Cash Back
-
గూగుల్ పే పై యూజర్స్ ఫైర్
-
‘గూగుల్ పే.. ఈ యాప్ పనికి రాదు’ మండిపడుతున్న యూజర్లు, అసలేం జరిగింది!
భారత్‌లో ప్రముఖ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) యాప్‌గా గుర్తింపు సంపాదించుకున్న గూగుల్ పే (Google Pay) తాజాగా నెట్టింట భారీ విమర్శలను ఎదుర్కొంటోంది. ఈ యాప్ యూజర్లు ట్విట్టర్లో దీనిపై #GPayతో ట్విట్స్ చేస్తూ వారి అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది పూర్తిగా పనికిరాని యాప్ (Use less App) అంటూ పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం గూగుల్ పే అందిస్తున్న క్యాష్‌బ్యాక్ ఆఫర్ అండ్ స్క్రాచ్ కార్డ్ పై ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం రేగుతోంది. ఎంతలా అంటే ఏకంగా ఈ ట్రోలింగ్ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఈ యాప్ పనికి రాదు అమెరికన్ టెక్ కంపెనీ గూగుల్ ఈ గూగుల్ పే యాప్‌ను 2017లో ప్రారంభించింది. మొదట్లో దీని పేరు తేజ్ యాప్. గూగుల్ పే కస్టమర్లకు అందుబాటులోకి వచ్చిన కొత్తల్లో ఈ యాప్ ద్వారా చేసే ఆన్లైన్ చెల్లింపులపై క్యాష్‌బ్యాక్ ఇచ్చేది. మొబైల్ రీఛార్జ్, డీటీహెఛ్ రీఛార్జ్ , విద్యుత్ బిల్లులు ఇలా ఒక్కటేంటి ఆన్‌లైన్‌కి చెల్లింపు వెసలుబాటు ఉన్న ఈ యాప్ ద్వారా యూజర్లు చెల్లించేవాళ్లు. ఈ క్రమంలో కొందరికి మూడు అంకెల నగదు రాగా, ఎక్కువ మంది కస్టమర్లకు కనీసం నగదు అనేది రివార్డ్స్ రూపంలో వచ్చేవి. అయితే రాను రాను ఈ పరిస్థితి కాస్త పూర్తిగా మారింది. కంపెనీ అందులో మార్పులు చేస్తూ నగదు నుంచి డిస్కౌంట్లను అందించడం ప్రారంభించింది. కానీ ఇప్పుడు ఇది ఎక్కువగా వివిధ డీల్స్‌పై డిస్కౌంట్లను ఇస్తుంది. దీంతో ట్విటర్లో దీనిపై యూజర్లు ఫైర్ అవుతున్నారు. ఓ యూజర్ గూగుల్ పే ఇంతకుముందు ఆన్లైన్ చెల్లింపులపై క్యాష్‌బ్యాక్ రూపంలో కొంత డబ్బును ఇచ్చేదని, కానీ ఇప్పుడు రివార్డ్‌లుగా డిస్కౌంట్లు ఆఫర్లంటూ కార్డులు ఇస్తోందని వాపోయాడు. పలువురు యూజర్లు ట్విటర్ వేదికగా మండిపడుతూ అందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తున్నారు. The main reason i shifted to another platforms for payment, pathetic #GPay pic.twitter.com/enJrZixExM — Vikz Karan (@VikzKaran1) November 15, 2022 use less..!!!! #GPay pic.twitter.com/7neORNwXZl — Nirmal Rangdal (@nirmal_rangdal) November 15, 2022 Always shows only this on #GPay full time pass pic.twitter.com/UxccW7khzA — Ketan Gandhi (@Coachketang) November 13, 2022 చదవండి: IT Layoffs 2022: ‘నా ఉద్యోగం ఉంటుందో..ఊడుతుందో’..టెక్కీలకు చుక్కలు చూపిస్తున్న కంపెనీలు! -
వాట్సాప్ ద్వారా మనీ ట్రాన్స్ఫర్ చేస్తే క్యాష్‌బ్యాక్
-
ప్రత్యేక ఆఫర్.. పేటిఎమ్‌లో రూ.50 కోట్ల క్యాష్ బ్యాక్‌లు
డిజిటల్ ఇండియా కార్యక్రమం ప్రారంభమై ఆరు ఏళ్లయిన సందర్భంగా ప్రముఖ పేటిఎమ్ యాప్ ప్రత్యేక ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఆఫర్ లో భాగంగా వినియోగదారులు, వ్యాపారులకు క్యాష్ బ్యాక్ అందించేందుకు రూ.50 కోట్లను కేటాయించినట్లు సంస్థ తెలిపింది. ఈ ఆఫర్ కింద పేటిఎమ్ యాప్ ద్వారా చేయబడ్డ లావాదేవీలపై వ్యాపారులు, వినియోగదారులకు క్యాష్ బ్యాక్లను అందుకొనున్నట్లు పేటిఎమ్ ప్రకటించింది. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహ దేశవ్యాప్తంగా 200 జిల్లాల్లో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపింది. దేశవ్యాప్తంగా ఉన్న వ్యాపారులు పేటిఎమ్ కమ్యూనిటీలో భాగం కావడం వల్ల డిజిటల్ ఇండియా కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారని సంస్థ తెలిపింది. ఈ ఏడాది క్యాష్ బ్యాక్ ఆఫర్ కోసం కంపెనీ రూ.50 కోట్లు కేటాయించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది. దీపావళి వరకు పేటిఎమ్ ద్వారా అత్యధిక సంఖ్యలో లావాదేవీలు చేసిన వ్యాపారులలో టాప్ మర్చంట్ లకు సర్టిఫికేట్, రివార్డులు ఇవ్వనున్నారు. ఉచిత సౌండ్ బాక్స్, ఐఓటి పరికరాలు వంటి అనేక రివార్డులను కూడా అందుకుంటారు. పేటిఎమ్ యాప్ ద్వారా స్టోరుల వద్ద పేటిఎమ్ క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసే కస్టమర్లు కూడా ప్రతి లావాదేవీపై క్యాష్ బ్యాక్ అందుకుంటారని ప్రకటనలో తెలిపింది. చదవండి: వోడాఫోన్ ఐడియా మూతపడనుందా? -
సంగీత 100% క్యాష్‌బ్యాక్
బెంగళూరు: ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ రిటైల్ సంస్థ ‘సంగీత మొబైల్స్’ తాజాగా 44వ వార్షికోత్సవం సందర్భంగా కస్టమర్లకు 100 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. రూ.5,000– రూ.80,000 ధర శ్రేణిలో యాపిల్ మినహా ఏ ఫోన్‌ను కొనుగోలు చేసిన 100 శాతం క్యాష్ బ్యాక్ అందిస్తామని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. నెలకు 10 శాతం చొప్పున 10 నెలల్లో మొత్తం డబ్బును వెనక్కు ఇస్తామని పేర్కొంది. అయితే ఫోన్ కొనుగోలు చేసిన వ్యక్తి ప్రతినెలా ఒక కొత్త కస్టమర్‌ను సంస్థకు పరిచయం చేయాలని (అతను రూ.5,000 విలువైన ఫోన్ కొనాలి), అప్పుడే ప్రతి నెలా క్యాష్‌బ్యాక్ వస్తుందని షరతు విధించింది. అలాగే ఫోన్ కొనుగోలు సమయంలో 5 శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ సహా ఉచిత బహుమతి కూడా ఉంటుందని తెలిపింది. ఈ ఆఫర్లన్నీ ఈ నెల చివరి వరకు అందుబాటులో ఉంటాయని సంస్థ ఎండీ సుభాష్ చంద్ర పేర్కొన్నారు. -
నోకియా ఫోన్లపై ఎయిర్టెల్ క్యాష్‌బ్యాక్!!
న్యూఢిల్లీ: టెలికం దిగ్గజ కంపెనీ ‘భారతీ ఎయిర్టెల్’ తాజాగా ఎంపిక చేసిన నోకియా స్మార్ట్ఫోన్లపై క్యాష్‌బ్యాక్ అందిస్తామని ప్రకటించింది. నోకియా–2, నోకియా–3 స్మార్ట్ఫోన్లపై తమ ప్రిపెయిడ్ కస్టమర్లు రూ.2,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చని తెలిపింది. ‘కస్టమర్లకు అందుబాటు ధరల్లో 4జీ స్మార్ట్ఫోన్లను అందించాలనే లక్ష్యంతో హెచ్ఎండీ గ్లోబల్ సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాం. ఇందులో భాగంగా నోకియా–3, నోకియా–2 స్మార్ట్ఫోన్లపై రూ.2,000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తున్నాం’ అని భారతీ ఎయిర్టెల్ వివరించింది. ఇక నోకియా రెండు స్మార్ట్ఫోన్లు ఎయిర్టెల్ ప్రత్యేకమైన రీచార్జ్ ప్యాక్ రూ.169తో బండిల్ ఆఫర్ కింద కస్టమర్లకు అందుబాటులోకి వస్తాయి. రూ.169 ప్లాన్‌లో రోజుకు 1 జీబీ 4జీ డేటా, అపరిమిత కాల్స్ వంటి ఫీచర్లున్నాయి. క్యాష్‌బ్యాక్ ఇలా.. ఎయిర్టెల్ కస్టమర్లు నోకియా–2, నోకియా–3 స్మార్ట్ఫోన్లను మార్కెట్ ధరకే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. తర్వాత క్యాష్‌బ్యాక్ మొత్తం రూ.2,000.. 36 నెలల కాలంలో రెండు విడతల్లో యూజర్ ఎయిర్టెల్ వాలెట్లో జమవుతుంది. తొలి విడత క్యాష్‌బ్యాక్ (రూ.500) పొందాలంటే యూజర్ ఫోన్ కొనుగోలు దగ్గరి నుంచి తొలి 18 నెలల కాలంలో రూ.3,500 విలువైన రీచార్జ్ చేసుకోవాలి. ఇక తర్వాతి 18 నెలల కాలంలో మళ్లీ రూ.3,500 విలువైన రీచార్జ్ చేయించుకోవాలి. అప్పుడు రెండో విడత క్యాష్‌బ్యాక్ (రూ.1,500) పొందొచ్చు. కాగా నోకియా–3 ధర రూ.9,499గా, నోకియా–2 ధర రూ.6,999గా ఉంది. -
‘కంపెనీ సెక్రెటరీ’ కోర్సులకు క్యాష్‌బ్యాక్
కోల్‌కతా: కంపెనీ సెక్రెటరీ ఫౌండేషన్, ఎగ్జిక్యూటివ్ కోర్సుల్లో చేరే నిరుపేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు 100 శాతం ఫీజు రిఫండ్ చేస్తామని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ) ప్రకటించింది. తమ సంస్థ స్థాపించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిరుపేద, మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ పథకం ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది. ఈ డిసెంబర్ నెలలో చేరే విద్యార్థులకే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. ఫౌండేషన్ కోర్సుకు సంబంధించి 10+2లో కనీసం 70 శాతం మార్కులు, ఎగ్జిక్యూటివ్ కోర్సుకు సంబంధించి డిగ్రీలో 60 శాతం మార్కులు సాధించిన వారికి రిఫండ్ వస్తుందని వెల్లడించింది. -
చౌక ధరకే.. ఐఫోన్ 8!
ఆపిల్ కొత్తగా ప్రవేశపెట్టిన ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్ఫోన్లు భారత్‌లో రేపటి నుంచి విక్రయానికి రాబోతున్నాయి. ఈ స్మార్ట్ఫోన్లను ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ రేపు నావి ముంబైలోని లాంచ్ చేయబోతున్నారు. వీటి ప్రీ-ఆర్డర్లు కూడా దేశవ్యాప్తంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అమెజాన్, రిలయన్స్ జియోలు ఈ రెండు హ్యాండ్సెట్లపై ఇప్పటికే ధరలను తగ్గించినట్టు ప్రకటించగా... తాజాగా ఫ్లిప్‌కార్ట్ కూడా వీటి జాబితాలో చేరిపోయింది. ఫ్లిప్‌కార్ట్ కూడా ఐఫోన్ 8 బేస్ మోడల్‌ను అత్యంత తక్కువకు రూ.31,100కే అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది. అదేవిధంగా ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్‌ఫోన్ ధరను కూడా రూ.40,100కు తగ్గించింది. ఐఫోన్ 8 ఆఫర్లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ ఈ ఫోన్‌పై ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌ను రూ.23 వేల వరకు అందిస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఐఫోన్ 7 ఉండి ఉంటే, దాన్ని కొత్త దానితో అప్‌గ్రేడ్ చేసుకుంటే, ధరపై రూ.20వేల ఫ్లాట్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేయనున్నట్టు తెలిపింది. అదేవిధంగా ఐఫోన్ 7 ప్లస్‌తో ఎక్స్చేంజ్ చేసుకుంటే రూ.23వేల డిస్కౌంట్ లభించనుంది. దీంతో ఐఫోన్ 7ప్లస్‌తో ఎక్స్చేంజ్ చేసుకున్న వారికి రూ.64వేల రూపాయలుగా ఉన్న ఐఫోన్ 8(64జీబీ వేరియంట్) రూ.41వేలకే లభ్యం కానుంది. పాత హ్యాండ్‌సెట్‌ను తీసుకున్నందుకు పికప్ ఛార్జీలుగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా సిటీ క్రెడిట్ లేదా వరల్డ్ డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే, మరో 10 వేల రూపాయల క్యాష్‌బ్యాక్ లభించనుంది. అయితే ఈ ఆఫర్ కార్పొరేట్ కార్డులకు అందుబాటులో ఉండదు. ఈ ఆఫర్ కూడా ప్రీ-ఆర్డర్ లావాదేవీలకు సెప్టెంబర్ 29 సాయంత్రం 5:59 వరకు మాత్రమే వాలిడ్‌లో ఉండనుంది. 2017 డిసెంబర్ 30 కంటే వరకు ఈ క్యాష్‌బ్యాక్ మొత్తం అకౌంట్లో క్రెడిట్ అవుతుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. ఈ ఎక్స్చేంజ్ డిస్కౌంట్లను, క్యాష్‌బ్యాక్ ఆఫర్లన్నింటిన్నీ తీసుకుంటే, ఐఫోన్ 8 బేస్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.31,100కు, ఐఫోన్ 8 ప్లస్ బేస్ వేరియంట్ రూ.40,100కు లభ్యం కానున్నాయి. అదేవిధంగా 256జీబీ ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ వేరియంట్లు కూడా రూ.44,100కు, రూ.53,100కు కొనుగోలుచేసుకోవచ్చు. ఈ ఫోన్లను కొనుగోలు చేసే అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంకు, బజాజ్ ఫిన్సర్వ్, సిటీ బ్యాంకు, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఇండస్ఇండ్ బ్యాంకు, కొటక్ బ్యాంకు, ఆర్బీఎల్ బ్యాంకు, స్టాండర్డ్ ఛార్టడ్, ఎస్బీఐ, యస్ బ్యాంకుల వినియోగదారులకు 12 నెలల పాటు నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్ అందుబాటులో ఉంది. అమెజాన్ కూడా ఐఫోన్ 8, ఐఫోన్ 8 ప్లస్ స్మార్ట్ఫోన్లపై రూ.12,100 వరకు ఎక్స్చేంజ్ డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. రిలయన్స్ జియో కూడా సిటీ బ్యాంకు కార్డులపై రూ.10వేల క్యాష్‌బ్యాక్‌ను అందిస్తోంది. క్యాష్‌బ్యాక్‌తో పాటు బైబ్యాక్ గ్యారెంటీని ప్రకటించింది. -
జియో మరో సూపర్ ఆఫర్
న్యూఢిల్లీ : దేశీయ మేజర్ టెలికాం ఆపరేటర్ల గుండెల్లో దడ పుట్టిస్తున్న రిలయన్స్ జియో మరో బంపర్ ఆఫర్‌తో ముందుకొచ్చింది. మొబైల్ పోస్ట్ పెయిడ్, ప్రీపెయిడ్ రీచార్జిలపై ఉత్తేజకరమైన ఆఫర్లను లాంచ్ చేసింది. పేటీఎం, ఫోన్ పే ద్వారా క్యాష్‌బ్యాక్ ఆఫర్‌ను ప్రకటించింది. తాజా నివేదికల ప్రకారం ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని రిలయన్స్ జియో పేటీఎం, ఫోన్ పే యాప్‌ల ద్వారా రీచార్జిలపై క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. పేటీఎం ద్వారాఅయితే రూ.300 ఆఫర్‌పై రూ.76ల క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఫోన్‌పే ద్వారా రీచార్జి చేసుకుంటే రూ.75 క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తోంది. అయితే దీనికి జియో యూజర్లకు కంపెనీ పంపిన ఒక ప్రోమో కోడ్‌ను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పేటీఎం యాప్‌లో 'మొబైల్ ప్రీపెయిడ్' లేదా 'మొబైల్ పోస్ట్ పెయిడ్' అప్షన్స్ను ఎంచుకుని జియో ఫోన్ నెంబర్‌ను ఎంటర్ చేసి 'ప్రోగ్రెస్ టు రీఛార్జ్'పై క్లిక్ చేయాలి. ఆ తరువాత ప్రోమో కోడ్‌నుకూడా జతచేయాలి. దీంతో రీచార్జ్ పూర్తవుతుంది. అయితే ఈ ప్రోమో కోడ్ ఎంట్రీ పై కొంత గందరగోళం నెలకొంది. ముఖ్యంగా ఇప్పటికే జియో వినియోగదారుల ప్రోమో కోడ్ జాబితాలో ఉందనీ, అందుకనీ పేటీఎం ద్వారా రీచార్జ్ సందర్భంగా ఈ ప్రోమో కోడ్ ఎంటర్ అవసరం లేదని తెలుస్తోంది. రీఛార్జ్ పూర్తి అయిన 24 గంటల్లో ఈక్యాష్ బ్యాక్ ఆఫర్ రూ. 76 కస్టమర్ల ఖాతాలో చేరుతుంది. మరిన్ని వివరాలను అధికారిక జియో వెబ్సైట్లో పరిశీలించవచ్చు. మరోవైపు మరికొన్ని రోజుల్లోనే ఉచిత ఫీచర్ ఫోన్ వినియోగదారుల చేతుల్లోకి రానుంది. దీంతో దేశీయ సర్వీసు ప్రొవైడర్లు ఆందోళనలో పడిపోయారు. రిలయన్స్ జియో ఉచిత ఫీచర్ల ఫోన్ల వల్ల టెలికం పరిశ్రమపై ప్రతికూల ప్రభావం పడుతుందని దేశీ రెండో అతిపెద్ద టెలికం ఆపరేటర్ వొడాఫోన్ ఫిర్యాదు కూడా చేసింది. జియో ఫోన్ల వల్ల ఆపరేటర్ల ఆదాయాలు మరింత తగ్గే ప్రమాదముందని పేర్కొంది. ఈ నేపథ్యంలో తాజా ఆఫర్‌తో ప్రధాన టెలికాం సంస్థలకు గుండెల్లోగుబులే. కాగా జియో తారిఫ్ ప్లాన్స్ రూ.19 నుంచి రూ.309మధ్య ఉన్న సంగతి తెలిసిందే. -
లెనోవో ల్యాప్‌టాప్స్‌పై క్యాష్‌బ్యాక్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: లెనోవో విద్యార్థుల కోసం ప్రత్యేక క్యాష్‌బ్యాక్ ఆఫర్లను ప్రకటించింది. ఎంపిక చేసిన మోడళ్లపై రూ.5,100 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. మూడేళ్ల వరకు అదనపు వారంటీ, యాక్సిడెంట్ డ్యామేజ్ ప్రొటెక్షన్ సైతం అందిస్తోంది. వీటి విలువ రూ.7,999. విద్యార్థులు 2 ఈఎంఐ పథకాల్లో వీటిని పొందొచ్చు. లెనోవో ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్లు, సంస్థ ఆన్లైన్ భాగస్వాముల వద్ద కొనుగోలు చేస్తేనే ఈ ఆఫర్ వర్తిస్తుంది. ఆగస్టు 15 వరకు ఈ సౌకర్యం ఉంటుందని లెనోవో ఇండియా కన్స్యూమర్, ఈ-కామర్స్ హెడ్ రాజేష్ థడని తెలిపారు. -
రూ.251 స్మార్ట్‌ఫోన్ డబ్బులు వెనక్కి..
న్యూఢిల్లీ: చౌక స్మార్ట్‌ఫోన్ (రూ.251) ఫ్రీడమ్‌పై వివాదాల నేపథ్యంలో.. ముందస్తుగా బుక్ చేసుకున్న వారికి డబ్బును వాపసు చేస్తానని ప్రకటించిన తయారీ సంస్థ మంగళవారం నుంచి ఆ పనిని మొదలుపెట్టింది. సదరు ఫోన్ తయారీ సంస్థ రింగింగ్ బెల్స్.. తన వెబ్ సైట్ ద్వారా చెల్లింపులు చేస్తోంది. రూ.251 స్మార్ట్ ఫోన్ కోసం ముందుగా డబ్బులు చెల్లించి బుక్ చేసుకున్న 30,000 మందికి నగదు తిరిగి ఇచ్చేస్తామన్న తయారీ కంపెనీ ఇప్పటివరకు 14,800 మంది కస్టమర్లకు రూ.84 లక్షలను వెనక్కి ఇచ్చేసినట్లు అవెన్యూ ఇండియా సీఈవో విశాల్ పటేల్ 'ఎకనామిక్స్ టైమ్స్'కు తెలిపారు. కాగా రూ.251కే స్మార్ట్ ఫోన్ అంటూ భారీ ప్రచారం చేసిన రింగింగ్ బెల్స్ వ్యవహారంపై ఎన్ఫోర్స్మెంట్ డెరైక్టరేట్ దృష్టి సారించింది. కంపెనీ, దాని ప్రమోటర్ల లావాదేవీలు, బ్యాంకు ఖాతాలను ఈడీ పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఇప్పటివరకు ఎవ్వరికీ నోటీసుల్లాంటివేవీ జారీకాలేదు. ఆదాయ పన్ను విభాగం కూడా కంపెనీ వ్యవహారాలను పరిశీలిస్తుండటం తెలిసిందే. -
మారుతి సుజుకి సెప్టెంబర్ సర్ప్రైజ్
హైదరాబాద్: వాహన తయారీ దిగ్గజం మారుతి సుజుకి సెప్టెంబర్ సర్ప్రైజ్ను ప్రకటించింది. ఇందులో భాగంగా బుకింగ్ కోసం చెల్లించిన మొత్తంపై 100 శాతం వరకు క్యాష్ బ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది. తద్వారా కస్టమర్లు అదనంగా రూ.20,000 వరకు ఆదా చేయొచ్చని కంపెనీ రీజినల్ మేనేజర్ మునీష్ బాలి తెలిపారు. దీనితోపాటు మరిన్ని ఆకర్షణీయ ఆఫర్లను మారుతి సుజుకి అందిస్తోందని చెప్పారు. కారును సొంతం చేసుకోవడానికి ఇది సరైన సమయమని పేర్కొన్నారు. సెప్టెంబర్ సర్ప్రైజ్ ఈ నెల 17 వరకు జరిగే బుకింగ్స్‌కు వర్తిస్తుంది. -
క్యాష్ బ్యాక్‌తో భవిత భద్రం
ఆశయాలను బట్టి ఒక్కొక్కరికీ ఒక్కో విధమైనవి ఉంటాయి. అయితే, వారు, వీరు అని భేదం లేకుండా ప్రతి ఒక్కరికీ కామన్‌గా ఉండే లక్ష్యాలు కొన్ని ఉంటాయి. కనుక భవిష్యత్ కోసం ప్లానింగ్ చేసుకోవడంతో పాటు వర్తమాన అవసరాలను కూడా తీర్చుకోగలగడం ముఖ్యం. అటు దీర్ఘకాలికమైన లక్ష్యాలపై ఎంతగా దృష్టి పెడతామో .. ఇటు స్వల్పకాలిక, మధ్యకాలికమైన మైలురాళ్లను సాధించడం కూడా అంతే ముఖ్యం. మొట్టమొదటి కారు కావొచ్చు, సొంత ఇల్లు కావొచ్చు, పిల్లల చదువు లేదా పెళ్లిళ్లు కావొచ్చు.. ఇవన్నీ కూడా ఆ కోవకే చెందుతాయి. కుటుంబానికి సంతోషాన్ని పంచే.. వీటన్నింటినీ సాధించేందుకు తగినన్ని నిధులు అవసరమవుతాయి. ఈ నేపథ్యంలో దీర్ఘకాలికమైన వాటితో పాటు స్వల్పకాలికమైన లక్ష్యాల సాధనకు కూడా తోడ్పడే క్యాష్ బ్యాక్ బీమా పాలసీలను గురించి వివరించేదే ఈ కథనం. క్యాష్ బ్యాక్ ప్లాన్ ప్రయోజనాలు.. ఇది చాలా సింపుల్ జీవిత బీమా పథకం. దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలపై ప్రతికూల ప్రభావం పడకుండా.. స్వల్ప, మధ్యకాలిక లక్ష్యాల సాధనకు వివిధ సమయాల్లో నిర్దిష్ట మొత్తం పాలసీదారు చేతికి అందిస్తుంది. ఇంటి కొనుగోలు, పిల్లల చదువు, విహారయాత్రలు లాంటి భవిష్యత్ లక్ష్యాలను సాధించేందుకు తోడ్పాటు అందిస్తుంది. ప్రత్యేకతలేమిటంటే ... పరిమిత కాలం పాటు ప్రీమియంలు కడితే చాలు దీర్ఘకాలికమైన పెట్టుబడి ప్రయోజనాలు అందించడం ఈ తరహా ప్లాన్ల ప్రత్యేకత. ఉదాహరణకు ఇండియాఫస్ట్ క్యాష్ బ్యాక్ ప్లాన్ విషయం తీసుకుంటే 5/7/10 సంవత్సరాల పాటు పేమెంటు టర్మ్ ఉంటే .. 9/12/15 సంవత్సరాల పాటు పాలసీ కొనసాగుతుంది. ప్లాన్ కాల వ్యవధి కొనసాగినంత కాలం.. మధ్య మధ్యలో గ్యారంటీగా చెల్లించే మొత్తాలు చేతికి వస్తూ ఉంటాయి. ప్లాన్ మెచ్యూరిటీ వేళ అదనంగా లాయల్టీ బోనస్ కూడా లభిస్తుంది. ఇక, ఈ ప్లాన్‌లో జీవిత బీమా కవరేజీతో పాలసీదారు కుటుంబానికి ఇన్సూరెన్స్పరమైన భద్రత లభిస్తుంది. అలాగే, కట్టిన ప్రీమియంలు, పొందే ప్రయోజనాలపైనా పన్నులపరమైన ప్రయోజనాలు లభిస్తాయి. పన్ను ప్రయోజనాలు ... ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద చాలా మటుకు క్యాష్ బ్యాక్ ప్లాన్లకు సుమారు రూ. 1,50,000 దాకా కట్టే ప్రీమియంలకు ట్యాక్స్ డిడక్షన్ లభిస్తుంది. మెచ్యూరిటీ మొత్తంపైన, విత్‌డ్రాయల్స్ పన్ను మినహాయింపు ప్రయోజనాలు లభిస్తాయి. డెత్ బెనిఫిట్స్‌పై కూడా పన్నులు ఉండవు. ఎవరికి అనువైనవి ... భవిష్యత్ లక్ష్యాల సాధన కోసం సంసిద్ధులుగా ఉండాలనుకునే వారెవరికైనా కూడా ఈ పాలసీలు అనువైనవే. ఇది సింపుల్ ఎండోమెంట్ ప్లాన్. ప్లాన్ ఆఖర్లో మెచ్యూరిటీ మొత్తాన్ని (బోనస్ లాంటి వాటితో పాటు) అందుకోవడంతో పాటు ప్లాన్ కొనసాగినంత కాలం మధ్య మధ్యలో కాస్త కాస్త చొప్పున నగదు కూడా చేతికి వస్తుండాలని కోరుకునే వారికి ఈ ప్లాన్లు అనువైనవి. -
మెట్రో ప్రయాణికులకు ‘క్యాష్‌బ్యాక్’
సాక్షి, ముంబై: వర్సోవా-అంధేరి-ఘాట్కోపర్ మధ్య రాకపోకలు సాగించే మెట్రో ప్రయాణికులకు మెట్రో-1 యాజమాన్యం ‘క్యాష్ బ్యాక్’ ఆఫర్ ్రపకటించింది. ఈ నెల 1 నుంచి 31 వరకు మెట్రో రైలులో 30 సార్లు ప్రయాణిస్తే ఐదు శాతం డబ్బులు ప్రయాణికులకు తిరిగి చెల్లించనున్నట్లు ప్రకటిచింది. అయితే ఈ సౌకర్యం రోజూ టికెట్లు కొనుగోలు చేసేవారికి కాదని, కేవలం స్మార్ట్ కార్డు ద్వారా ప్రయాణించే వారికి మాత్రమేనని అధికారులు తెలిపారు. నెలలో మొత్తం 30 ట్రిప్పులు పూర్తయ్యాక వెచ్చించిన డబ్బు నుంచి 5 శాతం మొత్తం స్మార్ట్‌కార్డులో అటోమెటిక్‌గా జమా అవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో అత్యధిక శాతం ముంబైకర్లు స్వగ్రామాలకు వెళ్లారు. దీంతో మెట్రో రైళ్లలో ప్రయాణికుల రద్దీ తగ్గింది. దీంతో ప్రతి రోజు మెట్రో ద్వారా రావాల్సిన ఆదాయానికి గండిపడుతోంది. ఆదాయం సమకూర్చుకునే క్రమంలో ఈ స్కీంకు శ్రీకారం చుట్టింది. -
ఆకర్షిస్తున్న ఆన్లైన్ షాపింగ్
న్యూఢిల్లీ: ఆకర్షణీయమైన ఆఫర్లు, భారీ డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్... తదితర అంశాలు ఆనలైన్ షాపింగ్ జోరును పెంచుతున్నాయి. ఈ అంశాల కారణంగా వినియోగదారులు ఆన్లైన్ షాపింగ్ పట్ల ఆకర్షితులవుతున్నారని తమ సర్వేలో వెల్లడైందని క్యాష్‌బ్యాక్, కూపన్ల సైట్ క్యాష్‌కరోడాట్‌కామ్ తెలిపింది. ఈ సంస్థ 3,200 మంది ఆన్లైన్ షాపర్లపై నిర్వహించిన ది ఆన్లైన్ షాపింగ్ ట్రెండ్స్ సర్వేలో వెల్లడైన కొన్ని ముఖ్యాంశాలు..., దరలు తక్కువగా ఉండడం, ఇంట్లో ఉంటూనే షాపింగ్ చేసే వీలుండడం.. వంటి అంశాలు కూడా ఆన్లైన్ షాపింగ్ జోరును పెంచుతున్నాయి. క్యాష్‌బ్యాక్ ఆఫర్ తమను ఆకర్షించిందని సర్వేలో పాల్గొన్న 95 శాతం మంది చెప్పారు. భారీ డిస్కౌంట్ల కారణంగా ఆన్లైన్ షాపింగ్‌కు ప్రాధాన్యత ఇస్తున్నామని 27 శాతం మంది పేర్కొన్నారు. తక్కువ ధరల కారణంగా ఆన్లైన్ షాపింగ్‌కు ఆకర్షితులవుతున్నామని 25 శాతం మంది వివరించారు. సౌకర్యం దృష్టికోణంలో ఇంటర్నెట్ ద్వారా షాపింగ్‌కే ప్రాధాన్యత ఇస్తున్నామని 22 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఎంచుకోవడానికి అవకాశాలు అధికంగా ఉంటాయని 16 శాతం మంది, నచ్చకపోతే వస్తువులు తిరిగి ఇచ్చే విధానం బావుండటంతో 10 శాతం మంది ఆన్లైన్ షాపింగ్‌కు జై కొడుతున్నారు. 40 శాతం మంది సగటున ఏడాదికి రూ.10,000 చొప్పున ఆన్లైన్ షాపింగ్ చేస్తుండగా, దాదాపు 10 శాతం మంది సగటున ఏడాదికి రూ.50,000 చొప్పున షాపింగ్ చేస్తున్నారు. వస్తువును ఎంచుకునేందుకు ధర అంశానికి ప్రాధాన్యత ఇస్తామని 30 శాతం మంది, వస్తువు నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తామని 29 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇంటర్నెట్ విస్తృతి పెరుగుతుండడంతో భారత ఇ-కామర్స్ మార్కెట్ దూసుకుపోతోంది. సమీప భవిష్యత్తులో ఆన్లైన్ ద్వారా షాపింగ్ చేసే వారి సంఖ్య 20 కోట్లకు సులభంగానే చేరుతుంది. 2013లో భారత ఇ కామర్స్ మార్కెట్ 33 శాతం వృద్ధితో రూ.62,967 కోట్లకు చేరిందని అంచనా.