త్వరలో మరిన్ని ఆర్థిక సంస్కరణల అమలు: జైట్లీ
ముంబై: ఆర్థిక రంగ సంస్కరణలపై ఏర్పాటైన కమిషన్ (ఎఫ్‌ఎస్‌ఎల్‌ఆర్‌సీ) చేసిన సిఫార్సులను త్వరలో అమల్లోకి తేనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెప్పారు. వీటి అమలుకు పాలనాపరమైన, చట్టాలపరమైన మార్పులు అవసరమవుతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో కమిషన్ ఇచ్చిన నివేదికను 4 అధికార బృందాలు అధ్యయనం చేస్తున్నాయని ఐసీఎస్‌ఐ నిర్వహించిన సెమినార్ సందర్భంగా మంత్రి చెప్పారు. సెబీ, ఐఆర్‌డీఏ, ఎఫ్‌ఎంసీ, ఆర్‌బీఐలో కొంత భాగాన్ని కలిపి ఏకీకృత ఆర్థిక రంగ నియంత్రణ సంస్థను ఏర్పాటు చేయడం మొదలైన సిఫార్సులను ఎఫ్‌ఎస్‌ఎల్‌ఆర్‌సీ చేసింది. అయితే వీటిలో కొన్నింటిని ఆర్‌బీఐ సహా వివిధ నియంత్రణ సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి.