కొంపముంచిన మంచు తుపాన్‌.. ఏకంగా 50 కార్లు ఒకదానిపై మరొకటి.. వీడియో వైరల్‌ | Terrifying Video Shows Snow Squall 50 Car Pileup On Pennsylvania Highway | Sakshi
Sakshi News home page

కొంపముంచిన మంచు తుపాన్‌.. ఏకంగా 50 కార్లు ఒకదానిపై మరొకటి.. వీడియో వైరల్‌

Published Tue, Mar 29 2022 7:27 PM | Last Updated on Tue, Mar 29 2022 9:00 PM

Terrifying Video Shows Snow Squall 50 Car Pileup On Pennsylvania Highway - Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలోని పెన్సిల్వేనియా హైవేపై సోమవారం భారీగా మంచు ఏర్పడింది. దీంతో ఆ హైవేపై వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఈ క్రమంలో మంచు కారణంగా పెద్ద సంఖ్యలో వాహనాలు ఢీకొట్టుకున్నాయి. వివరాల ప్రకారం.. హారిస్‌బర్గ్‌కు ఈశాన్యంగా 50 మైళ్ల దూరంలో ఉన్న షుయ్‌కిల్ కౌంటీలోని ఇంటర్‌స్టేట్ 81లో ఉదయం 10:36 గంటలకు ఈ ఘటన చోటు చేసుకుంది.

జీరో విజిబిలిటీతో 50 నుంచి 60 వాహనాలు పరస్పరం ఢీకొట్టుకున్నట్టు అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో పాటు 12 మందికి పైగా గాయపడ్డారు. ఘటనలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఘటన సమీపంలో నాలుగు ఆసుపత్రులకు తరలించినట్లు పెన్సిల్వేనియా స్టేట్ పోలీసులు తెలిపారు. ఈ వాహనాల్లో కార్లతోపాటు ట్రక్కులు, ట్రాక్టర్‌ ట్రాలీలు ఉన్నాయి. హైవేపై ఉన్న మంచును తొల‌గించేందుకు స్థానిక అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. 

ఇక్కడ శీతాకాలం మొదలుకాగానే వాతావరణం మంచుతో కప్పేస్తుండడంతో వాహనదారులకు రోడ్డు సరిగా కనిపించక ఇలాంటి ‍ప్రమాదాలు చోటు చేసుకుంటుంటాయి. ఈ తరహా ఘ‌ట‌న జ‌ర‌గ‌డం ఒకే నెల‌లో ఇది రెండోసారి అని పోలీసులు పేర్కొన్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్  అవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement