దీపావళి వచ్చేస్తోంది.. ఇప్పటికే చాలామంది షాపింగ్ చేయడం కూడా స్టార్ట్ చేసి ఉంటారు. షాపింగ్ అంటేనే డబ్బు ఖర్చు పెట్టడం. ఇలా డబ్బు ఖర్చుపెట్టే క్రమంలో కొంత ఆదా చేసే మార్గాల కోసం అన్వేషిస్తారు. దీనికోసం కొన్ని టిప్స్ పాటించాల్సి ఉంటుంది. ఈ కథనంలో అలాంటి టిప్స్ గురించి తెలుసుకుందాం.
బడ్జెట్ ప్లాన్ వేసుకోవడం
పండుగ వస్తోంది కదా అని కంటికి కనిపించిందల్లా.. కొనేస్తే పర్సు ఖాళీ అయిపోతుంది. కాబట్టి ఏ వస్తువులు కొనుగోలు చేయాలి, ఎక్కడ కొనుగోలు చేయాలి? దానికి ఎంత ఖర్చు అవుతుందనే విషయాలను ముందుగానే లెక్కించుకోవాలి. కిరాణా వస్తువులు, స్వీట్స్ వంటివన్నీ కూడా ఒకేసారి కొనుగోలు చేయడం ఉత్తమం. పండుగ సీజన్‌లో అందుబాటులో ఉన్న అన్ని డిస్కౌంట్స్ వాడుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మరో విషయం ఏమిటంటే.. డిస్కౌంట్స్ ఉన్నాయి కదా అని అనవసర వస్తువులను కొనుగోలు చేయకూడదు.
క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ ఉపయోగించుకోవడం
దసరా, దీపావళి సమయంలో క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ విరివిగా అందుబాటులో ఉంటాయి. కాబట్టి ఏ ప్లాట్‌ఫామ్‌లలో క్యాష్‌బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. అయితే ఆన్‌లైన్ షాపింగ్‌లో క్యాష్‌బ్యాక్ లభించే అవకాశాలు ఎక్కువ. వీటిని ఉపయోగించుకుంటే కొంత డబ్బు ఆదా అవుతుంది.
ధరలను సరిపోల్చడం
ఆన్‌లైన్ షాపింగ్ చేసే సమయంలో ఒక వస్తువు ధర ఏ ప్లాట్‌ఫామ్‌లో ఎంత ఉందో గమనించాలి. ఎక్కడ తక్కువ ధర ఉంటే అక్కడ వస్తువులను కొనుగోలు చేయాలి. ఇలా చేయడం ద్వారా కూడా డబ్బు ఆదా అవుతుంది. ధరలను సరిపోల్చడానికి ప్రైస్ ట్రాకింగ్ టూల్స్ ఉపయోగించడం ఉత్తమం.
డిస్కౌంట్స్ తెలుసుకోవడం
షాపింగ్ చేసేటప్పుడు ముఖ్యంగా డిస్కౌంట్స్ గురించి తెలుసుకోవాలి. అయితే చాలా సైట్స్ డిస్కౌంట్స్ పేరుతో మోసాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి డిస్కౌంట్స్ లభించే ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేయాలి. ఈ విషయంలో ఏ మాత్రం ఆదమరిచినా నష్టపోవడం ఖాయం.
ఇదీ చదవండి: రతన్ టాటా కఠిన నిర్ణయం: వెలుగులోకి కీలక విషయాలు
బ్యాంక్ ఆఫర్స్ సద్వినియోగం చేసుకోవడం
షాపింగ్ చేసే క్రమంలో బ్యాంకులు అందించే ఆఫర్స్ వినియోగించుకోవాలి. క్రెడిట్ కార్డులు లేదా డెబిట్ కార్డుల మీద డిస్కౌంట్స్, క్యాష్ బ్యాక్ వంటివి ఈ పండుగల సమయంలో చాలానే లభిస్తాయి. కొన్ని బ్యాంకులు రివార్డ్ పాయింట్లను కూడా అందిస్తాయి. వీటిని కూడా ఉపయోగించుకుంటే.. డబ్బు కొంత ఆదా అవుతుంది. అయితే క్రెడిట్ కార్డులు ఉపయోగించి షాపింగ్ చేస్తే.. నిర్దిష్ట కాలంలో తిరిగి చెల్లించాలి. లేకుంటే అది మీ సిబిల్ స్కోర్ మీద ప్రభావం చూపుతుంది. దీనిని ఎట్టి పరిస్థితుల్లోనూ మరచిపోకూడదు.
Comments
Please login to add a commentAdd a comment