అమెరికాలో రోడ్డు ప్రమాదం.. టైగర్‌ వుడ్స్‌కు తీవ్ర గాయాలు  | Tiger Woods Suffers Leg Injuries After California Car Crash | Sakshi
Sakshi News home page

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. టైగర్‌ వుడ్స్‌కు తీవ్ర గాయాలు 

Published Wed, Feb 24 2021 2:43 AM | Last Updated on Wed, Feb 24 2021 8:29 AM

Tiger Woods Suffers Leg Injuries After California Car Crash - Sakshi

లాస్‌ ఏంజిలెస్‌: అమెరికాకు చెందిన ప్రఖ్యాత గోల్ఫ్‌ క్రీడాకారుడు టైగర్‌ వుడ్స్‌ (45) కాలిఫోర్నియా రాష్ట్రంలోని లాస్‌ ఏంజిలెస్‌ కౌంటీలో ఉన్న రాంచో పాలో వర్జిస్‌ వద్ద మంగళవారం ఉదయం సుమారు 7 గంటలకు (భారత కాలమానం ప్రకారం మంగళవారం అర్ధరాత్రి దాటాక) జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వుడ్స్‌ ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి పల్టీలు కొడుతూ రోడ్డు పక్కనున్న లోయలోకి 20 అడుగుల దూరం దూసుకెళ్లి పడ్డట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో ఆయన కాళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయని, ఆయన్ను సమీప ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement