sangeetha mobiles
-
‘సంగీత’ వార్షికోత్సవ ఆఫర్లు
సాక్షి, బెంగళూరు: మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ చైన్ ‘సంగీత’ మొబైల్స్ 48వ వార్షికోత్సవం సందర్భంగా భారీ ఆఫర్లు ప్రకటించింది. గ్రామ్‌ఫోన్ నుంచి స్మార్ట్‌ఫోన్ విక్రయాల వరకు ఎదిగిన సంగీత మొబైల్స్ తాజాగా ఎలక్ట్రిక్ వాహనాల రంగంలోకి అడుగు పెట్టింది. బెంగళూరులో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల స్టోర్‌ను బాణసవాడిలో ప్రారంభించింది. త్వరలో మరిన్ని ప్రాంతాల్లో విస్తరించనున్నట్లు సంగీత మొబైల్స్ ఎండీ సుభాష్ చంద్ర మీడియాకు తెలిపారు. సంస్థ ఏర్పడిన నాటి నుంచి ప్రతి ఏటా వార్షికోత్సవ ఆఫర్లు అందిస్తున్నట్టు చెప్పారు. మే 31 నుంచి జూలై మొదటి వారం వరకు ఆఫర్లు కొనసాగిస్తామని తెలిపారు. త్వరలోనే కేరళ, వారణాసి, గోవా, అహ్మదాబాద్ తదితర ప్రాంతాల్లో కొత్త శాఖలు ప్రారంభిస్తామన్నారు. కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా స్టోర్ల సంఖ్య 800 దాటనున్నట్లు పేర్కొన్నారు. సంగీత ఆఫర్లు ఇవే.. ప్రతి స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై స్మార్ట్ వాచ్ తక్కువ ధరకే లభిస్తుంది. ఎంపిక చేసిన మోడళ్లపై 50 శాతం ఇన్స్టాంట్ క్యాష్‌బ్యాక్. రూ.99లకే ఏడాది కాల పరిమితిగల ఫోన్ ప్రొటెక్షన్, రూ.4,999 విలువ చేసే స్మార్ట్‌ఫోన్ కొంటే అదే ధర ఉన్న మరో మొబైల్ ఉచితం వంటి ఆఫర్లు ఉన్నాయి. వార్షికోత్సవం సందర్భంగా లక్కీడిప్ నిర్వహిస్తున్నట్లు సుభాష్ చంద్ర చెప్పారు. మొత్తం 30 రోజులకు గాను 30 మంది విజేతలను ఎంపిక చేసి ఒక్కొక్కరికి రూ.65 వేలు విలువ చేసే ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనం బహుమతిగా ఇస్తామని వివరించారు. సామాజిక సేవలోనూ.. సుభాష్ చంద్ర తన స్వగ్రామం నెల్లూరు జిల్లా పొదకలూరు మండలం తాటిపర్తిలో వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నారు. పదేళ్ల క్రితం ప్రారంభించిన ఈ కేంద్రంలో ప్రస్తుతం సుమారు 50 మంది ఆశ్రయం పొందుతున్నారు. లాక్డౌన్ సమయంలో అన్నదాన కార్యక్రమాల కోసం రూ.1 కోటి వెచ్చించారు. సుమారు 10 లక్షల మందికి ఆహార పొట్లాలు అదజేశారు. -
ఐఫోన్స్ ప్రీబుకింగ్‌పై ‘సంగీత’ భారీ ఆఫర్లు
సాక్షి, హైదరాబాద్: కొత్తగా భారత్ మార్కెట్లోకి రానున్న ఆపిల్ ఐఫోన్ 12, 12 ప్రో మొబైళ్ల ప్రీబుకింగ్‌పై సంగీత మొబైల్స్ ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించింది. హెచ్డీఎఫ్సీ డెబిట్/క్రిడెట్ కార్డు మీద ఐఫోన్ 12, 12 ప్రో మొబైళ్లపై రూ.6 వేల క్యాష్‌బ్యాక్, 6 నెలలపాటు వడ్డీలేని వాయిదాలను చెల్లించవచ్చు. కార్డు లేని వారు ఫోన్ ఎక్స్జేంజ్ చేస్తే దాని ప్రస్తుత విలువతో పాటు మరో రూ.ఆరు వేలు అదనంగా చెల్లించనున్నారు. ప్రీబుక్ చేసే తొలి 1000 మంది కస్టమర్లకు సంస్థ నుంచి ఒక గోల్డ్కాయిన్ బహుమతిగా అందుతుంది. జీఎస్టీఐఎన్ నంబర్ ఉన్న వారు ఐ ఫోన్లను కొంటే 18శాతం జీఎస్టీ రీఫండ్ అవుతుంది. ఇక్కడ కొంటే ఆపిల్ కేర్ మీద 50 శాతం డిస్కౌంట్ ఇస్తుంది. పండుగ సీజన్ సందర్భంగా ఇతర మొబైల్ బ్రాండ్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లపై అతి తక్కువ ధరకు, విన్నూత ఆఫర్లతో కస్టమర్లకు అందిస్తామని ఎండీ సుభాష్ చంద్ర తెలిపారు. -
యువత కోసమే బ్రాండ్ విజయ్
ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ రిటైల్ చైన్ సంస్థ ‘సంగీత మొబైల్స్’.. అర్జున్ రెడ్డి ఫేం విజయ్ దేవరకొండతో బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. యూసుఫ్‌గూడలోని సెయింట్ మేరీస్ కాలేజ్‌లో మంగళవారం జరిగిన ఒక కార్యక్రమంలో విద్యార్థుల మధ్య సంగీత మొబైల్స్, విజయ్ దేవరకొండ సంయుక్తంగా ఈ ఒప్పందాన్ని ప్రకటించారు. ‘మన జీవితాల్లో మొబైల్ హ్యాండ్సెట్స్ చాలా కీలకపాత్ర పోషిస్తున్నాయి. అందువల్ల ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు అన్ని విషయాలను జాగ్రత్తగా చూడాలి. ప్రస్తుతం చాలా మొబైల్ షోరూమ్‌లు ఉన్నాయి. అవి ఎలాంటి సేవలను అందిస్తున్నాయో గమనించండి. సంగీత మొబైల్స్ ప్రతినిధులు నన్ను కలిసిప్పుడు సంతోషపడ్డాను. వీళ్లు కస్టమర్లకు ఏం అవసరమో గుర్తించి వాటిని అందించేందుకు ప్రయత్నిస్తారు’ అని విజయ్ దేవరకొండ పేర్కొన్నారు. గత 30 ఏళ్లుగా కస్టమర్లకు సేవలందిస్తున్నామని, ఇన్నోవేషన్ తమ బలమని సంగీత మొబైల్స్ తెలిపింది. ‘యంగ్ కస్టమర్లకు దగ్గర కావాలని అనుకున్నాం. మోడల్స్ వద్దనుకున్నాం. ఆ సమయంలో అందరికీ పరిచయమున్న వ్యక్తి అయితే బాగుంటుందని భావించాం. అప్పుడు విజయ్ దేవరకొండ గుర్తొచ్చారు. ఆయన మంచి నటుడు మాత్రమే కాదు. విశ్వసనీయత కలిగిన వ్యక్తి’ అని సంగీత మొబైల్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుభాష్ చంద్ర తెలిపారు. సంగీత మొబైల్స్‌కు విజయ్ దేవరకొండ రెండేళ్లపాటు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఈ సమయంలో తమ అన్ని ప్రింట్, ఔట్‌డోర్ అడ్వర్టైజింగ్లో ఈయన కనిపిస్తారని ఒక ప్రకటనలో తెలిపారు. -
సంగీత 100% క్యాష్‌బ్యాక్
బెంగళూరు: ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ రిటైల్ సంస్థ ‘సంగీత మొబైల్స్’ తాజాగా 44వ వార్షికోత్సవం సందర్భంగా కస్టమర్లకు 100 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.5,000– రూ.80,000 ధర శ్రేణిలో యాపిల్ మినహా ఏ ఫోన్‌ను కొనుగోలు చేసిన 100 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నెలకు 10 శాతం చొప్పున 10 నెలల్లో మొత్తం డబ్బును వెనక్కు ఇస్తామని పేర్కొంది. అయితే ఫోన్ కొనుగోలు చేసిన వ్యక్తి ప్రతినెలా ఒక కొత్త కస్టమర్‌ను సంస్థకు పరిచయం చేయాలని (అతను రూ.5,000 విలువైన ఫోన్ కొనాలి), అప్పుడే ప్రతి నెలా క్యాష్‌బ్యాక్ వస్తుందని షరతు విధించింది. అలాగే ఫోన్ కొనుగోలు సమయంలో 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ సహా ఉచిత బహుమతి కూడా ఉంటుందని తెలిపింది. ఈ ఆఫర్లన్నీ ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉంటాయని సంస్థ ఎండీ సుభాష్ చంద్ర పేర్కొన్నారు. -
మొబైల్ కొంటే.. ఎయిర్ అంబులెన్స్ సేవలు
బనశంకరి (బెంగళూరు): సంగీతా మొబైల్స్ స్టోర్లలో ఫోన్ కొన్నవారికి సంస్థ వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. కస్టమర్లు ఏడాదిలోగా గుండెపోటు, లేక తీవ్ర అనారోగ్య సమస్యలకు గురైతే వారిని తక్షణం ఆస్పత్రులకు తరలించడానికి ఉచితంగా అవసరాన్ని బట్టి అంబులెన్స్ లేదా ఎయిర్ అంబులెన్స్ సేవలందిస్తామని స్పష్టంచేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని కస్టమర్లకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం బెంగళూరు ఎయిర్ అంబులెన్స్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు సంగీతా వ్యవస్థాపక డైరెక్టర్ ఎల్.సుభాష్‌చంద్ర గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. తమ స్టోర్లలో ఆన్లైన్ ధరలతో సమానంగా స్మార్ట్ఫోన్లను విక్రయిస్తున్నట్లు చెప్పారు. జనవరి 26న గుజరాత్లో 6, యూపీలోని వారణాసిలో 10 స్టోర్లను ప్రారంభించనున్నట్లు తెలియజేశారు. -
సుభాష్ చంద్రకు ఐఈఎస్ ఉద్యోగ్ రత్న
ప్రముఖ బహుళ ఉత్పత్తుల రిటైల్ సంస్థ- సంగీతా మొబైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ మేనేజింగ్ డెరైక్టర్ ఎల్ సుభాష్ చంద్ర (చిత్రంలో కుడివైపు వ్యక్తి) ప్రతిష్టాత్మక ఐఈఎస్ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ స్టడీస్) ఉద్యోగ్ రత్న అవార్డు అందుకున్నారు. ఆర్థిక రంగంలో ఆయన చేసిన కృషికి గుర్తింపుగా ఈ అవార్డు లభించింది. న్యూఢిల్లీలో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర ఉక్కు, గనుల శాఖ సహాయ మంత్రి విష్ణు దేవ్ సాయి, తమిళనాడు మాజీ గవర్నరు భీష్మ నారాయణ సింగ్ తదితరులు సుభాష్ చంద్రకు ఈ అవార్డు అందజేశారు.