళ్లీ పంజా విసిరాడు. 1999 తర్వాత వరుసగా నాలుగు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచి గ్రాండ్‌గా టెన్నిస్ నుంచి విరామం తీసుకొన్నాడు. -
అలరించిన టైగర్ వుడ్స్
న్యూఢిల్లీ: ప్రపంచ నంబర్‌వన్ గోల్ఫర్ టైగర్ వుడ్స్ తన అద్భుత ఆటతీరును భారత అభిమానులకు ప్రత్యక్షంగా చూపించాడు. హీరో మోటోకార్ప్ సీఈవో, ఎండీ పవన్ ముంజల్ ఆహ్వానం మేరకు భారత్‌కు వచ్చిన వుడ్స్ ఢిల్లీ గోల్ఫ్ కోర్స్‌లో 18 హోల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడాడు. తన అతిథులతో కలిసి గోల్ఫ్ ఆడినందుకు వుడ్స్‌కు ముంజల్ రూ.15 కోట్లు చెల్లించినట్టు సమాచారం. పూర్తి ప్రైవేట్ కార్యక్రమమే అయినప్పటికీ వుడ్స్ ఆటతీరు చూసేందుకు దాదాపు 5 వేల మంది గోల్ఫ్ కోర్సుకు తరలివచ్చారు. తొలి తొమ్మిది హోల్స్‌ను ముంజల్‌తో కలిసి ఆడిన వుడ్స్ ఆ తర్వాత రాజీవ్ సింగ్, విక్రమ్‌జిత్ సేన్, మహిళా గోల్ఫర్ షర్మిలా నికోలెట్, జర్నలిస్టు ప్రణయ్ రాయ్, అవీక్ సర్కార్‌తో కలిసి ఆడాడు. ‘భారత్‌కు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా చిన్న గోల్ఫ్ కోర్స్. భారత్ గురించి నా స్నేహితుడు అర్జున్ అత్వల్ చాలా చెప్పాడు’ అని వుడ్స్ అన్నాడు. క్రికెటర్ మురళీ కార్తీక్, మాజీ క్రికెటర్ మదన్ లాల్ కూడా వుడ్స్ ఆటను చూసిన వారిలో ఉన్నారు. వుడ్స్‌ను కలిసిన మాస్టర్ మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ మంగళవారం టైగర్ వుడ్స్‌ను కలుసుకున్నాడు. అతడు బస చేసిన హోటల్‌కు సతీసమేతంగా వెళ్లిన సచిన్ అతడితో కొద్దిసేపు గడిపాడు. ఈ విషయాన్ని వుడ్స్ ట్విట్టర్లో తెలిపాడు. ‘కొద్దిసేపటి క్రితమే క్రికెట్ లెజెండ్ సచిన్, అతడి కుటుంబాన్ని కలిశాను. అతడు నిజంగా చాలా కూల్. నేను భారత్‌కు వచ్చినందుకు సంతోషంగా ఉందని చెప్పాడు’ అని వుడ్స్ ట్వీట్ చేశాడు. -
లెజెండ్స్ ఇద్దరూ.. ఒకే చోట
న్యూఢిల్లీ: ఒకరు ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్. మరొకరు గోల్ఫ్ మేటి. ఈ దిగ్గజాలు తొలిసారి ఒకే చోట దర్శనమిచ్చారు. ఈ అరుదైన సన్నివేశానికి ఢిల్లీ వేదికైంది. వారిద్దరే టీమిండియా బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్.. అమెరికా స్టార్ గోల్ఫర్ టైగర్ వుడ్స్. భారత పర్యటనకు వచ్చిన వుడ్స్ మంగళవారం ఓ హోటల్లో సచిన్, అతని కుటుంబ సభ్యుల్ని కలిశాడు. ఈ విషయాన్ని వుడ్స్ ట్విట్టర్లో వెల్లడించాడు. 'సచిన్ చాలా ప్రశాంతంగా ఉంటాడు. ప్రేమ పూర్వకంగా స్వాగతం పలికాడు' అని వుడ్స్ ట్వీట్ చేశాడు. ఓ ఎగ్జిబిషన్ మ్యాచ్ కోసం వుడ్స్ ఢిల్లీకి రాగా, మంగళవారం భారతరత్న అవార్డు స్వీకరించేందుకు ఢిల్లీకి వచ్చాడు. మాస్టర్‌కు గోల్ఫ్ అంటే చాలా ఇష్టం. -
తొలిసారి భారత్ కు వచ్చిన టైగర్ వుడ్స్
న్యూఢిల్లీ: ప్రఖ్యాత గోల్ఫ్ క్రీడాకారుడు టైగర్ వుడ్స్ సోమవారం న్యూఢిల్లీ వచ్చాడు. భారత పర్యటనకు తొలిసారి విచ్చేసిన వుడ్స్ మంగళవారం ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనున్నాడు. అగ్రశేణి మోటార్ సైకిల్ కంపెనీ హీరో మోటో కార్ప్ ఈ మ్యాచ్ నిర్వహిస్తోంది. ప్రపంచ నెంబర్ వన్ గోల్ఫ్ క్రీడాకారుడైన టైగర్ వుడ్స్.. దుబాయ్ నుంచి ఇక్కడికి చేరుకున్నాడు. దుబాయ్ డిసర్ట్ క్లాసిక్ టోర్నమెంట్లో పాల్గొని ఇక్కడికి వచ్చాడు. మంగళవారం జరిగే ఎగ్జిబిషన్ మ్యాచ్‌లో హీరో మోటో కార్ప్ సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ పవర్ ముంజుల్, ఢిల్లీ గోల్ఫ్ క్లబ్ సభ్యులతో అతడు తలపడతాడు. భారత అగ్రశ్రేణి గోల్ప్ క్రీడాకారులు శివ్ కపూర్, అనిర్బాన్ లాహిరితో అతడు పోటీ పడతాడు.