హైదరాబాద్‌ నుంచి నేరుగా సింగపూర్‌, కొలంబోలకు ఫ్లైట్స్‌: ఇండిగో | Direct Flights From Hyderabad To Singapore And Colombo | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ నుంచి నేరుగా సింగపూర్‌, కొలంబోలకు ఫ్లైట్స్‌: ఇండిగో

Published Sat, Oct 28 2023 4:58 PM | Last Updated on Sat, Oct 28 2023 5:00 PM

 Direct Flights From Hyderabad To Singapore And Colombo - Sakshi

హైదరాబాద్‌ నుంచి ఇకపై నేరుగా సింగపూర్‌, కొలంబోకు వెళ్లేలా ఇండిగో సంస్థ విమాన సర్వీస్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. రాష్ట్రం నుంచి సింగపూర్‌, కొలంబోలను సందర్శించేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతుండటం వల్లనే ఈ నూతన సర్వీసులను అందుబాటులోకి తీసుకోస్తున్నట్లు ఇండిగో తెలిపింది. వీటిలో హైదరాబాద్‌-సింగపూర్‌ల మధ్య సర్వీసులు అక్టోబర్‌ 29 నుంచి అందుబాటులోకి రానున్నాయి.

హైదరాబాద్‌ నుంచి ఉదయం 2.50 గంటలకు బయలుదేరనున్న 6ఈ-1027 విమాన సర్వీసు సింగపూర్‌కు ఉదయం 10 గంటలకు(సింగపూర్‌ కాలమాన ప్రకారం) చేరుకోనుందని తెలిపింది. తిరుగు ప్రయాణంలో సింగపూర్‌లో రాత్రి 23.25 గంటలకు(సింగపూర్‌ కాలమాన ప్రకారం) బయలుదేరి హైదరాబాద్‌కు ఉదయం 1.30 గంటలకు చేరుకోనుంది. 

హైదరాబాద్‌-కొలంబోల మధ్య అలాగే నవంబర్‌ 3 నుంచి డైరెక్ట్‌ ఫ్లైట్‌ సర్వీసు అందుబాటులోకి రానుంది. 6ఈ-1181 విమాన సర్వీస్‌ హైదరాబాద్‌ నుంచి ఉదయం 11.50 గంటలకు బయలుదేరి కొలంబోకు మధ్యాహ్నం 2 గంటలకు చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో కొలంబోలో మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌కు సాయంత్రం 5 గంటలకు వస్తుంది. అయితే ఈ సర్వీస్‌ వారానికి నాలుగు రోజులు సోమ, మంగళ, శుక్ర, ఆదివారాల్లో మాత్రమే ఉంటుందని ఇండిగో తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement