ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన భారతీయ విద్యార్థులు హఠాత్తుగా ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోవడం షాక్‌కు గురి చేస్తోంది. ఎన్నో కలలతో భవిష్యత్తును నిర్మించుకుంటున్న యువత అకాల మరణాలు వారి కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగులు స్తున్నాయి. తాజాగా అమెరికాలో మరో విషాదం చోటు చేసుకుంది. ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థులు మృతి చెందారు. ఈ సంఘటన మే 14న చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
జార్జియాలోని అల్పారెట్టాలో జరిగిన ఈ ప్రమాదంలో భారతీయ అమెరికన్ విద్యార్థులు కన్నుమూశారు. వీరిని శ్రియ అవసరాల, ఆర్యన్ జోషి, అన్వీ శర్మగా గుర్తించారు. రిత్విక్ సోమేపల్లి, మహమ్మద్ లియాఖత్ అనే మరో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. వీరు అల్ఫారెట్టాలోని నార్త్ ఫుల్టన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరంతా జార్జియా యూనివర్సిటీలోని సీనియర్ అల్ఫరెట్టా హైస్కూల్ విద్యార్థులనీ, యాక్సిడెంట్ సమయంలో కారులో ఐదుగురు విద్యార్థులు ఉన్నట్టు అధికారులు తెలిపారు.
వాహనంపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అతివేగంగా వెళ్తున్న వాహనం అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టి బోల్తా పడిందని వారు తెలిపారు. ఈ ప్రమాదంలో ఆర్యన్ జోషి, శ్రీయా అవసరాల అక్కడికక్కడే మృతి చెందగా, అన్వీ శర్మ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
అన్వీశర్మ మృతి దిగ్భ్రాంతికి గురి చేసిందని కళాకార్ గ్రూప్ పేర్కొంది. అలాగే శ్రియ అద్భుతమైన డాన్సర్ అని షికారీ గ్రూప్ సంతాపం తెలిపింది. శ్రియ అవసరాల యూజీఏ షికారి డ్యాన్స్ టీమ్‌లో సభ్యురాలు, అలాగే అన్వీశర్మ యూజీఏ కళాకార్ ,కాపెల్లా బృందంలో సింగర్‌గా ఉన్నారు. ఇక ఆర్యన్ జోషి క్రికెటర్‌గా రాణిస్తున్నాడు. కీలక పోటీల్లో జట్టు విజయానికి కారణమైన అతని మరణం తీరని లోటని ఆల్ఫారెట్టా హై క్రికెట్ జట్టు ఇన్‌స్టా పోస్ట్‌లో విచారం వ్యక్తం చేసింది. తెలిపింది.
కాగా గత నెల, అరిజోనాలోని లేక్ ప్లెసెంట్ సమీపంలో పలు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment