డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై ఆరు ఏళ్లయిన సందర్భంగా ప్రముఖ పేటిఎమ్ యాప్ ప్రత్యేక ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ లో భాగంగా వినియోగదారులు, వ్యాపారులకు క్యాష్ బ్యాక్ అందించేందుకు రూ.50 కోట్లను కేటాయించినట్లు సంస్థ తెలిపింది. ఈ ఆఫర్ కింద పేటిఎమ్ యాప్ ద్వారా చేయబడ్డ లావాదేవీలపై వ్యాపారులు, వినియోగదారులకు క్యాష్ బ్యాక్లను అందుకొనున్నట్లు పేటిఎమ్ ప్రకటించింది. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహ దేశవ్యాప్తంగా 200 జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు పేటిఎమ్ కమ్యూనిటీలో భాగం కావడం వల్ల డిజిటల్ ఇండియా కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారని సంస్థ తెలిపింది. ఈ ఏడాది క్యాష్ బ్యాక్ ఆఫర్ కోసం కంపెనీ రూ.50 కోట్లు కేటాయించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. దీపావళి వరకు పేటిఎమ్ ద్వారా అత్యధిక సంఖ్యలో లావాదేవీలు చేసిన వ్యాపారులలో టాప్ మర్చంట్ లకు సర్టిఫికేట్, రివార్డులు ఇవ్వనున్నారు. ఉచిత సౌండ్ బాక్స్, ఐఓటి పరికరాలు వంటి అనేక రివార్డులను కూడా అందుకుంటారు. పేటిఎమ్ యాప్ ద్వారా స్టోరుల వద్ద పేటిఎమ్ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసే కస్టమర్లు కూడా ప్రతి లావాదేవీపై క్యాష్ బ్యాక్ అందుకుంటారని ప్రకటనలో తెలిపింది.
చదవండి: వోడాఫోన్ ఐడియా మూతపడనుందా?
Comments
Please login to add a commentAdd a comment