కోల్‌కతా: కంపెనీ సెక్రెటరీ ఫౌండేషన్, ఎగ్జిక్యూటివ్ కోర్సుల్లో చేరే నిరుపేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు 100 శాతం ఫీజు రిఫండ్ చేస్తామని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్‌ఐ) ప్రకటించింది. తమ సంస్థ స్థాపించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిరుపేద, మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ పథకం ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది.
ఈ డిసెంబర్ నెలలో చేరే విద్యార్థులకే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. ఫౌండేషన్ కోర్సుకు సంబంధించి 10+2లో కనీసం 70 శాతం మార్కులు, ఎగ్జిక్యూటివ్ కోర్సుకు సంబంధించి డిగ్రీలో 60 శాతం మార్కులు సాధించిన వారికి రిఫండ్ వస్తుందని వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment