ICSI
-
రోల్‌మోడల్‌గా భారత్.. కార్పొరేట్ గవర్నెన్స్‌పై రాష్ట్రపతి పిలుపు
న్యూఢిల్లీ: కార్పొరేట్ గవర్నెన్స్ విషయంలో భారత్ రోల్ మోడల్‌గా ఎదిగేందుకు కంపెనీ సెక్రటరీలు కృషి చేయాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సూచించారు. అలాగే, వ్యాపారాలు, పెట్టుబడులను ప్రోత్సహించే చట్టాలు అమలయ్యేలా చూడటంలో తమ వంతు తోడ్పాటు అందించాలని పేర్కొన్నారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) 55వ వ్యవస్థాపక దినోత్సవంలో పాల్గొన్న సందర్భంగా ఆమె ఈ విజ్ఞప్తి చేశారు. ప్రపంచానికి సారథ్యం వహించగలిగే దేశంగా భారత్ ముందుకు పురోగమిస్తోందని ముర్ము పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దేశీయంగా వృత్తి నిపుణులు తగిన అర్హత కలిగినవారై ఉండటంతో పాటు సాహసోపేతంగా, సృజనాత్మకంగా కూడా వ్యవహరించాలని ఆమె చెప్పారు. కంపెనీ సెక్రటరీల సంకల్పంపైనే దేశ కార్పొరేట్ గవర్నెన్స్ భవిష్యత్ ఆధారపడి ఉందన్నారు. కార్పొరేట్ గవర్నెన్స్‌కు పునరంకితం కావాలి మెరుగైన కార్పొరేట్ గవర్నెన్స్ ప్రమాణాల పాటింపునకు కంపెనీ సెక్రటరీలు పునరంకితం కావాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ కార్యక్రమంలో సూచించారు. ఐసీఎస్ఐ నెలకొల్పిన ఉత్తమ ప్రమాణాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని కితాబిచ్చారు. అగ్నివీర్, డిఫెన్స్ సిబ్బంది, అమరవీరుల కుటుంబాలకు చెందిన వారు కంపెనీ సెక్రటరీ కోర్సులో చేరితే రిజిస్ట్రేషన్ ఫీజు నుంచి మినహాయింపునివ్వాలని ఐసీఎస్ఐ నిర్ణయం తీసుకోవడం, అమరవీరుల కుమార్తెల విద్యాభ్యాసం కోసం రూ. 11 లక్షల విరాళమివ్వడం ప్రశంసనీయమని ఆమె పేర్కొన్నారు. వ్యాపార నిర్వహణను సులభతరం చేసేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని మంత్రి చెప్పారు. ఈ నేపథ్యంలో భారత్‌లోకి గత మూడు ఆర్థిక సంవత్సరాల్లో 230 బిలియన్ డాలర్ల పైచిలుకు పెట్టుబడులు వచ్చినట్లు పేర్కొన్నారు. భారత్‌లో పెట్టుబడులు పెట్టేందుకు, వ్యాపారాలు నిర్వహించేందుకు కంపెనీల్లో నెలకొన్న ఆసక్తిని ఇది సూచిస్తోందన్నారు. -
ఐసీఎస్ఐ కొత్త కార్యవర్గం
హైదరాబాద్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) హైదరాబాద్ చాప్టర్‌కు (తెలంగాణ) నూతన కార్యవర్గం ఎన్నికైంది. 2021 సంవత్సరానికి గాను చైర్మన్‌గా హైదరాబాద్‌లోని ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీ సీఎస్ నవజ్యోత్ పుట్టపర్తి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్‌గా సీఎస్ సుధీర్ కుమార్ పోలా, సెక్రటరీగా సీఎస్ లలితాదేవి తంగిరాల, ట్రెజరర్‌గా సీఎస్ అక్షితా సురానా నియమితులయ్యారు. మేనేజింగ్ కమిటీ మెంబర్లుగా సీఎస్ పీ విక్రమ్ రెడ్డి, సీఎస్ రాధాకృష్ణ, సీఎస్ ఏ రాజా మోగ్లీలు ఉంటారు. సీఎస్ వీ ఆహ్లాదరావు, ఆర్ వెంకటరమణలు ఇతర సభ్యులుగా కొనసాగుతారు. -
‘కంపెనీ సెక్రెటరీ’ కోర్సులకు క్యాష్‌బ్యాక్
కోల్‌కతా: కంపెనీ సెక్రెటరీ ఫౌండేషన్, ఎగ్జిక్యూటివ్ కోర్సుల్లో చేరే నిరుపేద, ప్రతిభావంతులైన విద్యార్థులకు 100 శాతం ఫీజు రిఫండ్ చేస్తామని ది ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రెటరీస్ ఆఫ్ ఇండియా(ఐసీఎస్ఐ) ప్రకటించింది. తమ సంస్థ స్థాపించి 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా నిరుపేద, మెరిట్ విద్యార్థులను ప్రోత్సహించడానికి ఈ పథకం ప్రవేశపెడుతున్నట్లు వెల్లడించింది. ఈ డిసెంబర్ నెలలో చేరే విద్యార్థులకే ఈ పథకం వర్తిస్తుందని పేర్కొంది. ఫౌండేషన్ కోర్సుకు సంబంధించి 10+2లో కనీసం 70 శాతం మార్కులు, ఎగ్జిక్యూటివ్ కోర్సుకు సంబంధించి డిగ్రీలో 60 శాతం మార్కులు సాధించిన వారికి రిఫండ్ వస్తుందని వెల్లడించింది. -
ఐసీఎస్ఐ ఐపీఏ వెబ్సైట్ ప్రారంభం
హైదరాబాద్: ఐసీఎస్ఐ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా) అనుబంధ సంస్థ, ఐసీఎస్ఐ ఐపీఏ(ఐసీఎస్ఐ ఇన్సాల్వేన్సీ ప్రొఫెషనల్ ఏజెన్సీ) తన వెబ్‌సైట్‌ను ప్రారంభించింది. ఈ వెబ్‌సైట్‌ను ఐసీఎస్ఐ అధ్యక్షుడు డాక్టర్ శ్యామ్ అగర్వాల్ ఆరంభించారని ఐసీఎస్ఐ ఐపీఓ ఒక ప్రకటనలో తెలిపింది. ⇔ ఐసీఎస్ఐ ఐపీఏ రాజ్యాంగం, గత, రాబోయే ఈవెంట్స్, ఇన్సాల్వేన్సీ ప్రొఫెషనల్‌గా నమోదు చేసుకోవడానికి సంబంధించిన ప్రక్రియ వివరాలు, దివాళాకు సంబంధించిన నియమనిబంధనలు, ఈ నియమనిబంధనలకు సంబంధించిన అప్డేట్లు, తాజా సవరణలు, ప్రకటనలు...సంబంధిత సమస్త వివరాలు ఈ వెబ్సైట్లో ఉంటాయని ఈ సందర్భంగా శ్యామ్ అగర్వాల్ పేర్కొన్నారు. -
కృత్రిమ గర్భధారణతో పుట్టే మగపిల్లల్లో ఆ లోపం!
పిల్లలు కలగని చాలామంది తల్లిదండ్రులకు ఒక వరం కృత్రిమ గర్భధారణ. పురుషుల వీర్యంలో శుక్రకణాలు చాలా తక్కువగా ఉన్నప్పుడు ఐసీఎస్ఐ అనే గర్భధారణ ప్రక్రియ ద్వారా మహిళలకు గర్భధారణ జరిగేలా చూడవచ్చు. ఇంట్రా సైటోప్లాసమిక్ స్పెర్మ్ ఇంజెక్షన్ (ఐసీఎస్ఐ) అనే ప్రక్రియ ద్వారా ఫెర్టిలిటీ నిపుణులు మహిళలకు గర్భధారణ కలిగేలా చూస్తారు. అయితే ఇలా పుట్టే మగసంతానానికి భవిష్యత్తులో వాళ్ల నాన్నలాగే వీర్యకణాల్లో కౌంట్ తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువని పరిశోధనలు పేర్కొంటున్నారు. బెల్జియంలోని ‘బ్రసెల్స్ వ్రిజె యూనివర్సిటీయేట్’కు చెందిన సెంటర్ ఫర్ రీప్రొడక్టివ్ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం తెలిసింది. అప్పట్లో 1992 నుంచి 1996 వరకు పుట్టిన పిల్లలు ఇప్పుడు యుక్తవయస్కులయ్యారు. అప్పుడు నార్మల్‌గా పుట్టిన పిల్లలకూ, కృత్రిమ గర్భధారణ ద్వారా పుట్టిన పిల్లలకూ మధ్య తేడాలను నిశితంగా పరిశీలించిన నిపుణులు ఈ విషయాన్ని తెలుసుకున్నారు. సాధారణంగా పుట్టిన మగ సంతానంతో పోలిస్తే... ఇలా కృత్రిమ గర్భధారణ వల్ల కలిగే సంతానంలో వీర్యకణాల సంఖ్య తక్కువగా ఉండటం సాధారణ పురుషుల కంటే మూడింతలు తక్కువని పరి శోధనలు వెల్లడిస్తున్నాయి. తండ్రి నుంచి జన్యుపరమైన లోపాలు ఆ పిల్లల జన్యువుల్లోకీ రావడం వల్ల వారిలో ఈ పరిస్థితి కలిగే అవకాశాలు ఎక్కువని ఈ పరిశోధనల్లో పాల్గొన్న నిపుణుల బృందంలో ఒకరైన యాండ్రీ వాన్ స్టియర్టేఘెమ్ పేర్కొన్నారు. ‘‘ఇది ఊహించని ఫలితం’’ అంటున్నారాయన. -
భారత్ వృద్ధికి జీఎస్టీ దన్ను: ఐసీఎస్ఐ
హైదరాబాద్: భారత్ వృద్ధి బాటలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమలు ఎంతో కీలకమైనదని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) ప్రెసిడెంట్ సీఎస్ మమతా బినానీ పేర్కొన్నారు. ఏకీకృత పన్ను వ్యవస్థ వృద్ధికి దోహదపడే అంశమే కాకుండా, అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థకు దేశాన్ని మరింత చేరువ చేస్తుందని అన్నారు. ఇందుకు సంబంధించి చరిత్రాత్మక రాజ్యాంగ (122వ సవరణ) బిల్లు, 2014 పట్ల ఆమె హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదలైంది. న్యూఢిల్లీలో ఈ నెల 30వ తేదీన జీఎస్టీపై రాష్ట్ర ఆర్థికమంత్రుల సాధికార కమిటీ నిర్వహిస్తున్న చర్చాగోష్టిలో పాల్గొని ఈ మేరకు తమ అభిప్రాయాలను వెల్లడిస్తామని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో పలు వాణిజ్య, వృత్తి పరమైన సంఘాల అత్యున్నత స్థాయి ప్రతినిధులు పాల్గొంటున్నారు. కాగా ఆగస్టు నెలను ‘జీఎస్టీ అవేర్నెస్ మంత్’గా ఐసీఎస్ఐ పాటిస్తున్న సంగతిని ఈ సందర్భంగా మమతా బినానీ గుర్తుచేశారు. -
ఐసీఎస్ఐ కార్యదర్శిగా దినేశ్ చంద్ర అరోరా
హైదరాబాద్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) కార్యదర్శిగా దినేశ్ చంద్ర అరోరా బాధ్యతలు స్వీకరించారు. చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీల్లో అర్హత సాధించిన దినేశ్‌చంద్ర... ఐటీ, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎఫ్ఎంసీజీ వంటి తదితర రంగాలకు చెందిన పలు కంపెనీల్లో పనిచేశారు. అరోరాకు బిజినెస్ ప్రణాళికల రూపకల్పన, వ్యాపార వ్యూహరచన, బడ్జెటింగ్, నిధుల సమీకరణ, ప్రైవేట్ ఈక్విటీ మేనేజ్మెంట్, ట్యాక్స్ ప్లానింగ్, లీగల్ డ్రాఫ్టింగ్, రిస్క్ మేనేజ్మెంట్ తదితర అంశాల్లో మంచి అనుభవముంది. -
కంపెనీలన్నింటికీ ఒకే కార్పొరేట్ గవర్నెన్స్ కోడ్
ఐసీఎస్ఐ ప్రతిపాదన హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : వ్యాపారాల నిర్వహణను సరళతరం చేసే విధంగా.. అంతర్జాతీయ స్థాయిలో కంపెనీలన్నింటికి ఒకే తరహా కార్పొరేట్ గవర్నెన్స్ నియమావళి అమల్లోకి తెచ్చే దిశగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) కసరత్తు చేస్తోంది. దీంతో పాటు ఇంటర్నేషనల్ కార్పొరేట్ గవర్నెన్స్ డే ప్రతిపాదనకు కూడా ఇతర దేశాల మద్దతు కూడగట్టేలా ఐక్యరాజ్యసమితితో కూడా త్వరలో చర్చలు జరపనున్నట్లు మంగళవారమిక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఐసీఎస్ఐ ప్రెసిడెంట్ మమతా బినాని తెలిపారు. గ్లోబల్ కార్పొరేట్ గవర్నెన్స్ కోడ్ (జీసీజీసీ)పై అవగాహన పెంచే క్రమంలో డిసెంబర్ 9,10 తేదీల్లో హైదరాబాద్‌లో ప్రత్యేక సదస్సు నిర్వహిస్తున్నట్లు మమత వివరించారు. దేశవిదేశాల నుంచి సుమారు 2,500 మంది పైచిలుకు ప్రతినిధులు దీనికి హాజరు కానున్నట్లు చెప్పారు. యువతలో వృత్తి నైపుణ్యాలపై అవగాహన పెంచేందుకు ఈ నెల 15న యువకౌశల్ పేరిట కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మమత తెలిపారు. ఐసీఎస్ఐ పరిధిని విస్తరిస్తూ త్వరలో దుబాయ్‌లో కూడా కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఐసీఎస్ఐ హైదరాబాద్ చాప్టర్ చైర్మన్ మహాదేవ్ తిరునగరి, కౌన్సిల్ సభ్యుడు ఆహ్లాద రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అటు ఐసీఎస్ఐ సభ్యులతో జరిగిన ఇష్టాగోష్టిలో పాల్గొన్న సందర్భంగా సంస్థ చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి మమత వివరించారు. -
ఐసీఎస్ఐ ‘వన మహోత్సవం’ కార్యక్రమం
హైదరాబాద్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) శుక్రవారం ‘వన మహోత్సవం’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించింది. భారతీయులు సాధారణంగా జూలై 1ని ‘వన మహోత్సవం’ దినంగా జరుపుకుంటారు. పర్యావరణ సమతుల్యంలో చెట్లు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఐసీఎస్ఐ పేర్కొంది. ఇన్స్టిట్యూట్ గో గ్రీన్ కార్యక్రమంలో ‘వన మహోత్సవం’ భాగమని, అందరూ వారి కార్యాలయాల్లో, నివాస ప్రాంతాల్లో మొక్కలను నాటాలని ఐసీఎస్ఐ ప్రెసిడెంట్ సీఎస్ మమత బినాని సందేశమిచ్చారు. -
సీఎస్బీఎఫ్ బ్రోచర్‌ను ఆవిష్కరించిన ఐసీఎస్ఐ
హైదరాబాద్: ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) తాజాగా ‘కంపెనీ సెక్రటరీస్ బెనవలెంట్ ఫండ్ (సీఎస్బీఎఫ్) బ్రోచర్‌ను ఆవిష్కరించింది. ఫండ్ కార్పస్ పెరుగుదల కోసం సభ్యులు ముందుకు రావడానికి, కార్పొరేట్ల విరాళాలకు ఈ బ్రోచర్‌ను విడుదల చేస్తున్నట్లు ఐసీఎస్ఐ ప్రెసిడెంట్ మమతా బినాని ఒక ప్రకటనలో తెలిపారు. సభ్యులు అనారోగ్యంతో ఉన్నప్పుడు వారి కుటుంబ ఆర్థిక భద్రతకు, వైద్య ఖర్చులకు, పిల్లల చదువుకు ఈ ఫండ్ ఉపయోగపడుతుందని వివరించారు. -
నేటి నుంచి ఢిల్లీలో ఐసీఎస్ఐ కన్వెన్షన్
హైదరాబాద్: కంపెనీ సెక్రటరీలకు సంబంధించిన అత్యున్నత సంస్థ ఐసీఎస్ఐ 43వ జాతీయ కన్వెన్షన్ నేటి (గురువారం) నుంచి ప్రారంభం కానుంది. మేక్ ఇన్ ఇండియా థీమ్‌తో 3 రోజుల పాటు ఈ కన్వెన్షన్‌ను ఢిల్లీలో నిర్వహిస్తామని ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) ఒక ప్రకటనలో తెలి పింది. వ్యాపారాలు సులభంగా నిర్వహించడం, నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, డిజిటల్ ఇండియా తదితర అంశాలపై సమావేశాల్ని నిర్వహిస్తామని ఐసీఎస్ఐ ప్రెసిడెంట్ అతుల్ హెచ్ మోహతా పేర్కొన్నారు. -
సెక్రటేరియల్ స్టాండర్డ్స్ అమలుతో చాలా ప్రయోజనం
హైదరాబాద్: సెక్రటేరియల్ స్టాండర్డ్స్ అమలుతో కంపెనీలకు చాలా ప్రయోజనం కలుగుతుందని ఐసీఎస్ఐ వైస్ ప్రెసిడెంట్ మమతా బినాని పేర్కొన్నారు. ఇటీవల సెక్రటేరియల్ స్టాండర్డ్స్‌పై న్యూఢిల్లీలో జరిగిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఎస్ఐ) జాతీయ సదస్సులో..మమతా బినాని మాట్లాడుతూ.. సెక్రటేరియల్ స్టాండర్డ్స్‌ను అమలుచేస్తున్న కంపెనీలపై ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ల, క్రెడిటర్ల విశ్వాసం బలపడుతుందని తెలిపారు. కంపెనీల చట్టం-2013, సెక్షన్ 118 (10) ప్రకారం కంపెనీలు సెక్రటేరియల్ స్టాండర్డ్స్‌ను అమలు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సెక్రటేరియల్ స్టాండర్డ్స్‌ను అమలు చేయడం వల్ల చిన్న, ప్రైవేట్ కంపెనీలకు ఎలాంటి సమస్యలు ఎదురుకావని తెలిపారు. సమావేశంలో ఐసీఎస్ఐ మాజీ ప్రెసిడెంట్ పవన్ కుమార్, ఐసీఎస్ఐ కౌన్సిల్ సభ్యులు వినీత్ చౌదరీ, రంజిత్ పాండే తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో మరిన్ని ఆర్థిక సంస్కరణల అమలు: జైట్లీ
ముంబై: ఆర్థిక రంగ సంస్కరణలపై ఏర్పాటైన కమిషన్ (ఎఫ్ఎస్ఎల్ఆర్సీ) చేసిన సిఫార్సులను త్వరలో అమల్లోకి తేనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. వీటి అమలుకు పాలనాపరమైన, చట్టాలపరమైన మార్పులు అవసరమవుతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కమిషన్ ఇచ్చిన నివేదికను 4 అధికార బృందాలు అధ్యయనం చేస్తున్నాయని ఐసీఎస్ఐ నిర్వహించిన సెమినార్ సందర్భంగా మంత్రి చెప్పారు. సెబీ, ఐఆర్డీఏ, ఎఫ్ఎంసీ, ఆర్బీఐలో కొంత భాగాన్ని కలిపి ఏకీకృత ఆర్థిక రంగ నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయడం మొదలైన సిఫార్సులను ఎఫ్ఎస్ఎల్ఆర్సీ చేసింది. అయితే వీటిలో కొన్నింటిని ఆర్బీఐ సహా వివిధ నియంత్రణ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. -
15 కోట్లతో ఐసీఎస్ఐ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్సీ!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కంపెనీ సెక్రటరీల ఉపాధికి విఘాతం కలిగించే విధంగా ఉన్న కొత్త కంపెనీల చట్టంలోని నిబంధనలకు త్వరలోనే సవరణలు జరగనున్నాయని, దీనికి ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిపిందని ఇనిస్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) జాతీయ అధ్యక్షుడు ఆర్.శ్రీధరన్ తెలిపారు. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొత్త కంపెనీల చట్టంలోని దొర్లిన లోపాలను కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సచిన్ పెలైట్ అంగీకరించారని, వీటిని తప్పక సరిచేస్తానని హామీ ఇచ్చారన్నారు. కొత్త కంపెనీల చట్టంలో ప్రైవేటు కంపెనీలు, రూ.10 కోట్ల లోపు చెల్లింపు మూలధనం ఉన్న పబ్లిక్ కంపెనీలకు కీ మేనేజరియల్ పెర్సనల్ (కేఎంపీ) నుంచి మినహాయింపు ఇవ్వడంతో అనేకమంది కంపెనీ సెక్రటరీల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నిబంధనను సవరించనుండటంతో కంపెనీ సెక్రటరీలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఇప్పటీకి దేశం డిమాండ్‌కు తగ్గట్టుగా కంపెనీ సెక్రటరీలు లేక కొరతను ఎదుర్కొంటోందని శ్రీధరన్ తెలిపారు. హైదరాబాద్‌లో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ రూ.15 కోట్లతో హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీని ఏర్పాటు చేస్తున్నట్లు ఐసీఎస్ఐ ప్రకటించింది. నెల రోజుల్లో పనులు ప్రారంభించి రెండేళ్లలో దీన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు శ్రీధరన్ తెలిపారు. ముంబై తర్వాత రెండో కేంద్రం హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తోంది. -
కార్పొరేట్ పటిష్టతలో ఐసీఎస్ఐకి సహకారం
చెన్నై: కార్పొరేట్ రంగం పటిష్టతకు ఐసీఎస్ఐ (ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా) చేసే ప్రయత్నాలన్నింటికీ తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కేంద్రం పేర్కొంది. కార్పొరేట్ వ్యవహారాల మంత్రి సచిన్ పెలైట్ ఈ మేరకు భరోసాను ఇచ్చారు. గురువారం ఇక్కడ ఆయన కంపెనీ సెక్రటరీల 41వ జాతీయ సదస్సును ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ సదస్సును ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ, కంపెనీల బిల్లు 2013 ఆమోదం విషయాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం-ప్రతిపక్షాల పూర్తి సహకారం, ఏకాభిప్రాయ సాధనతోనే ఇంతటి విజయాన్ని సాధించడం జరిగిందని అన్నారు. వ్యాపార నిర్వహణ విషయంలో ఈ తరహా స్పూర్తినే కార్పొరేట్ రంగం కూడా అనుసరించాలని కోరారు. పరస్పర సహకారం ద్వారా వ్యాపార విజయం, వృద్ధిలో పురోగతి సాధించే ప్రయత్నం చేయాలని పిలుపునిచ్చారు. కార్పొరేట్ రంగ పటిష్టతతో కంపెనీ సెక్రటరీల పాత్ర కీలకమని పేర్కొన్నారు.