ముంబై: ఇన్ఫోసిస్ సంస్థలో ఇటీవల చెలరేగిన విభేదాల నేపథ్యంలో సంస్థ నిర‍్వహించిన మీడియా సమావేశంపై మరిన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి సమస్యలు లేవని బోర్డ్ వివరణపై బోర్డ్ వివాదం ముగిసినట్టుగా కనిపించడం లేదనే వ్యాఖ్యలు వినిపించాయి. ఇలా పబ్లిగ్గా మీడియాకెక్కడం రావడం సరైందికాదనీ, ఇది ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజ కంపెనీలకు మంచిదికాదనే వాదన వినిపిస్తోంది. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ తరువాత ఇన్ఫోసిస్ కార్పోరేట్ గవర్నెస్ వ్యవహారంపై మరింత గందరగోళం నెలకొందని పేర్కొన్నారు.
సంస్థ ఛైర్మన్ శేషసాయి, సీఈవో విశాల్ సిక్కా మాట్లాడాని తీరు గానీ, బాడీ లాంగ్వేజెస్ గానీ సమస్యకు పరిష్కారం దిశగా సాగలేదని కొంతమంది విశ్లేషకులు వ్యాఖ్యానించారు. చాలా నిర్లక్ష్యంగా, బాధ్యతా రాహిత్యంగా వారి వివరణ సాగిందంటున్నారు.
గతరెండేళ్లుగా వివాదం నడుస్తున్నపుడు మరింత పారదర్శకంగా వ్యవహరించి ఉండాల్సిందని ఎనలిస్టులు చెబుతున్నారు. ముఖ్యంగా రాజీవ్ బన్సల్‌కు చెల్లించిన పే విషయంలో బోర్డ్ ఇచ్చిన వివరణ, విశాల్ సిక్కా కు చెల్లిస్తున్న వేతనాలపై స్పష్టంగా లేదని తెలిపింది. ఇన్ఫోసిస్ సంస్థ కచ్చితంగా నిజాలను దాచి పెడుతోందని వ్యాఖ్యానించారు.
అలాగే మీడియాద్వారా కాకుండా.. ప్రత్యక్షంగా సమస్యను పరిష్కరించుకొని ఉండే బావుండేదని పేర్కొన్నారు. ఇకముందైనా ఇలాంటి సాంప్రదాయాలను పాటించాలని కోరుతున్నారుదేశానికి గర్వకారణంగా ఉన్న ఇన్ఫోసిస్ సంస్థను గౌరవాన్ని కాపాడాల్సి ఉందన్నారు. ఇది షేర్ హోల్డర్స్ పై ప్రభావం చూపే అవకాశంఉందని తెలిపారు.
మరి తాను వ్యక్తం ఆందోళనలపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేసిన వ్యవస్థపాకులు తొలిఛైర్మన్ నారాయణ మూర్తి ఈ బోర్డ్ నిర‍్వహించిన మీడియా సమావేశంలో శేషశాయి, సీఈవో విశాల్ సిక్కా సమాధానాలపై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.