
దేశంలోని ప్రముఖ విమానయాన సంస్థ 'ఇండిగో' విద్యార్థుల కోసం 'స్టూడెంట్ స్పెషల్' అనే ప్రత్యేకమైన ఆఫర్ తీసుకువచ్చింది. ఇండిగో కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ ద్వారా ఫ్లైట్ టిక్కెట్‌లను బుక్ చేసుకునే సమయంలో విద్యార్థులకు ప్రత్యేక ఛార్జీలు, అదనపు ప్రయోజనాలు లభించనున్నట్లు ప్రకటించింది.
విమాన టికెట్ మీద 6 శాతం రాయితీ కల్పించడం మాత్రమే కాకుండా.. 10 కేజీల వరకు అదనపు లగేజ్ తీసుకెళ్లడానికి ఇండిగో అనుమతించింది. విద్యార్థులు కోసం తీసుకొచ్చిన ఈ స్పెషల్ ఆఫర్ ఈ ఆఫర్ ఎన్ని రోజుల వరకు అందుబాటులో ఉంటుందో.. స్పష్టంగా వెల్లడించలేదు.
ఇదీ చదవండి: తెలంగాణలో బీజం.. ఇతర రాష్ట్రాలకు చేరే అవకాశం
ఇండిగో ప్రకటించిన ఈ స్పెషల్ ఆఫర్ కేవలం హైదరాబాద్‌లో మాత్రమే కాకుండా గోవా, ముంబై, ఢిల్లీ, చెన్నై వంటి మొత్తం 80 రూట్లలో నడిచే విమాన సర్వీసుల్లో అందుబాటులో ఉంటుంది. 21 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న విద్యార్థులు తమ స్కూల్ లేదా యూనివర్సిటీకి సంబంధించిన ఐడీ కార్డును కలిగి ఉండాలి. ఐడీ కార్డు కలిగిన వారు మాత్రమే ఈ ఆఫర్ ఉపయోగించుకోవడానికి అర్హులు.