మొబైల్‌ కొంటే.. ఎయిర్‌ అంబులెన్స్‌ సేవలు | Sangeetha Mobiles offer to customers | Sakshi
Sakshi News home page

మొబైల్‌ కొంటే.. ఎయిర్‌ అంబులెన్స్‌ సేవలు

Published Fri, Jan 12 2018 12:53 AM | Last Updated on Fri, Jan 12 2018 2:00 AM

Sangeetha Mobiles offer to customers - Sakshi

బనశంకరి (బెంగళూరు): సంగీతా మొబైల్స్‌ స్టోర్లలో ఫోన్‌ కొన్నవారికి సంస్థ వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. కస్టమర్లు ఏడాదిలోగా గుండెపోటు, లేక తీవ్ర అనారోగ్య సమస్యలకు గురైతే వారిని తక్షణం ఆస్పత్రులకు తరలించడానికి ఉచితంగా అవసరాన్ని బట్టి అంబులెన్స్‌ లేదా ఎయిర్‌ అంబులెన్స్‌ సేవలందిస్తామని స్పష్టంచేసింది.

ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లోని కస్టమర్లకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. ఇందుకోసం బెంగళూరు ఎయిర్‌ అంబులెన్స్‌ కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లు సంగీతా వ్యవస్థాపక డైరెక్టర్‌ ఎల్‌.సుభాష్‌చంద్ర గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. తమ స్టోర్లలో ఆన్‌లైన్‌ ధరలతో సమానంగా స్మార్ట్‌ఫోన్లను విక్రయిస్తున్నట్లు చెప్పారు. జనవరి 26న గుజరాత్‌లో 6, యూపీలోని వారణాసిలో 10 స్టోర్లను ప్రారంభించనున్నట్లు తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement