
బెంగళూరు: ప్రముఖ మొబైల్ హ్యాండ్‌సెట్స్ రిటైల్ సంస్థ ‘సంగీత మొబైల్స్’ తాజాగా 44వ వార్షికోత్సవం సందర్భంగా కస్టమర్లకు 100 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.5,000– రూ.80,000 ధర శ్రేణిలో యాపిల్ మినహా ఏ ఫోన్‌ను కొనుగోలు చేసిన 100 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నెలకు 10 శాతం చొప్పున 10 నెలల్లో మొత్తం డబ్బును వెనక్కు ఇస్తామని పేర్కొంది.
అయితే ఫోన్ కొనుగోలు చేసిన వ్యక్తి ప్రతినెలా ఒక కొత్త కస్టమర్‌ను సంస్థకు పరిచయం చేయాలని (అతను రూ.5,000 విలువైన ఫోన్ కొనాలి), అప్పుడే ప్రతి నెలా క్యాష్‌బ్యాక్ వస్తుందని షరతు విధించింది. అలాగే ఫోన్ కొనుగోలు సమయంలో 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ సహా ఉచిత బహుమతి కూడా ఉంటుందని తెలిపింది. ఈ ఆఫర్లన్నీ ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉంటాయని సంస్థ ఎండీ సుభాష్ చంద్ర పేర్కొన్నారు.